ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై : జాతీయ రహదారి పనులతో వేల కోట్లకు పడగెత్తిన తమిళనాడులోని కాంట్రాక్టరు సెయ్యాదురై, ఆయన కుమారుల ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మూడోరోజూ తనిఖీల పర్వం కొనసాగింది. ఈ మూడురోజుల్లో రూ.215 కోట్ల నగదు, బంగారం, వజ్రాలు, వీవీఐపీల పేర్లతో కూడిన డైరీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలోని ఇద్దరు మంత్రుల అండదండలతో వేల కోట్ల రూపాయల రహదారి పనులు చేపట్టిన సెయ్యాదురై, ఆయన నలుగురు కుమారులకు చెందిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 ఇళ్లు, కార్యాలయాలపై ఈనెల 16న ప్రారంభించిన ఐటీ దాడుల్లో అధికారులే బిత్తరపోయేలా నగదు, స్థిర, చరాస్తులు బయటపడ్డాయి.
రామనాథపురంలో జిల్లా కముదిలోని ఇంటి గోడలో ఒక రహస్య అరను గుర్తించి బద్దలు కొట్టగా విలువైన పత్రాలు దొరికాయి. 15 బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే బుధవారం చెన్నై మైలాపూరులోని సెయ్యాదురై కుమారుడు నాగరాజ్ సహయకుని ఇంటిలో తనిఖీలు నిర్వహించి మూటలకొద్దీ నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment