Indian Airlines plane
-
కరోనా 'వేలకోట్ల'లో దెబ్బకొట్టింది, గాల్లో ఎగిరేదెలా!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలను (ఎయిర్‌లైన్స్) కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. వైరస్ నేపథ్యంలో కార్యకలాపాలు సజావుగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడం వల్ల.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ రంగం ఏకంగా రూ.22,400 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో 75 శాతం గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ వివరాలను లోక్‌సభకు తెలియజేశారు. కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా పౌర విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు మంత్రి చెప్పారు. ఫలితంగా దేశీయంగా ఎయిర్‌లైన్స్‌తోపాటు, విమానాశ్రయాలు, అనుబంధ సేవల్లోనూ నష్టాలు ఎదురైనట్టు వివరించారు. ‘‘భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు 2020–21లో నష్టాలు సుమారుగా రూ.19,000 కోట్ల వరకు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లకు ఈ నష్టాలు రూ.3,400 కోట్లుగా ఉన్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రయాణించే వారు 61.7 శాతం తగ్గినట్టు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ప్రయాణికుల మార్కెట్ రెట్టింపు అవుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. విమానయాన సేవల్లో ఎక్కువగా ఇంధనానికే (ఏటీఎఫ్) ఖర్చవుతున్నట్టు చెప్పారు. -
కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసినప్పట్నుంచీ సంస్థ నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఎయిరిండియా విక్రయా నికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15లోగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్థిక బిడ్లు రాగలవని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సంస్థను విక్రయించేందుకు గతేడాది జనవరి 27న కేంద్రం బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తికరణ పత్రాలను ఆహ్వానించింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో బిడ్ల దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ వచ్చింది. విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై విపక్షాల నిరసనల మధ్య స్వల్ప చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. షిప్పింగ్ పోర్టులపై పార్లమెంటరీ కమిటీ నివేదిక.. దేశీయంగా కొత్త పోర్టుల ఏర్పాటు అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించే స్వేచ్ఛ షిప్పింగ్ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు ఉండాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కంటైనర్లను వేగవంతంగా ఖాళీ చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీటీ)లో రైల్ యార్డును అభివృద్ధి చేసే అంశం పరిశీలించాలని ఒక నివేదికలో సూచించింది. -
హైజాక్ విమానాన్ని నడిపిన పైలెట్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1971లో ఇద్దరు కశ్మీర్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన పైలెట్ కెప్టెన్ ఎం కె కజ్రు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1971 జనవరి 30న 26 మంది ప్యాసింజర్స్‌తో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ గంగను ఇద్దరు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వేర్పాటువాదులు హైజాక్ చేశారు. విమానాన్ని పాకిస్తాన్ లోని లాహోర్‌కు తరలించాల్సిందిగా కెప్టెన్ కజ్రును ఆదేశించారు. ఆయన విమానాన్ని లాహోర్‌కు తీసుకెళ్లారు. తర్వాత భారత ప్రభుత్వం హైజాకర్ల చెర నుంచి భారతీయులను సురక్షితంగా తప్పించి రోడ్డుమార్గం ద్వారా ఇండియాకు రప్పించిన విషయం తెలిసిందే. -
దయాగుణమే శ్రీరామరక్ష
దశాబ్దం క్రితం ఒకసారి విశాఖపట్నం వెళ్లవలసి వచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం మధ్యాహ్నం విశాఖలో దిగింది. నగరంలో దిగబెట్టడానికి క్యాబ్‌ల వాళ్లు రూ.500 అడిగారు. అయితే విమానాశ్రయం నుంచి ఒక కిలోమీటరు నడిచి వెళితే, ప్రభుత్వ రవాణా సదుపాయం ఉంటుందని తెలిసింది. నడవడానికే నిశ్చయించుకున్నా ను. ఐదు నిమిషాలలోనే ఒక ఇన్నోవా కారు వచ్చి పక్కనే ఆగింది. లోపలున్న పెద్ద మనిషి నన్ను కూడా ఆ కారులోకి ఆహ్వా నించారు. నిజంగానే అదో ఆహ్లాదక రమైన అనూహ్య ఘటన. మాటల్లో వివరాలు అడి గాను. ఆయన ఎంతో ఒద్దికగా తాను అర బిందో ఫార్మసీకి చెందిన నిత్యానందరెడ్డినని చెప్పారు. మాన వాళి పట్ల నిత్యానందరెడ్డిగారికి ఉన్న ఇలాంటి దయాగుణమే కేబీఆర్ పార్క్ దుర్ఘటన నుంచి, ఏకే 47 దాడి నుంచి కాపా డింది. నిత్యానందరెడ్డిగారికి అభినందనలు. మానవాళికి మరిన్ని సేవలందించాలన్న భావంతోనే భగవంతుడు ఆయ నను కాపాడాడు. - చతుర్వేదుల శ్రీరామచంద్రమూర్తి హైదరాబాద్