Contractor
-
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: ఏ పనికైనా అంచనా వ్యయం రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌కు 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొబిలైజైషన్ అడ్వాన్స్‌ను రద్దు చేస్తూ 2019 డిసెంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 83)ను రద్దు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు (జీవో 57) జారీ చేశారు. 2014–19 తరహాలోనే అయిన వారికి, అధిక ధరలకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను ముట్టజెప్పి.. వాటిని కమీషన్లుగా వసూలు చేసుకుని ఖజానాను దోచేసేందుకు ప్రభుత్వ పెద్దలు మళ్లీ తెర తీశారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టెండర్ వ్యవస్థను నీరుగార్చి.. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అంచనా వ్యయం కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టేవారు. వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ముట్టజెప్పి.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు అప్పట్లో ఆరోపించారు. అంచనా విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్లకుపైగా భారం పడిందని అప్పట్లో లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో 2019 మే 30న అధికారంలోకి వచి్చన వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసింది. రూ.వంద కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనుల టెండర్ షెడ్యూల్‌ను జ్యుడీíÙయల్ ప్రివ్యూకు పంపి ఆమోదం తీసుకున్న తర్వాతే టెండర్లు పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు పిలవాలని నిర్దేశించింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వాలన్న నిబంధనను రద్దు చేసింది. 2019 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి వరకూ నిర్వహించిన టెండర్లలో అంచనా వ్యయం కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే జ్యుడీíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడం గమనార్హం. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్టీ..! రోజుకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
-
Maharashtra: శివాజీ విగ్రహ కాంట్రాక్టర్‌పై లుక్అవుట్ నోటీసులు
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. -
బొజ్జ గణపయ్యా...పొట్ట నింపవయ్యా!
కడప కల్చరల్: మరో మూడు వారాల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపదం వస్తుంది. సందుగొందుల్లో సైతం గణపయ్య విగ్రహాలు వెలుస్తాయి. ఏటా నెలరోజుల ముందే ఊరిబయట విగ్రహాల తయారీ మొదలవుతుంది. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకున్న సామగ్రితోపాటు స్థానికంగా లభించే సామగ్రితో విగ్రహాలు తయారు చేస్తారు. ఊరి బయట పెద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో గడుపుతారు. ఒకటి, రెండు నెలలపాటు తయారు చేసిన విగ్రహాలను అమ్ముకుని సంతృప్తిగా తిరిగి తమ ప్రాంతానికి వెళతారు. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొద్దిగా మారింది. స్థానికంగా ఉండే పెట్టుబడిదారులు ముందే ముడి విగ్రహాలను తెచ్చిపెట్టుకుని రాజస్తానీ కళాకారులకు కాంట్రాక్టుపై రంగులు పూసే పని అప్పగించారు. సదరు పెట్టుబడి పెట్టిన స్థానికులే విగ్రహాలకు అడ్వాన్సులు తీసుకుని ప్రజలు కోరిన తేదికి విగ్రహాలను సిద్ధం చేయాలని కళాకారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యమైతే కూలీ తగ్గుతుందన్న భయంతో కళాకారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కడప నగరంతోపాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో పెద్ద టెంట్లు వేసుకుని గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిజానికి విగ్రహాల వ్యాపారం నిన్న, మొన్నటివరకు కళాకారుల ద్వారానే జరిగేది. ప్రస్తుతం పెట్టుబడి దారులు రంగప్రవేశం చేశాక కళాకా రులంతా కూలీలుగా మారారు. తయారీదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే విగ్రహాలకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ. 8–10 వేలకు విక్రయిస్తున్నారు. 13 అడుగుల భారీ విగ్రహం రూ. 50–60 వేలకు ఇస్తున్నారు. తాము మాత్రం ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటూ కళాకారులకు కూలీ మాత్ర మే ఇస్తున్నారు. సీజన్ పోతే ఈ ఆదాయం కూడా ఉండదంటూ కళాకారులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
ఎవరికీ పట్టని ప్రాణాలు
జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది. పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది. ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్ఓ ఈ నివేదిక వెలువరించింది. మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ. ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్ఓ నివేదిక చెబుతోంది. మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు. అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది. కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు. ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి. -
పోలవరం కాంట్రాక్టర్‌ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
పూడూరులో పిల్లర్ స్థాయి దాటని ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం..
పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. పనులు వేగవంతం చేస్తాం పూడూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం. – మహేశ్, ఆర్అండ్బీ ఏఈ -
కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు..
-
Video: కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు ఒట్టి చేతులతో అమాంతం ఎత్తేశారు. కొత్తగా వేసిన రోడ్డు అట్టముక్కలా పైకి రావడం విచిత్రంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు. అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్‌లాగా పరిచి దానిపై తారు రోడ్డు వేశారు. స్థానిక కాంట్రాక్టర్ ఈ రహదారిని నిర్మించారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోగస్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయని మండిపడ్డారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోయే రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ మాటలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతడు పేర్కొన్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్ రోడ్డుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా ఇప్పటికీ పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం గమనార్హం. చదవండి: పసిప్రాయంలో రాసిన ఉత్తరం 15 ఏళ్లుగా వెంటాడుతూ... -
ఇదేనా రోడ్డు? దీనిపై కారు నడిపి చూపించండి.. కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్!
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కోట్లలో ఉంటుంది గానీ నాణ్యత పరంగా మాత్రం తేలిపోతుంది. ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే వేసిన రోడ్డు నాశనం అయ్యింది.ఆ రోడ్డు నాణ్యతను చెక్ చేసిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జఖానియన్ ప్రాంతంలోని జంగీపూర్-బహరియాబాద్-యూసుఫ్పూర్లను కలుపుతూ 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం విషయంలో రోడ్డు నాణ్యత కాంట్రాక్టర్ గాలికి వదిలిశాడు. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన సుహెల్దేవ్ శాసనసభ్యుడు బెదిరామ్ ఆ రోడ్డుకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలినకు వెళ్లి.. దాని నాణ్యతను చూసి షాకయ్యాడు. సాధారణంగా తారు రోడ్డు అంటే టన్నుల బరువున్న వాహనాలు ప్రయాణించిన తట్టుకుని నిలబడాలి. అయితే ఆ రోడ్డు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాలు పెట్టినా కదిలిపోతోంది. దీంతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పందిస్తూ.. "నేను రోడ్డు నాణ్యత పరిశీలనకు వెళ్లిన సమయలో అక్కడ పిడబ్ల్యుడి (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) అధికారి ఎవరూ లేరు. నేను కాంట్రాక్టర్‌తో ఈ సమస్యను లేవనెత్తాను. పిడబ్ల్యుడి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను, రహదారిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని వాళ్లతో చెప్పాను. ఈ రోడ్డు మరి దారుణంగా ఉంది, దీని నిర్మించి కనీసం ఆరు నెలలు కూడా మించలేదని ఫైర్ అయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. @ACOUPPolice Corruption in road construction Jakhiniya Ghazipur UP pic.twitter.com/d9bT5rP4BX — Sanjay Singh (@SANJAYK98610543) March 30, 2023 -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగొచ్చు
కీవ్: ఏడాది క్రితం మొదలైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్‌కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్స్క్లోని బఖ్‌ముత్‌లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు. తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కొనసాగుతుందని రష్యా కూడా చెబుతుండటం గమనార్హం. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు చేసే ప్రిగోజిన్‌కు ‘పుతిన్ వంటమనిషి’గా పేరుంది. శనివారం ఒడెసాలో వ్యూహాత్మక రైల్వే వంతెనను రష్యాకు చెందిన సీ డ్రోన్ దాడితో పేల్చేస్తున్న వీడియో ఒకటి రష్యా మిలటరీ బ్లాగర్లు విడుదల చేశారు. దీనిని ఇరు దేశాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
కర్నాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. బీజేపీ ప్రభుత్వమే కారణమా?
కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు క్లియర్ కాకపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య సందర్భంగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టీఎన్ ప్రసాద్(50) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు. మరోవైపు.. ప్రసాద్ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్‌లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్‌పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
కాంట్రాక్టర్ మోసం చేశాడని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి: పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికిలోనైన ఓ సబ్ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీతారాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఖమ్మం, ప్రశాంత్‌నగర్‌కు చెందిన చండ్ర శశికుమార్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. హైదరాబాద్ పంజగుట్టకు చెందిన కాంట్రాక్టర్ జీవీ ప్రతాప్‌రెడ్డి కంపెనీ డైరెక్టర్ జీవీ దినేష్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులను శశికుమార్ తీసుకున్నాడు. ఇందుకు సంబందించి సుమారు రూ.2 కోట్లు బిల్లులు రావాలని వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని దినేష్‌రెడ్డిని ఫోన్లో అడిగాడు. అయితే అతను స్పందించకపోవటంతో ఆదివారం శశికుమార్ తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌కు వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని గణేష్ లాడ్జిలో దిగారు. బుధవారం ఖమ్మంలో ఉంటున్న తన బావమరిది సురేష్‌కు ఫోన్ చేసి తామంతా సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సురేష్ సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించాడు. లాడ్జికి వెళ్లిన పోలీసులకు అప్పటికే అపస్మారకస్థితిలో అప్పటికే నిద్రమాత్రలు మింగి శశికుమార్, శ్వేత అపస్మారక పరిస్థితిలో కనిపించారు. ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకుని ఉన్నారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వటంతో వారు క్షేమంగా ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 8 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం సెల్ఫోన్లో సూసైడ్ చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేసినట్లు గుర్తించారు. అందులో తనకు రావాల్సిన, ఇవ్వాల్సిన డబ్బుల వివరాలు కూడా శశికుమార్ వివరించాడు. కాంట్రాక్టర్ తనపై మధిర పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెట్టాడని, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నాడని, తాను అన్ని వివరాలు రాశానని వాటి ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్
బెంగళూరు: కే.ఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్‌పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు. సంతోష్ పాటిల్ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది? కాంగ్రెస్ హస్తం ఉందేమో ? సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటిల్ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు. -
కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్‌పాటిల్ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్‌పాటిల్ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు. ఈశ్వరప్ప అరెస్ట్‌కు కాంగ్రెస్ ధర్నాలు.. శివాజీనగర: కాంట్రాక్టర్ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు. మంత్రిమండలి నుంచి తొలగింపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్ గెహ్లాట్‌కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలిచ్చారు. -
కాంట్రాక్టర్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి..‘ రాజీనామా చేసే ప్రసక్తే లేదు’
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్‌కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు. సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. -
కుమార్ వర్మ మరో దందా!... కాంట్రాక్టర్‌నూ వదల్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ను రూ.కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్–1 కాంట్రాక్టర్ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమార్ వర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీ ట్రైనింగ్ కిందికి వస్తామని, ఆపై డబ్బు చెల్లిస్తానంటూ కుమార్ వర్మ చెప్పగా ఈయన అంగీకరించారు. ఎలాంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, ఒప్పందపత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ.6 లక్షల చొప్పున రూ.20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు. ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా... 2020లో లాక్డౌన్ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్ వర్మ అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేనన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు. మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17 లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు బాధితుడు ఆరా తీయగా ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా చేశాడని, వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్ జనార్దన, కర్ణ మహేంద్ర రాజ్, అకౌంటెంట్ ప్రసన్న కుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు) -
సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్‌లకు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్ రూ.30కి బదులు రూ.100 వసూలు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు. టెంకాయ టెండర్ రద్దు భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. చదవండి: కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు -
అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విడపనల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..! తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్‌ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. బ్యాంక్‌కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు. ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్ అయిపోయింది.. బ్యాంక్‌లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్ విదేశాలకు చెక్కేశాడు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లా ప్రాజెక్ట్ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆక్రమించి.. రహదారిగా చేసి.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్లోనే లేదు. అయినా సరే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్‌కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. నకిలీ అనుమతులు సృష్టించి.. 2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు. ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్‌జోన్‌లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. చెరువులోకి మురుగు చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు. పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు విద్యుత్ శాఖ అధికారులు భూగర్భ కేబుల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు రట్టయిందిలా.. విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ హరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. -
బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్‌మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గాడ్‌ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్‌కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్‌బాబు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్‌బాబు పోలీసులు అరెస్ట్ చేశారు. పేషెంట్లకు ఇచ్చే డైట్ బిల్స్‌లో సురేష్‌బాబు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఇందులో రూ.కోటి 20లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. నీలోఫర్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొంపముంచిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..
సాక్షి, ఖానాపురం(వరంగల్) : జాతీయ రహదారి పనుల్లో ఎడతెగని జాప్యం, కాంట్రాక్టర్ నిర్లక్షం వెరసి ఓ కుటుంబాన్ని పోషించే యువకుడు మృత్యువాత పడ్డాడు. తండ్రి లేని లోటు తీరుస్తూ హమాలీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న యువకుడు మృతి చెందడం వి షాదాన్ని నింపింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానా పురం మండలంలోని బుధరావుపేట శివారులో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు మృతి చెందడంతో... మహబూబాబాద్ పత్తిపాకకు చెందిన ఎల్పుగొండ సాయిరాం(22) వ్యవసాయ మార్కెట్లో హమాలీగా పని చేస్తున్నాడు. వరంగల్‌లో తమ బంధువు మృతి చెందగా తన స్నేహితులు శరత్, సుమంత్‌తో కలిసి బుధవారం ఉదయం వెళ్లిన ఆయన దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాక ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. ఖానాపురం మీదుగా రాత్రి 7 గంటల సమయంలో మహబూబాబాద్‌కు వెళ్తున్నారు. కాగా, బుధరావుపేట శివారులో జాతీయ రహదారి పనుల్లో భాగంగా సుమారు రెండేళ్లుగా కల్వర్టు(బ్రిడ్జి) నిర్మాణ పనులు జరుగుంతడగా, ఎలాంటి హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో పనులను గుర్తించని యువకులు కల్వర్టును ఢీకొని గుంతలో పడిపోయారు. దీంతో సాయిరాం అక్కడికక్కడే మృతి చెందగా శరత్, సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎవరూ చూడకపోవడంతో రాత్రంతా అదే గుంతలో అపస్మారక స్థితిలో ఉన్నారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి శరత్, సుమన్‌ను నర్సంపేట ఆస్పత్రికి తరలించి వెళ్లిపోయారు. అయితే అదే గుంతలో మరొకరు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేసరికి సాయిరాం మృతి చెంది ఉన్నాడు. బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే సాయిరాం మృతి చెందాడని ఆరోపిస్తూ మంగళవారిపేట, బుధరావుపేట గ్రామాలకు చెందిన గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందునే ప్రమాదం జరిగినందున, యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ సతీష్‌బాబు, ఎస్సైలు సాయిబాబు, బండారి వెంకటేశ్వర్లు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కాంట్రాక్టర్లు శ్రీనివాసరావు, సందీప్‌రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు -
Mission Kakatiya: అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు..
‘పక్క చిత్రం సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేట ఈదుల చెరువు. మిషన్‌కాకతీయ మొదటి దశలో రూ.40 లక్షలతో చెరువులో పూడికతీసి, కట్టను బలోపేతం చేసి మత్తడి నిర్మించాల్సి ఉంది. చెరువులో మట్టితీసి కొంతమేరకు కట్టపై పోసి, మత్తడి కట్టారు. కట్టపై మొరం పోశారు. ఇది రికార్డుల్లో నమోదైన వివరాలు. కానీ ఇదే చెరువులో ఉపాధిహామీ పథకంలో గత ఏడేళ్లుగా స్థానిక కూలీలు మట్టిని తీశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు తవ్విపోసిన మట్టిగుంతలనూ సైతం మిషన్‌కాకతీయలో రికార్డు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేశారు. ఇప్పుడు వర్షాలు పడడంతో చెరువులో నీరు చేరింది. మిషన్ కాకతీయలో చేసిన పనులకు లెక్కలు లేకుండా పోయాయి. రికార్డుల్లో మాత్రం పూడిక మట్టి తీసినట్లుగా నమోదు చేసి బిల్లు చెల్లించారు. ఇప్పుడెవరైనా పనుల లెక్కలు చూద్దామంటే నిండిన చెరువులోనే లెక్కలన్నీ పూడుకుపోయాయి.’ ‘ఇది ముస్తాబాద్‌లోని పెద్ద చెరువు. దీని ఆయకట్టు 400 ఎకరాలు. 2016లో మిషన్‌కాకతీయలో భాగంగా చెరువుకు రూ.35 లక్షలతో మరమ్మతులు చేశారు. పనులు చేసిన ఆరు నెలలకే 2016 సెప్టెంబర్‌లో వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. కాంట్రాక్టర్ల నాసిరకం పనులకు ముస్తాబాద్ పెద్ద చెరువు ఉదాహరణగా నిలుస్తుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మళ్లీ ఇదే పెద్ద చెరువును రూ.6 కోట్లతో గండిని పూడ్చి మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిండిన నీటితో ముస్తాబాద్ పెద్ద చెరువు కళకళలాడుతోంది.’ సాక్షి, సిరిసిల్ల: పూడుకుపోయిన చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి, కట్టలను బలోపేతం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌కాకతీయ (మన ఊరు.. మన చెరువు)కు శ్రీకారం చుట్టింది. దశలవారీగా జిల్లాలోని చెరువులను బలోపేతం చేసి ఆయకట్టుకు నీరందించాలని, భూగర్భ జలాల పెంపునకు చెరువులు దోహదపడతాయని ఆశించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా మారారు. చెరువుల్లో పూడిక తీ యకుండానే తీసినట్లుగా రికార్డులు చేశారు. కొన్ని పనుల్లో నాణ్యత లోపించింది. మొక్కుబడిగా పనులు చేసి ప్రజాధనాన్ని నొక్కేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఒక్కటై లక్ష్యాన్ని నీరుగారించారు. మిషన్‌కాకతీయ బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులను ఏకంగా అవినీతి నిరో ధకశాఖకు పట్టించే స్థాయికి చేరింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ కాకతీయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. పనుల ఆనవాళ్లు.. నీళ్లపాలు జిల్లాలో మిషన్‌కాకతీయ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు, చెరువును బాగుచేసే పనిని పొందడం, అధికారులతో ఒప్పందం చేసుకుని పనులు చేయకుండా జాప్యం చేశారు. మరోవైపు గతంలో ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను రికార్డు చేయించుకుని ప్రజాధనాన్ని దండుకున్నారు. కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అధికార పార్టీ నేతలే కావడంతో ఇరిగేషన్ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ చెరువుల్లో పనులను తనిఖీ చేస్తామన్నా నీటితో నిండడంతో పూడిక తీసిన ఆనవాళ్లు.. నీటి అడుగున కనిపించకుండా పోయాయి. మొక్కుబడి పనులతో ఆయకట్టు రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. మి షన్కాకతీయ జిల్లాలో స్లోగా సాగింది. మరోవైపు ఇంకా పనులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. జిల్లాలో కేటాయింపులు ఇలా.. మొదటి దశ: జిల్లాలోని 104 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.20.13 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19.98 కోట్లు ఖర్చు చేసి 12,982.39 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేసినట్లు రికార్డులు చేశారు. రెండో దశ: 117 చెరువులను బాగుచేసేందుకు రూ.85.23 కోట్లు కేటాయించారు. ఇందులో 105 చెరువులకు రూ.53.10 కోట్లు ఖర్చు చేశారు. 8,789 ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు రికార్డులు చేశారు. మూడో దశ: 69 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.24.20 కోట్లు కేటాయించారు. ఇందులో 68 చెరువుల్లో పనులు ప్రారంభించి 57 చోట్ల పూర్తి చేశారు. రూ.11.76 కోట్లు ఖర్చు చేసి 12,791 ఎకరాలకు మేలు జరిగినట్లు స్పష్టం చేశారు. నాలుగో దశ: జిల్లాలో 46 సాగునీటి వనరులను బాగు చేసేందుకు రూ.7.90 కోట్లు కేటాయించారు. 22 చెరువుల్లో రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 3,714 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. సగం పనులు కూడా చేయలేదు మాది ఇల్లంతకుంట మండలం అనంతారం. మా పెద్ద చెరువులో సగం పనులు కూడా చేయలేదు. పూడిక తీయలేదు. కట్టను బందవత్తు చేయలేదు. తూము, మత్తడి దెబ్బతిన్నాయి. చెరువులోని నీరు లీకేజీ అవుతుంది. పూడిక తీస్తే నీళ్లు బాగా ఉండేవి. మిషన్ కాకతీయ పనులు మధ్యలోనే వదిలేసి పోయిండ్రు. – అక్కెం రామస్వామి, రైతు, అనంతారం చెరువును లోతు చేయాలి మాది కోనరావుపేట మండలం వెంకట్రావుపేట. మా కేశవరావు చెరువును లోతు చేయాలే. మిషన్ కాకతీయలో పనులు చేసినా.. అవి పూర్తి స్థాయిలో జరగలేదు. మత్తడి అలాగే ఉంది. గుట్టల ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో పూడికి వచ్చి చేరుతుంది. పూడికతీసి లోతు చేస్తే చెరువుతో రైతులకు మేలు జరుగుతుంది. – బైరగోని సురేశ్‌గౌడ్, వెంకట్రావుపేట కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం జిల్లాలో పనులు చేయకుండా మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లకు అనేకసార్లు నోటీసులు జారీ చేశాం. జిల్లాలో ఇంకా 48 చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు జరిగిన మేరకు రికార్డులు అయ్యాయి. కాంట్రాక్టర్లకు పేమెంట్ సరిగా రావడం లేదు. తెగిపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తాం. – అమరేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ -
పంజగుట్ట వంతెన నిర్మాణంలో జాప్యం.. రూ.లక్ష జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అడుగడుగునా పైప్లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్‌కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
వైరల్ వీడియో: కాంట్రాక్టర్‌ని బురద నీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే
-
Viral Video : మాట వినలేదని కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే దాడి
ముంబై : డ్రైనేజీ పనులు సరిగా చేయలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టరుపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. వర్షం కారణంగా నిలిచిన వరద నీటిలో కూర్చోబెట్టారు. పక్కనున్న చెత్తను తీసి కాంట్రాక్టరు నెత్తిన వేశారు. శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే సమక్షంలోనే ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో చండీవలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైనేజీపై రగడ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చండీవలి ప్రాంతంలో డ్రైనేజీ నీరు తొలగించాలంటూ పదిహేను రోజుల కిందట ఆ ఏరియా కాంట్రాక్టర్‌ని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆదేశించారు. పరిష్కరించలేదు రెండు వారాలు గడిచినా కాంట్రాక్టరు సమస్యను పరిష్కరించలేదు. దీంతో శివసేన కార్యకర్తలే అక్కడ బురద, చెత్తను తొలగించి వర్షపు నీరు పోయేలా పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టరు అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా దాడి కాంట్రాక్టరును చూడగానే ఎమ్మెల్యే, అతని అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బురదలో కూర్చోవాలంటూ ఒత్తిడి చేశారు.... చివరకు బురద నీటిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అక్కడున్న చెత్తను తెచ్చి అతని తలపై , ఒంటిపై వేశారు. తప్పు జరిగిందని వేడుకున్నా ... వినకుండా దుర్భాషలాడారు. కాంట్రాక్టరు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు. అందువల్లే ఇలాంటి చర్యకు పాల్పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే దిలీప్ పాండే వివరణ ఇచ్చారు. ఇదే నీతి మీకు వర్తిస్తుందా ? కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే జరిపిన దాడిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టరు తరహాలోనే పనులు చేయని ప్రజాప్రతినిధులను కూడా శిక్షించాలంటూ మెజారీటీ ప్రజలు డిమాండ్ చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లను శిక్షించాల్సందేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా...తప్పులను సరిదిద్దేందుకు చాలా మర్గాలు ఉన్నాయని, ఇలాంటి అమానవీయ శిక్షలు సరికాదని మరికొందరు అన్నారు. చదవండి: ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం ! -
నక్సల్స్ ఘాతుకం: కాంట్రాక్టర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేసిన నక్సల్స్ అదే సమయంలో అక్కడే గల విలువైన వాహనాలను దహనం చేశారు. సుక్మా జిల్లా మాథిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోలియాగూడలో నక్సలైట్లు ఈ బీభత్స ఘటనకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ను చంపారు. నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికంగా భీతావహాన్ని కలిగించిన ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. -
అంతే వీరు.. మారదు తీరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది. విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్‌ను టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ సోద రుడు, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. మరమ్మతు పనుల్లోనూ.. ‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్ వర్క్ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు. వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు కూన రవికుమార్ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. -
చేపల మార్కెట్లో రివాల్వర్‌తో బెదిరింపు..
-
ఒకే కాంట్రాక్టర్‌కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ►మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్‌లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్‌కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
కాంట్రాక్టర్ మాయాజాలం
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): ఏపీఈపీడీసీఎల్‌లో ఆయనో మానవ వనరులను సరఫరా చేసే కాంట్రాక్టర్.. 2014 వరకు సాధారణ వ్యక్తి.. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ట్రాన్స్‌కోలో చక్రం తిప్పాడు. అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్నతాధికారుల్ని వలలో వేసుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సబ్స్టేషన్లలో ఉద్యోగాలు వేయిస్తానని ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు వెలుగులోకి రావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. ఉద్యోగుల ‘స్పందన’లో శుక్రవారం బాధితులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు వినతి పత్రాన్ని అందజేయడంతో ఇది చర్చనీయాంశమైంది. ఒక కాంట్రాక్టర్ వల్ల తాము ఏ విధంగా ఇబ్బందులు పటుతున్నదీ వారు జిల్లా ఉన్నతాధికారి వద్ద వాపోయారు. వివరాల్లోకి వెళితే ...ఎన్.స్వామినాయుడు ఎంఎస్ సాయి మణికంఠ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. 2012 వరకు విద్యుత్ రంగ సంస్థలో ఏపీ ట్రాన్స్‌కో 139/33 కేవీ డీజీఎన్‌పీ(చావుల మదుం సమీపంలో ఉన్న) సబ్ స్టేషన్లో సబ్ ఇంజినీర్(హైస్కిల్డ్)గా పార్ట్‌టైం సూపర్వైజర్గా పని చేసేవాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ డిప్లమా సర్టిఫికెట్ సంపాదించి కాంట్రాక్టర్ అవతార మెత్తాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి అప్పటి మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అండతో ఏపీఈపీడీసీఎల్‌లో చక్రం తిప్పాడు. అప్పట్లో అవుట్ సోర్సింగ్‌లో పనిచేసే వారిని పర్మినెంట్ చేసేవారు. ఖాళీ అయిన స్థానాల్లో అవుట్ సోర్సింగ్‌లో కొత్తవారిని నియమించేవారు. ఈమేరకు ఉద్యోగాలు వేయించేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా విజయనగరం జిల్లాలో 200 ఖాళీలను భర్తీ చేశాడని చెబుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థల్లో కొందరు అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు ఆర్జించాడని బాహటంగానే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్లాయనే వాదన ఉంది. కారుణ్యం లేదు... జిల్లాలోని నర్సీపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌లో వేరొక కాంట్రాక్టర్ 11 మందిని కారుణ్య నియామకాలు చేపట్టారు. నెల రోజుల తరువాత గ్లోబల్ టెండర్ విధానంలో స్వామి నాయుడుకు ఆ కాంట్రాక్టు టెండర్ బదాలాయించారు. గతంలో జరిపిన కారుణ్య నియామకాల ద్వారా చేరిన వారిని భయాందోళనలకు గురిచేసి తొలగించేశారు. స్థానిక మంత్రి అయ్యన్నపాత్రుడుతో కుమ్మక్కయి ఒక్కో ఉద్యోగానికి రూ.7లక్షలకు అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా నర్సింగబిల్లి సబ్ స్టేషన్లో 11 మందిని నియమించారు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ సహకారంతో గతంలో నియమించిన వారిని తొలగించి కొత్తవారిని చేర్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులతో భయపెట్టారు. ఈ అరాచకాలను తట్టకోలేక దేవీప్రసాద్ అనే స్కిల్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు... వీరు చేసిన అవకతవకలు బయటపడడంతో పశ్చిమగోదావరి జిల్లాలో టెండర్లను రద్దు చేస్తూ ఈపీడీసీఎల్ సీజీఎం–ఓ అండ్ సీఎస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. తాడేపల్లి డివిజన్లో టెండర్ రద్దు చేస్తూ 2019 జూన్ 15న బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఈ వ్యక్తి కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని తిరిగి టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామినాయుడు అరాచకాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బాధితులు కోరుతున్నారు. ఈమేరకు ‘స్పందన’ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి... ఇటీవల 2018–19లో 132/33 కేవి సబ్స్టేషన్లలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలోనూ అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. వాచ్‌మన్ ఉద్యోగానికి రూ.5లక్షలు, ఐటీఐ చేసిన వారికి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.10లక్షలు, డిప్లమా చేసిన వారికి రూ.9లక్షలు వంతున వసూలు చేశారనే వాదన ఉంది. అరాచకాలపై విచారణ జరపాలి కాంట్రాక్టర్ చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ జరపాలి. చాలా చోట్ల ఉద్యాలు వేయిస్తామని నమ్మించి మా లాంటి నిరుద్యోగుల నుంచి లక్షల్లో దోచుకున్నాడు. పాత ఉద్యోగుల్ని రాజకీయం చేసి తొలగించేలా చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమేయం ఉంది. – ఎం.కృష్ణ, అనకాపల్లి -
మట్టిని దోచేశారు
సాక్షి, పరకాల: మిషన్ కాకతీయ పనులను అడ్డం పెట్టుకొని సంబంధిత కాంట్రాక్టర్లు అడ్డగోలుగా చెరువు మట్టిని మాయం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ పరకాల పెద్దచెరువు మట్టిని తరలిస్తు దర్జాగా అమ్మేసుకుంటున్నాడు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు కట్ట మరమతులు చేపట్టడంతో పాటు చెరువులోని నల్లమట్టిని రైతుల అవసరాలకు తరలించాల్సి ఉండగా కాంట్రాక్టర్ మొరం తవ్వకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒకవైపు అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండగా లక్షలాది రూపాయాల విలువ చేసే చెరువు మొరాన్ని మూడు నెలలుగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. తన అనుచరులకు చెందిన 5 జేసీబీ వాహనాలు, 50 ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పుకు మొరం మట్టికి రూ.500 నుంచి రూ.600 వరకు, నల్లమట్టికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా చెరువు నుంచి వందలాది ట్రిప్పుల మొరం మాయమైంది. కట్ట మరమతులకు నాలుగైదు ట్రాక్టర్లను వినియోగించి మిగతాదంతా పట్టణ ప్రజల ఇళ్ల నిర్మాణ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది. పట్టణంలో ఖాళీ స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న ప్లాట్లు చెరువుమట్టితో దర్శనమిస్తున్నాయి.ఓ జేసీబీ యాజమాని ఇదే అదనుగా భావించి తనకు సంబంధించిన ఎకరం ప్లాటుకు 500 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించడం చూస్తుంటే మట్టిదందా ఎంత జోరుగా సాగుతుందో స్పష్టం అవుతుంది. మిషన్ కాకతీయ పథకం పేరిట ఒకవైపు బిల్లులు తీసుకుంటూనే మరోవైపు చెరువు మట్టిని అమ్ముకుంటున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. చెరువు అంతా గుంతలమయం వాస్తవానికి మిషన్ కాకతీయలో భాగంగా చెరువులో ఒకే మాదిరిగా తవ్వకాలు చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తనకు మొరం లభించిన చోటల్లా జల్లెడ పట్టినట్లు తవ్వేస్తున్నాడు. దీంతో చెరువులో భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షకాలంలో చెరువులో నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎక్కువగోతులు ఉండడం వల్ల చెరువు నీరు తూము వద్దకు చెరుకోకుండా దూరంగానే నిలిచిపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు లేకపోలేదు. కట్టమరమతులో నాణ్యత లోపం చెరువు కట్ట పనుల్లో నాణ్యత కరువైంది. కట్టను వెడల్పు చేయడానికి కాంట్రాక్టర్ గతంలో ఉన్న కట్ట మట్టిని సగభాగం వరకు తొలగించి మళ్లీ చెరువు మొరం మట్టిని పోయిస్తున్నాడు. అయితే గట్టిపడిన కట్టను తొలగించి మళ్లీ పనులు చేపట్టడం వెనుక కాంట్రాక్టర్ కక్కుర్తి స్పష్టం అవుతుంది. ముఖ్యనేత పేరిట మట్టిదందా నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పుకుంటూ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నాడు. పరకాల మండలంలోని నాగారంతో పాటు ఇతర చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలు కొనసాగుతోన్నాయి. ప్రతిపక్షపార్టీల నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తరలింపును ఆపేసినట్లు సమాచారం. నేడు మళ్లీ అదే బాటలో పెద్ద చెరువు కాంట్రాక్టర్ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరుడిగా చెప్పుకుంటూ చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టిని అడ్డుకోవాలని లేనట్లయితే చెరువులో నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీఐఏ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్‌ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్‌ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్‌ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. -
సిఐ చాంబర్లో కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు
-
బొల్లినేనికి బంపరాఫర్
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కాకర్ల గ్యాప్ పనుల్లో సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ సంస్థకు రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పడం ఆలస్యం.. ఆయన సూచనలు పాటిస్తూ ఆగమేఘాలపై సదరు కాంట్రాక్టర్‌కు బంపర్ ఆఫర్ కింద ఈ అ‘ధన’పు సొమ్ము మంజూరు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీపీ) మౌలిక సూత్రాల్ని తుంగలో తొక్కేశారు. డిజైన్ మారడం వల్ల కాంట్రాక్టర్ అదనపు పనులు చేయాల్సి వచ్చిందని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటూ ఉత్తర్వుల్లో సమర్థించుకోవడం గమనార్హం. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా కాంట్రాక్టర్‌కు అదనపు లబ్ధి చేకూర్చుతూ ఇలా ఉత్తర్వులు జారీ చేయడాన్ని జలవనరుల శాఖ వర్గాలే తప్పుపడుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా కాకర్ల గ్యాప్‌ను పూడ్చటం ద్వారా ఎన్వోఎఫ్ డ్యామ్ నిర్మించి.. దాని ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు పనుల్ని రూ.206.80 కోట్లకు ఎస్సీఎల్–బీఎస్పీసీఎల్(జేవీ) 2005లో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. కానీ పనులు పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయినా పనులు పూర్తి చేయలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌పై అమితప్రేమ చూపింది. డిజైన్ మారడంతో 30 కాంక్రీట్ నిర్మాణాల స్థానంలో 48 నిర్మించాల్సి వస్తోందని.. ఆ మేరకు అదనపు బిల్లులివ్వాలని ఆ సంస్థ 2015లో సర్కార్‌కు ప్రతిపాదనలు పంపింది. ఈపీసీ విధానానికి ఇది విరుద్ధమని జలవనరులశాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీ(డీఎల్ఎస్సీ), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)లకు ఈ ప్రతిపాదనలను పంపారు. ఆ కమిటీల్లోని అధికారులపై ఒత్తిడి తెచ్చి అదనపు బిల్లుల మంజూరుచేసేలా ప్రతిపాదన చేయించారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ఇంటర్నల్ బెంచ్‌మార్క్ కమిటీ(ఐబీఎం) తిరస్కరిస్తూ వచ్చింది. ఐబీఎం కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అదనపు నిధులిచ్చే ప్రతిపాదనపై చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్‌కు అదనపు లబ్ధి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయకూడదు. కానీ సీఎం సూచనల మేరకు బొల్లినేనికి రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ ఉత్తర్వులు జారీ చేసేశారు. -
కనిపించని కేజీహెచ్ నీడ
విశాఖ సిటీ: ఈ మధ్యన వచ్చిన నెపోలియన్ సినిమాలో హీరో నా నీడపోయింది సార్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాడు. సరిగా ఇదే తరహాలో కేజీహెచ్ సిబ్బంది ఆస్పత్రిలో ఈ రోజు ‘షాడో’ కనిపించలేదుగా అంటూ గుసగుసలాడుకున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఆస్పత్రిని, సూపరింటెండెంట్ని అంటిపెట్టుకుని ఉండే సదరు ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగి ఆదివారం ప్రచురితమైన సాక్షి కథనంతో కేజీహెచ్ ఛాయల్లోకి రాలేదు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వచ్చినసూపరింటెండెంట్.. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్‌పై పెత్తనం చెలాయిస్తున్న అనధికారి ఖాన్ వ్యవహార శైలిపై సాక్షి దినపత్రికలో ‘కేజీహెచ్‌కు నీడ.. పీడ’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కింగ్‌జార్జి ఆస్పత్రిలో కలకలం రేగింది. ప్రతిరోజూ సిబ్బంది, వైద్యాధికారులపై పెత్తనం చెలాయించే సదరు సూపరింటెండెంట్ షాడో ఆదివారం మాత్రం కానరాలేదు. ఈ రోజు ప్రశాంతంగా పని చెయ్యగలుగుతున్నామని పలువురు వైద్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. మరోవైపు ఏదైనా అత్యవసర సేవలు, ముఖ్య కార్యక్రమాలైతే తప్ప ఆదివారం ఆస్పత్రికి రాని సూపరింటెండెంట్ ఆదివారం ఉదయం 9 గంటలకే కేజీహెచ్‌కు వచ్చేశారు. ఇది ఆస్పత్రిలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగిగా ఐడీ కార్డు హల్చల్ ఇదంతా ఒకెత్తయితే ఇన్నాళ్లూ అనధికారికంగానే ఆస్పత్రిలో చలామణి అయిన షాడో ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. కానీ సాక్షి కథనం ప్రచురితమైన తర్వాత ఆయన కేజీహెచ్‌లోని ఓ విభాగంలో ‘ఖాన్’ట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఐడీ కార్డు హల్చల్ చేసింది. ఇది నిజమైనదా ఉన్నఫలంగా తయారు చేసిందా అనే విషయంపై మాత్రం కేజీహెచ్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. అయితే శానిటేషన్ ఏజెన్సీ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సూపరింటెండెంట్ కారులో తిరుగుతూ ఆయన చాంబర్ చుట్టు పక్కలా కనిపించే పని ఏముంటుందని కేజీహెచ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ1 కాంట్రాక్టు ఉద్యోగే ఎ.ఖాన్ అనే వ్యక్తి ఎ1 ఔట్సోర్సింగ్ శానిటేషన్ ఏజెన్సీలో వర్క్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. కేజీహెచ్‌లో జరిగే వివిధ పనులకు సంబంధించిన పర్యవేక్షణ చూస్తారని పేర్కొన్నారు. పరిపాలన పరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖాన్‌పై ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై విచారణ చేపట్టి సదరు వ్యక్తిపైనా, సంస్థపైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎలుకల కోసం రూ.8.4 కోట్లు
సాక్షి, అమరావతి: రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్లుగా ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ ముఖ్యనేతకు దగ్గరి బంధువు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ చెల్లించారు. టీడీపీ ముఖ్యనేతకు ఈ కాంట్రాక్టర్ సమీప బంధువు కావడం గమనార్హం. పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ పేరుతో పని చేయకపోయినా కాంట్రాక్టర్‌కు భారీ లబ్ధి చేకూరుస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. నెలకు రూ.70 లక్షలు... రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, కీటకాల నియంత్రణ, సెక్యూరిటీ సర్వీసులు గతంలో ఒకే కాంట్రాక్టరు కింద ఉండేవి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన ఘటన అనంతరం పారిశుధ్యం నుంచి కీటకాల నియంత్రణను తొలగించారు. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. కీటకాల నియంత్రణకు సగటున రూ.70 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.8.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు, పాములు యధేచ్ఛగా సంచరిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో ఆస్పత్రిలో నలుగురు సిబ్బందితో తూతూమంత్రంగా నీళ్ల మందు పిచికారీ చేస్తూ కీటకాలను నియంత్రించినట్లు నెలవారీ బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, విశాఖపట్నం ఆస్పత్రుల్లో నెలకు రూ.7 లక్షలకు పైగా చెల్లిస్తున్నా కనీసం పది ఎలుకలను కూడా పట్టడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్లలోకి ఎలుకలు చొరబడుతుండటంతో రోగులు హడలిపోతున్నారు. -
‘పది వేలు ఇస్తేనే సంతకం పెడతా’
బిచ్కుంద(జుక్కల్): ప్రజాసేవకు నిలయమైన ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలోని తహసీల్‌లో మంగళవారం ఓ కాంట్రాక్టర్ బ్లేడ్‌తో చేతులు, మెడ కోసికుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. డీటీ ప్రవీణ్ కుమార్ హజ్గుల్ జీపీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. గ్రామంలో విష్ణు మానిక్ నాయక్ సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.45 వేలు బిల్లు వచ్చింది. చెక్కుపై సంతకం కోసం ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రూ.10 వేలు లంచం ఇవ్వాలని వారం రోజుల నుంచి వేధింస్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్ విష్ణు మనస్తాపం చెంది మంగళవారం తహసీల్ కార్యాలయంలో బ్లేడ్‌తో చేతులు, మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంబీ రికార్డులో వందశాతం పనులు హజ్గుల్‌లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.2 లక్షల 40 వేలు సీసీ రోడ్డు వేశారు. వంద శాతం పనులు పూర్తయ్యాయి. పంచాయతి రాజ్ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేసి రూ. 45 వేలను పీఆర్ శాఖ జీపీ ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్(ఎఫ్‌టీవో)ను జీపీ కార్యదర్శి చూసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని క్యాష్ బుక్‌లో ఎంట్రీ చేసి రూ.45 వేల చెక్కును కాంట్రాక్టర్ విష్ణుకు రాసి ఇచ్చారు. చెక్కుపై ప్రత్యేకాధికారి, డీటీ ప్రవీణ్ కుమార్ సంతకం ఉండాలి. వారం నుంచి సంతకం కోసం తహసీల్ చుట్టూ విష్ణు తిరుగుతున్నాడు. రూ.10 వేలు లంచం ఇస్తేనే సంతకం పెడతానని డీటీ వేధిస్తున్నాడని బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వలేను. ఇది చివరి బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా భార్య బంగారు పుస్తే, నగలు అమ్ముకొని సీసీ వేశానని మొరపెట్టుకొని రెండు కాళ్లు పట్టుకున్నా వినడం లేదన్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఘటనతో తహసీల్దార్, ఎంపీడీవో డీటీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే బాధితుడి చెక్కుపై సంతకం చేశారు. కార్యాలయం ఎదుట గిజనుల ఆందోళన బిచ్కుందకు చెందిన కాంట్రాక్టర్ విష్ణు మానిక్ నాయక్‌ను లంచం ఇవ్వాలని డీటీ వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు తెలియడంతో భద్రాల్ తండా గిరిజనులు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తం కారుతున్న విష్ణును ఆస్పత్రికి తరలించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీటీని నిలదీశారు. వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గాంధారిలో కూడా అక్రమాలకు పాల్పడి బదిలీపై బిచ్కుంద వచ్చి అవినీతికి పాల్పడుతున్నారని డీటీపై కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఈ ఘటనపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సాయిబాబా అన్నారు. -
‘రామానాయుడు బెదిరించారు’
సాక్షి, పాలకొల్లు: ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్‌పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. కమీషన్ ఇవ్వటంలేదని తన బిల్లులు నిలుపుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చేస్తానని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తనను పిలిపించి సీఐ కృష్ణకుమార్ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు. తనను బెరిరించిన ఎమ్మెల్యే రామానాయుడు, తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నరసాపురం డీఎస్పీని కలవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎస్పీ హామీయిచ్చినట్టు పృథ్విరాజ్ తెలిపారు. -
కమీషన్ కోసం టీడీపీ ఎమ్మెల్యే వేదిస్తున్నారు
-
స్వామీ.. ఏమిటీ దోపిడీ!
మంత్రాలయం: స్వామీ నిన్ను కొలవని వారికి నీవంటే భయం.. నిన్ను కొలిచే వారికి నీవంటే భక్తి.. నీ భక్తులను మోసం చేసేవారికి నీ సన్నిధి ఓ వ్యాపార కేంద్రం. ఇక్కడ రావాల్సింది అధికారులకు వస్తోంది. కావాల్సిన దానికి మించి కాంట్రాక్టర్‌కు మిగులుతోంది. దేవుని సాక్షిగా రూ.కోట్లలో అవినీతి పర్వం దర్జాగా సాగిపోతోంది. ఏటా దోపిడీ విలువ అక్షరాల కోటి రూపాయలు. ఈ సొమ్మంతా భక్తుల నుంచి దోచుకుంటున్నదే. ప్రముఖ ఉరుకుంద నృసింహ ఈరన్న స్వామి పుణ్య క్షేత్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఏటా చేస్తున్న దగా ఇదీ. దోపిడీ లీలలు కన్నామంటే కళ్లు తిరిగాల్సిందే. ఇదిగో దోపిడీ బాగోతం. నారీకేళాల సమర్పణ 14 లక్షలు పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ సోమ, గురు, శనివారాలు భక్తుల రద్దీ ఉంటుంది. నెలలో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. అందులో ఎంతలేదన్న 7 లక్షల మంది భక్తులు జోడు టెంకాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ లెక్కన క్షేత్రంలో అమ్ముడు పోయే టెంకాయలు 14 లక్షలు. టెంకాయలు ప్రతి భక్తుడూ ఇక్కడే కొనుగోలు చేస్తారు. టెంకాయల సమర్పణకు ఎలాంటి టిక్కెట్ లేకున్నా కొట్టే అర్చకులకు జోడికి రూ.10 ఇచ్చుకుంటారు. వాస్తవ ఖర్చు.. టెండర్‌దారులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇక్కడకు టెంకాయలు తీసుకువస్తారు. అక్కడ పెద్దసైజు టెంకాయ రూ.15, మధ్య సైజు టెంకాయ రూ.14, చిన్నసైజు రూ.10–12 ధర పలుకుతోంది. ఉరుకుంద క్షేత్రంలో మధ్యసైజు టెంకాయలు విక్రయిస్తారు. ఉత్సవాలకు 56 లారీల్లో (10 టైర్లు) టెంకాయలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో లారీలో 25 వేలు మధ్య సైజు టెంకాయలు లోడింగ్ అవుతోంది. ఒక్క లారీ బాడుగ అక్కడి నుంచి ఉరుకుందకు రూ.24 వేలు. బాడుగతో కలిపి లారీ టెంకాయలు రూ.3.74 లక్షలు. 56 లారీల టెంకాయలు విలువ రూ.1.96 కోట్లు. అందుకు లారీల బాడుగ మొత్తం రూ.13.44 లక్షలు. అంతా కలిపి కాంట్రాక్టర్ 56 లారీల సరుకు తెప్పించేందుకు గానూ రూ.2.09,44,000 వెచ్చిస్తారు. దోపిడీ తతంగం.. ఈఏడాది ఆదోనికి చెందిన మోహన్ అనే వ్యక్తి టెంకాయల టెండర్ కైవసం చేసుకున్నారు. రూ.90.90 లక్షలకు టెండర్ పాడారు. జోడి టెంకాయలను భక్తులకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. 14 లక్షల టెంకాయలకుగానూ కాంట్రాక్టర్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.4.90కోట్లు. అందులో ఆయన వెచ్చించిన నగదు రూ.2.09 కోట్లు. టెండర్ చెల్లింపు (రూ90.90 లక్షలు)తో కలిపి ఖర్చు రూ.3 కోట్లు అవుతోంది. భక్తులు సమర్పించిన టెంకాయలో అర చిప్ప కాంట్రాక్టర్‌కే సంబంధం. బయట మార్కెట్లో ఒక్కో చిప్ప ధర రూ.3లు. 14 లక్షల చిప్పలకుగానూ రూ.42 లక్షలు వస్తోంది. టెంకాయ కొట్టుకు 100 టెంకాయలు వేసేందుకు చేసే వసూలు 100. టెంకాయలకు రూ.60. ఈ లెక్కన వచ్చే ఆదాయం రూ.8.40 లక్షలు. అదనపు రేటు, చిప్పల విలువ కలిపి ఆయనకు నికరంగా మిగులు రూ.5,40,40,000. అందులో వెచ్చించి న ఖర్చు, టెండర్ నగదు తీసివేయగా దోపిడీ విలువ రూ.1.49 కోట్లు. ఇదీ ముమ్మాటికీ భక్తుల నుంచి దోచుకున్న సొమ్ము. అంతా కుమ్మక్కు.. ఏటా శ్రావణమాసంలో జరుగుతున్న దోపిడీ ఇది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దేవదాయ శాఖాధికారులకు తెలిసిన విషయమే. ఇంతగా భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అటు దేవుడికి శఠగోపం, భక్తుల నెత్తిన టెంకాయ కొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సొమ్మును పంచుకు తింటున్నారు. భక్తులు ఎంతగా అరిచి గీపెట్టుకున్నా క్షేత్రం అధికారుల్లో చలనం లేదు. కారణం ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోంది. ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు ఉన్నా ఫలితం శూన్యం. భక్తుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు. నిలువు దోపిడీని అరికట్టి భక్తుల జేబులకు కన్నాలు వేయడం మానుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఈఓ రామ్‌ప్రసాద్ అడుగగా అధిక ధరలకు విక్రయించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తామని సెలవిచ్చారు. -
రూ.215 కోట్ల నగదు, బంగారం సీజ్
సాక్షి ప్రతినిధి, చెన్నై : జాతీయ రహదారి పనులతో వేల కోట్లకు పడగెత్తిన తమిళనాడులోని కాంట్రాక్టరు సెయ్యాదురై, ఆయన కుమారుల ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మూడోరోజూ తనిఖీల పర్వం కొనసాగింది. ఈ మూడురోజుల్లో రూ.215 కోట్ల నగదు, బంగారం, వజ్రాలు, వీవీఐపీల పేర్లతో కూడిన డైరీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలోని ఇద్దరు మంత్రుల అండదండలతో వేల కోట్ల రూపాయల రహదారి పనులు చేపట్టిన సెయ్యాదురై, ఆయన నలుగురు కుమారులకు చెందిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 ఇళ్లు, కార్యాలయాలపై ఈనెల 16న ప్రారంభించిన ఐటీ దాడుల్లో అధికారులే బిత్తరపోయేలా నగదు, స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. రామనాథపురంలో జిల్లా కముదిలోని ఇంటి గోడలో ఒక రహస్య అరను గుర్తించి బద్దలు కొట్టగా విలువైన పత్రాలు దొరికాయి. 15 బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే బుధవారం చెన్నై మైలాపూరులోని సెయ్యాదురై కుమారుడు నాగరాజ్ సహయకుని ఇంటిలో తనిఖీలు నిర్వహించి మూటలకొద్దీ నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
కాంట్రాక్టర్‌పై ఐటీ దాడి:160 కోట్లు నగదు స్వాధీనం
-
అన్నీ ఒకరికేనా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనులను అప్పగించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే మింగుడు పడటం లేదు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో ఏకంగా రూ.48 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 8 శాతం కమీషన్ తీసుకుని ఈ పనులను కట్టబెట్టినట్టు సమాచారం. అంటే రూ.48 కోట్ల పనులకు గాను ఏకంగా రూ.3.84 కోట్ల కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. పార్టీని, నేతను నమ్ముకుని ఉంటే తమకు మాత్రం పనులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులే అధికంగా మంజూరయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇంకా పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. చెక్‌డ్యాం పనుల్లో భారీగా ఆదాయం ఉండకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కమీషన్ ఇంతేనా? నీరు–చెట్టు పథకం కింద జిల్లావ్యాప్తంగా భారీగా పనులు మంజూరవుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.868 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికభాగం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ పనులన్నింటిలోనూ 12 నుంచి 22 శాతం వరకు అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారు. ఇక్కడ ప్రధానంగా పూడికతీత పనులు కావడంతో భారీగా కమీషన్లు వస్తున్నాయి. అయితే.. ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మంజూరు కావడంతో అంతగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీనికితోడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పూడికతీత పనుల్లో ఇందుకు భిన్నం. కొన్నిచోట్ల గతంలో ఉపాధి హామీ కింద చేసిన పనులనే చూపి.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా చేపట్టి మొత్తం బిల్లు తీసేసుకుంటున్నారు. దీంతో ఏకంగా 22 శాతం వరకూ కమీషన్లు అక్కడి అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పారు. అయితే, తనకు కేవలం 8 శాతం కమీషన్ కావడంపై సదరు నేత మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనని శోధించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా చెరువులున్నాయా? నీరు–చెట్టు కింద నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులన్నీ సులభతరం కావడంతో కాంట్రాక్టర్లకు అధిక ఆదాయం ఉంటోంది. దీంతో అధికారపార్టీ నేతలకు ఇచ్చే కమీషన్ కూడా ఎక్కువగా ఉంటోంది. అదే చెక్‌డ్యాం పనుల్లో తమకు పెద్దగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీంతో పూడికతీత పనులకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేత సోదరుడు ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం చెక్‌డ్యాంల పనులను తీసుకున్న కాంట్రాక్టర్ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనంటూ వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా చెరువులు కనిపిస్తే చెక్‌డ్యాంల నిర్మాణం కాకుండా ఈ పనులను చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తన
అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అడ్డదిడ్డంగా పనులు చేస్తుండటాన్ని నిలదీసిన వారిపై కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నేత దౌర్జన్యానికి దిగుతున్నారు. మహిళా కార్పొరేటర్ అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అంతటితే ఆగకుండా దాడికి యత్నించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా.. కాంట్రాక్టర్‌కే వత్తాసు పలకడం విమర్శలకు తావిచ్చింది. అనంతపురం న్యూసిటీ: ప్రహరీగోడ నిర్మాణం కోసం అనుమతి లేకుండా జేసీబీతో గుంతలు తీయరాదని అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ బోయ గిరిజమ్మపై టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్‌చౌదరి దురుసుగా వ్యవహరించాడు. మూడవ డివిజన్ పరిధిలోని వైఎస్సార్ నగరపాలక ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఎస్.వి. ఇన్ఫ్రా కంపెనీ చేపడుతోంది. సోమవారం ఉదయం కాంట్రాక్టర్ శ్రీనివాస్ చౌదరి జేసీబీని తెప్పించి గుంతలు తీయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఈఈ దుశ్యంత్, డీఈ సుధారాణికి కార్పొరేటర్ గిరిజమ్మ ఫిర్యాదు చేశారు. జేసీబీతో గుంతలు తీస్తే తరగతి గదులు దెబ్బతింటాయని, అధికారుల అనుమతి లేకుండా ఏ విధంగా చేస్తారంటూ కాంట్రాక్టర్‌ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాస్‌చౌదరి ‘కార్పొరేటర్ అయితే మీ ఇంట్లో చూసుకో. ఇక్కడకు వచ్చి అతి చేయవద్దు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పనులు ఆపండి అని వర్క్ఇన్స్పెక్టర్లు ఆదేశించినా పట్టించుకోలేదు. చివరకు కార్పొరేటర్‌పై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న డివిజన్ ప్రజలు రత్నమ్మ, లలిత, లక్ష్మి, మణి అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్‌ను చుట్టుముట్టి నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులపై పోలీసుల మండిపాటు కార్పొరేటర్ గిరిజమ్మ, డివిజన్ మహిళలను దూషించి, దురుసుగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌కే వన్‌టౌన్ పోలీసులు వత్తాసు పలికారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కార్పొరేటర్, మహిళలపై ‘మీరు అసలు ఇక్కడకు ఎందుకొచ్చారు’ అంటూ సీఐ విజయభాస్కర్‌గౌడ్ మండిపడ్డారు. మఫ్టీలో ఉన్న జయరాం అనే కానిస్టేబుల్ అయితే ‘ఏం.. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ’ మహిళలపై వీరంగం వేశాడు. చివరకు ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లను ఆరా తీయగా తామొచ్చేసరికి పనులు జరుగుతున్నాయని, నిబంధనలకనుగుణంగా మాన్యువల్‌గా గుంతలు(ట్రెంచ్) తీయాలని కాంట్రాక్టర్‌కు చెప్పినట్లు సీఐకు తెలిపారు. -
దారి దోపిడీ
పైచిత్రంలోని రోడ్డు ద్వారకాతిరుమల మండలంలోని రామసింగవరంలో వేసిన సిమెంటు రోడ్డు. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పాకిరం వెంకటరత్నం ఇంటి వరకు దాదాపు 50 మీటర్ల దూరం సీసీ రోడ్డును ఐదు నెలల కిత్రం నిర్మించారు. ఇలా గ్రామంలో రూ.50లక్షల వ్యయంతో పలు చోట్ల రోడ్లు వేశారు. 20ఏళ్లకుపైగా ఉండాల్సిన రోడ్లు నాణ్యత లేక కుంగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని వీటిని వేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వేసిన ఐదు నెలలకే ఛిద్రమయ్యాయి. దేవరపల్లి/ద్వారకాతిరుమల/గోపాలపురం: జాతీయ ఉపాధి హామీ పథకం, పంచా యతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో నిర్మించిన రోడ్లకు అవినీతి తూట్లు పడుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు బినామీ కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతూ రోడ్ల నిర్మాణంలో దోపిడీకి పాల్పడుతున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఐదునెలలు తిరగకుండానే.. గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం సిమెంట్ రోడ్డు సుమారు 20 ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. అయితే ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఐదునెలలు కాకుండానే పగుళ్లు తీసి శి«థిలమవుతున్నాయి. గోపాలపురం పంచాయతీరాజ్ సబ్‌డివిజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరులమ మండలాల్లో 2017–18 సంవత్సరానికి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్ల ఉపాధి హామీ, పంచాయతీ నిధులు మంజూరు చేశారు. వీటితో 87,151 మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు సుమారురూ.150 కోట్లతో 29,099 మీటర్ల పొడవున రోడ్లు నిర్మించారు. అయితే వేసిన రోడ్లు పలు గ్రామాల్లో బీటలు తీశాయి. దీంతో సిమెంట్ రోడ్ల కంటే మట్టిదారులు నయమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో నిదర్శనాలు - దేవరపల్లిలో ఆరు సిమెంట్ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. బాలదుర్గమ్మ ఆలయ ప్రాంతంలో గత ఏడాది సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి కాలువ ఇసుక వాడుతున్నారని, స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టరు మిగిలిన రోడ్లను ఆపేశారు. - దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెంలో గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేయకుండానే గత ఏడాది మార్చిలో అధికారపార్టీ నేతల అండతో బిల్లులు చేయించుకుని జేబులు నింపుకున్నారు. సుమారు రూ. 10 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు ఆగమేఘాలపై రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు. - ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో 5 నెలల క్రితం నిర్మించిన అంబేడ్కర్ సెంటర్ రోడ్డు అప్పుడే ధ్వంసమైంది. ఎంపీపీ పాఠశాల వెనుక రోడ్డూ దెబ్బతింది. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు కావడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. - మద్దులగూడెంలో ఇటీవల సర్పంచ్ కట్టూరి స్వర్ణలత భర్త చంటిబాబు 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మిస్తుండగా, ఒక వార్డు సభ్యురాలు భర్త దానంపూడి భుజంగరావు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని గొడవకు దిగారు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరూ అధికార పార్టీ వారే కావడం విశేషం. - దేవినేనివారిగూడెంలో రోడ్లు నిర్మించిన కొద్దిరోజులకే బీటలు వారాయి. - గోపాలపురం మండలం గోపవరంలో టీడీపీ నాయకుడు చేపట్టిన రోడ్లు నిర్మించిన రెండు నెలలకే గోతులు పడ్డాయి. - వాదాలకుంట, జగన్నాథపురం, భీమోలు, చిట్యాల, గోపాలపురంలలో టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అవకతవకలపై విచారణ చేపట్టాలి గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు వేసిన రెండు నెలలకే పాడయ్యాయి. కాంట్రాక్టర్లను అడిగితే కమీషన్లే ఇవ్వాలా రోడ్డు నాణ్యతే పాటించాలా అని అంటున్నారు. సిమెంట్ రోడ్ల కన్నా గ్రావెల్‌రోడ్లు నయంగా ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారపార్టీ నాయకులే కాంట్రాక్టర్లవుతున్నారు. – కాకులపాటి వెంకట్రావు, భీమోలు రోడ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటా ఇటీవలే డివిజినల్ ఇంజినీరింగ్ అధికారిగా బదిలీపై వచ్చా. నాణ్యత లేకపోవడం వల్ల శిథిలమైన రోడ్లను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటా. రోడ్డు వేసిన కాంట్రక్టర్తో మళ్లీ మరమ్మతులు చేయిస్తా. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. – కె. భద్రానాయక్, డీఈఈ, పంచాయతీరాజ్ -
బలిపశువు
‘‘నమస్కారం సార్’’ అన్న పిలుపుతో న్యూస్ పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా ఇరవై ఏళ్ల కుర్రాడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఎగాదిగా చూసి ఏమిటన్నట్లుగా తలెగరేశాను. ‘‘పనేదైనా ఉంటే ఇప్పించండి సార్! చాలాదూరం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. పదో తరగతి వరకూ చదివా. మా ఊర్లో పంటలు లేక పనులు లేక కరువు వచ్చి ఇట్లా వచ్చాను సార్..’’ గడగడా అప్పజెప్పేశాడు. ‘‘ఇప్పుడు అన్‌సీజన్. పనులేవీ లేవు కదయ్యా!’’ అని నేను అంటుండగానే, ‘‘సార్సార్ నాతో పాటు ఊర్లో అమ్మ, నాన్న, తమ్ముడు బతకాలి. మీరేం పని చెప్పినా చేస్తా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. మొన్నరాత్రి ఒక పనిగురించి యాదగిరి నావద్దకు వచ్చి వెళ్లిన సంగతి గుర్తుకువచ్చింది. మరొకమారు వాడిని తేరిపార చూశాను. పనికొచ్చేటట్లే ఉన్నాడనిపించింది. ‘‘ఏం పేరు నీది?’’ అడిగాను. పని దొరికిందనుకున్నాడో ఏమో వాడి ముఖం ఒక్కసారి వెలిగిపోయింది. ‘‘నా పేరు కురుమూర్తి సార్. పాలమూరు పక్క పల్లె సార్ మాది’’ అన్నాడు వాడు. ‘‘ప్రస్తుతానికి పనులేవీ లేవు. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నా. వంటమనిషి ఊరెళ్లాడు. వాడు వచ్చేవరకూ ఇంట్లో పనులు చూసుకో’’ అని చెప్పి మళ్లీ పేపర్లో తల దూర్చాను. మంచి హుషారైన కుర్రాడి మాదిరి ఉన్నాడు. చేతి సంచి మూల ఉంచి చీపురు అందుకొని వెంటనే పనిలోకి దిగిపోయాడు. లేబరు కాంట్రాక్టరుగా గత ఐదారు సంవత్సరాలనుండి శ్రీశైలం అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో ఉంటున్నాను. ఫారెస్టులో రోడ్లు వెయ్యడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడానికి, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నన్ను కలుస్తుంటారు. వాళ్లకు తగిన పనివాళ్లను సప్లై చేయడం నా పని. ఇక్కడి గిరిజనుల్లో నాకు మంచి పరిచయాలున్నాయి కాబట్టి పనులకు మనుషులను పంపడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్లు నిరక్ష్యరాస్యులు. కూలీగా ఎంత ఇస్తే అంత కళ్లకద్దుకొని మరీ తీసుకుపోతారు. అందువల్ల నా సంపాదన బాగానే ఉంటున్నది. మొన్నరాత్రి యాదగిరి చెప్పిన పనిగురించే ఆలోచిస్తూ ఉన్నాను. డబ్బు కూడా బాగానే ముట్టేటట్లుంది. ఎటొచ్చీ చేద్దామా, వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. వీడ్ని చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించి పనిలోకి దిగుదామని నిర్ణయించుకున్నాను. వెంటనే మనిషిచేత నా సమ్మతి తెలియజేస్తూ యాదగిరికి కబురంపాను. ఒక నెలరోజులు గడిచాయి. అనుకున్నరోజు మనిషి వచ్చి అడ్వాన్సు ఇచ్చి ఆరోజు రాత్రి చేయవలసిన పనిగురించి వివరంగా చెప్పి వెళ్లిపోయాడు. కురుమూర్తిని పిలిచాను. ‘‘ఇదిగో నీ నెల జీతం. వెంటనే ఇంటికి మనీయార్డరు చేసి రాత్రికి రెడీగా ఉండు. అడవిలో కొంచెం పని ఉంది. వెళ్లి వద్దాం’’ అని అడ్వాన్సుగా ఇచ్చిన కట్టలో కొన్ని నోట్లు తీసి అందించాను. అంత డబ్బు ఇస్తానని ఊహించనివాడు కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాడు. ‘‘ఊ! తీసుకో. రాత్రికి స్పెషల్ భోజనం ఇద్దరికీ చెయ్యి..’’ అనగానే ‘‘అట్లాగే సార్’’ అని నోట్లందుకొని సంబరపడిపోతూ దండం పెట్టి వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నర కావస్తున్నది. అమావాస్య చీకటి. మోటార్ సైకిల్ మీద కురుమూర్తిని ఎక్కించుకొని బయలుదేరాను. పదికిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద ప్రయాణించి తరువాత ఫారెస్టులోని డొంక రోడ్లోకి తిప్పాను. బాటకిరువైపులా ముళ్ల పొదలు. కొంచెం పక్కకి పోయినా పంక్చరు పడ్డం ఖాయం. అలవాటైన దోవ కాబట్టి జంకు లేకుండా ముందుకుపోతున్నాను. వెనుక కురుమూర్తి మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు. బయలుదేరేముందు నాతోపాటే భోజనం చెయ్యమన్నాను. నేను వేసుకునే లాల్చీ పైజామా ఒక జత ఇచ్చి వేసుకొనమన్నాను. మొహమాటపడుతూనే వేసుకొని తయారయ్యాడు. దోవలో వాడి అమ్మా నాన్నల గురించి, తమ్ముడి గురించి, మధ్యలో నా మంచితనం గురించి పొగుడుతూ చాలాసేపు చెప్పాడు. ‘‘ఇంకా ఎంతదూరం పోవాలి సార్’’ మాటల మధ్యలో అన్నాడు వాడు. ‘‘ఇదుగో వచ్చేశాం. ఆ కనబడే మంట దగ్గరకే’’ అన్నాను. ఒక వంద గజాల దూరంలోనే బండి ఆపి ఇద్దరం తుప్పల్ని, పొదలను తప్పుకుంటూ మెల్లగా అక్కడికి చేరుకున్నాం. దూరంనించి మంట చిన్నదిగానే కనిపించినా, దగ్గరికి వెళ్లేసరికి చాలా పెద్ద సైజులో మండుతున్నది. పక్కనే పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టు. కింద పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసిన పెద్ద పీట, పెద్ద సైజు చెక్కమొద్దు, ఇంకా పూలు, నిమ్మకాయలు తదితర పూజా ద్రవ్యాలు ఉన్నాయి. మంట ఎదురుగా బుర్రమీసాలు, నిలువు బొట్టు, ఎర్రటి పంచెకట్టు, బానపొట్ట భుజంపైన తెల్లకండువాతో భయంకరమైన మనిషి కళ్లుమూసుకు కూర్చొని మంత్రాలు బిగ్గరగా జపిస్తున్నాడు. మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్లేసరికి యాదగిరి ఎదురొచ్చాడు. ‘‘రా అన్నా! అంతా రెడీయేనా?’’ అన్నాడు, కురుమూర్తిని ఎగాదిగా చూస్తూ. ‘‘సరిగ్గా టైముకు వచ్చామా?’’ అడిగాను వాచీని మంట వెలుగులో చూసుకుంటూ. ‘‘ఆ! అయిపోవచ్చింది. కాసేపు కూర్చోండి..’’ అని ఒక బండ చూపించి వెనక్కు వెళ్లిపోయాడు. ‘‘కూర్చోవోయ్’’ అని కురుమూర్తికి చెప్పి బండమీద ఊది చతికిలబడ్డాను. వాడు కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడి జరిగే తంతుని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఈ యాదగిరి నాకు రెండు నెల్ల క్రితమే పరిచయమయ్యాడు. పని గురించి మొదట మాట్లాడింది, తరువాత అడ్వాన్సు ఇచ్చి వెళ్లిందీ ఇతనే. మొదట్లో ఈ పని నావల్ల కాదు అని చెప్పినా రేటు పెంచి నా చేత ఒప్పించాడు. మంచి పట్టుదల మనిషి. పని ఏ విధంగానైనా చేయించి సాధించాలనే టైపు వ్యక్తి. ఇంతలో ఏవో మాటలు విన్పించడంతో అటు చూశాను. చీకట్లో గమనించలేదు కానీ అక్కడ ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు. యాదగిరి వాళ్లతో ఏదో మాట్లాడుతూ మళ్లీ మావైపొచ్చాడు. వాళ్లు చేతులు కట్టుకుని అతణ్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మావద్దకి వచ్చేటప్పటికి మాటలు ఆపేశారు. అపుడు గమనించాను వాళ్లని. క్రూరమృగాల మాదిరి పచ్చిరక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు. కట్ బనియన్ ధరించి అడ్డు పంచలతో ఉన్నారు. మా సమీపానికి వచ్చేసరికి బ్రాందీ వాసన గుప్పుమంది. ఇంతలో అగ్నిగుండం దగ్గరి మాంత్రికుడు నెమ్మదిగా కళ్లు తెరిచి మంటలోకి ఏవో రసాయనాలు చల్లి మరింత ప్రజ్వలింపజేశాడు. ఈసారి పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్యలో ఆపి, యాదగిరి వైపు తిరిగి ‘‘పశువు సిద్ధమేనా?’’ అని బిగ్గరగా అరిచాడు. యాదగిరి అతడి వద్దకు వడివడిగా వెళ్లి నెమ్మదిగా ఏదో మాట్లాడి, ఇటు తిరిగి తన మనుషులకు సైగ చేశాడు. వాళ్లు వెంటనే కురుమూర్తిపైకి ఉరికి పారిపోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. కురుమూర్తికి అప్పుడర్థమైనట్లుంది, పశువంటే ఎవరో. మరుక్షణమే వాళ్ల పట్టునుండి గింజుకుంటూ ‘‘బాబూ నన్ను వదలండి. సార్ వీళ్లను వదలమని చెప్పండి మీ కాల్మొక్కుతా. బుద్ధిలేక మీకాడ పనికొచ్చినా, మీ పని వద్దు, జీతం వద్దు. నన్నొదలండి. సార్ వదలమని చెప్పండి..’’ అని పెద్దగా ఏడుస్తూ అరవసాగాడు. యాదగిరి మనుషులు ఇవేమీ పట్టించుకోకుండా వాణ్ని మాంత్రికుడి దగ్గరకు ఈడ్చుకు వెళ్లారు. మాంత్రికుడు నిర్వికారంగా వాడి మొఖానికి పసుపు రాసి, కుంకుమతో నిలువుబొట్టు పెట్టి బలికి సిద్ధం చేయసాగాడు. ఈ మధ్యలో యాదగిరి నా వద్దకు వచ్చి ‘‘ఇదుగో అన్నా! బ్యాలెన్సు డబ్బు..’’ అని జేబునుండి తీసి నాకందించాడు. ‘‘ఇక నువ్వు వెళ్లే పనైతే పోవచ్చు..’’ అన్నాడు. నేను డబ్బు జేబులో వేసుకొని ఏమీ మాట్లాడకుండా అటువైపు చూడ్డం గమనించి ‘‘సరే భయం లేకపోతే కాసేపు ఉండివెళ్లు..’’ అని తిరిగి వెళ్లిపోయాడు. కురుమూర్తి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి గొంతు రాసిపోయింది. ‘‘అన్నా! నన్ను వదిలెయ్యి. దేవుడా రక్షించు. బాబూ నన్ను చంపొద్దు..’’ అని మాంత్రికుడికి దండం పెట్టి పెద్దగా విలపించసాగాడు. ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్న మాంత్రికుడు జోడించిన వాడి చేతులు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చేతులను విడదీసి పరిశీలించి పెద్దగా ‘‘ఒరేయ్ యాదగిరీ! వీడు బలికి పనికి రాడ్రా.. చూడు వీడి చేతికి ఆరు వేళ్లున్నై..’’ అని అరిచాడు. ఈలోపల నేను కూడా అటు దగ్గరగా వెళ్లి చూశాను. నిజమే వాడి కుడి చేతికి మాత్రం ఆరువేళ్లున్నాయి. యాదగిరి కూడా వచ్చి చూశాడు. ‘‘ముందే చూసుకొని రావొద్దా? మూర్ఖులారా? ఈ యాగం అసంపూర్తిగా ఆగిపోయిందో మీ కోర్కెల మాట అటుంచి సర్వం నాశనమైపోతారు జాగ్రత్త’’ అని రంకెలు వేయడం మొదలుపెట్టాడు. యాదగిరి ఖిన్నుడైపోయినట్లు కనిపించాడు. ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి మాంత్రికుణ్ని పక్కకు తీసుకెళ్లి ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపించాడు. ప్లానంతా అప్సెట్ అయ్యేసరికి నాకు చాలా నిరాశ అనిపించింది. డబ్బు వచ్చినట్లే వచ్చి జారిపోయింది. ఇప్పుడీ కురుమూర్తి గాడిని ఏం చెయ్యాలి? బెదిరించి పంపేద్దామా? లేక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామా? ఫ్రీగా వదిలేస్తే విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయా? అని రకరకాల ఆలోచనలతో ఉన్న నాకు హఠాత్తుగా పక్కన ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడి అటు చూశాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యాదగిరి మనుషులు తమ ఉక్కు పిడికిళ్లతో నా జబ్బలు వడిసి పట్టుకున్నారు. ఒక్కసారిగా షాకైపోయాను. వడిగా మాంత్రికుడి వద్దకు ఈడ్చుకువెళ్లి ఎదురుగా నిలబెట్టారు. వాడు నా కాళ్లు చేతులు, ముఖం పట్టి పట్టి చూసి చుట్టూ తిరిగి పరిశీలించి ‘‘ఫర్వాలేదు, పనికొస్తాడు. సమయం కావస్తున్నది. పశువును పక్కన నిలబెట్టండి. పిలుస్తాను.’’ అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నాకు అప్పుడర్థమైంది.. మాంత్రికుడు, యాదగిరిల మధ్య జరిగిన సంభాషణ ఫలితం నన్ను కొత్త బలిపశువుగా మార్చిందని. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. విపరీతమైన భయంతో నిలబడలేకపోతున్నాను. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. అరిచినా ప్రయోజనం ఉండదు. ఈ కీకారణ్యంలో అర్ధరాత్రి నా కేకలు విని కాపాడే నా«థుడెవరుంటారు? వళ్లంతా చెమటతో ముద్దగా తడిచిపోయింది. ఇంతలో యాదగిరి ఎదురుగా వచ్చి తలదించుకొని ‘‘నన్ను క్షమించన్నా! ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. పని మధ్యలో ఆగిపోతే మాతో పాటు తను కూడా చస్తానని మాంత్రికుడు గట్టిగా చెబుతున్నాడు. పైగా టైమ్ కూడా లేదు వేరే మనిషిని చూసుకోవడానికి..’’ అని నా లాల్చీ జేబులో డబ్బు తనే తీశాడు. ‘‘ఒరేయ్! ఇలారా..’’ అని కురుమూర్తిని పిలిచాడు. వాడికి భయంతో పారిపోవడానికి కూడా చేతకాలేదు. వంగి దండం పెడుతూ వచ్చాడు. ‘‘ఇదుగో! ఈ డబ్బు తీసుకొని పారిపో. ఎక్కడైనా ఇక్కడి సంగతులు చెప్పావో.. ఖబడ్దార్’’ అంటూ డబ్బులు ఇవ్వబోగా, ‘‘నాకే పైసలు వద్దు సార్. నన్ను వదిలేయండి. ఈ జన్మలో ఇటుకేసి రాను..’’ అని యాదగిరి కాళ్లకు మొక్కి, లేచి నావైపు జాలిగా చూసి పరిగెత్తుతూ చీకట్లో కలిసిపోయాడు. నాకంతా ట్రాన్స్‌లో ఉన్నట్లుంది. ఎవరూ నన్ను రక్షించలేరు అన్న నిర్ణయానికి వచ్చేసి చావు కోసం మానసికంగా సిద్ధపడసాగాను. అలసటతో కనురెప్పలు వాలిపొయ్యాయి. ముఖంమీద ఏవో లేపనాలు పులుముతున్నట్లున్నారు. చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చెక్క మొద్దు మీద కాబోలు తల ఆనించి పట్టుకున్నారు. నాకు ప్రతిఘటించే శక్తి ఎప్పుడో పోయింది. వాళ్లు ఎటుతిప్పితే అటు తిరుగుతున్నాను. రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ముఖానికి వేడి సెగ తగిలింది. కళ్లు తెరుద్దామనుకొనేంతలో మెడ మీద చురుక్కుమనిపించింది. వెంటనే కళ్లముందు శాశ్వతంగా చీకటి తెర దిగిపోయింది. ఆర్.వి.శివప్రసాద్ -
హాస్టల్ మెస్‌పైనా జీఎస్టీ వడ్డన
సాక్షి, న్యూఢిల్లీ : విద్యార్ధులు, సిబ్బందికి ఆహారం సమకూర్చే మెస్‌ల పైనా జీఎస్టీ వర్తింపచేశారు. విద్యాసంస్థల్లో మెస్ ఎవరు ఏర్పాటు చేశారనే దానితో సంబంధం లేకుండా వీటిపై 5 శాతం జీఎస్టీ చార్జ్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాలేజ్ హాస్టల్ మెస్‌లకు సంబంధించి జీఎస్టీ వివరాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఈ మేరకు వివరణ ఇచ్చింది. మెస్‌లు, క్యాంటిన్లపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్టీ విధిస్తారని పేర్కొంది. ఈ మెస్ లేదా క్యాంటిన్‌ను ఆయా విద్యా సంస్థలే నిర్వహిస్తున్నాయా, బయటి వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారా అనే అంశంతో సంబంధం లేకుండా ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
పిట్ట గుడ్లు కావు.. కోడిగుడ్లే!
పెద్దపల్లి: పక్క ఫొటో చూశారా? అరచేతిలో 9 కోడిగుడ్లు కనిపిస్తున్నాయి. చాలా మంది పిట్టగుడ్లుగానే భావించొచ్చు.. కానీ అవి కోడిగుడ్లే. అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రా క్టర్ సరఫరా చేస్తున్న గుడ్లు ఒక్క బుక్కతో నమలకుండానే మింగే సైజులో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిట్టగుడ్డు మాదిరిగా చిన్నగా ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. జిల్లాలోని 305 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చిన్న పిల్లల కోసం కాంట్రాక్టర్ ద్వారా గుడ్లను సరఫరా చేస్తోంది. భోజనంతోపాటు చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఒక కోడిగుడ్డును అందిస్తున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గత కొద్ది రోజులుగా చిన్నసైజు గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐడీసీఎస్ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారంటున్నారు. కాంట్రాక్టర్ సీల్ టెండర్ ద్వారా గతంలో రూ.3కే ఒక కోడిగుడ్డు అందిస్తామంటూ టెండర్ పొందాడు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్లు అంగన్వాడీ కేంద్రానికి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. రిటేల్ కోడిగుడ్లకు రూ.6: రెండేళ్ల క్రితం టెండర్ ద్వారా రూ.3కే కోడిగుడ్లను సరఫరా చేస్తామని కాంట్రాక్ట్ పొందిన వారు ప్రస్తుతం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఎదురవుతున్న నష్టాల నుంచి బయట పడేందుకు చిన్న సైజు కోడిగుడ్లను తెప్పిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారులు ఈ విషయాన్ని గమనించి అక్కడక్కడ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించడంతో కొన్నిచోట్ల చిన్నసైజు కోడిగుడ్లనే అంటగడుతున్నట్లు తెలిసింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో పలువురు తల్లులు చిన్నసైజు కోడిగుడ్లను సాక్షికి చూపిస్తూ ఇది ఒక్క బుక్కకు కూడా సరిపోదని, అలాంటప్పుడు కోడిగుడ్లను అం్దదించడం దేనికని ప్రశ్నిస్తున్నారు. చిన్న సైజు గుడ్లను తిరస్కరించండి – సుభద్ర, సీడీపీవో, పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రాలకు చిన్నసైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు అక్కడక్కడ తమ దృష్టికి తెచ్చారు.దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. చిన్నసైజు కోడిగుడ్లు తెచ్చిన కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవద్దని, వాటిని తిరస్కరించాలని సూచించాం. అంగన్వాడీ టీచర్లు దీనికి బాధ్యులవుతారు. -
అదానీకి మరోషాక్
సాక్షి, ముంబై: భారత్‌లో అతిపెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అదానీ పోర్ట్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో చేపట్టిన కార్మైకేల్ బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో మరోసారి అదానీకి భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియాలోని డోనర్ ఈడీఐ లిమిటెడ్‌కు చెందిన ప్రాజెక్టును వదులుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు అదానీ, డోర్ కంపెనీలు వెల్లడించాయి. వివాదాస్పద బొగ్గుగని ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం వెల్లడించింది. దీంతో దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న కార్మైకేల్ గనికి తాజాగా మరో షాక్ తగిలింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 16.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రుణాలను పొందడంలో విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, చైనా బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు నో చెప్పాయి. ఇక చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో దీంతో అదానీ ఆశలు వదులకుంది. కాగా 16,500 కోట్ల డాలర్ల విలువైన కార్మైకేల్ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. అయితే అంతర్జాతీయ బ్యాంకులు సహా, చైనాకు చెందిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించాయి. మరోవైపు స్థానికులు, పర్యావరణవేత్తలు, పలు సామాజిక సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. -
ఇంటికి పిలిచి..చెంపచెళ్లు..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశం ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేసే వరకు వెళ్లింది. పలువురు కాంట్రాక్టర్ల ఎదుటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓ గుత్తేదారుపై చేయిచేసుకున్నాడు. మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్ నిర్ఘాంతపోయాడు. అయితే బాధిత కాంట్రాక్టర్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధాలు ఉండడం వల్ల ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదిగా మారింది. చివరికి ఇంటెలిజినెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక సైతం తయారు చేశాయి. స్టోన్ క్రషర్ల విషయంలో వివాదం.. స్టోన్ క్రషర్ల విషయంలో తలెత్తిన వివాదం కాంట్రాక్టర్‌పై దాడికి కారణమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్లు, హాట్‌మిక్స్, రెడిమిక్స్ ప్లాంట్ల నిర్వహణతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందంటూ కొంద రు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో క్రషర్ల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్ కార్యకలా పాలు నిలిపేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాలుష్య నియం త్రణ, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగించాలంటూ తీర్పు వెలువరించడంతో స్టోన్‌క్రషర్లు మూతపడ్డాయి. దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి కొసాగుతుండగా.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ నడుస్తుండడంతో ఇతర యజమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యజమానులు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఎమ్మెల్యేకు చెందిన క్రషర్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ క్రషర్ యజమాని, మరో క్రషర్ యజమాని (ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు)తో ఫోన్లో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార ఎమ్మెల్యే క్రషర్ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే మనకు ఈ ఇబ్బందు లేంటి. మనల్ని వాడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పని చల్లగా చేసుకుంటున్నాడు. ఇదేం పద్ధతి. మనం మాత్రం ఏ పాపం చేశాం’ అంటూ ఓ క్రషర్ యాజమాని వ్యాఖ్యానించాడు. ఫోన్లో జరిగిన ఈ సంభాషణను మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లి అందరం ఇబ్బందిపడుతున్నామని వివరిస్తూనే ఫోన్ సంభాషణను వినిపించాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపమొచ్చి ఆయన్ను తీసుకురా అని చెప్పాడు. మెరుపుదాడి.. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. అతడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. దీంతో ఇరువురి మధ్య కాంప్రమైజ్ కోసం ఎమ్మెల్యే ఇంట్లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు యజ మానులు, కాంట్రాక్టర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు, ఫోన్లో మాట్లాడిన క్రషర్ యజమానిని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపైనే వాఖ్యలు చేస్తావా, వాడు.. వీడు అంటావా అని క్రషర్ యజమానిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క ఉదుటన లేచి కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్న తనపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సమస్య పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే కొత్త సమస్య ఎదురుకావడంతో క్రషర్ యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో దాడికి గురైన వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యలతోనూ దగ్గరి పరిచయాలు ఉండడంతో విషయం హైదరాబాద్‌కు వరకు చేరింది. అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ అక్కడి నుంచి ఇంటలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చివరికి ఈ అంశానికి ముగింపు ఎలా ఉంటుందనేది రాజకీయ, కాంట్రాక్టర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ..
సాక్షి, అనంతపురం: అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. కాంట్రాక్టర్ నరసింహారెడ్డి మద్యం మత్తులో సోమవారం నగరపాలక సంస్థలో నానా హంగామా చేశాడు. స్వీపింగ్ మిషన్ సెకండ్ పేమెంట్ బిల్లుకు సంబంధించి సంతకం చేయాలని ఏఈ మహదేవ ప్రసాద్‌కు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి అల్టిమేటం జారీ చేశాడు. అందుకు ఏఈ మహదేవప్రసాద్ నిరాకరించడంతో నీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప వారిని వారించారు. చివరకు కాంట్రాక్టర్‌ను అతనితో వచ్చిన ఇద్దరు పోకిరీలను అక్కడి నుంచి అధికారులు పంపిచేశారు. దారికాచి దాడి కాంట్రాక్టర్... డీఈ కిష్టప్పపై దారికాచి దాడి చేశాడు. డీఈ కిష్టప్ప.. కార్పొరేటర్ పద్మావతి సంతాప సభ అయ్యాక ఇంటికి బయలుదేరారు. డీఈని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి తన అనుచరులతో కారులో ఫాలో చేస్తూ వచ్చారు. నగరంలోని నామా టవర్స్ సమీపంలోకి రాగానే డీఈ టూవీలర్ వాహనాన్ని కారుతో తగిలించి వెళ్లిపోయారు. డీఈ తేరుకునే లోపే కాంట్రాక్టర్ జారుకున్నాడు. డీఈ... కాంట్రాక్టర్ కారును ఫాలో చేశారు. రఘువీరా కాంప్లెక్స్ వెనుకవైపు వీధిలోకి వెళ్లగా... అక్కడ కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని డీఈ కిష్టప్ప నిలదీశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నరసింహారెడ్డి డీఈ కిష్టప్పపై బూటుకాలితో దాడి చేశాడు. వన్‌టౌన్‌లో ఫిర్యాదు డీఈపై దాడి చేయడాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఈ నాగమోహన్ డీఈలు షుకూర్, నరసింహారెడ్డి, ఏఈ మహదేవప్రసాద్ కాంట్రాక్టర్‌పై వన్‌టౌన్ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ డీఈకు మద్దతుగా వచ్చారు. (పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న డీఈ కిష్టప్ప, ఏఈ మహదేవప్రసాద్, వైఎస్సార్ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ) ఆది నుంచి వివాదమే..! స్వీపింగ్ మిషన్ కొనుగోలు ఆది నుంచి వివాదాస్పదంగా మారింది. 2015లో అప్పటి కమిషనర్ రూ. 33 లక్షలతో స్వీపింగ్ మిషన్‌ను కొనుగోలు చేశారు. అనంతపురం రోడ్లపై స్వీపింగ్ మిషన్ పని చేయదని అన్ని వర్గాల నుంచి పూర్తీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. 2016లో కమి షనర్‌గా ఉన్న సురేంద్రబాబు స్వీపింగ్ మిషన్‌ను వ్యతిరేకించారు. అది అసెంబుల్ సెట్ అని, జేఎన్టీయూ అధికారులతో సర్టిఫై చేశాకే బిల్లు చేస్తామని తేల్చి చెప్పారు. స్వీపింగ్ మిషన్ సరిగా లేకపోవడంతో వెనక్కు పంపామని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పలుమార్లు చెప్పారు. స్వీపింగ్ మిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, మేయర్ ఇప్పుడు మొదటి పేమెంట్ కింద కాంట్రాక్టర్‌కు రూ.24 లక్షలు చెల్లిస్తే మిన్నకుండిపోయారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వీపింగ్ మిషన్ మెయిన్టైనెన్స్ నెలకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. ప్రతి నెలా రూ లక్షల్లో ప్రజాధనం లూటీ అవుతుందని సాక్షాత్తు పలువురు అధికారులే వాపోతున్నారు. పోలీసుల అదుపులో కాంట్రాక్టర్ నగర పాలక సంస్థ డీఈ కిష్టప్పపై దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని వన్టౌన్న్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. డీఈతో పాటు మేయర్ స్వరూప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడికి పాల్పడిన కాంట్రాక్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జీ సీఐ కృష్ణమోహన్‌ను కలిసి డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. -
నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ..
-
ప్రభుత్వస్థలాన్నే కబ్జా చేశారు
-
ఇదేం చోద్యం..!
♦ ప్రభుత్వ పనుల కోసమని చెప్పి సిమెంట్ తెప్పించిన కాంట్రాక్టర్ ♦ సొంత పనుల కోసం గోదాంకు తరలించే యత్నం ♦ విషయం తెలిసి గోదాం వద్దకు వెళ్లిన మీడియా ♦ లోడు దించకుండా నిలిపేసిన లారీ ♦ మేము ఇండెంట్ పెట్టలేదంటున్న పంచాయతీరాజ్ అధికారులు విజయనగరం ఫోర్ట్: ఆయన ఓ కాంట్రాక్టర్. ప్రభుత్వ పనులు చేయిస్తానని చెప్పి ఆ రేటుకు దాదాపు 700 బస్తాల సిమెంట్‌ను తెప్పించుకున్నాడు. కానీ ప్రభుత్వ పనులకు వినియోగించేందుకు కాకుండా సొంత గోదాములో దించేందుకు ప్రయత్నిస్తుంటే విషయం మీడియాకు తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో సిమెంట్‌ను దించకుండా అలాగే లారీల్లో వదిలేశారు. లారీ సిబ్బందిని లోడుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అడిగితే గుమస్తా పట్టుకెళ్లి పోయినట్లు బదులిచ్చారు. ఈ తతంగం అంతా శనివారం, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నివాసం ఎదురుగా ఉన్న రైల్వే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గోదాం వద్ద జరిగింది. గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్ల కోసమని..! సదరు కాంట్రాక్టర్ మండలంలోని గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం కోసమని నాగార్జున కంపెనీ చెందిన దాదాపు 700 సిమెంట్ బస్తాలను తెప్పించారు. వాస్తవానికి ప్రభుత్వ పనుల కోసమైతే కంపెనీలు రూ.240కే సిమెంట్ బస్తాను ఇవ్వాలి. స్లాగ్ సిమెంట్‌ను రూ.230కు, ఓపీసీ గ్రేడ్ సిమెంట్ అయితే రూ.240కు ప్రభుత్వ పనులకు కంపెనీలు ఇస్తున్నాయి. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ బస్తా ధర రూ.330 నుంచి రూ.340గా ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు బస్తా సిమెంట్‌కు రూ.100 వరకు మిగులుతుంది. దాదాపు 700 బస్తాలకు రూ.70వేల వరకు ఆ కాంట్రాక్టర్ మిగిలించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉండడంతో కొన్ని సిమెంట్ కంపెనీలకు చెందిన సిబ్బందితో, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ పనుల పేరు చెప్పి తక్కువ ధరకే సిమెంట్‌ను తెప్పించుకుంటున్నారు. అసలు నిబంధన ఇదీ.. ప్రభుత్వ పనులకు సిమెంట్ కావాలంటే స్థానిక సర్పంచ్ ఎన్ని బస్తాల సిమెంట్ అవసరమో వాటికి డీడీ తీసీ పంచాయతీరాజ్ ఈఈకు ఇవ్వాలి. ఈఈ ఇన్ని బస్తాల సిమెంట్ అవసరం అని ఇండెంట్ పెడతారు. సంబంధిత కంపెనీలు సిమెంట్‌ను సరఫరా చేస్తారు. సిమెంట్ వచ్చిన తర్వాత డెలివరీ బిల్లుపై మండల ఇంజినీర్ సంతకం చేయాలి. కానీ శనివారం జిల్లాకు వచ్చిన సిమెంట్ లోడు అసలు పంచాయతీ రాజ్ అధికారులు ఇండెంటే పెట్టకుండా వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. -
చెట్ల కిందనే పాఠాలు!
► బిల్లులు రాక గదికి తాళాలు వేసిన కాంట్రాక్టర్ ! ► ఆరుబయట కూర్చుంటున్న విద్యార్థులు ► పట్టించుకోని ఉన్నతాధికారులు ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఇల్లందకుంట: ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విసుగెత్తిన ఓ కాంట్రాక్టర్ అదనపు తరగతిగదులకు తాళం వేయడంతో విద్యార్థులకు చెట్లే దిక్కయ్యాయి. చేసేదేమిలేక ఉపాధ్యాయులు సైతం చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.28.61లక్షలతో.. ఇల్లందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.28.61లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేశాడు. ఈ విద్యాసంవత్సరం అదనపు తరగతి గదులకు మారేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు బిల్లులు రాలేవంటూ కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారని ప్రధానోపాద్యాయుడు సాంబయ్య తెలిపారు. చేసేదేమి లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. వెనుదిరుగుతున్న తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చి ఇక్కడి విద్యార్థుల చెట్ల కింద కూర్చోవడాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ తాళం వేయడం, ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులకు నివేదించాం డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారు. ఈ విషయంతోపాటు విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్న విషాయన్ని సైతం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం కూలిపోయిన తరగతిగదులలో కొందరు, మరికొందరు చెట్లకింద కూర్చుంటున్నారు. కాంట్రాక్టర్‌కు సైతం చాలాసార్లు ఫోన్ చేశాం. ఆయన స్పందించడం లేదు. – సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు -
భవనంపై నుంచి కింద పడి..
యువకుడి మృతి - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని న్యూ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సుంకన్న గౌండా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు నల్లబోతుల సురేష్(21) నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజిలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో గతంలో సెంట్రింగ్ పనికి వెళ్లేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనితో పాటు ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న గైనకాలజీ విభాగం(ఎంసీహెచ్ భవనం)లో ఐదో అంతస్తు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అందరూ పని ముగించుకుని కిందకు దిగారు. చీకటి పడటంతో సురేష్ సైతం కిందకు దిగే ప్రయత్నం చేస్తుండగా అదుపు తప్పి ఐదో అంతస్తు నుంచి కిందకు పడ్డాడు. వెంటనే తలపగలి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కాలేజికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో మేనమామ ఊరికి వెళ్తానని సురేష్ చెప్పినా ఈ రోజు ఒక్కరోజు వెళ్లిరా అని తాను పంపించడంతోనే పనికి వచ్చి ఇలా మృత్యువుపాలయ్యాడని తల్లి శ్యామలమ్మ కన్నీటి పర్యంతమైంది. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సౌకర్యాలు కల్పించక పోవడంతో యువకుడు చీకట్లో కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటల సమయంలో చీకటి పడటం, లైట్లు ఏర్పాటు చేకపోవడంతో ప్రమాదం జరిగింది. -
ముడుపులకు మూల్యం
ముడుపులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతి బిల్లుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పర్సెంటేజీల పేరిట వేధింపులకు తగిన శాస్తి జరిగింది. ప్రజోపయోగానికి రోడ్డు నిర్మించేందుకు లంచాలు చెల్లించాలి. ఆ పని దక్కించుకోవడానికి పర్సంటేజీలు ఇవ్వాలి. ఇక పని పూర్తి చేశాక ఆ కాంట్రాక్టర్‌కు దక్కిందేమిటి. కడుపు మండిన ఓ కాంట్రాక్టర్ వేధిస్తున్న ఇంజినీరింగ్ అధికారిని అవినీతి నిరోధక శాఖకు పట్టించారు. ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్ అధికారి ఎంబుక్‌లో నమోదు చేసేందుకు రూ. 20వేలు డిమాండ్ కడుపుమండి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ సాక్షి ప్రతినిధి, విజయనగరం :పర్సంటేజీలు, ముడుపులు ఇచ్చుకోలేక చిన్నపాటి కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. సహనం ఉన్న వాళ్లు భరిస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు అవినీతికి పాల్పడుతున్న వారికి తిరిగి బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడా విధంగానే సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఎంబుక్‌లో రికార్డు చేసేందుకు చిన్నపాటి కాంట్రాక్టర్ నుంచి రూ. 20వేలు లంచం తీసుకుని విజయనగరం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పబ్లిక్‌గా దొరికిపోయారు. పని చేతికొచ్చిన దగ్గరి నుంచే ముడుపులే పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే. నామినేటేడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మంజూరైన పనులను పర్సంటేజీకి చిన్నపాటి కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి కాంట్రాక్టర్లు ఏదో ఒక రకంగా పని కానిచ్చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు మామూళ్లు ఇక సర్పంచ్‌లనుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఇంజినీరింగ్ అధికారులు వదలడంలేదు. తమకు రావల్సినవి ఇచ్చేయాల్సేందంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కొందరు పని విలువలో 10నుంచి 12శాతం తీసుకుంటుండగా, మరికొందరు 15శాతం వరకు గుంజేస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోనైతే 20శాతం వరకు లాగేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాటితో సంతృప్తి చెందడం లేదు. ఎంబుక్‌లో రికార్డు చేసిన ప్రతీసారి పిండేస్తున్నారు. అప్పుడు కూడా తమను సంతృప్తి పరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడా రకంగా ఇవ్వలేకే సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన కాంట్రాక్టర్ బి.సూర్యనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వ్యూహాత్మకంగా ఎంబుక్ రికార్డు చేసేందుకు డబ్బులు అడిగిన మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్‌రెడ్డిని బుక్ చేయించారు. పట్టు బడేంతవరకు తొందరే బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాంగోపాల్‌రెడ్డి వ్యవహారం చూస్తే లంచం సొమ్ము కోసం తానెంత ఆత్రుత పడ్డాడన్నది స్పష్టమవుతుంది. రూ. 5లక్షల విలువైన సీసీ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రూ. 3.50లక్షల బిల్లు చేసేశారు. మిగతా రూ. లక్షా 50వేలు బిల్లు కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారు. లంచమిస్తేనే ఎంబుక్ రికార్డు చేస్తానని మొండికేయడంతో కాంట్రాక్టర్ సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ప్రణాళిక ప్రకారం అడిగినంత ఇస్తామంటూ ఇంజినీరింగ్ అధికారికి చెప్పించారు. బుధవారం తెల్లవారు జామునుంచి లంచం సొమ్ము కోసం ఇంజినీరింగ్ అధికారి తెగ ఆరాట పడ్డారు. ఉదయం 7.30గంటలకు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి సాలూరు రావడం లేదని... కలెక్టరేట్లో సమావేశం ఉందని... ఇక్కడికొచ్చి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ 9గంటలకు ఫోన్ చేసి వస్తున్నావా...అని అడిగారు. 9.30గంటలకు మరోసారి ఎక్కడున్నావని అడిగారు. 10గంటలకు ఫోన్ చేసి కలెక్టరేట్ వద్దకు వచ్చేశానని, తెలిపారు. ఇదిగో వచ్చేస్తున్నానంటూ కాంట్రాక్టర్ సూర్యనారాయణ ఏసీబీ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. ఆ పక్కనే చెట్లు కింద ఉన్న ఇంజినీరింగ్ అధికారిని కలిశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ప్రయత్నించగా తన బ్యాగ్‌లో పెట్టాలని ఇంజనీరింగ్ అధికారి కోరారు. కానీ, కాంట్రాక్టర్ బ్యాగ్‌లో పెట్టకుండా నేరుగా చేతికిచ్చాడు. అదే అదనుగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పబ్లిక్‌గా పట్టుకున్నారు. వెంటనే కారులోకి ఎక్కించి, విచారించారు. మీడియా కంట పడకుండా గంటన్నరకు పైగా కారులోనే ఇంజనీరింగ్ అధికారి ఉండిపోయారు. కొసమెరుపు ఏంటంటే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ అధికారికి మరో రెండేళ్లే సర్వీసు ఉంది. దాడుల్లో విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి, సీఐలు రమేష్, లక్మోజులు పాల్గొన్నారు. -
అటకెక్కిన కాకినాడ కెనాల్ రోడ్డు విస్తరణ
-
టన్నెల్ పనుల తనిఖీ
అవుకు: గాలేరు–నగరి సుజల స్రవంతి పనుల్లో భాగంగా అవుకు టన్నెల్ (ప్యాకేజ్ నంబర్–30) నిర్మాణ పనులను సీఈ నారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలతో పాటు కాంట్రాక్టర్ల పై ఒత్తిడి పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవుకు టన్నెల్ పనుల్లో ఒక సొరంగం 300 మీటర్లు మేర ఫాల్ట్‌జోన్ ఉందని, దీంతో రైట్ డైవర్స్న్లో దాదాపు 394 మీటర్లలో మరో టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 100 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉందని,రోజుకు 10 మీటర్ల తగ్గకుండా చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నెల చివరినాటికి ఒక సొరంగం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ సూర్య కుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్ రాజు, శివప్రసాద్, మురళీకృష్ట, క్యాలిటీ కంట్రోల్ డీఈ చిదంబర్ రెడ్డి, టన్నెల్ జీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
నీ వ్యాపారం పచ్చగుండా!
నా వద్దే కంకర కొనాలి! – సిమెంట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు – అధికార పార్టీ ఎమ్మెల్యే దాదాగిరి – రెండో ప్లాంట్ ఏర్పాటుకూ సన్నాహాలు – ఓర్వకల్లు వద్ద ఇప్పటికే పనులు మంచి పనులు చేయాలి. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి. చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలి. ఇదీ ఒకప్పటి రాజకీయ నేతల మదిలోని మాట. ఇప్పుడు ఇలాంటి నేతలు నూటికో.. కోటికో ఒక్కరు. నాయకుడు కావడమే తరువాయి.. ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులు వెనకేసుకోవడంపైనే దృష్టి. తాజాగా ఓ అధికార పార్టీ నేత తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాలను వేదికగా చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు తాపత్రయపడుతున్నారు. వీరిలో కొందరు మరో అడుగు ముందుకేసి ఎదుటివాళ్ల ఇళ్లనూ సర్దేసే పనిలో పడ్డారు. ఈ కోవలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఎవరు ఏ పనిచేయాలన్నా.. ఎవరికి కంకర కావాలన్నా తన నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఒక సిమెంటు కంపెనీ రైల్వే సైడింగ్ పనులు చేపడుతోంది. ఈ పనులకూ సదరు ఎమ్మెల్యేకు చెందిన కంకర మిషన్ నుంచే సిమెంటు కంపెనీ కాస్తా కంకర కొనుగోలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో తిప్పలు తప్పవంటూ హెచ్చరించడంతో సిమెంటు కంపెనీ యాజమాన్యం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తన నియోజకవర్గ పరిధిలో ఏ కాంట్రాక్టర్ పనిచేయాలన్నా.. అవసరమైన కంకరను తన వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీచేశారు. భలేగా ఉంది బిజినెస్.. ఏదైనా వ్యాపారం చేయాలంటే అందుకు మార్కెటింగ్ ఎంతో కీలకం. అయితే, ఇక్కడ అధికారం ఉండటమే మార్కెటింగ్‌గా మారింది. అందుకే ఏ మాత్రం కష్టపడకుండా నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టర్ పనిచేసినా.. ఏ సిమెంటు కంపెనీ పనులు చేసినా ఈయనకు చెందిన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి వస్తోంది. త్వరలో ఇదే నియోజకవర్గంలోని మిగిలిన సిమెంటు కంపెనీలు కూడా రైల్వే సైడింగ్ పనులు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ కంపెనీలు కూడా తప్పనిసరిగా సదరు ఎమ్మెల్యే నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి రానుంది. ఇక రోడ్ల పనులు చేపట్టే కాంట్రాక్టర్లు సైతం ఈయన ప్లాంటు నుంచే కంకర కొనాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్లాంటులో తయారైన కంకరకు డిమాండ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రణాళిక వేసుకున్నారు. ఓర్వకల్లులో రెండో ప్లాంటు ఇప్పటికే తన నియోజకవర్గంలో ఉన్న కంకర తయారీ ప్లాంటుకు గిరాకీ ఉండటంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎమ్మెల్యే సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లులో రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా పనులు ప్రారంభించకపోయినా రానున్న రోజుల్లో ఒకటో, రెండో పరిశ్రమలు పనులు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీకి స్థలం కేటాయించింది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీకి కూడా జగన్నాథగట్టు వద్ద స్థలాన్ని కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అటు ఉర్దూ యూనివర్సిటీ, ఇటు ట్రిపుల్ ఐటీ క్లాసులను సొంత క్యాంపస్‌లలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కంకర ప్లాంటును ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా తన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలోచనగా ఉంది. మొత్తం మీద అటు రాజకీయం.. ఇటు వ్యాపారం మేళవింపుతో మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఈయన కాస్త దూసుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. -
కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టండి..
వన్‌టౌన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాబు.ఏ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేసి డబ్బులు కాజేయాలని చూస్తే ఊరుకుంటామనుకుంటున్నారా...అంటూ తీవ్రంగా హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అందులో భాగంగా 1800 మరుగుదొడ్ల ఏర్పాటుకు పూనేకు చెందిన లాల్జీ అనే కాంట్రాక్టర్ రూ.రెండు కోట్లకు కాంట్రాక్ట్ పొందాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, నిర్వహణ వారే చూడాలి. ఆ సంస్థ మరుగుదొడ్ల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందింది. దానిపై కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు వివరించారు. ఆయన స్వయంగా పరిశీలించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, ఇతర అధికారులు దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశమయ్యారు. కమిషనర్ కాంట్రాక్టర్‌ను పిలిపించి జిల్లా కలెక్టర్ ముందు నిలబెట్టాడు. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా డబ్బులో కాజేయాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అటువంటి ట్రిక్‌లు ఎక్కడైనా జరుగుతాయోమో.. ఈ జిల్లాలో జరగదంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఎస్పీని కార్పొరేషన్ వారు ఫిర్యాదు చేస్తారని, కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలంటూ సూచించారు. -
నాణ్యతకు తిలోదకాలు
బెల్లంపల్లి : నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడంతో నిర్మించిన నెల రోజుల్లోనే రహదారి గుంతలమయంగా మారింది. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గుత్తేదారు నాణ్యతగా నిర్మించకపోవడంతో బీటీ రహదారి చెదిరిపోయి గుంతలు పడుతున్నాయి. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం భీమిని మండలంలో ఇటీవల నిర్మించిన ఓ బీటీ రోడ్డు నాణ్యత ప్రమాణాలను వెక్కిరించే రీతిలో తయారైంది. రూ.4.36 కోట్లతో.. భీమిని మండలం ముత్తాపూర్ గ్రామ క్రాస్ రోడ్డు నుంచి మెట్పల్లి గ్రామం వరకు కొన్నాళ్ల నుంచి గ్రామీణులకు సరైన రోడ్డు సదుపాయం లేకుండా పోయింది. కంకర రోడ్డుపై రాకపోకలు సాగించడానికి ఏళ్ల తరబడి నుంచి గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఆ రోడ్డును బీటీగా మార్చడానికిSఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల మధ్య ఉన్న 9.2 కిలోమీటర్ల పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.36 కోట్ల నిధులను మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు గత నెల( జూన్)లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇన్నాళ్లు గతుకుల రోడ్లతో ఎన్నో అవస్థలు పడ్డ తమకు ఇక కొత్త రోడ్డు నిర్మాణంతో కష్టాలు కడతేరినట్లేనని ఆ ప్రాంతాల ప్రజలు ఎంతగానో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. సరిగ్గా నెల రోజులు కూడా తిరక్క ముందే రోడ్డుపై వేసిన బీటీ చెదిరిపోయింది. అడుగుకో గుంత... కొత్తగా నిర్మించిన రహదారి బీటితో తళతళ మెరిసిపోవాల్సి ఉండగా కళావిహీనంగా మారింది. 9 కిలోమీటర్ల పొడవున అడుగుకో గుంత ఏర్పడి అధ్వానంగా తయారైంది. చాలా మట్టుకు కొత్తగా వేసిన బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. అనేక చోట్ల పగుళ్లు తేలింది. కొన్ని చోట్ల రహదారి కోతకు గురైంది. రోడ్డుపై కనీసం అర ఇంచు మందం డాంబర్ లేకుండా పోయిందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లేక.. రూ. కోట్ల అంచనాతో చేపట్టిన రహదారి నిర్మాణం సక్రమంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవల్సిన బాధ్యత సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులపై ఉంటుంది. ఆగమేఘాల మీద, సరైన పద్ధతులు పాటించకుండా రోడ్డు నిర్మాణం జరిగిన∙ఇంజినీరింగ్ అధికారులు పట్టింపు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికైనా రోడ్డు పునఃనిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామీణులు కోరుతున్నారు. బిల్లులు చెల్లించలేదు – రాంచందర్, ఏఈ పంచాయతీరాజ్, భీమిని ముత్తాపూర్ – మెట్పల్లి ప్రధాన రహదారి నిర్మించిన గుత్తేదారుకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. ఐదేళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా గుత్తేదారుపైనే ఉంటాయి. ప్రస్తుతం బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు పడ్డాయి. నాణ్యతగా నిర్మించని గుత్తేదారుకు లీగల్ నోటీసులు ఇచ్చాం. రోడ్డు దుస్థితిని ఉన్నతాధికారుల దష్టికి ఈపాటికే తీసుకెళ్లాను. రోడ్డు పునఃనిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. -
పుణ్యకాలంలో పాపకార్యం
పుష్కరాల భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు నాసిరకంగా మరుగుదొడ్లు నిర్మించిన కాంట్రాక్టర్ పెనమలూరు : మండలంలో పుష్కరాల పనులు ఫార్సుగా మారాయి. తాజాగా మరుగుదొడ్ల అద్దె బాగోతం వెలుగులోకి వచ్చింది. పచ్చనేతల అండదండటతో మరుగుదొడ్లనూ వదలకుండా కాసులు దండుకునే పనిలో పడ్డారు కాంట్రాక్టర్లు. పుష్కరాలకు అద్దె మరుగుదొడ్లు ఏర్పాటు చేసి రూ.11 లక్షలు స్వాహాకు చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేశారు. పెనమలూరు మండలంలో యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. పుష్కరాల యాత్రికుల కోసం ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టింది. అద్దె డబ్బుతో శాశ్వతంగా నిర్మించొచ్చు పుష్కర ఘాట్ల వద్ద కాంట్రాక్టర్ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మరుగుదొడ్డికి రోజుకు అద్దె రూ 2200. పెనమలూరు మండలంలో యనమలకుదురులో 20 మరుగుదొడ్లు, పెదపులిపాకలో 10, చోడవరంలో 10, కాసరనేనివారిపాలెంలో నాలుగు కలిపి మొత్తం 44 మరుగుదొడ్లు నిర్మించారు. ఈ మరుగుదొడ్లకు 44 రోజులకుగాను అద్దె రూ.11,61,600. ఈ లెక్కన ఒక్కో మరుగుదొడ్డికి రూ 26,400 ప్రభుత్వం చెల్లించాలి. విజయవాడ నగరంలో ఏసీ గది రోజుకు రూ.1500 ఉంటుంది. కానీ తాత్కాలిక మరుగుదొడ్డి అద్దె మాత్రం దీనికంటే ఎక్కువ. దీన్ని చూసిన వారు పుష్కరాల పనులనూ అక్రమార్కులు వదలడం లేదని విమర్శిస్తున్నారు. వాస్తవంగా అద్దె బదులుగా ఈ సొమ్ముతో ఇక్కడ సామూహిక మరుగుదొడ్లు నిర్మించవచ్చు. గాలి వస్తే పడడం ఖాయం కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఇరుకుగా చిన్నపాటి గాలి వస్తే పడిపోయేలా ఉన్నాయి. కేవలం రేకులతో సన్నని ఇనుక కమ్మెలతో వీటిని నిర్మించారు. భారీ ఖాయంగల వ్యక్తులు ఈ మరుగుదొడ్డిలోకి వెళ్లడం కష్టమే. తాత్కాలిక మరుగుదొడ్లకు పైకప్పు లేదు. వర్షం కురిస్తే భక్తుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇలాంటి వారికి లక్షల రూపాలయ అద్దె చెల్లించడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలి. -
సివిల్ సప్లయ్ స్టేజ్–1 కాంట్రాక్టర్‌కు మంత్రి బినామీ
- ఎఫ్‌సీఐ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర - ఆందోళన చేస్తాం: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆశాఖ స్టేజ్–1 కాంట్రాక్ట్‌కు బినామీగా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల స్టేజ్–1 కాంట్రాక్ట్‌లన్నీ మంత్రి, టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి కాకుండా వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఆహారధాన్యాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ప్రతి జిల్లాలోనూ గోదాములు ఉన్నాయన్నారు. జిల్లాలో జంగాలపల్లి, తిమ్మనచెర్లలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాలలోని వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు ఎఫ్‌సీఐ గోదాముల్లో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కందుకూరులోనే దాదాపు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రామగిరి మండలంలో గనులు మూసివేసి 3 వేల కుటుంబాలు రోడ్డున పడేలా చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదేనన్నారు. ఎస్కేయూలో పని 400 మంది ఫ్రీఫుడ్ కార్మికులను తొలిగించారన్నారు. వేలాది మంది ఆరోగ్యమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి మేట్లు, ఆదర్శరైతులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించారన్నారు. ఆత్మకూరు మండలం బి. యాలేరులో చెరువు ఆక్రమణతో 400 వాల్మీకి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం రూరల్ మండలం అధ్యక్షుడు కట్టకిందపల్లి వరప్రసాద్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
యువనేత కక్కుర్తి
► వేంకటేశ్వరస్వామి వారి పనుల్లోనూ కమీషన్ డిమాండ్ ► సొమ్ము ఇవ్వలేదని నిర్మాణ పనులు నిలిపివేత ► కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌కు బెదిరింపు ► నరసరావుపేటలో పెచ్చుమీరిన టీడీపీ యువనేత ఆగడాలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా ఉంది ఆ యువనేత తీరు. దశాబ్ద కాలం తర్వాత అధికారం రావడంతో తనివి తీరా దోచుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే తన హవా సాగిస్తున్నారు. రెండేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో అన్నీ తానై నడిపిస్తున్నారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తూ అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. తాజాగా దేవుడి సొమ్ముపై కూడా ఆ నేత కన్ను పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వ్యూహాన్ని రచించాడు. కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదనే సాకుతో పనులు నిలిపివేసి తన ప్రతాపాన్ని చూపించాడు. సాక్షాత్తూ వేంకటేశ్వరుని నిధులతో చేపట్టిన పనుల్లోనూ వాటా కోరటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో యువనేత ఆగడాలకు అంతులేకుండా పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కోటప్పకొండ దిగువన దాదాపు రూ.6 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం, వేదపాఠశాలను నిర్మిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో టీడీపీ యువనేత తనదైన శైలిలో కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపించినా యువనేత వైఖరి కారణంగా ముందుకు రాలేదు. పనులు నిలిపివేత..... కొన్ని నెలల తర్వాత గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. కొద్ది రోజులకే అధికార పార్టీ యువనేత పనులను నిలిపి వేయించాడు. తన కమీషన్ ఇచ్చిన తరువాతే పనులు చేయాలని స్పష్టం చేశాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కాంట్రాక్టర్‌ను బెదిరించారు. యాత్రికుల వసతి గృహం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచే రూ.25 లక్షలు డిమాండ్ చేయగా ఆ సమయంలో రూ.5 లక్షలు కాంట్రాక్టర్ చెల్లించినట్టు తెలిసింది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెల రోజుల్లో పూర్తికావస్తుండటంతో తనకు రావాల్సిన కమీషన్ కోసం యువనేత మరోసారి బెదరింపులకు దిగాడు. పోలీసుస్టేషన్‌కు కూలీల తరలింపు... శనివారం నిర్మాణ పనుల్లో ఉన్న 9మంది కూలీలను పోలీసులు తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆదివారం మధ్నాహ్నం వరకు స్టేషన్లోనే వారిని ఉంచినట్టు సమాచారం. భోజనాలకు బయటకు పంపగా వారు పరారైనట్టు తెలిసింది. సాక్షాత్తూ త్రికోటేశ్వర స్వామి సన్నిదిలో శ్రీ వేంకటేశ్వరుని నిధులతో జరుగుతున్న పనుల్లో కూడా కమీషన్ కోసం యువనేత కక్కుర్తిపడటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కూలీలను తీసుకొచ్చిన దానిపై రూరల్ ఎస్ఐ జేసీహెచ్ వెంకటేశ్వర్లను వివరణ అడగ్గా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా వారిని స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు చెప్పడం విశేషం. -
నెల్లూరులోనూ బురిడీబాబా లీలలు
► పలువురిని మోసగించిన వైనం ► పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోన్న బాధితులు ► ఆరా తీస్తున్న పోలీసులు నెల్లూరు (క్రైమ్) : లక్ష్మీపూజల పేరిట డబ్బులు రెట్టింపు చేస్తామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెండ్‌గా మారిన బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి మోసాలు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. 2014లో జూన్ 8వ తేదీన మాగుంట లేఅవుట్లోని పావని అపార్ట్మెంట్లో ఆనందరెడ్డి ఇంట్లో రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై అప్పట్లో నెల్లూరు నాల్గోనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడి కోసం నెల్లూరు, తిరుపతి పోలీసులు విసృ్తత గాలిస్తుండగా అదే ఏడాది ఆగస్టు 22వ తేదీన అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి కరకంబాడి వద్ద బురిడీబాబాను, అతని అనుచరుడు దామోదర్‌ను అరెస్ట్ చేసి రూ.80 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపారు. అప్పటి నుంచి అతను కొంతకాలం కనుమరుగయ్యారు. తాజాగా హైదారాబాద్‌కు చెందిన లైఫ్‌స్టైల్ అధినేత మధుసూదన్‌రెడ్డిని సుమారు రూ. 1.30 కోట్లు బురిడీకొట్టించడంతో అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం శివను బెంగళూరులో అరెస్ట్ చేశారు. జిల్లాలో అనేక మోసాలు బురిడీ బాబా శివకు నెల్లూరు జిల్లాలోని పలువురుతో భారీ పరిచయాలు ఉన్నాయి. వారి ఆధారంగా సంపన్న వర్గాలకు చెందిన పలువురుని పూజల పేరిట మోసగించినట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ను పూజల పేరిట రూ. 80 లక్షల వరకు మోసగించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇటీవల పూజల పేరిట రూ. 40 గ్రాముల బంగారు, రూ. 40 వేల నగదుతో పూజారి ఉడాయించిన సంఘటనపై ఒకటో నగర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసులు బురిడీబాబా మోసాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. -
కాంట్రాక్టర్ పేరుతో డబ్బు వసూళ్లు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : సివిల్ కాంట్రాక్టర్‌గా చెప్పుకుంటూ అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అఫ్జల్‌గంజ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కిషన్ కథనం ప్రకారం.. గౌలిగూడకు చెందిన సుబ్రహ్మణ్య రాజు సివిల్ కాంట్రాక్టర్ అవతారమెత్తి అపార్ట్మెంట్లు, ఇండ్లు నిర్మించి ఇస్తానని పలువురి వద్ద అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్నాడు. కొంతమేర పనులు చేసినట్లు చూపి రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. ఎవరైనా నిలదీస్తే వారిపై కోర్టు, హెచ్ఆర్సిల్లో భార్యతో కేసులు వేయించి భయపెడుతున్నాడు. ఈ నేపధ్యంలో గౌలిగూడ బస్‌డిపో సమీపంలో ఉండే అశోక్ వద్ద ఇంటి నిర్మాణం కోసం రూ.40 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టి నిలిపివేశాడు. అలాగే మరో వ్యాపారి వద్ద ఇంటి నిర్మాణానికి రూ.27లక్షలకు మాట్లాడుకొని, రూ.9 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకోని మొదటి అంతస్తు వరకు నిర్మించి నిలిపివేశాడు. వీరు నగదు తిరిగి ఇవ్వాలని కోరగా వాయిదాలు పెడుతున్నాడు. దీంతో బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు సుబ్రహ్మణ్యరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డా కూలీల మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపైన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బోర్డు ఎండీ లోకేష్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో యంత్రాల సాయంతో డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. -
జేసీబీ దహనం: మావోయిస్టుల చర్యేనా?
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో జరిగిన వరుస ఘటనలు మావోయిస్టుల సంచారంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. సోమవారం రాత్రి మండలంలోని రామన్నపేట శివారులో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ జేసీబీని ఇక్కడ గుట్టను తవ్వేందుకు వాడుతున్నారు. ఇదే విధంగా ఇటీవల మరిమడ్ల గ్రామంలోని సెల్‌ఫోన్ టవర్‌ను కూడా కాలబెట్టారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇది మావోయిస్టుల పనిగా అనుమానిస్తున్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి.. పసి ప్రాణం బలి
రెడీమిక్స్ ప్లాంట్ కోసం తవ్విన 40 అడుగుల గోతిలో పడి మృతి కన్నవారికి కడుపుకోత విజయవాడ (పటమట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ పసివాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఏపీఐఐసీ కాలనీలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రెడీమిక్స్ తయారీ కోసం ప్లాంట్‌ను ప్రాజెక్టుకు పక్కనే ఉన్న మరో స్థలంలో ఏర్పాటు చేశారు. రెడీమిక్స్ తయారీలో వచ్చే నీటిని పంపేందుకు 40 అడుగుల మేర భారీ గొయ్యి తీశారు. దాని చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో కాలనీ వాసి ఆఫ్రిన్ ఏకైక కుమారుడు అజారుద్దీన్ (8) సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆడుకుంటూ ఆ గొయ్యిలో పడిపోయాడు. బాలుడితో ఉన్న పిల్లలు వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో గొయ్యిలో పడిన బాలుడిని వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తండ్రి సిజారుద్దీన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తల్లి ఆఫ్రిన్ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. స్థానికుల ఆందోళన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలనీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విష యం తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇదేమి న్యాయం ?
అభివృద్ధి పనుల పేరుతో పేదల భూములపై కన్ను తమదాకా వస్తే మాత్రం వ్యతిరేకం తెలుగు తమ్ముళ్ల ద్వంద్వనీతి శాంతిపురం: ‘అభివృద్ధి చేయాలంటే భూమి కావాలి.. రైతులు సహకరిం చాలి.. పరిశ్రమలు, ప్రాజెక్టులు గాలిలో కట్టలేం. భూములు ఇవ్వబోమంటే ఎలా?’ టీడీపీ నాయకుల నోట తరచూ దొర్లుతున్న మాటలివి. గతంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణ, ఇప్పు డు హంద్రీ-నీవా కాలువ సర్వేల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ మాటలను పదేపదే వల్లెవేశారు. రైతులు భూములు వదులుకుని సహకరించాలని ఎవరికి వారు బాకా ఊదారు. విమానాశ్రయం పేరుతో కడపల్లి పంచాయతీలో దాదాపు వెయ్యి కుటుంబాల భూములు లాక్కునేందుకు విఫలయుత్నం చేశారు. ఏకంగా కొంపలు కూల్చి, గ్రామాలను ఖాళీ చేయించటానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు.ఇప్పటికీ ఇక్కడి రైతుల తీరును తప్పు పడుతూనే ఉన్నా రు. విమానాలు రాకుండా చేశారనే నింద లు మోపుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇంకో పక్కన తమ భూముల్లో అరచేతి వెడల్పుతో భూమి పోతుందన్నా అరచి గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుకు అడ్డు శాంతిపురం నుంచి వెంకటేపల్లి మీదుగా కేజీఎఫ్ వెళ్లే రోడ్డులో బోయనపల్లి క్రాసు నుంచి సిద్దామారు సమీపానికి లింక్ రోడ్డు ఉంది. మట్టి రోడ్డుగా ఉన్న దీన్ని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా రూ.26 లక్షలు మంజూరు చేసింది. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఒక పైపున ట్రెంచి కొట్టి వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. కానీ మరో వైపున పనులు ప్రారంభించగానే అక్కడ భూములు ఉన్న ప్రముఖ తెలుగుదేశం నాయుకుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తవు భూముల్లో వేలు పెట్టకుండా అవతలే రోడ్డు పనులు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ భావించినా భూములు కోల్పోయిన వారిలో కొందరు ఎదురు తిరిగారు. తవు భూముల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం తవ్విన ట్రెంచ్‌లను పూడ్చివేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయూరుు. పరాయి రైతుల భూములను అభివృద్ధికి ఇవ్వాలని నీతులు చెబుతున్న బడా నాయకుడు ఇప్పుడు ఇంట్లో వాళ్లకు అవే నీతులు చెప్పాలని స్థానికు లు తలంటుతున్నారు. ఈ వ్యవహారంపై పీఆర్ ఏఈ హరినాథ్ వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పారు. హంద్రీ-నీవాకూ అడ్డే శ్యాటిలైట్ సర్వే ఆధారంగా పొలాల్లో అడ్డగోలుగా కాలువ తవ్వకాలకు రాళ్లు నాటినా, తమకు కనీస సమాచారం లేకున్నా చాలా మంది రైతులు కిమ్మనకుండా ఉన్నారు. వీరిలో సర్వం కోల్పోయే వారు, ఉన్న భూముల మధ్య నుంచి కాలువ పోతే ఇరువైపులా అడుగుల వెడల్పుతో సాగు భూమి మిగిలే వారు ఉన్నారు. కానీ తమ ప్రాంతానికి నీళ్లు రావాలన్న ఆశతో కన్నీటిని గుండెల్లో దాచుకున్నారు. అయితే సిద్దామారు వద్ద టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబం మాత్రం తమ భూముల్లో కాలువకు ససేమిరా అంటోంది. సర్వే బృందం రాళ్లు నాటకుండా అడ్డుకుంటోంది. అధికారులు, నాయకులు రెండు రోజుల పాటు చేసిన దౌత్యాలన్నీ విఫలమయ్యాయి. సోమవారం తాను వచ్చి చూస్తానని సదరు ప్రజాప్రతినిధి చెప్పటంతో ఆయన కోసం ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరూ భూములు ఇచ్చేయండని అంటున్న అధికారపార్టీ నాయకులు తమ భూముల్లో నామ మాత్రంగా పోయినా సహించలేక పోతున్నారు. ఈ తీరును సామాన్యులతో పాటు అధికార పార్టీ శ్రేణులు కూడా తప్పుబడుతున్నారు. నిత్యం సీఎం నామజపం చేస్తూ బతుకుతున్న నాయకులు ముందుగా తమ భూములు వదులుకుని మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు.