దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పదేళ్ల పార్టీ లెక్కలను పరిశీలిస్తే.. 2014 నుంచి నేటివరకూ 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు 50 మందికి పైగా బడా నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
ఈ నేతలంతా తాము కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ నాయకత్వం, పనితీరులో లోపమే కారణమని చెబుతున్నారు. వీరు పార్టీని వీడిన ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన పదేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీతో కలిపి మొత్తం 51 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది.
ఇటీవలే మిలింద్ దేవరా, గీతా కోడా, బాబా సిద్ధిఖీ, రాజేష్ మిశ్రా, అంబ్రిష్ డెర్, జగత్ బహదూర్ అన్నూ, చంద్మల్ జైన్, బసవరాజ్ పాటిల్, నరన్ రథ్వా, విజేందర్ సింగ్, సంజయ్ నిరుపమ్, గౌరవ్ వల్లభ్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడారు.
ఇక కాంగ్రెస్‌ను వీడిన 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు బడానేతల విషయానికొస్తే ఈ జాబితాలో హిమంత బిస్వా శర్మ, చౌదరి బీరేందర్ సింగ్, రంజిత్ దేశ్‌ముఖ్, జికె వాసన్, జయంతి నటరాజన్, రీటా బహుగుణ జోషి, ఎన్ బీరెన్ సింగ్, శంకర్ సింగ్ వాఘేలా, టి. వడక్కన్, జ్యోతిరాదిత్య సింధియా, కేపీ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీసీ చాకో, స్తిన్ ప్రసాద్, జితిన్ ప్రసాద్ , లలితేష్ త్రిపాఠి, పంకజ్ మాలిక్, హరేంద్ర మాలిక్, ఇమ్రాన్ మసూద్, అదితి సింగ్, సుప్రియా అరోన్, ఆర్‌పీఎన్ సింగ్, అశ్విని కుమార్, రిపున్ బోరా, హార్దిక్ పటేల్, సునీల్ జాఖర్, కపిల్ సిబల్, కుల్దీప్ బిష్ణోయ్, జైవీర్ షెర్గిల్, అనిల్ ఆంటోనీ, సీఆర్ కేస్వానీ తదితరులు ఉన్నారు.
గత పదేళ్లలో కాంగ్రెస్ ఓటమి పాలైన ఎన్నికలు..
లోక్ సభ ఎన్నికలు: 2014, 2019
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 2017
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013,2023
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 2015, 2020
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
అసోం అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2019
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు: 2022
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు: 2018
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు: 2023
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
గోవా అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 2018
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 2018
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: 2022
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019
Comments
Please login to add a commentAdd a comment