
రేపు సింగరేణి భవన్‌లో స్ట్రక్చరల్ సమావేశం
15 నెలల తర్వాత తొలిసారి భేటీ
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మారుపేర్ల బాధితులు
ప్రభుత్వం కరుణించినా పట్టించుకోని సింగరేణి
గోదావరిఖని: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి(Singareni) బొగ్గు గనుల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన స్ట్రక్చరల్ సమావేశం 15 నెలలు గడిచినా జాడ లేకుండా పోయింది. గతేడాది నవంబర్ 28న డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహించింది.
విధానాల నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కావడంతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి సమావేశంలోనే తేల్చుకోవాలని డైరెక్టర్లు చేతులెత్తేశారు. అప్పటి నుంచి అనేక కారణాలతో సీఎండీ స్థాయి సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 5న స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పేరిట వాయిదా..
గత ఫిబ్రవరి 5న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తామని యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలకు సమాచారం ఇచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా వేసింది. గతంలో కూడా జనవరి 27న నిర్వహిస్తామని చెప్పినా.. వాయిదా పడింది.
ఈసారైనా మోక్షం లభించేనా?
సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈసారైనా మోక్షం లభించేనా? అని ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జీతభత్యాలపై ఆదాయపన్ను మాఫీ, సొంతింటి పథకం, మారుపేర్ల కార్మికులకు ఉద్యోగాలు తదితర సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటి పరిష్కారం కోసం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించింది. 2023 డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించగా.. గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.
ఎట్టకేలకు 2024 సెప్టెంబర్ 9న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం అందజేశారు. అక్టోబర్‌లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు సాగాలనే తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో వివరించారు.
ఆరేళ్ల తర్వాత తొలి సమావేశం..
సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు యూని యన్‌గా రెండోసారి గెలిచిన తర్వాత ఒకటి రెండు సమావేశాలు జరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చరల్ సమావేశాలు లేకుండా పోయాయి.
ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్‌గా గెలిచిన తర్వాత స్ట్రక్చ రల్ సమావేశం నిర్వహించాలని యాజమా న్యంతో పట్టుబట్టింది. దీంతో ఏడాది ఆల స్యంగానైనా సంస్థ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని గతేడాది నవంబర్‌లో నిర్వ హించింది. కానీ అందులో సమస్యల పరి ష్కారానికి మోక్షం లభించలేదు.
⇒ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గతేడాది డిసెంబర్ 23న జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సీఎండీ స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరగలేదు
⇒ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్య లకు ఇప్పటికీ మోక్షం లభించలేదు
⇒ ప్రధానంగా మారుపేర్ల బాధితులు, విజి లెన్స్ కేసులతో చాలామందికి ఉద్యోగా లు రాక కార్యాలయాల చుట్టూ తిరు గుతున్నారు.
⇒ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశం గతేడాది నవంబర్ 28న జరిగింది.
⇒ ప్రధాన సమస్యలన్నీ సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలోనే తేల్చుకోవాల ని డైరెక్టర్లు చేతులెత్తేశారు.
⇒ ఇప్పటివరకు మళ్లీ సమావేశం లేదు.
⇒ స్ట్రక్చరల్ సమావేశం కోసం సుమారు 42 వేల మంది కార్మికుల నిరీక్షణ
ప్రధాన డిమాండ్లు ఇవే..
⇒ కోల్–ఇండియా మాదిరిగా జీత భత్యాలపై ఆదాయ పన్ను మాఫీ చేయాలి
⇒ మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలి.
⇒ విజిలెన్స్ పేరిట పెండింగ్‌లో ఉన్న కార్మికుల పిల్లలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి.
⇒ సంస్థ వ్యాప్తంగా సుమారు 500 మంది మారుపేర్ల కార్మికులున్నారు.
⇒ గైర్హాజరు పేరుతో తొలగించిన కార్మికులను కూడా వన్‌టైం సెటిల్‌మెంట్ కింద విధుల్లోకి తీసుకోవాలి
⇒ కోల్ ఇండియాలో లేని సింగరేణిలో ఉన్న 14 రకాల అలవెన్స్‌లు పెంచాలి
⇒ కార్మికుల పదోన్నతి విధానం అమలు చేయాలి
⇒ ట్రేడ్స్‌మెన్లకు గనిలో పనిచేసే పరిధి నిర్ధారించాలి.
⇒ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి
⇒ గనులపై కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం కల్పించాలి
⇒ వైద్య సౌకర్యం మెరుగుపరచి కార్పొరేట్‌స్థాయి సౌకర్యాలు కల్పించాలి
⇒ కొత్త గనులు ఏర్పాటు చేసి నూతన ఉద్యోగాలు కల్పించాలి
⇒ కొన్ని శతాబ్దాలపాటు సంస్థ భవిష్యత్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి
⇒సీఎస్‌ఆర్ నిధులు ప్రభావిత, నిర్వాసిత గ్రామాల్లోనే వినియోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment