
కణేకల్లు(బెంగళూరు): తక్కువ ధరకు బంగారమిస్తామంటూ ఆశచూపి ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ముఠా రూ.5 లక్షలు కొట్టేసింది. వివరాలు.. కణేకల్లు పరిధిలోని కళేకుర్తికి చెందిన రుద్ర బాధితుడు. హొసపేటె జిల్లా హువిన హడగలికి చెందిన నాగరాజు, మరికొందరితో నకిలీ బంగారు మోసాలకు పాల్పడేవాడు. అతడు రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులో జావేద్ అనే వ్యక్తికి కేజీ బంగారం రూ.5 లక్షలకు ఇస్తానని, ఎవరైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాడు.
జావేద్ ఈ విషయాన్ని రుద్రకు చెప్పడంతో ఆయన ఆశపడి రూ.5 లక్షలు రెడీ చేసుకున్నాడు. నాగరాజు, జావేద్, మరికొందరు ముఠాసభ్యులు రుద్రతో రూ.5 లక్షలు తీసుకొని నకిలీ బంగారాన్ని అంటగట్టారు. రుద్ర ఊరికి వచ్చాక బంగారాన్ని పరీక్షింపజేయగా నకిలీదని తెలిసి కణేకల్లు పోలీసులకు ఆశ్రయించాడు
Comments
Please login to add a commentAdd a comment