దయాగుణమే శ్రీరామరక్ష | Dayaguname sriramaraksa | Sakshi
Sakshi News home page

దయాగుణమే శ్రీరామరక్ష

Published Fri, Nov 28 2014 12:30 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Dayaguname sriramaraksa

దశాబ్దం క్రితం ఒకసారి విశాఖపట్నం వెళ్లవలసి వచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం మధ్యాహ్నం విశాఖలో దిగింది. నగరంలో దిగబెట్టడానికి క్యాబ్‌ల వాళ్లు రూ.500 అడిగారు. అయితే విమానాశ్రయం నుంచి ఒక కిలోమీటరు నడిచి వెళితే, ప్రభుత్వ రవాణా సదుపాయం ఉంటుందని తెలిసింది. నడవడానికే నిశ్చయించుకున్నా ను. ఐదు నిమిషాలలోనే ఒక ఇన్నోవా కారు వచ్చి పక్కనే ఆగింది. లోపలున్న పెద్ద మనిషి నన్ను కూడా ఆ కారులోకి ఆహ్వా నించారు. నిజంగానే అదో ఆహ్లాదక రమైన అనూహ్య ఘటన. మాటల్లో వివరాలు అడి గాను. ఆయన ఎంతో ఒద్దికగా తాను అర బిందో ఫార్మసీకి చెందిన నిత్యానందరెడ్డినని చెప్పారు. మాన వాళి పట్ల నిత్యానందరెడ్డిగారికి ఉన్న ఇలాంటి దయాగుణమే కేబీఆర్ పార్క్ దుర్ఘటన నుంచి, ఏకే 47 దాడి నుంచి కాపా డింది. నిత్యానందరెడ్డిగారికి అభినందనలు. మానవాళికి మరిన్ని సేవలందించాలన్న భావంతోనే భగవంతుడు ఆయ నను కాపాడాడు.
- చతుర్వేదుల శ్రీరామచంద్రమూర్తి  హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement