బెడిసికొట్టిన ప్రాంక్‌.. క‌దులుతున్న‌ రైలుపై నీళ్లు చ‌ల్ల‌డంతో.. | Video: Pranksters splash water on moving train get instant karma | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన ప్రాంక్‌.. క‌దులుతున్న‌ రైలుపై నీళ్లు చ‌ల్ల‌డంతో..

Published Fri, Jun 28 2024 6:30 PM | Last Updated on Fri, Jun 28 2024 7:15 PM

Video: Pranksters splash water on moving train get instant karma

ఇస్లామాబాద్‌: కొంత‌మంది యువ‌త‌లో పిచ్చి చేష్ట‌లు పెరిగిపోతున్నాయి. చేయ‌కూడ‌ని ప‌నులు చేసి, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు కాలువ వద్ద నిలిపిన బైక్‌ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు.  రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పాకిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలో ఉన్న కాలువ వద్ద కొందరు యువకులు ఫ్రాంక్‌ కోసం ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించిన వారు బైక్‌ ద్వారా నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చేష్టలకు సంతోష ప‌డ్డారు. 

కాగా, రైలు ఇంజిన్‌పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. దీంతో వెంట‌నే భ‌య‌ప‌ప‌డిన యుకులు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే కొందరు ప్రయాణికులు ఆ యువకుల వెంబ‌డించి పట్టుకొని కొట్టారు.

అనంత‌రం రంగంలోకి దిగిన పోలీసులు యువకులు రైలుపై నీటిని చిమ్మిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement