
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రయాణికులున్న ఆ ట్రైన్ ను హైజాక్ చేసిన 27 గంటల పాటు బందించి ఉంచారు. ఈ క్రమంలోనే వారు పలు డిమాండ్లు వినిపించారు పాక్ ప్రభుత్వానికి. అయితే పాక్ ప్రభుత్వం వారి డిమాండ్లను ఏ మేరకు నెరవేర్చిందో కానీ హైజాక్ చేసిన ట్రైన్ ను ఆఖరికి బీఎల్ఏ మిలిటెంట్లు విడిచిపెట్టారు.
అయితే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ కు డ్రైవర్ గా ఉన్న అంజాద్ తన చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అదొక భయానక ఘటన అన్న అంజాద్.. ట్రైన్ ను ఎలా హైజాక్ చేశారనే సంగతిని స్పష్టం చేశాడు. ట్రైన్ ఇంజిన్ కింద, బోగీల కింద కొన్ని పేలుడు పదార్థాలు పెట్టి ట్రైన్ హైజాక్ చేశారన్నాడు. ట్రైన్ ఆగిన తర్వాత విండోలు పగలగొట్టి లోపలికి వచ్చిన మిలిటెంట్లు.. తాము చనిపోయి ఉంటామని భావించారన్నాడు. వందల సంఖ్యలో ప్రయాణికుల్ని చూసిన తర్వాత వారిని రెండు సెపరేట్ గ్రూపులుగా విభజించారని డ్రైవర్ అంజాద్ పేర్కొన్నాడు.
హైజాకర్ల నుండి సురక్షితంగా బయటపడ్డ ఓ ప్రయాణికుడు అర్సలాన్ యూసఫ్.. మిలిటెంట్లు వ్యవహరించిన తీరును పేర్కొన్నాడు. అందులో ఉన్న సైనికుల్ని బంధించి తీసుకెళ్లి కొంతమందిని చంపేశారన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని వారు టార్గెట్ చేసి కాల్చి చంపారన్నాడు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కాల్చి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు.
కాగా, మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు.33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్‌ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment