train incident
-
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రయాణికులున్న ఆ ట్రైన్ ను హైజాక్ చేసిన 27 గంటల పాటు బందించి ఉంచారు. ఈ క్రమంలోనే వారు పలు డిమాండ్లు వినిపించారు పాక్ ప్రభుత్వానికి. అయితే పాక్ ప్రభుత్వం వారి డిమాండ్లను ఏ మేరకు నెరవేర్చిందో కానీ హైజాక్ చేసిన ట్రైన్ ను ఆఖరికి బీఎల్ఏ మిలిటెంట్లు విడిచిపెట్టారు.అయితే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ కు డ్రైవర్ గా ఉన్న అంజాద్ తన చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అదొక భయానక ఘటన అన్న అంజాద్.. ట్రైన్ ను ఎలా హైజాక్ చేశారనే సంగతిని స్పష్టం చేశాడు. ట్రైన్ ఇంజిన్ కింద, బోగీల కింద కొన్ని పేలుడు పదార్థాలు పెట్టి ట్రైన్ హైజాక్ చేశారన్నాడు. ట్రైన్ ఆగిన తర్వాత విండోలు పగలగొట్టి లోపలికి వచ్చిన మిలిటెంట్లు.. తాము చనిపోయి ఉంటామని భావించారన్నాడు. వందల సంఖ్యలో ప్రయాణికుల్ని చూసిన తర్వాత వారిని రెండు సెపరేట్ గ్రూపులుగా విభజించారని డ్రైవర్ అంజాద్ పేర్కొన్నాడు.హైజాకర్ల నుండి సురక్షితంగా బయటపడ్డ ఓ ప్రయాణికుడు అర్సలాన్ యూసఫ్.. మిలిటెంట్లు వ్యవహరించిన తీరును పేర్కొన్నాడు. అందులో ఉన్న సైనికుల్ని బంధించి తీసుకెళ్లి కొంతమందిని చంపేశారన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని వారు టార్గెట్ చేసి కాల్చి చంపారన్నాడు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కాల్చి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు.కాగా, మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు.33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. -
రైలు హైజాక్‌లో ఢిల్లీ హస్తమంటూ పాక్ కూతలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉంది పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇటీవల బలుచిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్ కారణమంటూ తాజాగా పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.ఈ నేపథ్యంలో షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025ఇదిలాఉండగా.. ఇటీవల పాక్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది. -
పాక్ రైలు హైజాక్: 50 నిమిషాలు నరకమే.. ప్రయాణీకుడి ఆవేదన
ఇస్లామాబాద్: సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఉదంతానికి తెర దించినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చెరబట్టడం, పలువురు ప్రయాణికులను కాల్చి చంపి 215 మందిని బందీలను చేసుకోవడం తెలిసిందే. జైళ్లలో ఉన్న తమ నేతలను 48 గంటల్లోగా వదిలేయకపోతే బందీలందరినీ చంపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ప్రయాణికులందరినీ సైనిక ఆపరేషన్ ద్వారా బుధవారం సాయంత్రానికల్లా బీఎల్ఏ చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.ఈ సందర్బంగా ‘ఘటనా స్థలిలో ఉన్న 33 మంది మిలిటెంట్లను ఆర్మీ స్నైపర్లు హతమార్చారు. ఆ క్రమంలో నలుగురు సైనికులను కోల్పోయాం. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మిలిటెంట్లు రైలును హైజాక్ చేశారు. ఆ క్రమంలో 27 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నారు’ అని చెప్పారు. ట్రైన్‌తో పాటు ఘటనా స్థలిని బాంబ్ డిస్పోజల్ బృందాలు జాగ్రత్తగా జల్లెడ పడుతున్నాయన్నారు. దాడికి కారకులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని వెంటాడి వేటాడతామని ప్రకటించారు.భిన్న వాదనలు ఆపరేషన్ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య నక్కారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్టు మీడియా పేర్కొంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి 190 మంది ప్రయాణికులను కాపాడినట్టు పాక్ సర్కారు కూడా బుధవారం సాయంత్రం పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. ‘ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను కాల్చేశాం. ఇంకో 150 మంది బందీలుగానే ఉన్నారు. డెడ్లైన్లో కొన్ని గంటల్లో ముగియనుంది. ఆలోపు మా నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తాం’ అని ఒక ప్రకటనలో హెచ్చరించింది.ప్రత్యక్ష నరకమే..హైజాక్ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులను మిగతావారు భుజాలపై మోసుకెళ్లారు. సెలవుపై ఇళ్లకు వెళ్తున్న సైనికులను తమ కళ్లముందే కాల్చి పొట్టన పెట్టుకున్నారని హమీద్ అనే ప్రయాణికుడు బీబీసీకి వెల్లడించాడు. ‘బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేం చూస్తుండగానే కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు. నేను హృద్రోగినని వేడుకోవడంతో వదిలేశారు’ అని చెప్పాడు. ‘భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేను. ఏం జరుగుతుందోనని 50 నిమిషాలకు పైగా ఊపిరి బిగబట్టుకుని గడిపాం’ ఇషాక్ నూర్ చెప్పుకొచ్చాడు. -
పట్టాలు తప్పిన రైలు..ప్రమాదం ఎక్కడ జరిగింది..?
-
రైలు ప్రమాద ఘటన బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేత
-
బాధితుడి కన్నీళ్లను తుడిచిన సీఎం వైఎస్ జగన్
-
బాధితుల ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం
-
ప్రమాద స్థలం వద్ద ఇదీ ప్రస్తుత పరిస్థితి
-
బాలాసోర్‌లోని ప్రమాద స్థాలానికి సీబీఐ అధికారులు
-
కోరమండల్ ప్రమాద భాదితులతో చెన్నైకి ప్రత్యేక రైలు
-
అద్దం పగలగొట్టి బయటికి దూకేశా
-
ఘటన స్థలాన్ని పరిశీలించిన రైల్వే మంత్రి
-
ఒడిశా రైలు ప్రమాదంతో అప్రమత్తమైన నెల్లూరు యంత్రాంగం
-
బాలేశ్వర్ హాస్పిటల్ ను సందర్శించిన నవీన్ పట్నాయక్
-
ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: కన్నబాబు
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత
-
దురంతో ఎక్స్‌ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
-
గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు
వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా)/రాజమహేంద్రవరం సిటీ: షాలిమార్ నుంచి నాగర్‌కోయిల్ అప్‌లైన్‌లో వెళుతున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. ఎస్–5 బోగీలోని బ్రేక్ వీల్ యాక్సిల్‌లోకి ఎస్ఈజే (సెల్ఫ్ ఎడ్జస్టింగ్ జాయింట్), చెక్ రెయిల్ చొచ్చుకుపోవడంతో రైలు కదలికల్లో మార్పు వచ్చింది. దీన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కవిటగ్రహారం గేటు కీ ఉమన్ కె.రాధారాణి పూండి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమిచ్చారు. ఆయన పూండికి అతి సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేటు 381 వద్ద అర్థాంతరంగా రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మూడు గంటలపాటు గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ పూండిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నౌపడ ఎస్ఎస్ఈ చంద్రశేఖరరావు, సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది, రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూండిలోని సంతోషిమాతా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని కర్ని గురు సహకారంతో చెక్ రైల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు. మరమ్మతుల అనంతరం రైలు విశాఖకు బయలుదేరింది. మళ్లీ విరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ చెన్నై నుంచి హౌరా వెళ్లే కోరమండల్ (12842) ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ మరోసారి విరగడంతో గురువారం రాత్రి గంటన్నర పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా ఎస్–9 కోచ్ బాలిస్టర్ స్ప్రింగ్ విరగడాన్ని సీనియర్ గ్రేడ్ టెక్నీషియన్ గుర్తించాడు. విషయాన్ని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సత్యనారాయణకు చెప్పడంతో అతడు తన సిబ్బందితో వచ్చి గంటన్నర పాటు శ్రమించి కొత్త స్ప్రింగ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రైలు రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరింది. కాగా, ఇదే రైలుకి ఈ నెల 21న ఎస్–4 బోగీ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగిన సంగతి తెలిసిందే. -
ఆ నేతల్ని అందించిన ఘనత మనది
పీటర్‌మారిట్జ్‌బర్గ్: గొప్ప నాయకుల్ని అందించినందుకు భారత్, దక్షిణాఫ్రికాల్ని ప్రపంచం గౌరవిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్యాయానికి, వివక్షకు గురైన ప్రజల్లో నమ్మకం నింపేందుకు గాంధీజీ, నెల్సన్ మండేలాలు పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘మన నుంచి ప్రపంచం ఎంతో లాభపడింది. గొప్ప నాయకుల్ని అందించినందుకు ప్రపంచం గౌరవిస్తోంది. బానిస ప్రజల్లో గాంధీజీ, మండేలా ఆశను ఉదయింపచేశారు. వలస బానిసత్వం నుంచి విముక్తి కల్పించడం ద్వారా భారత్, ఆఫ్రికా దేశాలకు నమ్మకం కలిగించారు’ అని సుష్మా స్వరాజ్ చెప్పారు. 25 ఏళ్ల క్రితం పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మండేలా మాట్లాడిన అంశాల్ని ఆమె ప్రస్తావించారు. అలాగే వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా జరిపిన పోరుకు భారత్ అందించిన మద్దతును గుర్తుచేశారు. అంతకుముందు పెంట్రిక్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌కు రైలులో ప్రయాణించారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉన్న సుష్మా స్వరాజ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభిచారు. ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు.. దక్షిణాఫ్రికా డిప్యూటీ విదేశాంగ మంత్రి లాండర్స్‌తో కలిసి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వర్ణవివక్షతపై పోరాడిన ప్రముఖ నేత ఒలివర్ టాంబోల పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేశారు. -
ఆ అవమానానికి 125 ఏళ్లు!
పీటర్‌మారిట్జ్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గెంటివేతకు గురైన తరువాత మహాత్మా గాంధీ ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమానికి 125 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాలో లాయర్‌గా పనిచేస్తున్న సమయంలో గాంధీ 1893, జూన్ 7న శ్వేతజాతీయులకు కేటాయించిన సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో ఆయన్ని బలవంతంగా దించేశారు. ఈ ఘటన ప్రభావంతో దక్షిణాఫ్రికా, భారత్‌లో బ్రిటిష్ విధానాలను శాంతియుతంగా ఎదుర్కొనేందుకు, ప్రజలను సంఘటితపరచడానికి గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించారు. 1996లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని భారత్, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రాపంచిక వ్యవహారాలను వదులుకుని డర్బన్‌లో ఫీనిక్స్, జోహెన్నెస్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్ ఫార్మ్‌ను నిర్మించాలని గాంధీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన అవలాన్ గ్రూప్ సినీ సెంటర్ సీఈఓ ఏబీ మూసా స్పందిస్తూ..తన పూర్వీకులకు గాంధీతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటే ఎంతో ఉద్వేగం కలుగుతోందని అన్నారు. తదుపరి రెండు రోజులపాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. -
రైలు కింద పడబోయి తృటిలో బతికిపోయింది
-
ప్రమాదంతో రైల్వే శాఖకు 90 కోట్ల నష్టం
బీహార్‌లో పట్టాలపై నిలబడి ఉన్న భక్తుల మీదకు రైలు దూసుకెళ్లి దాదాపు 38 మంది వరకు మరణించిన ఘటన కారణంగా.. రైల్వే శాఖకు వాటిల్లిన నష్టం విలువ ఎంతో తెలుసా? దాదాపు 90 కోట్ల రూపాయలు!! తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు, స్థానికులు కలిసి సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (నెం.12567) ఇంజన్, ఒక ఏసీ బోగీ సహా మొత్తం 12 బోగీలకు నిప్పు పెట్టారు. దాంతోపాటు సమస్తిపూర్ నుంచి సహర్సా వచ్చే ప్యాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలు, ఇంజన్‌ను కూడా తగలబెట్టారు. అధికారికంగా రైల్వే శాఖ మృతుల సంఖ్యను 28గానే చెబుతున్నా, వాస్తవానికి ఈ సంఘటనలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో పాటు రైల్లోని వారు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రజాగ్రహం ఫలితంగా రైల్వేలకు సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. రైల్వే స్టేషన్, కేబిన్, పట్టాలు.. అన్నీ ధ్వంసమయ్యాయి. కనీసం ఆ ప్రాంతానికి వెళ్లి ఆస్తులను కాపాడుకోవడం కూడా సాధ్యం కాలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో అబిత్బా ప్రభాకర్ తెలిపారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి నేరుగా రోడ్డు కూడా లేకపోవడం, ఉన్న ఏకైక రైలు మార్గం ధ్వంసం కావడంతో రైల్వే డాక్టర్లు గానీ, సహాయ బృందాలు గానీ అక్కడకు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలోనే రైల్వే రక్షణ బృందాలు అక్కడకు చేరుకున్నాయి.