సాక్షి, ముంబై: భారత్‌లో అతిపెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అదానీ పోర్ట్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో చేపట్టిన కార్‌మైకేల్ బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో మరోసారి అదానీకి భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియాలోని డోనర్ ఈడీఐ లిమిటెడ్‌కు చెందిన ప్రాజెక్టును వదులుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు అదానీ, డోర్ కంపెనీలు వెల్లడించాయి.
వివాదాస్పద బొగ్గుగని ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం వెల్లడించింది. దీంతో దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న కార్‌మైకేల్ గనికి తాజాగా మరో షాక్ తగిలింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 16.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రుణాలను పొందడంలో విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, చైనా బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు నో చెప్పాయి. ఇక చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో దీంతో అదానీ ఆశలు వదులకుంది.
కాగా 16,500 కోట్ల డాలర్ల విలువైన కార్‌మైకేల్ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. అయితే అంతర్జాతీయ బ్యాంకులు సహా, చైనాకు చెందిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించాయి. మరోవైపు స్థానికులు, పర్యావరణవేత్తలు, పలు సామాజిక సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది.
Comments
Please login to add a commentAdd a comment