balochistan
-
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
పాక్‌లో బీఎల్ఏ స్వైరవిహారం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) రెచ్చిపోయింది. ఆది, సోమ వారాల్లో బీఎల్ఏ సాయుధులు పోలీస్ స్టేషన్లు, రైలు మార్గాలు, వాహనాలపై దాడులు జరిపి 50 మందిని చంపేశారు. అనంతరం సైన్యం చేపట్టిన ఏరివేతలో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారు. బీఎల్ఏ సభ్యులు ఆదివారం రాత్రి బలోచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లాలోని హైవేను దిగ్బంధించారు. అటుగా వచ్చిన బస్సులు, ట్రక్కులను అడ్డగించి, ప్రయాణికులతోపాటు డ్రైవర్లను కిందికి దించివేశారు. ‘గుర్తింపు కార్డులు పరిశీలించాక పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్‌లకు చెందిన 23 మందిని తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలోకి వారంతా పరారయ్యారు. ఉగ్రవాదులు ప్రయాణికుల వాహనాలతో పాటు బొగ్గుతో వెళ్లే ట్రక్కులను కూడా అడ్డగించి డ్రైవర్లను చంపేశారు. పది ట్రక్కులకు నిప్పుపెట్టారు’అని అధికారులు తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లోని మరికొన్ని చోట్ల ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాల పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఈ ఘటనల్లో మరో 10 మంది చనిపోయారు. బలోచిస్తాన్‌లోని ఖలాట్ జిల్లాలో మరో ఘటనలో..ఆరుగురు పోలీసులు సహా మొత్తం 11 మందిని బీఎల్ఏ తీవ్రవాదులు చంపారు. మరో ఘటనలో బొలాన్ జిల్లా డొజాన్ ప్రాంతంలోని పాక్– ఇరాన్‌లను కలిపే రైల్వే మార్గంపై వంతెనను పేల్చివేసిన ఉగ్రవాదులు, ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలకు తమదే బాధ్యతంటూ అనంతరం బీఎల్ఏ మీడియాకు పంపిన ఈ మెయిల్లో ప్రకటించుకుంది. పారామిలటరీ బలగాల బేస్‌పైనా దాడి చేసినట్లు అందులో చెప్పుకుంది. అయితే, ప్రభుత్వం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాక్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్‌లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది దుర్మరణం చెందారు.బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు... 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
బలూచిస్తాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 12 మంది మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు. -
పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్ భిన్న స్వరం
ఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులపై భారత్ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఇరాన్, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు తెలిపారు. ఇరాక్, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్.. ఆ మరుసటి రోజే పాక్ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జైష్ అల్ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై జైష్ అల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ‘‘పొరుగు దేశం పాక్ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్ రక్షణ విభాగం ప్రకటించింది. మరోవైపు పాక్ మాత్రం ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్.. తెహ్రాన్(ఇరాన్ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. -
కెనడా ప్రధాని ద్వంద్వ నీతి.. ఆమె సంగతేంటి?
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్‌పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాదికి అండగా? ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ప్రధానికి లేఖ.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది. సమన్యాయం చేయండి.. బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని.. ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ఎవరీ కరీమా బలూచ్? కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు. Karima Baloch had been exposing the reality of Pak throughout her life and #PakArmy got so scared of her that it murdered her. But it didn’t stop other Baloch from speaking the truth. She continues to inspire all of us. #FreeBalochistan@Hani_Baloch7@yalsarmachar@FawazBaloch7 pic.twitter.com/lSmaI0cIYi — Sohrab Haider (@SohrabHaider7) September 23, 2023 ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం' -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాక్ జరిపిన చర్చలు సఫలం అయ్యారు. ఈ ఇద్దరూ బెలూచిస్తాన్‌కు చెందిన సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో.. పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 9వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. దీంతో ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ ఎంపికలో ప్రతిపక్ష నేత రజా రియాజ్దే ముఖ్యభూమిక అయ్యింది. ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి ఉండాలనే నిర్ణయంతో కాకర్ పేరును ప్రతిపాదించగా.. అందుకు షెహబాజ్ సైతం అంగీకరించారు. దీంతో ఈ పేరును పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి పంపించగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. చిన్న ప్రావిన్స్ అయినా.. బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ గురించి పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే.. ఆ ప్రాంతమంతా తిరుగుబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది కాబట్టి. కాకర్ తొలినాళ్లలో విదేశాల్లో ఉంటున్న పాక్ ప్రజల సంరక్షణ, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్పై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్కమిటీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత బెలూచిస్తాన్ అధిరాకప్రతినిధిగా పని చేశారు. 2018లో బెలూచిస్తాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై.. అటుపై బెలూచిస్తాన్ ఆవామీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సెనేట్‌లో పార్లమెంటరీ లీడర్‌గా ఉన్నారాయన. ఎన్నికలు మరింత ఆలస్యం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, జనాభా పెరుగుదల కారణంగా.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాకే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ఎన్నికలకు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Imran Khan: విద్వేష ప్రసంగం కేసు.. తాత్కాలిక ఊరట
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్‌లోని ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్.. పాక్ సర్కార్‌ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్ ఘర్ పోలీస్ స్టేషన్లో ఖాన్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్ బెలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ ప్రసంగించిన చోటుకి.. బిజిల్ఘర్ స్టేషన్ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను రెండు వారాలపాటు సస్పెండ్ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్ ఎస్పీకి, బిజిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. -
Sucide Bomb Attack In Pakistan: తొమ్మిది మంది పోలీసులు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడంతో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. (చదవండి: 30 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు మిస్టరీ..క్లోజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్!) -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్‌లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్‌పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్‌లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్‌కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి
పాకిస్థాన్‌లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతోపాటు నలుగురు మృత్యువాతపడ్డారు. దీనికి తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఓ మహిళా సుసైడ్ బాంబర్ ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. తాజాగా హ్యుమన్ బాంబర్‌గా మారిన మహిళ గురించి షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 బలూచిస్తాన్‌లోని నియాజర్ అబాద్‌కు చెందిన 30ఏళ్ల షరి బలోచ్ ఈ దాడికి పాల్పడింది. ఆమె ఎంఎస్సీ జువాలజీ పూర్తిచేసి.. సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైద్యుడిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు పేరు మహర్రోష్.. మరొకరికి నాలుగేళ్లు పేరు మీర్ హాసన్. రెండేళ్ల క్రితమే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బ్రిగేడ్‌కు చెందిన స్పెషల్ సెల్ఫ్ శాక్రిఫైజ్ (ఆత్మ బలిదానం) బృందంలో చేరింది. చదవండి👉 Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. క్షణం ఆలస్యమైనా.. Shari Jan,your selfless act has left me speechless but I am also beaming with pride today. Mahroch and Meer Hassan will grow into very proud humans thinking what a great woman their mother https://t.co/xOmoIiBPEf will continue to remain an important part of our lives. pic.twitter.com/Gdh2vYXw7J — Habitan Bashir Baloch (@HabitanB) April 26, 2022 తొలి మహిళా బాంబర్ అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉండడంతో దీని నుంచి తప్పుకోవడానికి అవకాశం కల్పించినా ఆమె ఒప్పుకోలేదు. షరి మిలిటెంట్ గ్రూప్‌లో తొలి మహిళా బాంబర్. ఆరు నెలల క్రితమే తాను ఆత్మబలిదాన దాడికి కట్టుబడి ఉన్నానని ఆమె ధ్రువీకరించింది. ఆత్మాహుతి దాడికి బాధ్యత ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. #Karachi suicide bomber was highly educated mother of two. M.Phil, MSc wife of a doctor: Shari #Baloch, fighting for liberation of #Balochistan from #Pakistan army atrocities. Part of the #MajeedBrigade of Baloch Liberation Army #BLA. Spl wing created in BLA to target #China Pak pic.twitter.com/nkmM1SzHxg — GAURAV C SAWANT (@gauravcsawant) April 26, 2022 చైనా స్పందన మరోవైపు చైనీయులే లక్ష్యంగా జరిగిన కరాచీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అదే విధంగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న చైనీయులకు మరింత భద్రతను అందిచాలని కోరింది. ఈ ఘటన వెనక బాధ్యులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ వాఖ హెచ్చరించింది. -
పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. -
మారణహోమం: పాక్‌లో ప్రతీకార దాడులు
పాకిస్థాన్‌లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తీర నగరం గ్వాడర్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్ పోస్ట్ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది. Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar. 2 children died who were playing nearby & one Chinese sustained minor injuries. 3 persons injured including driver Police & CTD teams are on the crime scene. Investiga launched. Innocent Children,Afsos — Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021 బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా. చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా -
14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు చెందిన ఎంపీ 14 ఏళ్ల మైనర్బాలకను పెళ్లి చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల ప్రకారం..జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, పాక్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ.. 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం మైనర్ బాలికను ఎంపీ వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని,తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. చదవండి : (భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?) (గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!) -
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
చైనా- పాక్ దుందుడుకుతనం.. 30 కి.మీ. మేర గోడ!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాక్‌లోని బలూచిస్తాన్ తీరంలో గల గ్వడార్ పోర్టు వద్ద ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్) అథారిటీ మరో కీలక నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. గ్వడార్ పట్టణం చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుమారు 10 అడుగుల ఎత్తు, 30 కిలోమీటర్ల పరిధి మేర ఓ గోడను నిర్మించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువరించింది. ఈ విషయం గురించి మానవహక్కుల కార్యకర్తలు మాట్లాడుతూ.. రహస్యంగా గోడను నిర్మించడం వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా స్థానికులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు. అదే విధంగా పోర్టు సిటీలో పాక్ ఆర్మీ దురాగతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపెట్టకుండా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, మీడియాను నిషేధించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా.. గడ్వార్‌ను పూర్తిస్థాయిలో తమ నిఘా, నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా సుమారు 500 హెచ్డీ కెమెరాలు బిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులు, సామాజిక కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరి కదలికలను కనిపెడుతూ నిరసన గళాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. (చదవండి: నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు) కాగా గ్వడార్‌లో ఇప్పటికే సుమారు 15 వేల మంది (పాకిస్తాన్ 9 వేలు, డ్రాగన్ ఆర్మీ 6 వేలు) సైనికులను అక్కడ మోహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులు మాట్లాడుతూ.. ఆర్థిక కారిడార్ అని పైకి చెబుతున్నా మిలిటరీ బేస్ కోసమే గ్వడార్‌లో చైనా ఆర్మీ పలు నిర్మాణాలు చేపడుతోందని పేర్కొంటున్నారు. పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను ప్రయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. బెలూచిస్తాన్ నుంచి బెలూచీలను ఖాళీ చేయించి పంజాబీలు, ఫంక్తూన్లతో తమ ప్రాంతాన్ని నింపేందుకు చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు బదులుగా.. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. సీపెక్.. భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్‌పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్‌షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్‌లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
పాక్.. విషం చిమ్మడం మానేసి..
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్తాన్.. ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే దాయాది దేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం పాక్‌కు పిలునివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వర్చువల్ ‘కౌంటర్- టెర్రరిజం’ వీక్‌లో భాగంగా.. ‘‘ప్రపంచానికి శాపంగా పరిణమించిన ఉగ్రవాదం: మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు, పెచ్చు మీరుతున్న తీవ్రవాదం మరియు విద్వేష ప్రసంగాలు, ట్రెండ్స్’’ అనే టాపిక్‌పై వెబినార్ నిర్వహించింది. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన మహవీర్ సింఘ్వీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్‌కు ఈ మేరకు గట్టి కౌంటర్ ఇచ్చారు.(పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..) ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం వంటిదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. అందుకు తగినట్లుగా వారి భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని ఏరివేసేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం ప్రపంచమంతా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. దురదృష్టవశాత్తూ పాక్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టులను పెంచి పోషించే పనిలో ఉంది. ఇందుకు తన సైన్యాన్ని ఉపయోగించుకుంటోంది. ఆర్థికంగా వారికి సహకరిస్తోంది. అంతేగాకుండా భారత్‌పై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు. (పాక్ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే) విషం చిమ్మడం మానేసి.. అదే విధంగా.. భారత్‌లోని జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్.. బలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తువా సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. వివిధ మతాలు, సంస్కృతులు, ఆచారాలు పాటిస్తున్న మైనార్టీలపై ఎందుకు వివక్ష చూపుతోందని మహవీర్ ధ్వజమెత్తారు. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నిమతాల వారికి భారత్‌లో సముచిత స్థానం లభిస్తుందని.. దేశ రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో వారు పనిచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాబట్టి భారత్ వైపు వేళ్లు చూపుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విషం చిమ్మడం మానేసి తమ దేశంలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. (తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!) ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ -
‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’
లండన్: పాకిస్తాన్ ఆర్మీ ‘డెత్‌స్క్వాడ్’ నుంచి బలూచిస్తాన్ ప్రజలను రక్షించాలని ది బలూచ్ నేషనల్ మూమెంట్(బీఎన్ఎం) అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పాక్ సైన్యం ఆగడాల నుంచి తమను కాపాడాలని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియర్ సహా భారత్, అమెరికాలకు మొరపెట్టుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మక్రాన్ ప్రాంతంలో ఇటీవల కొంతమంది దుండగులు మాలిక్ నాజ్ అనే మహిళను కాల్చి చంపారు. అదే విధంగా ఆమె నాలుగేళ్ల కొడుకు బ్రంశ్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బలూచిస్తాన్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. డెత్‌స్క్వాడ్ చీఫ్ సమీర్ సబ్జల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ వందలాది మంది పురుషులు, మహిళలు ఒక్కచోట చేరి నినదించారు.(పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు) కిడ్నాప్.. లైంగిక దాడి ఈ నేపథ్యంలో బీఎన్ఎం(యూకే) అధ్యక్షుడు హకీం బలూచ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘‘పాకిస్తాన్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మనస్తత్వం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఓ గాయం చల్లారిన తర్వాత ప్రజలు తమ పనుల్లో పడిన వెంటనే మళ్లీ ఇంకో ఘటనకు పాల్పడతారు. పాక్ డెత్ స్క్వాడ్ ఆగడాలకు అంతులేకుండా పోయింది. బలూచిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. రెండు వారాల క్రితం అవరన్‌లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి అతడిపై దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే తాజా ఘటనలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతికేందుకు ఉద్యమిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.(పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్) మీ మద్దతు కావాలి ఇక ఈ పోరాటం ముందుకు సాగాలన్నా.. తమ ఉద్యమం నీరుగారిపోకుండా ఉండాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అంతర్జాతీయ సమాజం మద్దతు తప్పనిసరి అని హకీం వ్యాఖ్యానించారు. ‘‘ప్రపంచాన్ని.. ముఖ్యంగా ఐరాస, అగ్రరాజ్యం అమెరికా, యూకే, ఈయూ.. వాటితో పాటు పొరుగు దేశాలైన భారత్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల మద్దతు కోరుతున్నాం’’అంటూ పాకిస్తాన్ ఆర్మీ ఆగాడాలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పాకిస్తాన్‌కు స్థానిక నాయకులే మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చే లంచాలకు అలవాటు పడి సొంత ప్రజలకే అన్యాయం చేస్తున్నారంటూ హకీం మండిపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారం ప్రదర్శిస్తూ.. బలూచ్ ప్రజలను అణచివేస్తూ అకృత్యాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కాగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎన్‌ఎంను స్థాపించి ప్రజా గళాన్ని వినిపించిన గులాం మహ్మద్ బలూచ్ 2009లో దారుణ హత్యకు గురయ్యారు. -
స్వీడన్లో పాక్ జర్నలిస్ట్ మృతి
స్టాక్ హోం: స్వీడన్లో నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్(39) మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మార్చి 2న తప్పిపోయిన సాజిద్ ఏప్రీల్ 23న ఫైరిస్ నదిలో మృతదేహంగా తేలాడని పోలీసు అధికారి జోనాస్ ఎరోనెన్ తెలిపారు. మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయగా సాజిద్ ఏదో నేరం చేసిన నిందితునిగా అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక సాజిద్ మృతి హత్య లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందన్నారు. (ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్) సాజిద్ పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు. అతను బెలుచిస్తాన్ టైమ్స్ అనే వెబ్‌సైట్‌కి చీఫ్ ఎడిటర్ పని చేసేవారు. పాకిస్తాన్లో చోటు చేసుకొనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు, పాక్ ఆర్మీ తిరుగుబాటుపై పలు కథనాలు రాశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సాజిద్ 2012లో స్వీడన్‌కు వలస వెళ్లారు. 2017లో స్వీడన్‌లోని ఉప్ప్సలాలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను చివరిసారిగా స్టాక్ హోంలోని ఉప్ప్సలాలో రైలు ఎక్కినట్లు పోలీలు తెలిపారు. -
పాక్ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఏరెనాలో ఏర్పాటుచేసిన ప్రవాస పాకిస్థానీల సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో బలూచిస్థాన్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. గట్టిగా నినాదాలు చేశారు. బలూచిస్థాన్‌కు విముక్తి ప్రసాదించాలని, వుయ్ వాంట్ బలూచిస్థాన్ అంటూ ఈ సమావేశంలో ఓ మూలన ఉన్న ముగ్గురు కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని అడ్డుకొని దాడి చేసేందుకు అక్కడ ఉన్న కొందరు ప్రయత్నించడంతో సమావేశంలో కొంత రభస చోటుచేసుకుంది. ముత్తహిద కస్మి మూవ్మెంట్ (ఎంక్యూఎం) కార్యకర్తలు, ఇతర మైనారిటీ గ్రూపులు కూడా ఇమ్రాన్ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, పాక్ మీడియా ఈ నిరసన ప్రదర్శనల గురించి కవరేజ్ ఇవ్వకపోవడం గమనార్హం. తన పాలనలో ‘నయా పాకిస్థాన్’ను తీసుకొస్తానంటూ ఇమ్రాన్ చేసిన ప్రసంగానికి పాక్ మీడియా పెద్ద ఎత్తున ప్రచురించింది. -
బాంబు పేలి 16 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా పట్టణంలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కూరగాయల మార్కెట్లో ఘటన జరిగినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బాంబు దాటికి కొన్ని భవనాలు కూలిపోయానని.. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బెలూచిస్తాన్‌లోని క్వెట్టాలో నివసించే మైనార్టీ వర్గం హజారా(షియా ముస్లింలు)లే లక్ష్యంగా ముష్కరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పక్కాగా రిక్కీ నిర్వహించి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట ఐఈడీ పేలేలా ప్రణాళిక రచించారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇంతవరకు ఏ గ్రూప్ కూడా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి త్వరితగతిన నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.