బీహార్లో పట్టాలపై నిలబడి ఉన్న భక్తుల మీదకు రైలు దూసుకెళ్లి దాదాపు 38 మంది వరకు మరణించిన ఘటన కారణంగా.. రైల్వే శాఖకు వాటిల్లిన నష్టం విలువ ఎంతో తెలుసా? దాదాపు 90 కోట్ల రూపాయలు!! తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు, స్థానికులు కలిసి సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ (నెం.12567) ఇంజన్, ఒక ఏసీ బోగీ సహా మొత్తం 12 బోగీలకు నిప్పు పెట్టారు. దాంతోపాటు సమస్తిపూర్ నుంచి సహర్సా వచ్చే ప్యాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలు, ఇంజన్ను కూడా తగలబెట్టారు. అధికారికంగా రైల్వే శాఖ మృతుల సంఖ్యను 28గానే చెబుతున్నా, వాస్తవానికి ఈ సంఘటనలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో పాటు రైల్లోని వారు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ప్రజాగ్రహం ఫలితంగా రైల్వేలకు సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. రైల్వే స్టేషన్, కేబిన్, పట్టాలు.. అన్నీ ధ్వంసమయ్యాయి. కనీసం ఆ ప్రాంతానికి వెళ్లి ఆస్తులను కాపాడుకోవడం కూడా సాధ్యం కాలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో అబిత్బా ప్రభాకర్ తెలిపారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి నేరుగా రోడ్డు కూడా లేకపోవడం, ఉన్న ఏకైక రైలు మార్గం ధ్వంసం కావడంతో రైల్వే డాక్టర్లు గానీ, సహాయ బృందాలు గానీ అక్కడకు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలోనే రైల్వే రక్షణ బృందాలు అక్కడకు చేరుకున్నాయి.
ప్రమాదంతో రైల్వే శాఖకు 90 కోట్ల నష్టం
Published Tue, Aug 20 2013 11:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement