సాక్షి, న్యూఢిల్లీ: శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1971లో ఇద్దరు కశ్మీర్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన పైలెట్ కెప్టెన్ ఎం కె కజ్రు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
1971 జనవరి 30న 26 మంది ప్యాసింజర్స్‌తో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ గంగను ఇద్దరు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వేర్పాటువాదులు హైజాక్ చేశారు. విమానాన్ని పాకిస్తాన్ లోని లాహోర్‌కు తరలించాల్సిందిగా కెప్టెన్ కజ్రును ఆదేశించారు. ఆయన విమానాన్ని లాహోర్‌కు తీసుకెళ్లారు. తర్వాత భారత ప్రభుత్వం హైజాకర్ల చెర నుంచి భారతీయులను సురక్షితంగా తప్పించి రోడ్డుమార్గం ద్వారా ఇండియాకు రప్పించిన విషయం తెలిసిందే.
హైజాక్ విమానాన్ని నడిపిన పైలెట్ మృతి
Published Sun, Apr 1 2018 6:45 PM | Last Updated on Sun, Apr 1 2018 8:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment