ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్‌సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.
ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి
Comments
Please login to add a commentAdd a comment