Coal mine
-
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్7) జరిగిన ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన గనిలో బొగ్గు వెలికితీసేందుకుగాను బాంబులు పెడుతుండగా పేలుడు సంభవించింది.పేలుడు తర్వాత గని ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గని వద్ద నిలిపి ఉంచిన వాహనాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: పండుగల వేళ ఢిల్లీలో హై అలర్ట్ -
కొత్తగా బొగ్గు గనుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్సీ) 30 ఎంటీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానమ్)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. -
సింగరేణిని ముంచే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్‌ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసేందుకే... ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్‌లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్‌లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాడు అంధకారంలోకి దక్షిణాదిసింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.లోక్‌సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బలూచిస్తాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు.. 12 మంది మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో గల జర్దాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హర్నై జిల్లాలో జరిగింది. గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ సమయంలో 18 మంది మైనర్లు గనిలో చిక్కుకుపోయారు. వెంటనే మైనర్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో 12 మంది మైనర్లు మరణించగా, ఆరుగురు మైనర్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గనిలో రాత్రిపూట మీథేన్ వాయువు వెలువడింది. ఇదే పేలుడుకు కారణం కావచ్చని బలూచిస్తాన్ చీఫ్ మైన్స్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ గనుల శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయని తెలిపారు. మృతదేహాలను గుర్తించి, ఆసుపత్రికి తరలించామన్నారు. -
China: బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 10 మంది కార్మికులు మరణించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సీసీ టీవీ వెల్లడించింది. పేలుడు జరిగినపుడు బొగ్గుగనిలో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు.పేలుడు తర్వాత బొగ్గుగనిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గనుల భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటీవలి కాలంలో చైనాలోని బొగ్గుగనుల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గనులపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరంలో చైనా గనుల్లో 168 ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో మొత్తం 245 మంది మృతి చెందారు. ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్ అమెరికా దాడులు -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు. -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
బొగ్గు రవాణా మరింత పెంచాలి
శ్రీరాంపూర్: బొగ్గు రవాణా మరింత పెంచాలని సింగరేణి(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన రెస్ట్హాల్ను ప్రారంభించారు. అనంతరం సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం బీ.సంజీవరెడ్డి, ఏరియా ఇంజనీర్ రమేశ్‌బాబు, సీహెచ్‌పీ డీజీఎం వెంకటేశ్వరరావు డీజీఎం సివిల్ శివరావు, డీజీఎం ఐఈడీ చిరంజీవులు, ఆర్కే 5 గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, గుర్తింపు సంఘం నాయకులు లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజ్, ఐఎన్టీయూసీ బ్రాంచిఉపాధ్యక్షుడు శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
‘సుల్యారీ’లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సాక్షి, అమరావతి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలోని సుల్యారీ బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత బొగ్గు తవ్వడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ జాతీయ స్థాయి మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఏపీఎండీసీ ముందంజలో ఉందని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గనిలో 2021, ఏప్రిల్ నెలలో బొగ్గు తవ్వకాలను ఏపీఎండీసీ లాంఛనంగా ప్రారంభించింది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు, కోర్టు కేసులన్నింటినీ పరిష్కరించుకుని 2022, మార్చి నుంచి పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది మార్చి నాటికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీనిద్వారా రూ.483.5 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 8 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్ల రెవెన్యూ సాధించాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. సుల్యారీ బొగ్గు గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాలపాటు వెలికితీసేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఏపీఎండీసీ ముందుకెళుతోంది. అలాగే ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్‌ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం ముందుచూపు నిర్ణయాలే కారణం రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలైన మొదటి ఏడాదే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆయన దూరదృష్టం కారణం. ఈ బొగ్గు గని ద్వారా మున్ముందు మంచి ఫలితాలు రానున్నాయి. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. సుల్యారీ బొగ్గు గనుల తవ్వకాల ద్వారా ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పరిధిని విస్తరించుకోవడంతోపాటు సత్తా చాటుకుంది. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
2023లో 4 కొత్త గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులపై బుధవారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. కొత్తగూడెంలోని వీకే బ్లాక్‌లో జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లెందులోని జేకే ఓసీ విస్తరణలో జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని శ్రీధర్ సూచించారు. 2023–24లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్ట్ గనుల వార్షిక లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీడీకే గని నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. రికార్డుస్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి రికార్డు స్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే 23 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2021–22లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.26,619 కోట్లు కాగా, 2022–23లో రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
బొగ్గు ఎలా తవ్వుతారు..? కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు?
బొగ్గు ఎలా తవ్వుతారు.. అసలు నేలలో బొగ్గు నిక్షేపాలు ఎలా ఉంటాయి.. తోడిన బొగ్గును బయటకు ఎలా తీస్తారు.. బొగ్గులో రకాలెన్నుంటాయి.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు.. ఈ ప్రశ్నలకు ఎవరో సమాధానాలు చెప్పడం కంటే, ప్రత్యక్షంగా ఆ ప్రక్రియలను తిలకిస్తే ఎంత బాగుంటుంది. కానీ, అలా నేరుగా చూసే భాగ్యం సామాన్యులకు దక్కడం కుదరదు. దాన్ని సాకారం చేసేలా ఇప్పుడు ఆర్టీసీ–సింగరేణి సంయుక్తంగా ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. రూ.1,600 చెల్లిస్తే చాలు.. వీటన్నింటినీ దగ్గరుండి నేరుగా చూసి మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని ఇదీ ఆ ప్రాజెక్టు.. దేశంలో ఉత్పత్తయ్యే బొగ్గులో 10 శాతానికిపైగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు ప్రసాదిస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బొగ్గు–పర్యాటకానికి తెర తీశారు. ఇందులోభాగంగా ఇటీవలే ఆయన సింగరేణి అధికారులతో మాట్లాడి సంయుక్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. బుక్ చేసుకునే పర్యాటకుల తొలి బస్సు ఈనెల 28న సింగరేణికి వెళ్లనుంది. జనవరి నుంచి ప్రతీ శనివారం ఒక సూపర్‌లగ్జరీ బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండు నుంచి బయలుదేరుతుంది. పర్యాటకుల రద్దీ పెరిగితే ఈ ట్రిప్పుల సంఖ్య పెంచుతారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.1,600గా నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి దాన్ని రూ.1,850గా సవరించాలని భావిస్తున్నారు. ఉదయం జూబ్లీ బస్టాండులో బయలుదేరే బస్సు నేరుగా గోదావరి ఖనిలోని 7 ఇంక్లైన్ బొగ్గుగనికి చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలుత భూగర్భ గనిలో బొగ్గు తవ్వే విధానాన్ని చూపుతారు. ప్రత్యేక కన్వేయర్ ద్వారా వందల అడుగుల లోతులోని భూగర్భ గనిలోకి తీసుకెళ్లి చూపుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి ఓపెన్‌కాస్ట్ గని వద్దకు తీసుకెళ్తారు. బొగ్గు తవ్వేందుకే జరిపే పేలుళ్లు మొదలు తవ్వి పైకి తెచ్చే వరకు చూపుతూ వివరిస్తారు. తర్వాత అక్కడికి చేరువలో ఉన్న జైపూర్ పవర్‌ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి తీరును ప్రత్యక్షంగా చూపుతారు. జీడీకే–7ఎల్ఈపీ గని స్వాగత ద్వారం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చార్జి అదనం నగరం నుంచి బయలుదేరాక సిద్దిపేట సమీపంలో ఓ హోటల్ వద్ద బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అందుకయ్యే రూ.99ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి అండర్‌గ్రౌండ్ బొగ్గుగనిలోకి వెళ్లేటప్పుడు ఉచితంగా టీ, స్నాక్స్ ఇస్తారు. మధ్యాహ్నం అక్కడి గెస్ట్‌హౌజ్‌లో ఉచితంగా లంచ్ ఏర్పాటు చేస్తారు. తిరుగుప్రయాణంలో మళ్లీ సిద్దిపేట సమీపంలోని హోటల్లో డిన్నర్ ఉంటుంది. ఆ చార్జీని ప్రయాణికులే భరించాలి. ప్రస్తుతం ఈ ట్రిప్ చార్జీగా వసూలు చేసే రూ.1,600 నుంచి సింగరేణికి రూ.300 చెల్లిస్తారని సమాచారం. అందులో ఎంట్రి టికెట్, లంచ్ చార్జీ కలిసి ఉంటాయి. నేడు లాంఛనంగా ప్రారంభం సింగరేణి దర్శన్ యాత్రను మంగళవారం ఉదయం బస్‌భవన్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సింగరేణి డైరెక్టర్లు ఎస్,చంద్రశేఖర్, ఎన్.బలరాం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి ప్రారంభిస్తారు. తొలి ట్రిప్పు ఈనెల 28న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. చైర్‌కార్ ద్వారా గనిలోకి.. పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సంస్థ గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మ్యాన్‌రైడింగ్ చైర్‌కార్ ద్వారా గనిలోకి తీసుకెళ్లి బొగ్గు ఉత్పత్తి, యాంత్రీకరణ, అంశాలను చూపిస్తాం. గని ముందున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పర్యాటకులు పెరిగితే అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడైతే వారంలో ఒకసారి సందర్శన ఉండేలా నిర్ణయించాం. – ఎ.మనోహర్, జీఎం, ఆర్జీ–2 -
బొగ్గు గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
ఇస్తాన్‌బుల్: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇప్పటివరకు 58 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇంకా పదుల సంఖ్యలో కార్మికులు గనిలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఈ పేలుడు జరిగినప్పుడు గనిలో 110 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో సగం మంది 300 అడుగుల లోతులో ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సిబ్బంది రాత్రంతా రెస్కూ ఆపరేషన్ నిర్వహించి గని లోపల ఉన్నవారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు వివరించారు. ఇంకా 15 మంది గనిలోనే చిక్కుకున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం కుటుంబసభ్యులు గని వద్ద రోదిస్తున్నారు. అయితే ఈ భారీ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బొగ్గు గనులలో పేలుడు మిశ్రమాన్ని ఏర్పరుచుకునే మిథేన్ గ్యాస్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని టర్కీ ఇంధన మంత్రి తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు -
బ్రహ్మదియా బొగ్గును తెచ్చేద్దాం
సాక్షి, అమరావతి: మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ).. ఇప్పుడు జార్ఖండ్‌లోని బ్రహ్మదియా బొగ్గు గనిపై దృష్టి సారించింది. ఈ గనిలోనూ సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం 2021లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి మరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్‌ను దక్కించుకుంది. ఇందులో ఉన్న అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్‌ను ఉక్కు కర్మాగారాల్లో వినియోగిస్తారు. దీన్ని ఉత్పత్తి చేస్తే.. బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలో వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏపీఎండీసీ చర్యలు చేపట్టింది. అనుమతుల కోసం ప్రయత్నాలు.. బ్రహ్మదియాలో తవ్వకాలు జరిపేందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. దీనిపై జార్ఖండ్ పర్యావరణ అథారిటీ స్పందించాల్సి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఎండీసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. నాలుగైదు నెలల్లో అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈలోపు మైనింగ్ లీజు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సాధించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో అవి కూడా వస్తాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈలోగా అవసరమైన భూ సేకరణపై దృష్టి కేంద్రీకరించారు. ఏడాదికి 5 లక్షల టన్నులు తవ్వేలా.. బ్రహ్మదియా గని నుంచి ఏడాదికి లక్షన్నర టన్నుల బొగ్గును 14 సంవత్సరాలపాటు ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సు ఇచ్చింది. కానీ స్థానికంగా అక్రమ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలోని బొగ్గు నిల్వలను తక్కువ సమయంలోనే మైనింగ్ చేయాలని ఏపీఎండీసీ భావిస్తోంది. ఏడాదికి లక్షన్నర టన్నులకు బదులు ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నాలుగైదేళ్లలోనే ఈ గనిలో బొగ్గు తవ్వకాలు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో మైనింగ్ ప్రారంభిస్తాం.. సుల్యారీలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియా సరసన నిలిచాం. పర్యావరణ అనుమతులు సాధించి త్వరలో బ్రహ్మదియాలోనూ ఉత్పత్తి ప్రారంభిస్తాం. దీని వల్ల మన రాష్ట్ర అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
చైనా బొగ్గు గని ప్రమాదంలో 14 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో బొగ్గు గని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది మరణించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న పై కప్పు కూలిపోవడంతో అక్కడే పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సహాయ సిబ్బందిని రంగంలోకి దించారు. వారం రోజులు సహాయ కార్యక్రమాలు నిర్వహించాక 14 మంది మృతదేహాలు బయటపడ్డాయి. చైనాలో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో మరణాల సంఖ్య తగ్గాయి. (చదవండి: ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం) -
బొగ్గు బావుల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిని ప్రైవేట్‌పరం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సింగరేణిలో ఉన్న బొగ్గు బావులను ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకొన్నది. ప్రైవేటీకరణ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల జీవితాల మీద దెబ్బకొడుతుంది. ప్రస్తుతం నాలుగు బావులతో మొదలుపెట్టి ఆ తర్వాత సింగరేణి బావుల మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. సింగరేణి బ్లాకులన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనులు రావు. ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్వ ఉద్యోగాలు ఉండవు. క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పుడు అమలు చేస్తున్న హక్కులు, బోనస్‌లు, అలవెన్స్‌లను తగ్గిస్తుంది. దీనితో కార్మికుల మీద భారం పడుతుంది. వారు ఆర్థికంగా దెబ్బతిని కుంగిపోతారు. వారి కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి బొగ్గు బావులు ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) ముందు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల హక్కులపై దృష్టి పెట్టండి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. సింగరేణిలో పని చేస్తున్న అన్ని కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయండి. కరోనా వల్ల మరణించిన సింగరేణి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి. సింగరేణిలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌లో మట్టి తొలగింపు విధానం, అండర్‌గ్రౌండ్ గనుల్లో కాంట్రాక్ట్ పద్ధతిని నిలిపివేయండి. గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే సహాయం అందించండి. సింగరేణి కార్మికుల హక్కులను హరించి వేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు కావున సింగరేణిలో జరిగే 72 గంటల సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికులు కర్షకులు, మేధావులు, ప్రజలపై ఉంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – కనికరపు లక్ష్మీకాంతం, కార్మిక సంఘాల జేఏసీ -
రష్యా బొగ్గు గనిలో ప్రమాదం.. 52 మంది మృతి
మాస్కో: రష్యాలోని సైబీరియాలో బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రక్షకులతో సహా ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సైబీరియాలోని కెమెరొరో ప్రాంతంలోని లిట్స్వ్యనయ బొగ్గు గని బయట ఉన్న బొగ్గు పొడిలో ముందుగా మంటలు చెలరేగాయి. వెంటిలేషన్ వ్యవస్థ గుండా అగ్నికీలలు గని లోపలికి వేగంగా వ్యాపించి చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో అనేకమంది గనిలో చిక్కుకుపోయారు. చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్ ఈ ఘటన జరిగే సమయానికి గని లోపల 285 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గనిలో ప్రాణాలతో బయటపడిన వారు లేరని రష్యా అధికారులు చెబుతున్నారు. మృతదేహాలు భూగర్భంలోనే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ గనిలో ఏవైనా పేలుళ్లు జరిగే ఆస్కారముందనే అంచనాతో సహాయక చర్యల్ని తాత్కాలికంగా ఆపేశామని రష్యా అత్యయక వ్యవహారాల తాత్కాలిక మంత్రి అలెగ్జాండర్ చెప్పారు. ఘటనపై రష్యా దర్యాప్తునకు ఆదేశించింది. కాగా రష్యా దేశంలో ఐదేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన గని ప్రమాదం ఇది. మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కెమెరోవో ప్రాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలను రష్యా సర్కారు ప్రకటించింది. -
కార్మిక క్షేత్రంలో విషాదం: ‘బావ.. ఒక్కసారి లే.. నీ కొడుకును ఎత్తుకో..’
శ్రీరాంపూర్/నస్పూర్/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం మొదటి షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో పట్టణంలో నివాసం ఉంటున్న నలుగురు కార్మికులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు గని వద్ద విలపించిన తీరు పలువురు కార్మికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గని ప్రమాదంలో మృతిచెందిన కార్మికులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ.. సైకిల్‌పైనే డ్యూటీకి... ఒంటెల క్రిష్ణారెడ్డి ఆర్కే 8 కాలనీ నివాసి. ఇతను అనారోగ్య కారణాలతో కారుణ్య ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లాడు. ఐతే బోర్డు ఆయన్ను తిరిగి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇవ్వడంతో వచ్చి డ్యూటీ చేస్తున్నారు. మంచి సౌమ్యుడిగా పేరు. ఎప్పుడు సైకిల్‌పైనే తిరిగే వాడని, డ్యూటీకి కూడా సైకిల్ మీదనే వచ్చే వాడని పేరుంది. ఇతనికి భార్య సత్యవతి, కొడుకులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అన్‌ఫిట్ అయితే కొడుకు ఉద్యోగం వస్తుందని ఆశ పడితే బోర్డు ఫిట్ ఇవ్వడంతో అటు కొడుకు ఉద్యోగం ఆశ నెరవేరక, ఇటూ ఇంటి పెద్దప్రాణాలు నిలువక ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది. శాశ్వత విశ్రాంతి మిగిలింది బేర లక్ష్మయ్య ఈ సంవత్సరం జూలైలో రిటైర్డ్ అయ్యారు. విశ్రాంతి తీసుకుందామనుకుంటే కంపెనీ తిరిగి ఒక సంవత్సరం సర్వీసు పెంచడంతో తిరిగి ఆగస్టులో ఉద్యోగంలో చేరారు. నస్పూర్ షిర్కేలో కుటుంబం నివాసం ఉంటుంది. తన జీవిత కాలంలో ఏ ప్రమాదం జరగకుండా బయటపడి.. మళ్లీ డ్యూటీలో చేరాక ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఇతనికి భార్య, కొడుకులు శ్రీధర్, శ్రీకాంత్, కూతురు సుమలత ఉన్నారు. స్నేహితుడి రూంలో ఉంటూ.. గడ్డం సత్యనర్సింహారాజు స్వస్థలం ఇల్లెందు. ఉద్యోగం చేరి సంవత్సరం దాటింది. పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయితడనే మురిపం తీరకుండానే బాయి ప్రమాదం పొట్టనపెట్టుకోవడం వారికుటుంబాల్లో విషాదం నింపింది. తల్లిదంద్రులు రాజు, రమాదేవి ఇల్లందులోనే ఉంటారు. నర్సింహారాజు మంచిర్యాల సున్నంబట్టి వాడలో స్నేహితుడి రూంలో ఉంటూ డ్యూటీకి వస్తుంటాడు. చంద్రశేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న చెల్లెలు.. ఇన్సెట్లో చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో) అరిన ఆశాదీపం.. రెండ చంద్రశేఖర్ తండ్రి పోశం సింగరేణిలో పని చేసి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఆయన స్థానంలో కారుణ్య ఉద్యోగం వచ్చింది. రెండేళ్లుగా సింగరేణిలో చేస్తున్నారు. ఇతనికి భార్య నవ్య, ఐదు నెలల ముద్దుల కొడుకు ఉన్నాడు. కొడుకుతో మురిపం తీరలేదు. కారుణ్య ఉద్యోగంతో ఆ ఇంటికి ఆశాదీపంగా ఉంటానుకున్న తన కొడుకు బాయి ప్రమాదం విగతజీవున్ని చేసిందని చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బావా.. నీ కొడుకును ఎత్తుకోవా..? ఆ పసి మనసుకు ఏం తెలుసు? నాన్న చనిపోయాడని..? అమ్మ ఎందుకు ఏడుస్తుందోనని...? అమ్మ ఎన్ని సార్లు పిలిచిన నాన్న రావడం లేదని.. మృతుల్లో ఒకరైన యువ కార్మికుడు రెంక చంద్రశేఖర్ ఐదు నెలల కుమారుడి చూపులు ఆ పరిసరాల్లో వర్ణణాతీత విషాదాన్ని నింపింది. ఊహ తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని చూసిన వారందరికీ దుఃఖం కడుపులోంచి తన్నుకొచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య నవ్య ‘‘ఓ బావ, నీ కొడుకును ఎత్తుకోవా.. నీ కోసం చూస్తున్నాడు... బావ.. ఒక్కసారి లే.. బావ ఒక్కసారి లే..’’ అంటూ తల్లడిల్లిన తీరు అందరినీ కలచి వేసింది. (గని పైకప్పు కూలి... నలుగురు కార్మికులు మృతి) -
బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గని షేర్లంటూ రూ.కోటి స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గనికి సంబంధించిన షేర్లు ఇస్తామంటూ హైదరాబాద్‌వాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.కోటి కొట్టేశారు. ఆరేళ్ల పాటు సాగిన ఈ దోపిడీపై ఎట్టకేలకు బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ఆగాపూరకు చెందిన వ్యక్తి కొన్నేళ్లు అసోంలోని గౌహతిలో ఉన్నాడు. 2015లో ఇతడికి చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు పాలసీ పేరు చెప్పారు. తమ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ.80 లక్షల విలువైన కోల్‌మైన్ షేర్లు ఇస్తామంటూ ఎర వేశారు. అతి తక్కువ కాలంలోనే వాటి విలువ రూ.కోట్లకు చేరుతుందని నమ్మబలికారు. తొలుత ఇన్సూరెన్స్ పాలసీతో పాటు వివిధ పేర్లు చెప్పి రూ.20 లక్షలు కాజేశారు. ఆపై షేర్స్ కేటాయింపు కోసమంటూ కొన్ని పత్రాలు ఆయనకు పంపారు. వీటిని తిరిగి పొందిన తర్వాత ఓసారి ఫోన్ చేసి షేర్ విలువ భారీగా పెరిగిందని చెప్పారు. ఆ డబ్బును ఎన్‌క్యాష్ చేసుకోవడానికి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పి భారీ మొత్తం స్వాహా చేశారు. ఆరేళ్ల కాలంలో మొత్తం రూ.కోటి స్వాహా చేశారు. మరికొన్ని పన్నుల పేరుతో ఇంకా డబ్బు చెల్లించాలని చెప్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. -
అక్రమ మైనింగ్ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు
షిల్లాంగ్: మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు కార్మికులు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురూ అస్సాంకు చెందిన వారని సిల్చార్ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. తావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష్య సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్ జైంతియా హిల్స్ ఎస్పీ జగ్పాల్ ధనోవా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జైంతియా హిల్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయంపై తనకు అంత అవగాహన లేదని స్థానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
Coal Block Auction: వేలానికి 67 బొగ్గు గనులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 67 బొగ్గు బ్లాకులను (గనులు/నిక్షేపాలు) విక్రయానికి పెట్టింది. రెండో దశ వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలాన్ని గురువారం ప్రారంభించి.. ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించింది. 2014లో వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు గనులను ప్రారంభించిన తర్వాత ఒక విడతలో అత్యధిక బ్లాక్‌లను వేలానికి ఉంచడం ఇదే ప్రథమం. వేలాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బొగ్గు శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విక్రయించనున్న 67 గనుల్లో 23 కోల్‌మైన్స్ చట్టం కింద, 44 మైన్స్ అండ్ మినరల్స్ చట్టం పరిధి కింద ఉన్నాయి. కోకింగ్, నాన్‌కోకింగ్ కలసి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రహ్లాద్ జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి మేరుగుపడుతుందని అని అన్నారు. బొగ్గు రంగంలో గత విజయాలను పరిశీలించాక, భవిష్యత్తులో వేలం నిర్వహించడానికి ప్రభుత్వం ‘రోలింగ్ యాక్షన్’ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు. చదవండి: ఈ బ్యాంకు పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని భూగర్బ బొగ్గు గనిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నైరుతి చైనాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వేయర్ బెల్ట్ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ విడుదలైందని, దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్ జిల్లా యంత్రాంగం సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా, ప్రమాదం జరిగిన చోఘింగ్ ఎనర్జీ సంస్థ ప్రభుత్వం అధీనంలో నడుస్తోంది. భద్రత కరువు చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణమైపోయాయి. భద్రతా పరమైన నిఘా లేకపోవడం, అధికారుల వైఫల్యం కారణంగా ఎంతోమంది అమాయకులు, మైనర్లు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన ఓ బొగ్గుగని, గ్యాస్ పేలుడు ఘటనలో 14 మంది మైనర్లు మృతి చెందారు. 2018 డిసెంబర్లో ఇదే చోఘింగ్ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతి చెందారు. 2018 అక్టోబర్‌లో షాన్‌డోంగ్ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మైనర్లు ప్రాణాలు విడిచారు. బొగ్గు పెళ్లలు విరిగిపడంతో బయటకు రాలేక 22 మంది చిక్కుకు పోగా.. ఒకరిని మాత్రమే రక్షించగలిగారు. (చదవండి: కరోనాని కట్టడి చేయకపోతే.. 20 లక్షల మంది బలి) -
ఆర్కే 5బి గనిలో పేలుడు
సాక్షి, శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే 5బి గనిలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వివరాలు.. రోజువారీ పనుల్లో భాగంగా కోల్ కట్టర్లు రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, గాదె శివయ్య, బదిలీ వర్కర్ సుమన్‌కుమార్, షాట్ ఫైరర్ శ్రీకాంత్ విధులకు హాజరయ్యారు. రెండో షిఫ్ట్ విధుల్లో భాగంగా వీరికి భూగర్భంలో కోల్æకట్టింగ్ పనులు అప్పగించారు. వారు బ్లాస్టింగ్ హో ల్స్ చేస్తుండగా.. ఒక్కసారి పేలుడు సంభవించింది. బొగ్గు పొరల్లో ఉన్న మందుగుండు పేలడంతో పొరల్ని చీల్చుకుంటూ వచ్చిన పెల్లలు.. కార్మికుల చేతులు, ముఖాలకు బలంగా తాకాయి. ఈ ప్రమాదంలో రత్నం లింగయ్య తల, చేతులకు, శివయ్య ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వా రూ గాయపడ్డారు. క్షతగాత్రులను తోటి కార్మికులు ఉపరితలానికి తీసుకొచ్చి.. అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. (వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ) అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రత్నం లింగయ్య మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అదే అంబులెన్సులో తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లింగయ్యకు ఆసుపత్రిలో కనీస ప్రాథమిక చికిత్స చేయకుండానే హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతోనే మృతి చెందాడని కార్మిక సం ఘాల నేతలు, కార్మికులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ వైద్య అధికారులను నిలదీశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయ కులు ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.వీరభద్రయ్య ఏరియా ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదటి షిఫ్ట్‌లో బ్లాస్ట్ కానిదే.. ప్రమాదానికి మొదటి షిఫ్ట్‌లో బ్లాస్టింగ్ కాకుండా మిగిలిన మందుగుండే కారణమని, మొదటి షిఫ్ట్‌లో పేలకుండా.. రెండో షిఫ్ట్‌లో పేలిందని తెలిసింది. సాధారణంగా బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఎన్ని మందుగుండ్లు పెట్టారు..? ఎన్ని పేలాయి..? పేలనివి ఎన్ని..? అని లెక్క చేసుకుంటారు. పేలనివి ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మొదటి షిఫ్ట్‌లో పేలని దాన్ని గుర్తించకుండా అధికారులు రెండో షిఫ్ట్‌లో కార్మికులను పనులకు పంపడంతో ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
మేఘాలయలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్