workers association
-
ఏడేళ్ల నిరీక్షణ ఫలించేనా?
గోదావరిఖని: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి(Singareni) బొగ్గు గనుల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన స్ట్రక్చరల్ సమావేశం 15 నెలలు గడిచినా జాడ లేకుండా పోయింది. గతేడాది నవంబర్ 28న డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహించింది.విధానాల నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కావడంతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి సమావేశంలోనే తేల్చుకోవాలని డైరెక్టర్లు చేతులెత్తేశారు. అప్పటి నుంచి అనేక కారణాలతో సీఎండీ స్థాయి సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 5న స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పేరిట వాయిదా..గత ఫిబ్రవరి 5న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తామని యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలకు సమాచారం ఇచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా వేసింది. గతంలో కూడా జనవరి 27న నిర్వహిస్తామని చెప్పినా.. వాయిదా పడింది.ఈసారైనా మోక్షం లభించేనా?సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈసారైనా మోక్షం లభించేనా? అని ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జీతభత్యాలపై ఆదాయపన్ను మాఫీ, సొంతింటి పథకం, మారుపేర్ల కార్మికులకు ఉద్యోగాలు తదితర సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటి పరిష్కారం కోసం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించగా.. గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి.ఎట్టకేలకు 2024 సెప్టెంబర్ 9న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం అందజేశారు. అక్టోబర్‌లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు సాగాలనే తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో వివరించారు. ఆరేళ్ల తర్వాత తొలి సమావేశం..సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు యూని యన్‌గా రెండోసారి గెలిచిన తర్వాత ఒకటి రెండు సమావేశాలు జరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చరల్ సమావేశాలు లేకుండా పోయాయి.ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్‌గా గెలిచిన తర్వాత స్ట్రక్చ రల్ సమావేశం నిర్వహించాలని యాజమా న్యంతో పట్టుబట్టింది. దీంతో ఏడాది ఆల స్యంగానైనా సంస్థ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని గతేడాది నవంబర్‌లో నిర్వ హించింది. కానీ అందులో సమస్యల పరి ష్కారానికి మోక్షం లభించలేదు. ⇒ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గతేడాది డిసెంబర్ 23న జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సీఎండీ స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరగలేదు⇒ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్య లకు ఇప్పటికీ మోక్షం లభించలేదు⇒ ప్రధానంగా మారుపేర్ల బాధితులు, విజి లెన్స్ కేసులతో చాలామందికి ఉద్యోగా లు రాక కార్యాలయాల చుట్టూ తిరు గుతున్నారు. ⇒ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశం గతేడాది నవంబర్ 28న జరిగింది.⇒ ప్రధాన సమస్యలన్నీ సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలోనే తేల్చుకోవాల ని డైరెక్టర్లు చేతులెత్తేశారు.⇒ ఇప్పటివరకు మళ్లీ సమావేశం లేదు.⇒ స్ట్రక్చరల్ సమావేశం కోసం సుమారు 42 వేల మంది కార్మికుల నిరీక్షణప్రధాన డిమాండ్లు ఇవే..⇒ కోల్–ఇండియా మాదిరిగా జీత భత్యాలపై ఆదాయ పన్ను మాఫీ చేయాలి⇒ మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. ⇒ విజిలెన్స్ పేరిట పెండింగ్‌లో ఉన్న కార్మికుల పిల్లలకు వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి. ⇒ సంస్థ వ్యాప్తంగా సుమారు 500 మంది మారుపేర్ల కార్మికులున్నారు. ⇒ గైర్హాజరు పేరుతో తొలగించిన కార్మికులను కూడా వన్‌టైం సెటిల్మెంట్ కింద విధుల్లోకి తీసుకోవాలి ⇒ కోల్ ఇండియాలో లేని సింగరేణిలో ఉన్న 14 రకాల అలవెన్స్‌లు పెంచాలి ⇒ కార్మికుల పదోన్నతి విధానం అమలు చేయాలి⇒ ట్రేడ్స్మెన్లకు గనిలో పనిచేసే పరిధి నిర్ధారించాలి.⇒ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి ⇒ గనులపై కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం కల్పించాలి⇒ వైద్య సౌకర్యం మెరుగుపరచి కార్పొరేట్‌స్థాయి సౌకర్యాలు కల్పించాలి⇒ కొత్త గనులు ఏర్పాటు చేసి నూతన ఉద్యోగాలు కల్పించాలి⇒ కొన్ని శతాబ్దాలపాటు సంస్థ భవిష్యత్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి ⇒సీఎస్ఆర్ నిధులు ప్రభావిత, నిర్వాసిత గ్రామాల్లోనే వినియోగించాలి. -
‘ప్రభుత్వ దృష్టికి కార్మిక సంఘాల సమస్యలు’
సాక్షి, విజయవాడ : సమ్మెకు వెళ్లే కార్మిక సంఘాలతో తాము చర్చలు జరుపుతామని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వ దృష్టికి ఆయా సమస్యలను తీసుకవెళ్తామని, మార్చిలో జరిగిన ఒప్పందం విషయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని తెలిపారు. కార్మిక సంఘాలు సమ్మెకు సంబంధించిన నోటీసుల ఇచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్న విషయమూ తెలిసిందే. ఈ నెల 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మె తేదిని ప్రకటిస్తామని , ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఆ రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎన్నో కష్టాలు పడుతున్నా ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం సన్మానాలు, సంబరాలు చేసి సమస్యలన్నీ తీరినట్టు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల సమాఖ్య కన్వీనర్ వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటానికే కొత్తగా ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశామని విజయవాడ ఏలూరు రోడ్డులోని ఐఎమ్ఏ హాల్లో గురువారం ఉద్యోగ సంఘ ఆవిర్భావ సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడున్న రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని, వాటికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల శ్రేయస్సే ప్రధాన అజెండాగా రాష్ట్రంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఉమ్మడి పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు. ఆ రెండు సంఘాలు ఎప్పుడూ ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదని, రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్, ఇళ్ల స్థలాలకు చెందిన రెండు జీఓలను గొప్పగా చూపే ప్రయత్నం చేస్తూ సీఎంకు సన్మానాలు చేయటం ఆక్షేపనీయమన్నారు. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఎమ్మెల్సీ పదవికోసం ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టారని సంఘ కో– కన్వీనర్ అరవపాల్ ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగ సంఘమనే ముసుగు తీసి తను పనిచేసిన పార్టీ కండువా కప్పుకున్నాడన్నారు. మరో సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అదే తోవలో పయనిస్తున్నారన్నారు. 54 సంఘాల మద్దతు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల సమాఖ్యకు 54 ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయని కన్వీనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయయాదవ్, వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పంచాయతీరాజ్ సంఘం వెంకటస్వామి, మున్సిపల్ ఉపాధ్యాయుల సంఘం రామకృష్ణ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వ్యవసాయాధికారుల సంఘం, పీఎస్టీయూ, గెజిటెడ్ ఫోరం ఉద్యోగుల సంఘం, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఆల్ యూనివర్శిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ అధికారుల సంఘం, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం, ఏపీ టీచర్స్ గిల్డ్, డివిజన్ అకౌంట్స్ అధికారుల సంఘం, పీఆర్ సైట్ ఇంజనీర్ సంఘం, నాగార్జున యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్, హిందీ ఉపాధ్యాయుల సంఘం, పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం, సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం, ఫ్యాక్టరీల ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక.. కాగా, తక్షణ కార్యకలాపాల నిమిత్తం తాత్కాలికంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ కన్వీనర్‌గా వెంకటరామిరెడ్డి, కో–కన్వీనర్ అరవపాల్, సభ్యులుగా కమలాకర్‌శర్మ, జమాల్‌రెడ్డి, ఏవీ పటేల్, ఎం రమేష్‌కుమార్, ఖాదర్‌బాబాను ఎన్నుకున్నారు. ఉద్యోగులను మోసం చేస్తున్న నాయకుల గురించి అప్రమత్తం చేసేందుకు మార్చి 3వ వారంలో ఉద్యోగ చైతన్య యాత్ర చేపట్టాలని తీర్మానించారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని.. జనవరి నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
స్తంభించిన జనజీవనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. సకలజనుల సమ్మెగా రూపాంతరం చెందిన తర్వాత ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నగరం నుంచి పల్లె వరకూ అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, కార్మిక సంఘాలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. బస్సులు తిరగక పోవడం, వ్యాపార సంస్థలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. అయినా భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉద్యమానికి సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన జూలై 30వ తేదీ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉన్నతాధికారులు మినహాయిస్తే ఉద్యోగులు, సిబ్బంది అందరూ ఆందోళనబాట పట్టారు. ఈనెల 12న అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఎన్జీఓలు సకలజనుల సమ్మె చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. చేసేదేమి లేక ఉన్నతాధికారులు సైతం కార్యాలయాలకు రావడం మానేశారు. మరోవైపు ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాలో ఎన్జీఓ ప్రతినిధులు శుక్రవారం గుంటూరులో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమాన్ని మరింత హోరెత్తించాలని తీర్మానించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం ఈనెల 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని ఉద్యమం నుంచి స్కూళ్లకు మినహాయింపు ఇస్తూ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచినా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రైవేటు స్కూళ్ల యజమానులు ప్రకటించారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీపై ప్రభావం చూపుతోంది. రోజూ రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.