decade
-
మహా ప్రగతి
నింగినంటే ఆకాశ హర్మ్యాలు.. వేగం పెంచిన రహదారులు.. ఫ్లైఓవర్లు.. ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ హంగులతో మహానగరం గ్లోబల్ సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గిజాలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. గత పదేళ్లలో నగరంలో అనేక మార్పులు వచ్చాయి. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం.. లుంబినిని ఆనుకొని నిర్మించిన అమరుల స్మారకం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మార్గంలో పర్యాటకులను ఆకట్టుకొనే డబుల్ డెక్కర్ బస్సులు, లక్షలాదిమంది ప్రయాణికులకు చేరువైన మెట్రో రైలు. సుమారు రూ.వంద కోట్లతో నిర్మించిన సైకిల్‌ట్రాక్, ప్రపంచదేశాలను ఆకట్టుకున్న ఫార్ములా–ఈ వంటి పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పదేళ్లలో మహా నగరం రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాలతో పోటీ అన్నట్లుగా విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది.నూతన రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన భాగ్యనగరం ప్రగతి పథంలోనూ తనదే పైచేయి అంటూ సగర్వంగా నినదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిగ్ స్టోరీ. – సాక్షి, హైదరాబాసిటీబ్యూరో బృందం రూ.8 వేల కోట్లతో ఎస్సార్డీపీ.. నగరంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద దాదాపు రూ.8 వేల కోట్ల పనులు జరిగాయి. వీటిలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు, తదితరమైనవి ఉన్నాయి. మొదటి దశ కింద చేపట్టిన ఈ పనుల్లో 36 పూర్తిచేశారు. మరో ఆరు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన పనుల వల్ల రద్దీ మార్గాల్లో వాహన వేగం 15 కేఎంపీహెచ్ నుంచి 35 కేఎంపీహెచ్‌కు పెరిగింది. దాదాపు రూ.450 కోట్లతో స్లిప్‌రోడ్లు, లింక్‌రోడ్లు నిర్మించారు.రూ.530 కోట్లతో ఎస్ఎన్డీపీ.. ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద రూ. 530 కోట్ల పనులు చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకుగాను దాదాపు 70 వేల గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. థీమ్‌పార్కులు, కాలనీపార్కుల వంటివి వందలాదిగా అభివృద్ధి చేశారు. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వడంతో రోడ్ల సమస్యలు తగ్గాయి. 38 మోడల్ మార్కెట్లు, 12 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, 30కి పైగా శ్మశాన వాటికల నిర్మాణం/ఆధునికీకరణ పనులు చేశారు. బస్తీ దవాఖానాలు.. అన్నపూర్ణ భోజనం పేదలకు రూ. 5లకే అన్నపూర్ణ భోజనం, బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటోలు, రెఫ్యూజ్ కాంపాక్ట్ వాహనాలు వినియోగంలోకి తెచ్చారు. 5 ప్రధాన కారిడార్ల ద్వారా నిత్యం 15 లక్షల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. దశాబ్ద కాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేక సంస్కరణలు చేపట్టింది. అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అండర్ గ్రౌండ్ లైన్ల సంఖ్యను పెంచింది. సామర్థ్యానికి మించి నమోదవుతున్న డిమాండ్‌ను తట్టుకుని నిలిచేలా సరఫరా వ్యవస్థను మెరుగుపర్చింది. రయ్‌మన్న ఫార్ములా– ఈ హుస్సేన్‌సాగర్ తీరంలో గతేడాది ఫిబ్రవరి 11న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా–ఈ పోటీలు ప్రపంచం దృష్టినిఆకర్షించాయి. ఈ పోటీల కోసం నెక్లెస్‌రోడ్డులో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా– ఈ ప్రిక్స్ పోటీల్లో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. పాదచారుల భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ప్రతిరోజు వేలాది మంది బాటసారులు నలువైపులా నడిచే ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌తో పాదచారుల భద్రతకు భరోసా ఏర్పడింది. సుమారు రూ.25 కోట్లతో ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీని నిర్మాణంలో 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్.. అదరహో.. ఔటర్‌రింగ్ రోడ్డు మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. దీనికి సోలార్ రూఫ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది తొట్టతొలి అధునాతన సైక్లింగ్ ట్రాక్. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కి.మీ, కొల్లూరు నుంచి నార్సింగి వరకు మరో 14.5 కి.మీ మేర దీన్ని ఏర్పాటు చేశారు. 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లతో ట్రాక్‌ను నిర్మించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. నెక్లెస్ రోడ్డులో సుమారు 11.4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పచ్చదనం వాతావరణం మధ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకొనేవిధంగా ఈ మహామూర్తిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనం ఆకృతిలో ఏర్పాటు చేసిన బేస్మెంట్ మరో ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది 50 అడుగుల ఎత్తు ఉంటుంది. బేస్మెంట్లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవిత విశేషాలను, రాజ్యాంగ రచనా కాలం నాటి ఫొటోలను, చిత్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నలువైపులా మెట్రో సేవలు... నగరంలో 2017 నవంబర్‌లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 54 కోట్లు దాటింది. నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఎల్బీనగర్, పాతబస్తీ రూట్ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మించనున్నారు.అలాగే నగరం నలువైపులా మెట్రో రైళ్లను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. భేషుగ్గా నీటి నిర్వహణ కోటిన్నరకు పైగా జనాభా కలిగిన మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణను జలమండలి సమర్థంగా నిర్వహిస్తోంది. నగర నలుమూలల తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి తాగునీరు సరఫరా చేస్తోంది. భవిష్యత్ తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తోంది. మరోవైపు వంద శాతం మురుగు శుద్ధి కోసం మూడు ప్యాకేజీల్లో అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా అందులో ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. నగర వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా పథకం అమల్లోకి వచి్చంది. పారిశుద్ధ్య విధానం పూర్తిగా మ్యానువల్ నుంచి యాంత్రికానికి మారింది. ప్రస్తుతం సివర్ జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తోంది. మ్యాన్ హోళ్లలో మానవ సహిత పారిశుద్ధ్య పనులు నిషేధించింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ చర్యల్లో భాగంగా కూకట్పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని సాగర్‌లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దశాబ్ది ధగధగలు అవతరణ ఉత్సవాలకు ముస్తాబైన గ్రేటర్ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఆదివారం జరగనున్న వేడుకల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, నెక్లెస్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులతో పాటు, అమరుల కుటుంబాలను సమున్నతంగా గౌరవించనుంది. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద సుమారు 700 మందికి పైగా కళాకారులు, వివిధ సాంస్కృతిక బృందాలు భారీ కవాతును నిర్వహించనున్నాయి. బతుకమ్మ, బోనాలు, డప్పు వాద్యాలు, ఒగ్గుడోలు తదితర కళాకారుల బృందాలు వేడుకల్లో పాల్గొంటాయి. తెలంగాణ రుచులను పరిచయం చేసే వివిధ రకాల వంటలతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. లేజర్ షోలతో ఆకాశం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. రాత్రి 8.50 గంటలకు బాణాసంచా వెలుగుల్లో వేడుకలను ముగించనున్నారు.నేడు ట్రాఫిక్ ఆంక్షలుమధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. » లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్, పీపుల్స్ ప్లాజా ఎగ్జిబిషన్లు ఆదివారం మూసివేసి ఉంటాయి. సాధారణ ప్రజలు, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు రాకూడదు. » ట్యాంక్‌బండ్‌పై జరిగే ఉత్సవాలకు పాసులు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. » మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో పాటు పోలీసులు, అధికారులు వారి వారి వాహనాల పార్కింగ్ కోసం బోట్స్ క్లబ్, చి్రల్డన్స్ పార్క్, హోటల్ అమోఘం, సచివాలయం నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్క్ రోడ్డు, జీహెచ్ఎంసీ లేన్లతో పాటు ఎనీ్టఆర్ స్టేడియంను పార్కింగ్ కోసం కేటాయించారు. » రాణిగంజ్ రైల్వే ట్రాక్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి వచ్చే వాహనాలు రవీంద్రభారతి వైపు డైవర్షన్ తీసుకోవాలి. » తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్ వైపు అనుమతి లేదు. » కూకట్పల్లి నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్ వైపు, పంజాగుట్ట వైపు వాహనాలకు అనుమతి ఉంటుంది. ఖైరతాబాద్ చౌరస్తా వైపు అనుమతించరు. » మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ నుంచి సికింద్రాబాద్ వైపు అనుమతిస్తారు. » లిబర్టీ, హిమాయత్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్రైలఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. నేరాల నియంత్రణకు ఐసీసీసీపదేళ్ల కాలంలో ‘గ్రేటర్’లో పోలీసు విభాగాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్– తెలంగాణ స్టేట్ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ) తలమానికంగా నిలిచింది. దీన్ని 6.427 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనంలో హైదరాబాద్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్ సేఫ్టీ బ్యూరో, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డయల్–100, వ్యవస్థీకృత నేరాల నిరోధక విభాగం, ప్రాసిక్యూషన్ సపోర్ట్ సెంటర్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సపోర్ట్ సెంటర్ తదితరాలు ఉన్నాయి. ఇది మొత్తం ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ‘ఏ’ టవర్ 1,69,000, ‘బీ’ టవర్ 1,25,000, ‘సీ’ టవర్ 34,414, ‘డీ’ టవర్ 27,166, ‘ఈ’ టవర్ 45,000, బేస్మెంట్ 2,16,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 60 మీటర్ల ఎత్తులో 14,15 అంతస్తుల మధ్య ఉన్న స్కై బ్రిడ్జ్ 20,750 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల సీసీ కెమెరాలన్నీ ఇక్కడి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఉంటాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల విషయంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. సైబరాబాద్‌లోని తూర్పు భాగంతో ప్రత్యేకంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. ప్రతి కమిషనరేట్‌లోనూ జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు పునర్ వ్యవస్థీకరణ జరిగింది. -
గత పదేళ్లలో కాంగ్రెస్ సాధించిందేమిటి? ఎందరు పార్టీని వీడారు?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పదేళ్ల పార్టీ లెక్కలను పరిశీలిస్తే.. 2014 నుంచి నేటివరకూ 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు 50 మందికి పైగా బడా నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ నేతలంతా తాము కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ నాయకత్వం, పనితీరులో లోపమే కారణమని చెబుతున్నారు. వీరు పార్టీని వీడిన ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన పదేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీతో కలిపి మొత్తం 51 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. ఇటీవలే మిలింద్ దేవరా, గీతా కోడా, బాబా సిద్ధిఖీ, రాజేష్ మిశ్రా, అంబ్రిష్ డెర్, జగత్ బహదూర్ అన్నూ, చంద్మల్ జైన్, బసవరాజ్ పాటిల్, నరన్ రథ్వా, విజేందర్ సింగ్, సంజయ్ నిరుపమ్, గౌరవ్ వల్లభ్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక కాంగ్రెస్‌ను వీడిన 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు బడానేతల విషయానికొస్తే ఈ జాబితాలో హిమంత బిస్వా శర్మ, చౌదరి బీరేందర్ సింగ్, రంజిత్ దేశ్‌ముఖ్, జికె వాసన్, జయంతి నటరాజన్, రీటా బహుగుణ జోషి, ఎన్ బీరెన్ సింగ్, శంకర్ సింగ్ వాఘేలా, టి. వడక్కన్, జ్యోతిరాదిత్య సింధియా, కేపీ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీసీ చాకో, స్తిన్ ప్రసాద్, జితిన్ ప్రసాద్ , లలితేష్ త్రిపాఠి, పంకజ్ మాలిక్, హరేంద్ర మాలిక్, ఇమ్రాన్ మసూద్, అదితి సింగ్, సుప్రియా అరోన్, ఆర్పీఎన్ సింగ్, అశ్విని కుమార్, రిపున్ బోరా, హార్దిక్ పటేల్, సునీల్ జాఖర్, కపిల్ సిబల్, కుల్దీప్ బిష్ణోయ్, జైవీర్ షెర్గిల్, అనిల్ ఆంటోనీ, సీఆర్ కేస్వానీ తదితరులు ఉన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ఓటమి పాలైన ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలు: 2014, 2019 హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 2017 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013,2023 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 2015, 2020 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014 సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 అసోం అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2019 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు: 2022 మిజోరం అసెంబ్లీ ఎన్నికలు: 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు: 2023 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 గోవా అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 2018 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: 2022 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 -
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు. దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు?
ప్రపంచంలోని వివిధ దేశాలలోని ప్రజల జీవన విధానం భిన్నంగా ఉంటుంది. ప్రజల జీవనశైలి, పని విధానంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రజల జీవితకాలం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని ప్రజలు అధికకాలం జీవిస్తుండగా, మరికొన్ని దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. అమెరికాకు సంబంధించి ఒక నూతన నివేదిక పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. అమెరికాలో గత 100 సంవత్సరాలతో పోలిస్తే, ప్రజల సగటు వయస్సులో క్షీణత చోటుచేసుకున్నదని తేలింది. ఈ రిపోర్టు ప్రకారం చూస్తే అమెరికన్లు గతంతో పోలిస్తే ఇప్పుడు త్వరగా చనిపోతున్నారు. పరిశోధకులు తెలియజేసిన విషయాలను బీబీసీ ప్రపంచం ముందు ఉంచింది. అమెరికాలో పేదల సగటు వయసు తగ్గిందని పరిశోధనల్లో తేలింది. నల్లజాతి అమెరికన్ల జీవితకాలం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. సమాజంలోని అసమానతలు వయస్సుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అమెరికన్ల సగటు జీవితకాలం క్షీణించడానికి అనేక కారణాలను దానిలో తెలియజేశారు. ఇందుకు వ్యాధులతో పోరాటం, ఔషధాలు నుంచి ఆయుధాల వరకు అన్నీ బాధ్యతవహిస్తున్నాయి. సామూహిక కాల్పుల ఘటనలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల అమెరికాలో లక్షల మంది చనిపోతున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి, ఇతర వ్యాధుల కారణంగా, చిన్న వయస్సులోనే మరణాలు సంభవించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న అసమానతలు, మారణాయుధాల వినియోగం, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: సింగపూర్‌కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ -
ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో మాట్లాడుతూ ఈ దశాబ్దాన్ని సాంకేతిక దశాబ్దంగా మార్చాలన్న లక్ష్యంతోనే భారత దేశంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి "స్టార్టప్ ఇండియా" మిషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మూడురోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న భారత నరేంద్ర మోదీ రెండో రోజు న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ తో కలిసి వర్జీనియాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను సందర్శించారు. ఇక్కడ అవకాశాలున్నాయి.. అక్కడ యువత ఉన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క అమెరికాలో అధునాతన సాంకేతికతతో కూడిన ప్రపంచస్థాయి విద్యా సంస్థలున్నాయి. మరోపక్క భారతదేశంలో భారీసంఖ్యలో నైపుణ్యమున్న యువత ఉంది. స్కిల్ ఇండియా కాంపెయిన్ పేరిట సుమారు ఐదు కోట్ల మందికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డ్రోన్ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించినట్టు తెలిపారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచ వృద్ధికి ఇంజిన్ లా వ్యవహరిస్తుందని, అమెరికాకు భారత దేశానికి ఒక పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. యువత పైన పెట్టుబడి పెట్టాలి అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా కలయిక ప్రపంచంలోనే అతి పాతవైన, పెద్దవైన ప్రజాస్వామ్యాల కలయికగా అభివర్ణించారు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే కాదు కుటుంబాలు కూడా స్నేహతత్వంతో మెలుగుతున్నాయని, మా ఐక్యత ప్రాపంచిక సవాళ్ళను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రెండు దేశాలు ఆర్ధికంగా వృద్ధి చెందాలంటే యువత పైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని, వారికి తగినన్ని అవకాశాలు కల్పించాలని అన్నారు. ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు -
బిల్లులు రాక ఇల్లు తాకట్టుకు సిద్ధమయ్యా: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, కామారెడ్డి (బాన్సువాడ/నస్రూల్లాబాద్): డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడం కొంత ఆలస్యం కావడంతో.. ఒకానొక సందర్భంలో సొంతింటిని తాకట్టు పెట్టి బిల్లులు చెల్లించాలనుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కానీ కొందరు తనపై విశ్వాసంతో వారించడంతో ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలను నిర్వహించారు. పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో సొంత స్థలాలున్న వారికి 7 వేల ఇళ్లు, ప్రభుత్వపరంగా 4 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కాగా, ఓ లబ్ధిదారుడు కలలో కూడా ఇంతమంచి ఇంట్లో ఉంటానని ఊహించలేదని.. స్పీకర్ సార్ తనకు దేవుడితో సమానమని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో స్పీకర్ కూడా కంటతడి పెట్టారు. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? -
ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ గత పదేళ్లలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను ,అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో పది రోజులు వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని, కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న సర్వతోముఖాభివృద్ధి గురించి, దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న తీరును ఎన్ఆర్ఐలందరికీ తెలియజేసేలా ఈ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ వేడుకలలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్యారావు , విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శణ్ముఖ్, వేణు నాన్న, సాయి గుప్తా, రాకేష్, అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్, డా.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఖరారు చేసింది. ఇందులో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించడంతో పాటు దశాబ్ది ఉత్సవాలకు చిహ్నంగా 10 సంఖ్యతో లోగో డిజైన్ చేశారు. లోగో మధ్యలో తెలంగాణా తల్లి, పై భాగంలో ఎగురుతున్న రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట తీసుకున్నారు. 10 భాగాలుగా ..ఒక్కో భాగంలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బొమ్మ ఉండగా, 10 సంఖ్యలోని 1 లో తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పొందుపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, , మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, జంటనగరాల తలమానికం హైదరాబాద్ మెట్రో రైల్, వ్యవసాయం టీ-హబ్, రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి కోతలు లేకుండా ప్రజలకు, ఉచితంగా రైతులకు కరెంటు అందిస్తోన్న విద్యుత్ రంగానికి స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను లోగోలో పొందుపరిచారు. -
TS: రాష్ట్రానికి పదేళ్ల పండుగ! సంవత్సరమంతా దశాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ నిర్వహిణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడగా.. 2023 జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్ల అవలోకనాన్ని గుర్తుచేసుకుంటూ.. ఉత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన రోజున వివిధ రంగాల్లో తెలంగాణ పరిస్థితి, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచాలని భావిస్తోంది. ఎన్నికల ఏడాదికావడంతో.. క్షేత్రస్థాయిలో ఉత్సవాలతో ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనకు వచ్చింది. ఈ కార్యక్రమానికి జూన్ 1వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అప్పుడు.. ఇప్పుడు.. వివరాలివ్వండి! ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఏడాదిలో సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలను అన్ని శాఖలు ప్రభుత్వానికి అందజేసేవి. ఈసారి కూడా అలా వివరాల సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. అయితే ఒక్క ఏడాది కాకుండా.. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో జరిగిన పురోగతి వివరాలను సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతి శాఖ నుంచి పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నారు. రెండు రోజుల్లో డేటా పంపాలని ఆర్థిక శాఖ నుంచి అన్ని శాఖలకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా ఈ పనిని పర్యవేక్షిస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించనున్నారు. సీఎస్ సూచనల మేరకు ప్రతి శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సావనీర్లను రూపొందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ సావనీర్లు, కాఫీ టేబుల్ కేలండర్లలో ఆయా శాఖల్లో 2014 నాటి పరిస్థితి ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే కసరత్తు జరుగుతోంది. ప్రతిష్టాత్మక పథకాలపై ఫోకస్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, ధాన్యం ఉత్పత్తిలో రికార్డు, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, బీసీ గురుకులాల ఏర్పాటు వంటివి.. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చాయి. ఈ పథకాలకు సంబంధించిన గణాంకాలతోపాటు.. వాటి అమలు ద్వారా వచి్చన మార్పును కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించేలా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల మనన్నలు పొందేలా.. ప్రజల మనన్నలు పొందేలా.. ఎన్నికల ఏడాది కావడంతో గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా వారి మన్ననలు పొందడమే ఈ దశాబ్ది ఉత్సవాల ఉద్దేశమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏ పథకం అమలు చేసినా గణంకాలు మారుతుంటాయని.. కానీ ఆయా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా సమాజంలో వచి్చన మార్పును వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలనను చేరువగా తీసుకువచ్చామని.. ప్రతీ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల ద్వారా జిల్లా అధికార యంత్రాంగమంతా ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించనున్నట్టు సమాచారం. అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం, తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తి నిచి్చన బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ స్థాపన, తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా అమరవీరుల స్మారకం, అమరజ్యోతి వంటి వాటిని సగర్వంగా చాటాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది పాటు ఉత్సవాలు.. దశాబ్ధి ఉత్సవాలను ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు నిర్వహించాలని.. చివరి రోజున ప్రత్యేకంగా వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మధ్యలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తొలుత ఈ ఏడాది జూన్ 1 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ వారం రోజుల పాటు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ దాకా వివిధ దశల్లో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ప్రభుత్వ వర్గాలు త్వరలో ఖరారు చేయనున్నాయి. చదవండి: వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేయాలి -
దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్బీఐ గణాంకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
దశాబ్దం పాటు 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలం పాటు భారత్ 6.5 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచి ఎగుమతులు అన్నవి కొంత నిదానంగా ఉండొచ్చని, ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, వృద్ధిపై మన ఎగుమతులు ఆధారపడి ఉంటాయన్నారు. వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆర్థిక, రుణ, పెట్టుబడుల సైకిల్ పునరుద్ధరణతో రానున్న పదేళ్ల పాటు సగటున 6.5 శాతం వృద్ధి సాధ్యమేనని నాగేశ్వరన్ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి నిదానించడం అన్నది కరోనాకి ముందే, సహజంగానే మొదలైనట్టు అంగీకరించారు. బ్యాంక్ బ్యాలన్స్ షీట్ల ప్రస్తావన, ఆ తర్వాత కరోనా మమహ్మారి రూపంలో, ఆ తర్వాత కమోడిటీల ధరల పెరుగుదల రూపంలో సవాళ్లు ఎదురైనట్టు చెప్పారు. సహజంగానే ఇవి ప్రైవేటు ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీస్తాయన్నారు. -
రానున్న పదేళ్లలో100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: అదానీ
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మూడో అంత్యంత సంపన్న బిలియనీర్ గౌతమ్ అదానీ రానున్న దశాబ్ద కాలంలో ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారు. పదేళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని తాజా వెల్లడించారు. న్యూ పవర్ ఎనర్జీ, డేటా సెంటర్లు లాంటి రంగాలలో ఈ పెట్టుబడులుంటాయని తెలిపారు. సింగపూర్‌లో జరిగిన గ్లోబల్ సీఈఓల కాన్ఫరెన్స్‌లో అదానీ మాట్లాడుతూ, అదానీ గ్రూపుగా వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నా మన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 70 శాతం ఇంధన పరివర్తన రంగానికి కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుత 20 గిగా వాట్ల పునరుత్పాదక పోర్ట్ ఫోలియోతో పాటు, 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని తీసుకొస్తా మన్నారు. ఇది 100,000 హెక్టార్లలో విస్తరించి, సింగపూర్ వైశాల్యం కంటే 1.4 రెట్లు ఎక్కువ. 30 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కమర్షలైజేషన్‌కు తోడ్పడు తుందని అదానీ వెల్లడించారు. -
భారత సాంకేతిక దశాబ్దం ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల సమ్మేళనానికి.. టెక్నాలజీ రంగంలో ఇప్పటికే నిరూపితమైన శక్తి సామర్థ్యాలు తోడై మరిన్ని అవకాశాలు అందనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం(టెకేడ్)గా మారుతుందని అభివర్ణించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. డేటా పవర్‌హౌజ్‌గా భారతదేశానికి తన బాధ్యతలు తెలుసని చెబుతూ డేటా రక్షణకు సంబంధించిన కార్యక్రమం పురోగతిలో ఉందని వివరించారు. ‘డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల భారతదేశానికి భారీ అవకాశాన్ని ఇస్తోంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఈ దశాబ్దం ‘భారత టెకేడ్’గా మారడంలో విజయవంతమవుతుంది’ అని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని డజన్లకొద్దీ టెక్ కంపెనీలు యూనికార్న్ క్లబ్( 1 బిలియన్ డాలర్ల విలువతో కూడినవి)లో ప్రవేశిస్తాయని అంచనాలు సూచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాలైన దీక్ష, ఇ-నామ్, ఈ సంజీవని, ప్రధాన మంత్రి స్వనిధి తదితర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. విద్య కొనసాగింపులో, ఆరోగ్య సంరక్షణలో, ఇతర పౌర సేవలు అందించడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషించిందని వివరించారు. ఈ సమయంలో మన దేశం ఆవిష్కరించిన డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. ‘కరోనా సమయంలో భారతదేశం చూపిన పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ట్రేసింగ్ యాప్‌లలో ఒకటైన ఆరోగ్య సేతు యాప్ కోవిడ్ కట్టడిలో కీలకపాత్ర పోషించింది’ అని పేర్కొన్నారు. కోవిన్ యాప్‌పై చాలా దేశాలు ఆసక్తి కనబరిచాయని, ఇలాంటి సాధనాలు భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి సాక్ష్యాలని పేర్కొన్నారు. దేశంలో ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచిని, ఆ ఆవిష్కరణలను వేగంగా కార్యరూపంలో అందించాలని ఉన్న ఉత్సాహాన్ని మోదీ ప్రశంసించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ స్వావలంబన సంకల్పాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రానిక్ టాబ్లెట్లు, డిజిటల్ పరికరాలు అందుతున్నాయని, ఇందుకోసం ఆయా కంపెనీలకు ఉత్పత్తి అనుసంధానిత రాయితీలు ఇస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని సుహానీ సాహు ‘దీక్ష యాప్’ గురించి తన అనుభవాలను ప్రధాన మంత్రితో పంచుకున్నారు. తాను చదువు కొనసాగించేందుకు ఈ యాప్ ఎలా తోడ్పడిందో వివరించారు. అవినీతిపై దాడి ఇది జూలై 1, 2015 న ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే భావనపై నిర్మితమైందని, ‘అందరికీ అవకాశాలు, అందరికీ సౌకర్యం, అందరి భాగస్వామ్యం’ లక్ష్యంగా రూపొందిందని ప్రధాన మంత్రి వివరించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రజలకు ప్రవేశం కల్పించిందని, సేవల్లో పారదర్శకతకు దారి తీసిందన్నారు. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం అవినీతిపై నేరుగా దాడి చేసిందని వివరించారు. అది వైద్యుల ఘనతే..! కరోనాను భారత్ సమర్థ్దంగా ఎదుర్కోవడంపై మోదీ ప్రశంస కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఒక్క ప్రాణాన్ని కోల్పోవడమైనా బాధాకరమే.. అయినా, కోవిడ్ నుంచి ప్రాణాలను కాపాడే విషయంలో భారత్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సమర్థ్దవంతంగా పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాగా, కరోనా సమయంలో ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్యులను రాష్ట్రపతి కోవింద్ స్వార్థం లేని దేవుళ్లని, వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. -
ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో 2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం, వాక్సినేషన్, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
వన్డే, టీ20లకు ధోని.. టెస్టులకు కోహ్లి
యావత్ క్రికెట్ ప్రపంచం టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి నామస్మరణతో మునిగితేలుతుండటంతో ఎంఎస్ ధోని ప్రాశస్త్యం రోజురోజుకి తగ్గిపోతుందని అతడి ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. అయితే అతడు సాధించిన విజయాలు, ఘనతలను వెలికి తీస్తూ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలను మాజీ క్రికెటర్లు, పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై జార్ఖండ్ డైనమెట్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేశారు. తాజాగా వారికి మరింత జోరు కలిగించే వార్త ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ ఈఎస్పీఎన్ తెలిపింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేసింది. అయితే టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లి వైపే మొగ్గు చూపింది. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ పలు అంశాలను పరిగణలోకి తీసుకుని టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఆరేళ్లకు పైగా ఆడి ఉండి లేక కనీసం 50 టెస్టులైనా ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని టెస్టు జట్టును ప్రకటించినట్టు ఈఎస్పీఎన్ తెలిపింది. అదేవిధంగా కనీసం 75 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల రికార్డులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించింది. ఇక టెస్టు జట్టులో కోహ్లితో పాటు టీమిండియాకు చెందిన మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇక వీరితో పాటు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. వన్డేల్లో ధోని, కోహ్లిలతో పాటు రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. టీ20 ఫార్మట్ విషయానికొస్తే వెస్టిండీస్ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఏకంగా ఐదుగురు కరీబియన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, పొలార్డ్‌లతో పాటు ఆండ్రీ రసెల్‌లు టీ20 జట్టులో ఉన్నారు. ఇక టీమిండియా నుంచి ధోనితో పాటు కోహ్లి, జస్ప్రిత్ బుమ్రాలు అవకాశం దక్కించుకున్నారు. మహిళల క్రికెట్ విషయానికి వస్తే మిథాలీ రాజ్, జులాన్ గోస్వామిలు ఇద్దరు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోగా.. ఈ రెండు ఫార్మట్లకు ఆసీస్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. -
ఈ దశాబ్దం టీమిండియాదే!
హైదరాబాద్: ప్రస్తుత దశాబ్దం(2000-2020) టీమిండియాదే. అవును. ఎందుకంటే అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న టీమిండియా ప్రత్యర్థి జట్లకు సాధ్యం కాని ఘనతలను అందుకుంది. దీంతో ఈ దశాబ్దం ముగిసే వరకు టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్థానంలో కొనసాగడం ఖాయం. గత మూడేళ్లుగా టెస్టుల్లో ఆగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు.. ఇప్పటికే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో 300 పాయింట్లతో మరే జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతేకాకుండా విజయాల శాతం, గెలుపోటముల నిష్పత్తిలో దూసుకపోతోంది. ఓ దశాబ్దకాలంలో అత్యధిక సక్సెస్ రేషియో కలిగిన జట్టుగా టీమిండియా తొలిసారి రికార్డు నెలకొల్పింది. ఈ దశాబ్దంలో ఇప్పటివరకు 106 టెస్టులు ఆడిన భారత్ 55 విజయాలు, 29 అపజయాలను చవిచూసింది. గెలుపోటముల నిష్పత్తి 1.90గా ఉంది. ఇక తర్వాత స్తానంలో దక్షిణాఫ్రికా 1.76తో(89 టెస్టుల్లో 44 విజయాలు, 25 ఓటములు) నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్ల సక్సెస్ రేషియో వరుసగా 1.39, 1.30, 1.07, 0.91, 0.79 ఉన్నాయి. ఇలా ఓ దశాబ్దకాలంలో అన్ని మేటిజట్లను అధిగమించి అత్యధిక సక్సెస్ రేషియోను సాధించడం టీమిండియాకు ఇది తొలిసారి. ఇప్పటివరకు క్రికెట్‌ను ఏలిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లే అధిక గెలుపోటముల నిష్పత్తిని కలిగి ఉండేవి. అత్యధికంగా 2000-2010 కాలంలో ఆసీస్ అధ్యధికంగా 4.39 సక్సెస్ రేషియోతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. . ప్రస్తుత జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు ఆకలితో వేటాడే సింహంలా రెచ్చిపోతున్నారు. బ్యాటింగ్‌లో సారథి విరాట్ కోహ్లి, పుజారా, అజింక్యా రహానేలు నిలకడగా ఆడుతుండగా.. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, హనుమ విహారీ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో టీమిండియా ఈ మధ్యకాలంలో మరింత రాటుదేలింది. ముఖ్యంగా పేస్ అటాక్ పదును పెరిగింది. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు పేస్ దళాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. కాగా, స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టుకు తురుపుముక్కలుగా మారారు. సీమ్ పిచ్‌లపై కూడా స్పిన్ తిప్పుతూ జట్టుకు విజయాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ దశాబ్ద ప్రారంభంలో సచిన్ టెండూల్కర్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి స్టార్ క్రికెటర్లు టెస్టుల్లో టీమిండియా విజయాలకు బాటలు వేశారు. -
సజీవ సమాధుల్లోంచి చిన్నారుల ఘోష
బెర్లిన్: సుమారు 90 వేలకు పైగా పౌరులు. వారిలో 7 వేల మంది స్కూల్ చిన్నారులు. భారీ భూకంపం దాటికి సజీవ సమాధి అయ్యారు. అయితే నాణ్యత లేమి కారణంగానే స్కూల్ భవనాల కారణంగా ఆరోపణలు. పదేళ్లైనా మృతుల జాబితాను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు? మరోవైపు తమ పిల్లలు బతికే ఉన్నారా? అన్న ఆశలో తల్లిదండ్రులు. వెరసి దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో... చైనాలోని సిచువాన్ ప్రొవిన్స్‌లో మే12, 2008న రిక్చర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనాల దాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. 70 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా పోయారు. పెద్ద సంఖ్యలో స్కూల్ భవనాలు కుప్పకూలిపోవటంతో సుమారు 7 వేల మంది చిన్నారులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శరీరాలు భవనాల కిందే ఛిద్రం అయిపోగా తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు అని సామాజిక వేత్త ‘అయి వెయివెయి’ చెబుతున్నారు. భూకంపం తర్వాత సహయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. నాటి పరిస్థితిపై ఓ నివేదిక రూపొందించారు. వెయివెయి నివేదిక ప్రకారం... ‘కనీస ప్రామాణికాలు లేకుండా భవనాలను నిర్మించారు. ఫలితం 7 వేల మంది చిన్నారులు బలయ్యారు. భద్రత ప్రమాణాలు లేని స్కూళ్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఆ మరుసటి ఏడాది సంభవించిన భూకంపాల్లో మరో 5 వేల మంది విద్యార్థులు చనిపోయారని ప్రభుత్వం అంటోంది. మరి మృతుల పేర్ల జాబితాను పదేళ్లు గడిచినా ఎందుకు విడుదల చేయలేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావట్లేదు. చారిత్రక ఘటనకు సంబంధించిన నిజాలను ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం బయటకు రానీవ్వట్లేదు. పోరాటంలో తల్లిదండ్రులు అలసిపోయారు. విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో నాపై పోలీసులు దాడి చేశారు. నా ప్రాణాలు పోయినా చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆపను’ అని వెయివెయి చెబుతున్నారు. పోలీసుల దాడిలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో వెయివెయికి జర్మనీలో శస్త్రచికిత్స జరగ్గా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. భూకంపం జరిగి పదేళ్లు పూర్తి కావటంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. భారీ కుంభ కోణం... కాగా, నాటి భూకంపం దాటికి 6.5 మిలియన్ భవనాలు కప్పకూలిపోయాయి. మరో 23 మిలియన్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా భూకంపం అధికారిక విభాగం, జియాలజిస్టులు నాణ్యత లేని భవనాల మూలంగానే పెను నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొందరు ఇంజనీర్లు భవన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలుస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో భారీ కుంభకోణం చైనా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే అవినీతి ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. భారీ భూకంపం జోన్లో ఆయా భవనాలు ఉండటంతోనే కుప్పకూలిపోయానని నివేదికను వక్రీకరించింది. కానీ, సామాజిక వేత్త వెయి వెయి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం స్వతంత్ర్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ తర్వాత అంశాన్ని పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో వెయివెయి పోరాటాన్ని ఉదృతం చేయగా.. ఆయనపై దాడి చోటు చేసుకుంది. -
దయాగుణమే శ్రీరామరక్ష
దశాబ్దం క్రితం ఒకసారి విశాఖపట్నం వెళ్లవలసి వచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం మధ్యాహ్నం విశాఖలో దిగింది. నగరంలో దిగబెట్టడానికి క్యాబ్‌ల వాళ్లు రూ.500 అడిగారు. అయితే విమానాశ్రయం నుంచి ఒక కిలోమీటరు నడిచి వెళితే, ప్రభుత్వ రవాణా సదుపాయం ఉంటుందని తెలిసింది. నడవడానికే నిశ్చయించుకున్నా ను. ఐదు నిమిషాలలోనే ఒక ఇన్నోవా కారు వచ్చి పక్కనే ఆగింది. లోపలున్న పెద్ద మనిషి నన్ను కూడా ఆ కారులోకి ఆహ్వా నించారు. నిజంగానే అదో ఆహ్లాదక రమైన అనూహ్య ఘటన. మాటల్లో వివరాలు అడి గాను. ఆయన ఎంతో ఒద్దికగా తాను అర బిందో ఫార్మసీకి చెందిన నిత్యానందరెడ్డినని చెప్పారు. మాన వాళి పట్ల నిత్యానందరెడ్డిగారికి ఉన్న ఇలాంటి దయాగుణమే కేబీఆర్ పార్క్ దుర్ఘటన నుంచి, ఏకే 47 దాడి నుంచి కాపా డింది. నిత్యానందరెడ్డిగారికి అభినందనలు. మానవాళికి మరిన్ని సేవలందించాలన్న భావంతోనే భగవంతుడు ఆయ నను కాపాడాడు. - చతుర్వేదుల శ్రీరామచంద్రమూర్తి హైదరాబాద్ -
హీరో విశాల్ - ఓ దశాబ్ధం
చెన్నై: దక్షిణాది యువ హీరో విశాల్(విశాల్ కృష్ణా రెడ్డి) సినిమా రంగంలో అడుగుపెట్టి ఈరోజుకు దశాబ్ధం పూర్తి అయింది. విశాల్ నటించిన 'చెల్లామే' 2004 సెప్టెంబరు 10న విడుదలైంది. ఈరోజుకు పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా విశాల్ ఇప్పటి వరకు తన సినీరంగ ప్రయాణం చాలా గొప్పగా సాగిందన్నారు. ఇప్పటి వరకు సినిమా రంగంలో తనకు సహకరించిన వారందరికీ, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న కథాంశాలతో, నటనకు ప్రాధాన్యత గల పలు చిత్రాలలో విశాల్ నటించారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారావేత్త అయిన జికె రెడ్డి కుమారుడైన విశాల్ చెన్నైలోనే పుట్టిపెరిగాడు. పందెంకోడి, పల్నాడు, ఇంద్రుడు, వాడువీడు, సెల్యూట్, ధీరుడు..వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రారంభం నుంచి విశాల్ అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్నాడు.తెలుగులోకి అనువాదమైన విశాల్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విశాల్ ఫిల్మి ఫ్యాక్టరీ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారాడు. పాండియనాడు, నాన్సింగప్పు మణితన్ చిత్రాలు నిర్మించాడు. పూజై చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ పూజై చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ తమిళ హీరో విశాల్ త్వరలో తెలుగులో డైరెక్ట్ చిత్రంలో నటించబోతున్నారు. **