
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.
పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ట్రైన్ హైజాక్‌పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment