ఫైల్ ఫోటో
సాక్షి, విజయవాడ : సమ్మెకు వెళ్లే కార్మిక సంఘాలతో తాము చర్చలు జరుపుతామని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. ప్రభుత్వ దృష్టికి ఆయా సమస్యలను తీసుకవెళ్తామని, మార్చిలో జరిగిన ఒప్పందం విషయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని తెలిపారు. కార్మిక సంఘాలు సమ్మెకు సంబంధించిన నోటీసుల ఇచ్చాయని పేర్కొన్నారు.
ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్న విషయమూ తెలిసిందే. ఈ నెల 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్‌ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మె తేదిని ప్రకటిస్తామని , ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment