hijacked
-
అమెరికాలో బస్సు హైజాక్ కలకలం
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో బస్ హైజాక్ కలకలం రేపుతోంది. అయితే ఆ బస్సులో హైజాకర్స్ ఎంత మంది ఉన్నారు. బందీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.పలు అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో నిందితులు బస్సును హైజాక్ చేశారని, ప్రయాణికుల్ని బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హైజాక్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను క్షణ్ణంగా పరిసీలించారు. బస్సుల్లో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు తేలింది. అయితే హైజాకర్స్ నుంచి డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతుండగా.. హైజాక్ గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో సైతంఈ ఏడాది మార్చిలో సైతం లాస్ ఏంజెల్స్ డౌన్టౌన్లో బస్సును నిందితుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న హైజాకర్ ఇతర వాహనాల్ని ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held insideOnline images show that a SWAT team is at the sceneFollow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6— RT (@RT_com) September 25, 2024 -
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపిన కేటుగాళ్లు.. డ్రైవర్‌పై మత్తు మందు చల్లి జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు.అక్కడ నుంచి పసుపు లోడును వేరే వాహనాల్లోకి తరలించే యత్నం చేశారు. పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. పసుపు విలువ సుమారు రూ. 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ
ఢిల్లీ: ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం మరో ఆపరేషన్ చేపట్టింది. సోమాలియ దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. అందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అల్ నయీమి అనే పాకిస్థాన్‌కు చెందిన పిషింగ్ నౌకపై సామాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన ఓ ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ సుమిత్రా.. 17 మంది ఇరాన్ దేశస్థులను రక్షించారు. ఇదీ చదవండి: ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ -
భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వాళ్లంతా సేఫ్
సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్‌కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది. The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm — ANI (@ANI) January 5, 2024 -
భారత్‌కు రావాల్సిన కార్గో షిప్ హైజాక్!
టెల్ అవీవ్: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్ ఎర్ర సముద్రంలో హైజాక్‌కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యగా తెలిపింది. వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది కూడా ఓడలో ఉన్నారని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని జపాన్ నిర్వహిస్తున్న కార్గో షిప్‌ను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిప్లో ఇజ్రాయెల్ పౌరులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఇది ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న నెతన్యాహు.. అంతర్జాతీయ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఇరాన్ చర్యలను ఆయన ఎండగట్టారు. The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence. The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship. — Israel Defense Forces (@IDF) November 19, 2023 షిప్ హైజాక్‌కు బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓటను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. షిప్‌ను యెమెన్ పోర్టుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిని ఇజ్రాయెల్ ఖండించింది. అది తమ ఓడ కాదని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని ఓడగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఓడ జపాన్ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అందులో ఉన్న 25 మంది సిబ్బంది ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోకు చెందినవారని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడులను ఉదృతం చేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు గతవారం ప్రకటించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఆధారిత ఓడలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జెండాలు కలిగిన షిప్‌లను హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ఓడల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. ఇదీ చదవండి: Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
హైజాక్ విమానాన్ని నడిపిన పైలెట్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1971లో ఇద్దరు కశ్మీర్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన పైలెట్ కెప్టెన్ ఎం కె కజ్రు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1971 జనవరి 30న 26 మంది ప్యాసింజర్స్‌తో ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ గంగను ఇద్దరు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన వేర్పాటువాదులు హైజాక్ చేశారు. విమానాన్ని పాకిస్తాన్ లోని లాహోర్‌కు తరలించాల్సిందిగా కెప్టెన్ కజ్రును ఆదేశించారు. ఆయన విమానాన్ని లాహోర్‌కు తీసుకెళ్లారు. తర్వాత భారత ప్రభుత్వం హైజాకర్ల చెర నుంచి భారతీయులను సురక్షితంగా తప్పించి రోడ్డుమార్గం ద్వారా ఇండియాకు రప్పించిన విషయం తెలిసిందే. -
విమానం హైజాక్... పేల్చేస్తామని బెదిరింపులు
-
విమానం హైజాక్ కథ సుఖాంతం
లిబియా విమానం హైజాక్ ఉదంతం సుఖాంతమైంది. విమానంలోని 111 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బందినికూడా హైజాకర్లు విడిచిపెట్టారు. తొలుత బందీల్లో మహిళలను, చిన్నారులను వదిలిట్టిన హైజాకర్లు చివరికి ప్రభుత్వానికి లొంగిపోయారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని శుక్రవారం హైజాక్ చేశారు. మొత్తం111మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. విమానాన్ని పేల్చివేస్తామని బెదిరించారు. దీంతో మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ రంగంలోకి దిగి లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. భద్రతా దళాలు రక్షణ మరియు అత్యవసర చర్యల్ని చేపట్టి, హైజాకర్లతో మంతనాలు జరిపారు. నైరుతీ లిబియా సబా నుంచి ట్రిపోలీ వెళుతుంగా హైజాకర్లు దాళి మళ్లించారు. దీంతో మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. Informed of potential hijack situation of a #Libya internal flight diverted to #Malta. Security and emergency operations standing by -JM — Joseph Muscat (@JosephMuscat_JM) December 23, 2016 -
మేయర్‌గా పిల్లి!
కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఎన్నిక.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రష్యా.. బార్నౌల్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మార్జాలం పోటీచేయడమే వింతనుకుంటే.. ఏకంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ప్రపంచాన్ని ఆకర్షించిన వార్తయింది. అసలు పిల్లేంటి? ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటి? అని ఆరాతీస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని అరికట్టాలనే ఆలోచనను ప్రాక్టికల్ గా అమలుచేస్తూ స్థానిక ప్రజలు బార్సిక్ అనే పిల్లిని స్థానికులు మేయర్ గా పోటీలోకి దింపారు. సాధారణ ఎన్నికల్లో జంతువులు పోటీచేయకూడదనే నిబంధన ఉంది కాబట్టి ఆన్ లైన్ లో ఎన్నికలు నిర్వహించారు. నిజం ఎన్నికలను మైమరపించేలా ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. నిజం ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకంటే మెరుగైన ప్రజాసేవ చేస్తానన్న పిల్లిగారి వాగ్ధానాన్ని ఓటర్లు నమ్మారు. దీంతో తొంభై శాతం ఓట్టను కైవసం చేసుకుని బార్సిక్ ముందువరుసలో నిలిచింది. రష్యన్ సోషల్ మీడియా వెబ్సైట్ (Vkontakte) ద్వారా టికెట్ పొందిన తర్వాత సియమీస్ పిల్లి బార్సిక్.. మేయర్ ఎన్నికల్లో అనేకమంది ఓటర్ల హృదయాలను దోచేసింది. కొత్త మేయర్ ను ఎన్నుకునే సందర్భంలో.. ఆన్లైన్లో జరిగిన పోలింగ్ లో అరుగురు అభ్యర్థులపై పోటీ చేసిన పిల్లి విజయపథంలో దూసుకుపోయింది. స్థానిక ఇంటర్నెట్ గ్రూప్ ద్వారా పోస్ట్ చేసిన పిల్లి.. అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు జనం కూడ ఆ నాలుగుకాళ్ళ అభ్యర్థిని ఆనందంగా ఓట్లేసి గెలిపించేయడం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఓపక్క ఆన్లైన్లో 'గో బార్సిక్'... 'బార్సిక్ రూల్స్' అన్న నినాదాలతో ఓటర్లంతా పలికిన మద్దతుకు రష్యన్ సోషల్ మీడియా నిండిపోయింది. "పోటీ చేసిన అభ్యర్థులకంటే పిల్లే బాగా నిజాయితీగా పనిచేస్తుందని ఓటర్లు నమ్మారు అందుకే దాన్ని గెలిపించారు" అంటూ అలెగ్జాండర్ రెషెత్నికోవ్ పేరున ఓ యూజర్ కూడ ఈ సందర్భాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇగోర్ సావింట్నేవ్ ను తొలగించిన తర్వాత... ప్రస్తుతం పీటర్ ఫ్రైసన్ ఈ నగర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై పిల్లి స్థానంలో మేయర్ బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పిల్లిని సపోర్ట్ చేసిన ఓటర్లే ఆ విషయం నిర్ణయిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. -
మళ్లీ హైజాక్ ముఠా!
- రహదారుల్లో డ్రైవర్లను మట్టుపెట్టే గ్యాంగ్ - ఇటీవల కొందరు జైలు నుంచి విడుదల పలమనేరు : జాతీయ రహదారుల్లో లారీలను హైజాక్ చేసి డ్రైవర్లను అత్యంత క్రూరంగా మట్టుపెట్టే గ్యాంగ్ మళ్లీ జిల్లాలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గతంలో లారీ ైెహ జాక్‌లకు పాల్పడే నరహంతక ముఠాలోని కీలక సభ్యులు ప్రస్తుతం పలు జైళ్లలో ఉన్నారు. కొందరు ఆరునెలల క్రితం విడుదలయ్యారు. వీరు కొత్త గ్యాంగ్‌లా ఏర్పడి మళ్లీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం తమిళనాడులోని శూలగిరిలో లారీని హైజాక్ చేసి తీసుకెళ్లి ఇద్దరు డ్రైవర్లను హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో పలమనేరుతో ప్రమేయమున్న ఈ నర హంతకుల విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ గ్యాంగ్ 12 మందికి పైగా డ్రైవర్లను హత్యచేసి పలు లారీలను దోచుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్తులు: లారీల హైజాక్ గ్యాంగ్‌లో సుమారు 18 మంది సభ్యులున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు. మిగిలిన వారు కర్ణాటక, తమిళనాడులకు చెందిన వారు. వీరిలో ముఖ్యమైన వ్యక్తి గుండుగల్లు శ్రీరాములు (58). ఇతనిపై మూడు రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. ఈ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన కాపర్ లారీలనే టార్గెట్ చేసి ఆ డ్రైవర్లను హత్య చేసి లారీలు, సరుకును తీసుకెళ్తుంది. ఇప్పటికే 12 మందికి పైగా డ్రైవర్ల హతం: ఈ ముఠా తమిళనాడు, కర్ణాటకతో పాటు మన జిల్లాలోని ములకలచెరువు, పీటీఎం, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. ప్రయాణికుల్లా లారీలు ఎక్కడం, అటవీ ప్రాంతం రాగానే డ్రైవర్ల మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి చంపడం లేదా పదునైన కత్తులతో నరకడం చేస్తుంటారు. గతంలో జరిగిన హత్యలన్నీ ఇదే రీతిలో జరిగాయి. హత్య చేసి మృతదేహాలను అటవీప్రాంతాల్లో పూడ్చిపెడుతుంటారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలతో ఈ ముఠా ప్రస్తావన మళ్లీ వినిపిస్తోంది. -
మోడీ సభలో పాల్గొంటా
సీఎం సిద్ధరామయ్య వెల్లడి అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి హాజరవుతా లేకుంటే ఆ కార్యక్రమాన్ని బీజేపీ హైజాక్ చేస్తుంది బీజేపీ హయాంలో జరిగిన డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు చేయిస్తా దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు బీబీఎంపీ విభజన వల్లే సమస్యల పరిష్కారం మూడు డివిజన్లుగా విభజించే యోచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తుమకూరులో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని ఛాన్సెరీ పెవిలియన్ హోటల్లో శనివారం రోజంతా జరిగిన కేపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంగా, మోడీ సభలో పాల్గొనవద్దని పదాధికారులు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మోడీ సభలో పాల్గొన్నప్పుడు చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేశారు. కనుక ఆ సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రధాని పాల్గొనే సభకు ముఖ్యమంత్రిగా తాను హాజరు కావడం రాజ్యాంగ విధి అని అన్నారు. ఒక వేళ తాను హాజరుకాకపోతే బీజేపీ ఈ మొత్తం కార్యక్రమాన్నే హైజాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక ఏదెలా ఉన్నా ప్రోటోకాల్‌ను పాటించడం తన కర్తవ్యమని ఆయన చెప్పారు. బీజేపీ డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు రాష్ర్టంలో బీజేపీ హయాంలో జరిగిన పది వేల ఎకరాల డీ నోటిఫికేషన్ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక ఎకరాను కూడా డీనోటిఫై చేయలేదని తెలిపారు. బీజేపీ నాయకులు అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కనుక వారి హయాంలో జరిగిన డీనోటిఫికేషన్లపై దర్యాప్తు జరిపించడం ద్వారా వారి అసలు రంగు బయటపెడతానని సవాలు విసిరారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలను చేపడతామని ఆయన వెల్లడించారు. మూడుగా బీబీఎంపీ పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని మూడు డివిజన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ, నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. బెంగళూరు నగర విస్తీర్ణం ఇప్పుడు 80 చదరపు కిలోమీటర్లు దాటిపోయిందని, దీని వల్ల అనేక పాలనా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బీబీఎంపీ విభజనే దీనికి పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.. -
నీటి యుద్ధాలకు..ఇది ఆరంభం!
ద్వారకలో వాటర్‌ట్యాంకర్ హైజాకింగ్‌పై ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నీటి యుద్ధాలు మొదలయ్యాయని అత్యున్నత న్యాయస్థానమైన ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్‌ను స్థానికులు కొందరు హైజాక్ చేసిన ఘటనపై స్పందిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో జరగబోయే నీటి యుద్ధాలకు ద్వారక ఘటన ఆరంభమని పేర్కొంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది. ద్వారకలో నీటి కొరతను తీర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు బదార్ బుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 6న డీడీఏకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10 నాటికి ద్వారక వాసుల నీటి కొరతను తీర్చేందుక పది బోరువావులను అందుబాటులోకి తేవాలని ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం పదో తేదీ దాటిపోవడంతో తాము చేపట్టిన చర్యలను డీడీఏ కోర్టుకు వివరించింది. ద్వారక ప్రాంతంలో 14 గొట్టపు బావులు అందుబాటులో ఉన్నాయని, కోర్టు ఆదేశించినట్లుగా మరో పది బోరుబావులను ఏర్పాటు చేశామని, అందులో 8 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయని తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల మిగతా రెండు బోర్లు పనిచేయడం లేదని, రెండువారాల్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పింది. కాగా డీడీఏ ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వారకలో నీటి కొరతపై రెండు వారాల్లో స్థాయీ నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఏర్పాటు చేసిన బోరుబావులకు సంబంధించిన చిత్రాలను కోర్టు ముందుంచాలని సూచించింది. ఈ బోరుబావుల్లోని నీటిని ప్రధాన నీటి సరఫరా పైపులైన్‌కు కలుపుతున్నారా? లేక నీటి ట్యాంకర్లను నింపేందుకు ఉపయోగిస్తున్నారా? అనే వివరాలను కూడా కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది. అయితే ఈ బోరుబావులు, ట్యాంకర్లు తాత్కాలికంగా మాత్రమే ప్రజల దాహార్తిని తీరుస్తాయని, ద్వారకవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు ఏం చేయాలని యోచిస్తున్నారో చెప్పండంటూ కోర్టు ప్రశ్నించింది. దీనికి డీడీఏ న్యాయవాది స్పందిస్తూ... ఢిల్లీ జల్ బోర్డు నీటి కోసం తాము ఎదురు చూస్తున్నామని, ప్రధాన పైపులైన్‌కు సంబంధించి కొన్ని కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ జల్‌బోర్డు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ద్వారక ప్రాంతం చాలా ఇరుకైన ప్రదేశమని, నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలన్నా, బోరుబావులు తవ్వలన్నా అక్కడ ఖాళీ ప్రదేశమే లేదన్నారు. అయినప్పటికీ 16 బోరుబావులను ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ సంబంధిత పనులు పూర్తయితే మరో 10 త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. కేవలం ద్వారకలో మాత్రమే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ఢిల్లీ జల్ బోర్డు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. ఇదిలాఉండగా నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ వేసవికి నీటి ఇబ్బందులు పెద్దగా ఉండవని చెబుతున్నారు. అయితే వాటిని నగరవాసులకు సరఫరా చేయడమే ఇబ్బందికరంగా మారింది. -
మలేషియా విమానం ఏమైంది ?
-
పైలట్ పై ప్రత్యేక దృష్టిపెట్టిన మలేషియన్ ఎయిర్ లైన్స్
కౌలాలంపూర్ :మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం తప్పిపోయిన ఘటనకు సంబంధించి అక్కడి ప్రభుత్వం పైలట్ పై దృష్టిపెట్టింది. ఈ ఘటన వెనుక పైలట్ పాత్ర ఏమైనా ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పైలట్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా మలేషియన్ విమానం మాయం వెనకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. శాటిలైట్, రాడార్ ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టారు. దీంతో విమానాన్ని హైజాక్ చేసారని అనుమానాలు బలపడుతున్నాయి. విమానాన్ని మళ్లించిన తరువాత ఏడు గంటలపాటు గాల్లోనే విమానం ఉన్నట్లు తెలిసింది. మార్చి8 వ తేదీ అర్ధరాత్రి 12.40ని.లకు కౌలాలాంపూర్ లో బయల్దేరిన విమానం ఒక గంటల్లోపూ మాయమైంది. ఆ క్రమంలోనే విమానంలో సిగ్నల్ వ్యవస్థను పూర్తిగా పనిచేయకుండా నిలిపివేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొంతమంది విమానాన్ని దారి మళ్లించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ తెలుపుతోంది. మరుసటి రోజు ఉదయం 8.11గం.లకు విమానాన్ని శాటిలైట్ గుర్తించినా, ఆ ప్రాంతాన్ని గుర్తించడంలో మాత్రం విఫలమైందని ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కజకిస్థాన్ తీసుకెళ్లారేమో: మలేషియా ప్రధాని
-
కజకిస్థాన్ తీసుకెళ్లారేమో: మలేషియా ప్రధాని
మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేకపోతున్నామని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ అన్నారు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ విమానం మలేషియా- వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్- తుర్కెమెనిస్థాన్‌లకు తీసుకెళ్లి ఉండొచ్చని రజాక్ చెప్పారు. లేదా ఇండోనేషియా- దక్షిణ హిందూ మహాసముద్రం వైపుగా కూడా తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అంతకుముందు వారం రోజులకు పైగా కనపడకుండా పోయిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయ్యిందని అధికారులు అంటున్నారు. ఈ సంఘటనపై తమ దర్యాప్తు పూర్తయిందని, ఈ దర్యాప్తులోనే ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. విమానం నడపడంలో బాగా అనుభం ఉన్నవాళ్లే ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, వాళ్లు విమానాన్ని హైజాక్ చేయగానే సమాచార వ్యవస్థకు సంబంధించిన సిగ్నళ్లు ఏవీ పనిచేయకుండా ఆపేశారని చెబుతున్నారు. బహుశా ప్రయాణికుల్లోనే ఈ హైజాకర్లు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు వాళ్ల డిమాండ్లు ఏమీ తెలియలేదని, అలాగే ఎవరి నుంచి తాము విమానాన్ని అపహరించినట్లు ఫోన్లు కూడా రాలేదని అధికారులు వెల్లడించారు. విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. సాధారణ పౌర రాడార్‌కు విమానం సిగ్నళ్లు అందడం ఆగిపోయిన తర్వాత కాసేపు సైనిక రాడార్‌కు మాత్రం అందాయని ఆయన అన్నారు. దాన్నిబట్టి చూస్తే కావాలనే సమాచార సిగ్నళ్లను ఆపేసిన విషయం అర్థమవుతోందన్నారు. చిట్టచివరిసారిగా అది కనిపించిన తర్వాత నుంచి కనీసం ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. -
మలేసియన్ విమానం హైజాక్?