
ప్రతీకాత్మక చిత్రం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో యువతి ఫొటో పెట్టి యువకులతో చాటింగ్ చేసి అనంతరం బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు దోచుకున్న దాసరహళ్లికి చెందిన రవికుమార్(24) అనే నిందితుడిని రామనగర సీఈఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కుణిగల్ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్ బెంగళూరు దాసరహళ్లిలో ఉంటూ సెకెండ్ పీయూసీ చదివి ప్రైవేటు డాటాబేస్ కంపెనీలో పనిచేసేవాడు.
యువతి ఫొటోతో ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేశాడు. రామనగరకు చెందిన రాజేశ్ అనే యువకుడు రిక్వెస్ట్ పంపాడు. అతనితో తీయగా మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అనంతరం బ్లాక్‌మెయిల్ చేసి పలు విడతలుగా రూ.41 లక్షలు వసూలు చేశాడు. ఇలా చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment