Fake profile
-
Cybercrime: ఫేస్బుక్ టు వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చేసే సైబర్ నేరగాళ్లు నానాటికీ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫేస్బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్‌లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్‌లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో.. ఫేస్బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనే క మంది తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తు న్నారు. ఎక్కువగా యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్బుక్ యూజర్‌కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది. నకిలీ ప్రొఫైల్‌తో డబ్బు డిమాండ్.. ఇలా ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్‌లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్.. సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో... వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్‌లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు. -
గొంతు మార్చి.. ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: వాయిస్ ఛేంజ్ ఫీచర్ సాంకేతికతతో అమ్మాయిల గొంతులాగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరస్తులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్, శెట్టి సతీష్‌లు ఇంటర్నెట్ నుంచి అమ్మాయిల ఫొటోలను డౌన్లోడ్ చేసి నకిలీ పేరు, ఇతరత్రా వివరాలతో మ్యాట్రిమోనీ సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నకిలీ ప్రొఫైల్స్‌ను మ్యాట్రిమోనిలో అబ్బాయిలకు పంపించేవారు. తీయని మాటలతో వాట్సాప్ చాట్లు, ఫోన్లు మాట్లాడుతుండేవారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటారు. బాధితుల కుటుంబ వివరాలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా సేకరించేవారు. తల్లిదండ్రులకు అనారోగ్యం, చదువుల ఫీజులు, వ్యాపారంలో నష్టాలు అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో రూ.13.27 లక్షలు మోసపోయిన బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులు సూర్య ప్రకాశ్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ నిందితులు రామగుండం ఎన్టీపీసీ, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాల పరిధిలోని పలువురు బాధితుల నుంచి ఇదే తరహాలో రూ.33.68 లక్షలు మోసం చేశారు. -
మ్యాట్రిమోనీలో అమ్మాయిలను మోసగించిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి, పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాణ్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పలు డేటింగ్ యాప్‌లలో సందీప్ సన్నీ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. ఆకర్షితురాలైన ఓ బాధితురాలికి గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని నమ్మించాడు. స్నేహం పేరుతో బంధాన్ని ప్రారంభించి తర్వాత ప్రేమ, పెళ్లి వరకూ తీసుకెళ్లాడు. వ్యక్తిగత, కుటుంబ కష్టాలు ఉన్నాయని కట్టుకథలు చెప్పి బాధితురాలి నుంచి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. కొట్టేసిన సొమ్మును మేజిస్టిక్ ప్రైడ్, క్యాసినో ప్రైడ్ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్‌లలో పెట్టి పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. -
పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీయల్ రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. జూదం, విలాసాలకు బానిసై డబ్బు కోసం మ్యాట్రిమోనీ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఈక్రమంలో గతేడాది ఏప్రిల్‌లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ వాట్సాప్‌లో సంభాషణలు, చాటింగ్‌లతో ఆమెకు మాయమాటలు చెబుతూ నమ్మించాడు. ఈక్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పూర్తిగా విశ్వసించి.. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామని కోరింది. దీంతో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారని, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. సహాయం చేయాలని కోరడంతో ఆమె గతేడాది ఏప్రిల్ 30న రూ.2 లక్షలు నగదు ఇచి్చంది. దీంతో ఇద్దరూ ప్రకాశ్‌నగర్‌లోని ఓ హోటల్లో కలిశారు. ఇక అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సొమ్ముతో జూదం, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ చేసేవాడు. అప్పు చేసి మరీ.. ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం రుణం, రూ.52 లక్షలు గృహరుణంతో పాటు మనీవ్యూ, పోస్ట్‌పే వంటి వ్యక్తిగత రుణ యాప్‌లలో లోన్లు తీసుకొని మొత్తం రూ.70 లక్షలు రాజేశ్‌కు ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి, అతని నుంచి రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. -
ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపి.. తియ్యగా మాట్లాడి, అప్పటి నుంచి అసలు కథ మొదలు!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్ ప్రొఫైల్‌లో యువతి ఫొటో పెట్టి యువకులతో చాటింగ్ చేసి అనంతరం బ్లాక్మెయిల్ చేసి లక్షలు దోచుకున్న దాసరహళ్లికి చెందిన రవికుమార్(24) అనే నిందితుడిని రామనగర సీఈఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కుణిగల్ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్ బెంగళూరు దాసరహళ్లిలో ఉంటూ సెకెండ్ పీయూసీ చదివి ప్రైవేటు డాటాబేస్ కంపెనీలో పనిచేసేవాడు. యువతి ఫొటోతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేశాడు. రామనగరకు చెందిన రాజేశ్ అనే యువకుడు రిక్వెస్ట్ పంపాడు. అతనితో తీయగా మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అనంతరం బ్లాక్మెయిల్ చేసి పలు విడతలుగా రూ.41 లక్షలు వసూలు చేశాడు. ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు -
మీ ఇన్‌స్టా అకౌంట్‌కి ఒకేసారి లైక్స్, వ్యూస్ పెరుగుతున్నాయా? తస్మాత్ జాగ్రత్త
నిజజీవితంలో కాకుండా డిజిటల్ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రదర్శించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి దూరమవుతూ, తాము అంతా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ‘ఫేక్ హ్యాపీనెస్’ను క్రియేట్ చేస్తుంటారు కొందరు. అది ఫేక్ అని తెలియని వాళ్లు, తాము కూడా తమ ఫేక్ హ్యాపీనెస్‌ను మరింత క్రియేటివ్‌గా పోస్ట్ చేస్తుంటారు. వ్యసనంలా మార్చే ఈ చట్రంలో రోజుకు ఎంతోమంది చేరుతున్నారు. అవగాహనా లోపం మనమంతా మన చుట్టూ ఉన్నవారితో కలిసి జీవిస్తున్నాం. ఇందులో కొందరు తమపై తమకు సరైన అవగాహన లేని కారణంగా ఎదుటివారిని అనుకరించడం, విలువలు లేని వారి ప్రవర్తనలను కాపీ చేయడం చూస్తుంటాం. అంటే, ఉదాహరణకు.. స్నేహితుల్లో ఒకరు తాగతాగడాన్ని చూస్తూ, కొన్నాళ్లకు ఆ గ్రూప్‌లో ఉన్న మిగతావారూ అదేపని చేస్తుంటారు. ఇది సమయాన్ని వృథా చేస్తుంది. మానసికంగా, శారీరకంగా చెత్తను తయారు చేస్తుంది. ఇదే సోషల్ మీడియా విషయంలోనూ జరుగుతుంది. చాలామంది ఒకేరకమైన కంటెంట్‌ను చూడటానికి అలవాటు పడుతున్నారు.అది నిజం కాదని స్పష్టంగా తెలిసినప్పటికీ. ఏదో ఆనందం కోసం చూస్తున్నాం అంటారు. అదే కంటెంట్‌ను చూస్తూ కొంతకాలానికి తామూ కూడా అదే రకమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తారు. ఒకరిని చూసి ఒకరు ఫేక్ కంటెంట్‌ను సోషల్‌మీడియాలో వదిలితే.. కొన్నాళ్లకు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ఆత్మగౌరవ సమస్య మీలో ఆత్మబలం లేకపోతే ఇతర వ్యక్తులపై ఆధారపడతారు. అప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఎప్పుడూ బాధ, భయపడుతూ ఉంటారు. నిజానికి చుట్టూ ఉన్నవాళ్లకు మన గురించి పట్టించుకునేంత తీరిక లేదు. మన సొంత అవగాహనే తప్ప ఎవరూ ఎవరికీ తీర్పులు చెప్పరు. ఆత్మగౌరవ సమస్యలు ఉన్న ఎవరైనా సోషల్‌మీడియా ద్వారా తమ జీవితం గొప్పగా, సంతోషకరంగా ఉందని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఎవరైనా ఇప్పటికీ అంతా బాగానే ఉన్నట్లు నటించడానికి సోషల్‌మీడియాను ఉపయోగించవచ్చు. వారి బంధాల గురించి, సంతోషకరంగా గడిపిన సందర్భాలను ఫొటోలతో సహా పోస్ట్ చేయవచ్చు. అవే నిజం అనుకోవడానికి లేదు. వాటికి ప్రతిగా మరికొందరు తాము సంతోషంగా ఉన్న ఎప్పటి సందర్భాన్నో ఇప్పుడు పంచుకోవచ్చు. ఇలాంటి విధానాల వల్ల ఆత్మగౌరవం, బలం పెరగవు అని గుర్తుంచుకోవాలి. ఫేక్ సర్కిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతిదీ ఏదైనా డిలీట్ చేయలేరు. దశాబ్దాలుగా ఇంటర్నెట్లో కనిపించే అవకాశం ఉంది. మీరు మీ మెసేజ్‌ను లేదా ఫొటోని డిలీట్ చేయవచ్చు. అయితే, ఇంటర్నెట్లో స్క్రీన్‌షాట్, డౌన్లోడ్ వంటి సాధనాలపై మీ కంట్రోల్ ఉండదని గుర్తించాలి. మీ ప్రొఫైల్‌ని ఆర్ట్ గ్యాలరీగా పరిగణించాలి. అంటే, మీ సొంత భావోద్వేగాలతో సహా గొప్పగా కనిపించని దేన్నీ పోస్ట్ చేయరని అర్ధం. కానీ, కాలక్రమేణా ఫేక్ హాపీనెస్ షేరింగ్ ఒక అలవాటుగా మారొచ్చు. అలాంటప్పుడు కొన్నాళ్లకు ప్రోఫైల్లోని మొత్తం కంటెంట్ ఫేక్ అవ్వచ్చు. దీనిని కొన్నాళ్లుగా చూస్తున్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు కూడా అదే అలవాటుగా మార్చుకుంటే... ఫేక్ హాపీనెస్ చట్రం క్రియేట్ అవుతుంది. గుర్తింపు కోరుకోవడం ఈ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. సోషల్ మీడియాను అదే పనిగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలలో ఇది ఒకటి. కాలక్రమేణా మిమ్మల్ని మీ ఆన్లైన్ ప్రోఫైల్తోనే జనాలు గుర్తించవచ్చు. అప్పుడు మీ ప్రోఫైల్ మీరు కావచ్చు. మన మనసుకు ఏది నిజం, ఏది అబద్ధం.. వాటి మధ్య ఉంటే తేడా అన్నీ తెలుసు. కానీ, అది ఒక్కటే సరిపోదు. సోషల్ మీడియాలో తమ సొంత ఇమేజ్‌తో గుర్తింపు పొందేందుకు ఇష్టపడే ఎవరైనా చివరికి వారి సొంత నిజ జీవితాన్ని, నిజమైన అవసరాలను విస్మరించవచ్చు. మీరు సంతోషంగా లేని సమయాల్లో గుర్తింపు పోతుందేమో అనే ఆలోచనతో ఫేక్ హ్యాపీనెస్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేయవచ్చు. మీరు సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, దానిపై ఆధారపడే వ్యాపారాన్ని చేస్తుండవచ్చు. కానీ, అన్నింటికన్నా జీవితంపై దృష్టి పెట్టడం ఇప్పుడే మొదలవ్వాలి. ఎందుకంటే జీవితం ఆన్లైన్లో కాదు ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. వ్యసనం లైక్‌లు, కొత్త ఫాలోవర్లు, నోటిఫికేషన్లను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు చేసిన పోస్ట్‌కి వచ్చిన కామెంట్స్‌కు రిప్లై కూడా ఇవ్వండి. వచ్చే నోటిఫికేషన్స్‌కి అడిక్ట్ అవకండి. మీరు చేసిన పోస్ట్‌కు కామెంట్స్, వ్యూస్, లైక్స్.. నంబరింగ్‌పై దృష్టి పెట్టకండి. సంతోషకరమైన ఫొటోలన పోస్ట్ చేయడం వల్ల వచ్చే లైక్‌లు, వ్యూస్ పెరుగుతుంటే వాటి వల్ల వచ్చేదేంటో ఊహించండి. లైక్స్ ఎన్ని ఎక్కువ వస్తే అంత బలం పొందినట్టుగా అనిపిస్తుంది. దీనివల్లే మళ్లీ మళ్లీ అదే పని చేయాలనుకుంటారు. పొంచి ఉండే స్కామర్లు మీరు ఫేక్హ్యాపీనెస్ కోసం ప్రయతిస్తుంటే మిమ్మల్ని నకిలీ ఖాతాలతో మోసం చేసేవారూ ఉండచ్చు.. మీరు చేసే పోస్ట్‌లకు ఉన్న ఫలంగా ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తే అనుమానించండి. ఎందుకంటే, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీతో పరస్పర చర్యలు జరిపి, దారితప్పించవచ్చు.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా లేదా ఆర్థిక స్కామ్‌లలో పాల్గొనేలా మోసగించవచ్చు. స్కామర్లు ఫేక్ స్పాన్సర్షిప్ అవకాశాలను అందిస్తూ, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు. పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు మొదలైన సమాచారాన్ని పంచుకునేలా మోగిసించవచ్చు. మోసగించబడుతున్నాం అని గుర్తిస్తే వెంటనే... ఈ క్రింది సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రి΄ోర్ట్ చేయండి. ♦ https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet ♦ https://www.facebook.com/help/1380418588640631 https://www.linkedin.com/help/linkedin/answer/a1344213/recognize-and-report-spam-inappropriate-and-abusive-content?lang=en https://help.instagram.com/192435014247952 ♦ https://faq.whatsapp.com/1142481766359885/?cms_platform=android పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటే.. https://www.cybercrime.gov.inË లో రిపోర్ట్ చేయండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదపు లేకుండ పోతుంది. మరోసారి కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫోటోతో ఫేక్ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్‌లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్‌తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని, ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న మెస్సేజ్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునే పనిలో సైబర్ టీం పనిచేస్తోందని తెలిపారు. -
జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్ వృత్తిపరమైన వ్యక్తులతో కనెక్ట్ అవడానికి, జాబ్సెర్చ్లకు సహాయపడుతుంది. జనాదరణ పొందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ను స్కామర్లు మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. లింక్డ్ఇన్ స్కామ్‌ల నుండి రక్షించుకోవడానికి, వాటి బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు. లింక్డ్ ఇన్ మన కెరీర్ ఫీల్డ్‌లోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే, మీరు సెర్చ్ చేసేటప్పుడు వచ్చే ప్రతి రిక్వెస్ట్‌ను అంగీకరించే ముందు, ప్రొఫైల్ లేదా వివరాలను తనిఖీ చేయడం సరైన విధానం. లింక్డ్ఇన్ తరచుగా ఆకట్టుకోవడమే కాదు నిపుణులలో ప్లాట్‌ఫారమ్ ఎంత ప్రజాదరణ పొందిందో సూచిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాట్‌ఫారమ్ స్కామర్లను కూడా ఆకర్షించింది. లింక్డ్ఇన్లో సబ్స్రైబర్లు నిపుణులుగా ఉండటం, వారి నమ్మకం ఈ స్కామ్‌కి ప్రధాన కారణమవుతోంది. నకిలీ ప్రొఫైల్ స్కామర్లు నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తారు. వారు తమ ప్రొఫైల్స్‌ను వీలైనంత చట్టబద్ధంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. వాటి ద్వారా ఈ కింది మోసాలకు పాల్పడతారు.. అడ్వాన్స్ ఫీజు మోసాలు ముందుగా స్కామర్లు ఒక చిన్న ఫీజుతో రిక్వెస్ట్ పెడతారు. దానికి బదులుగా మీరు పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారని చూపుతారు. అందుకు, సివివి నంబర్లు, ఓటీపీలతో పాటు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లను అందించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. కొన్నిసార్లు డబ్బు పొందడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. జాబ్ స్కామ్‌లు ఈ స్కామ్‌లలో సాధారణంగా రిక్రూటర్లుగా నటిస్తున్న వ్యక్తులు, యజమానులు లేదా ఉద్యోగాలను అందించే ప్లేస్మెంట్ ఏజెన్సీలు ముఖ్యంగా ఐటీ సంబంధిత కొత్త ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటారు. చాలా వరకు ఈ నకిలీ ప్రొఫైల్స్ మీకు బ్యాక్ డోర్ జాబ్‌లను అందిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేకుండా ఇంటి నుండి పనికి ఆహ్వానిస్తాయి (ఎ) ఆఫర్‌ను రిలీజ్ చేయడానికి, దరఖాస్తు ప్రక్రియ పూర్తయినందున వారు మిమ్మల్ని కొత్త మొత్తం చెల్లించమని అడుగుతారు. వారి స్కామర్లలో చాలా మంది ఉద్యోగాలను ప్రకటించే కంపెనీలలో అంతర్గత వ్యక్తిని కలిగి ఉంటారు లేదా చట్టబద్ధమైన కంపెనీల ఇ–మెయిల్లు, ఆఫీస్ ఫోన్ నంబర్లను వాడుతుంటారు. డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు ఈ స్కామర్లు మిమ్మల్ని సంప్రదించి, సన్నిహిత సంబంధంపై ఆసక్తిని వ్యక్తం చేసే మోసగాళ్ల నుండి వస్తాయి. వారు సాధారణంగా మీ ప్రొఫైల్ ఫోటోపై వ్యాఖ్యానిస్తారు. తమ రిక్వెస్ట్‌ను ఓకే చేయమని కోరుతారు. ఈ డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు చాలా వరకు సెక్స్టార్షన్ స్కామ్‌లకు దారితీయవచ్చు. ఫిషింగ్ స్కామ్‌లు ఎవరైనా ఇ–మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ లేదా వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని నకిలీగా మారుస్తారు. ఈ స్కామ్‌లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికే రూపొందించబడ్డాయని గుర్తించాలి. అవార్డులు ఇస్తున్నామని, ప్రముఖ మ్యాగజైన్ మొదటి పేజీలో ప్రచురిస్తామని, సంఘాలలో సభ్యత్వాన్ని అందిస్తామని... ఇలాంటి ఆకర్షణీయమైన మెయిల్స్ ఉంటాయి. టెక్ సపోర్ట్ ప్రీమియం లింక్డ్ ఇన్ ఉచిత ఆఫర్లను అందించే టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లుగా స్కామర్లను ఉపయోగిస్తారు. లేదా కస్టమర్ సపోర్ట్‌గా పేరున్న బ్రాండ్‌ను అనుకరిస్తారు. చాలా సందర్భాలలో చిన్న చిన్న లింక్‌లు స్కామర్ల ద్వారా పంపబడతాయి. చివరికి ఆ లింక్‌లు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడే మాల్వేర్ లేదా కీ–లాగర్కు దారితీస్తాయి. దీని నుంచి తమ పనులు చక్కబెట్టుకోవడానికి స్కామర్లకు సులువు అవుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. నకిలీ ప్రొఫైల్‌ల సంకేతాలివి మీకు తెలియని వ్యక్తి నుండి లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ వచ్చినప్పుడు, మీరు కనెక్ట్ చేయడానికి ముందు వారి ప్రొఫైల్‌ను పూర్తిగా తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. లింక్డ్ఇన్ లో స్పామ్, నకిలీ ఖాతాలను సాధారణంగా గుర్తించడం చాలా సులభం. మీరు ఈ నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లలో సాధారణమైన నమూనాలు, సంకేతాలను చూడవచ్చు. నకిలీ ప్రొఫైల్‌లకు వ్యతిరేకంగా నిజమైన ప్రొఫైల్స్‌ను అంచనా వేసేటప్పుడు ఉపయోగించే కొన్ని సంకేతాలివి.. ►వారికి ప్రొఫైల్ చిత్రం ఉండదు. లేదా సరిగా లేని ఫొటో ఉపయోగిస్తారు ►వారికి అధికారిక ఇ–మెయిల్ చిరునామా ఉండదు ►వారి ప్రొఫైల్‌లో వ్యాకరణం, స్పెల్లింగ్‌లో లోపాలు ఉంటాయి ►వారి ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం ఉండదు ►సారాంశం, నైపుణ్య విభాగాలలో నిర్దిష్టత లేని సాధారణ ప్రకటనలను ఉంటాయి ►వారి వర్క్ హిస్టరీలో చాలా వరకు ఖాళీలు ఉంటాయి ►వారు తమ ప్రొఫైల్‌లోని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వరు ►లింక్డ్ఇన్ తో పాటు ఇతర నెట్వర్కర్స్తో కనెక్ట్ అయ్యే ముందు వారి పూర్తి ప్రొఫైల్‌ను క్రాస్ చెక్ చేయండిమీరు ఏదైనా లింక్డ్ఇన్ కనెక్ట్ నుండి వ్యక్తిగతంగా మాట్లాడే ►ముందు పూర్తి ఇ–మెయిల్ హెడర్లను చెక్ చేయండి. ►ఇ–మెయిల్ మోసపూరితంగా లేదని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడండి. గోప్యత భద్రతా చిట్కాలు ప్రతి నెలా మీ లింక్డ్ఇన్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. ∙మీ ప్రొఫైల్‌లో సంప్రదింపు సమాచారాన్ని పరిమితం చేయండి. మీ ప్రొఫైల్ సారాంశంలో మీ ఇ–మెయిల్ చిరునామా, ఇంటి చిరునామా లేదా ఫోన్ నంబర్‌ను ఉంచడం మానుకోండి. ►ప్రైవేట్, సెమీప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ ప్రొఫైల్స్: https://www.linkedin.com/help/linkedin/answer/a567226/browsing-profiles-in-private-and-semi-private-mode?%20lang=en ►దిగువ ఇచ్చిన యుఆర్ఎల్ను ఉపయోగించి ప్రొఫైల్‌లో మీ గోప్యతా సెటింగ్‌లను సరిగ్గా పరిశీలించి, సెటప్ చేయండి. https://www.linkedin.com/mypreferences/d/categories/account ►మీ ఖాతా కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి దాని ప్రామాణికతను ధృవీకరించకుండా చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు, మీరు https://-www.isitphishing.org ఉపయోగించవచ్చు. ►దిగువ యుఆర్‌ఎల్‌లో సరైన (కంటెంట్, మెసేజ్‌లు, ప్రొఫైల్స్, గ్రూప్స్) తెలియజేయడం అలవాటు చేసుకోండి. https://www.linkedin.com/help/linkedin/answer/14z6 సైబర్క్రైమ్కిరిపోర్ట్ చేయచ్చు ►లింక్డ్ ఇన్‌లో స్కామ్‌ను తెలియజేయండి. https://www.linkedin.com/help/linkedin/ask/TS-RPS l https://cybercrime.gov.in/లో ఫిర్యాదును రిజిస్టర్ చేయచ్చు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లను సంప్రదించవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మెగా ఫ్యాన్స్‌కు షాక్, అది ఫేక్ అట!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదేల పేరుతో ట్విటర్ ఖాతా దర్శనమిచ్చింది. అంతేకాదు తన తొలిపోస్ట్ తనయుడి గురించే షేర్ చేయడంలో మెగా ఫ్యాన్స్ సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో వరసగా మెగా ప్యాన్స్, నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్ ఈ క్రమంలో కొద్ది గంట్లోనే ఈ ఫ్రొఫైల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 వేలు దాటింది. ఇదిలా ఉంటే. ఇప్పుడు వారందరికి షాకిస్తూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చూస్తుంటే ఇది తన నిజమైన ఖాతా కాదని తెలింది. ఎందుకంటే ఈ ఫ్రొఫైల్‌ను మెగా కుటుంబంలోని ఏ ఒక్కరూ ఫాలో కావడం లేదు. అంతేకాదు సురేఖ కొణిదెల ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టెక్ కూడా ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఇది మెగా ఫ్యాన్ పని అని, ఎవరో సురేఖ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తల్లికొడుకుల ఫొటోను షేర్ చేసిన అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ‘నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది’అంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేయండంతో ఇది నిజమైన అకౌంట్ అనుకుని అంతా భ్రమపడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి పేరుతో కూడా ఫేక్ అకౌంట్ దర్శమించిన సంగతి తెలిసిందే. Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP — Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022 -
మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి..
సాక్షి, నిర్మల్: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ ప్రవీణ్(పేరు మార్చాం) అనే యువకుడి మెసెంజర్లో ఒక మెసెజ్ వచ్చింది. పేరు కొత్తగా ఉండటంతో పాటు అందమైన అమ్మా యి ఫొటో డీపీగా ఉండటంతో మెసెంజర్ ఓపెన్‌చేసి, తాను కూడా చాట్ చేయడం మొదలు పెట్టాడు. కాసే పటికే ఎదుటి యువతి ఫోన్ నంబర్ చెప్పు, వీడియో కాల్ చేస్తాను అనటంతోనే.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రవీణ్ వెంటనే తన నంబర్‌ను పంపించాడు. సెకన్ల వ్యవధిలోనే గుర్తుతెలియని ఓ కొత్త నంబర్ నుంచి ఆయనకు వాట్సప్ ద్వారా వీడియోకాల్ వచ్చింది. లిఫ్ట్ చేసేసరికి.. నిజంగానే ఓ అందమైన యువతి లైన్లోకి వచ్చింది. ‘హాయ్..’ అంటూ స్వీట్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతడూ వచ్చీరాని ఇంగ్లిష్తో మాట్లాడాడు. కాసేపటికే ఆమె అసభ్యకరంగా మాట్లాడటం, దుస్తులు తొలగించడం చేసింది. తనను కూడా అలాగే చేయాలని చెప్పడంతో.. వెనుకాముందు ఆలోచించకుండా తీసేశాడు. కాసేపటికే.. వీడియోకాల్ కట్ అయ్యింది. అంతే.. ప్రవీణ్ దుస్తులు సర్దుకునేంత లోపే వాట్సప్‌లో ఒక వీడియోతోపాటు ఒకదాని వెంట ఒకటి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చూడటంతోనే ప్రవీ ణ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అప్పటి దాకా వారు మాట్లాడుకున్న వీడియోకాల్ మొత్తం రికార్డు చేసి, తనకు పంపించారు. ‘దుస్తులు లేకుండా మనం ఇద్దరం మాట్లాడుకున్న వీడియో మొత్తం రికార్డు అయ్యింది. నువ్వు వెంటనే మా గూగుల్‌పే నంబర్‌కు రూ.50 వేలు పంపించు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులందరికీ పంపిస్తాను. సోషల్ మీడియాలలో పోస్టు చేస్తాను. వెంటనే డబ్బు పంపించు.. లేదంటే.. అంతే సంగతి..’అంటూ వరుసగా మెసెజ్‌లు వచ్చాయి. దీంతో ప్రవీణ్ ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో.. తెలియక కంగారుతో జ్వరం తెచ్చుకున్నాడు. చివరికి దగ్గరి మిత్రుడి సలహాతో వారి ఫోన్లు లిఫ్డ్ చేయడం, మెసేజ్‌లు చూడటం చేయడం లేదు. రెండు రోజులైనా ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోవడం లేదు. ఒక్క ప్రవీణ్‌కే కాదు.. జిల్లాలో చాలామంది ‘హనీట్రాప్’కు గురవుతున్నారు. ఇలాంటి పలు రకాల సైబర్ ఉచ్చులతో పలు ముఠాలు వివిధ వయసుల వారిని టార్గెట్ చేస్తున్నాయి. మాటలతో మాయచేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! మాట కలిపి..మాయ చేస్తూ ‘హనీట్రాప్’.. ఇటీవల ఈ ఉచ్చు బిగించేవారి సంఖ్య పెరుగుతోంది. అందమైన యువతులను ముందు ఉంచి కొన్ని సైబర్ దోపిడీ ముఠాలు ఉచ్చులు పన్నుతున్నాయి. సదరు యువతులు ముందు స్వీట్‌గా పలకరిస్తూ.. మాటల్లోకి దించుతున్నారు. తమ దుస్తులను తొలగిస్తూ.. మెల్లగా ఉచ్చులోకి దించి, ఎదుటి వ్యక్తిని కూడా అసభ్యకరంగా తయారయ్యే దాకా వేచి చూస్తున్నారు. ఇదంతా స్పైవేర్‌తో రికార్డు చేసి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. సదరు అమ్మాయిని ముందుండి కథ నడించిన ముఠా రంగంలోకి దిగి, డబ్బులు డిమాండ్ చేస్తోంది. లేదంటే నీ వీడియో మొత్తం యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా అందరికీ పంపిస్తామంటూ బెదిరిస్తోంది. చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ యువతే లక్ష్యంగా... ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ముఠాలు సైబర్‌నేరాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే.. బాధితులంతా 25 నుంచి 28ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇందులో పెళ్లికాని వాళ్లు, పెళ్లికి దగ్గరి వయసులో ఉన్నవారినే సదరు ముఠాలు టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి వారైతేనే.. పెళ్లి కావాల్సిన వయసులో ఇలాంటి వీడియోలు బయటకు వస్తే తన పరువు పోవడంతోపాటు పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతో ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది పెళ్లయిన వారు కూడా ఎక్కడ తమ బండారం భార్య కు తెలుస్తుందోనన్న భయంతో సదరు ముఠాలకు ఎంత అడిగితే అంత ముట్టజెప్పిన ఘటనలూ ఉన్నాయి. సోషల్‌మీడియా ద్వారా.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న చాలా ముఠాలు సోషల్ మీడియా నుంచే తమ టార్గెట్లను ఎంచుకుంటున్నాయి. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలలో పూర్తి ప్రొఫైల్‌ను పెట్టడం, ఫ్రెండ్స్ గురించి ఉండటంతో సదరు వ్యక్తి ఎలాంటివాడు, ఆయన వెనుకాముందు ఏముందనేది మొత్తం తెలిసిపోతోంది. వారిలో తమ పనికి సులువుగా దొరికి పోయేవాడు, డబ్బులు పంపించేవాడిని ఎంచుకుంటున్నారు. ముందు మెసెజ్‌లతో బెదిరిస్తున్నారు. లేనిపక్షంలో నేరుగా కాల్ చేసి భయపెట్టిస్తున్నారు. పోలీసులకు ఫోన్‌చేసినా, స్టేషన్‌కు వెళ్లినా వెంటనే మీవాళ్లకు ఈ వీడియోలు షేర్ చేస్తామని హెచ్చరిస్తుండటంతో చాలామంది గుట్టుగా ఎంతోకొంత డబ్బులు ముట్ట జెప్పుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇలాంటి ముఠాలు ఒకసారి డబ్బు తీసుకోవడంతోనే వదిలిపెట్టవని, తరచూ అడుగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఏది జరిగినా వెంటనే స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డాడు.. రిజక్ట్ చేయడంతో కాల్ గర్ల్ అని..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కేవీ విజయ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుకోవెల అక్షిత్ కౌండిన్య విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ప్రొఫైల్‌ను చూశాడు. ఆమె ఫొటో చూసి ప్రేమను పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తరచు మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఆమె కౌండిన్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను బ్లాక్ చేసింది. దీనిని తట్టుకోలేకపోయిన నిందితుడు ఆమెపై పగ పెంచుకున్న అతను ఆమె ప్రొఫైల్ ఫొటోతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచాడు. దీని ద్వారా పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించాడు. ఆమె కాల్ గర్ల్ అని, రకరకాల అసభ్యకర కామెంట్లు పెట్టేవాడు. దీనిని గుర్తించిన బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌కు రిపోర్ట్ చేసి తన పేరుతో ఉన్న నకిలీ ఐడీని బ్లాక్ చేయించింది. దీంతో నిందితుడు మరోసారి ఆమె ఫొటోను వినియోగించి రెండు నకిలీ ఖాతాలను సృష్టించాడు. మరోమారు అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేశాడు. చదవండి: న్యూఇయర్ టార్గెట్: గ్రాము ‘కొకైన్’ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఈసారి బాధితురాలు, ఆమె తల్లి ఫోన్ నంబర్లను సంపాదించాడు. వర్చువల్ నంబర్లతో వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలను పంపించాడు. తనకు వీడియో కాల్స్ చేయాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు గురువారం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు.. -
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా; విలువైన కానుకలు పంపిస్తున్నా
బనశంకరి: నిత్యజీవితంలో డిజిటల్ సాంకేతికత పాత్ర పెరిగేకొద్దీ సైబర్ మోసగాళ్ల పని సులువవుతోంది. అమాయకులను ఎంచుకుని లక్షలాది రూపాయలు దోచుకోవడం సిలికాన్ సిటీలో పరిపాటైంది. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నర్సుకు రూ.2 లక్షల నష్టం మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఆగంతకుడు, యువతికి రూ.2.07 లక్షలు టోపీ వేశాడు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్లు యువతి బెంగాలీ షాదీ డాట్‌కామ్‌లో ఖాతా తెరిచింది. ఓ వ్యక్తి పరిచయమై విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, మీకు ఢిల్లీకి ఖరీదైన కానుకలు పంపించానని చెప్పాడు. కస్టమ్స్ ఫీజుల కింద ఆమె నుంచి రూ.2.07 లక్షలు ఆన్లైన్లో లాగేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలు దక్షిణ విభాగ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేవైసీ అని రూ.27 లక్షలు స్వాహా ఓ వృద్దుడు సిమ్‌కార్డు కేవైసీ అనివచ్చిన కాల్‌ను నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడు. బాణసవాడిలోని 80 ఏళ్ల రిటైర్డు ఉద్యోగికి ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ మొబైల్ సిమ్‌కార్డు కేవైసీ చేసుకోవాలని, లేకపోతే బ్లాక్ అవుతుందని తెలిపాడు. నిజమేననుకున్న వృద్ధుడు అతడు అడిగిన డెబిట్‌కార్డు సమాచారం ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో నుంచి రూ.27 లక్షల నగదు కాజేశాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణం పేరుతో రూ.5.17 లక్షలు ఓ వ్యాపారికి ఫోన్ చేసిన మోసగాడు ముద్రా రుణ విభాగం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. అతన్ని నమ్మిన వ్యాపారిని రుణ మంజూరు పేరుతో దశలవారీగా రూ.5.17 లక్షలు తమ అకౌంట్లు జమచేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నగదు రెట్టింపు అని రూ.7.30 లక్షలు కంపెనీలో పెట్టుబడి పెడితే నిర్ణీత అవధిలోగా రెట్టింపు ఇస్తామని ఆశచూపించిన వంచకులు రూ.7.30 లక్షలు కైంకర్యం చేశారు. దేవనహళ్లి కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి అల్టా ఎంపైర్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధినని ఫోన్ వచ్చింది. తమ కంపెనీలు పెట్టుబడి పెడితే త్వరలోనే రెట్టింపు చేసి ఇస్తామని తెలిపారు. నిజమేననుకుని అతడు రూ.1.80 లక్షలు, స్నేహితుల ద్వారా రూ.5.40 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. తరువాత ఫోన్ కంపెనీ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు. -
నయవంచకుడు; రాజకుటుంబం పేరుతో యువతులకు వల
బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో మైసూరు రాజకుటుంబం బంధువునని ప్రొఫైల్స్ పెట్టుకుని యువతులను పెళ్లి పేరుతో నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేసిన సిద్ధార్థ్ అనే వంచకున్ని వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు స్మార్ట్ ఫోన్లు, పలు బ్యాంకుల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దేవరాజ్ తెలిపారు. తన పేరు సిద్ధార్థ్ అరస్ అని, అమెరికాలో ఐటీ ఇంజనీరునని ప్రొఫైళ్లు పెట్టుకున్నాడు. ఆంగ్లం, స్పానిష్ మాట్లాడుతూ యువతులను బుట్టలో వేసుకుని ఏదో కారణంతో వారి నుంచి భారీగా డబ్బు గుంజడం ఇతని నైజం. పలువురు ఫిర్యాదు చేయడంతో మైసూరు జిల్లాలో అరెస్టు చేశారు. -
టెకీకి నరకం చూపిన ‘వరుడు’: మెసేజుల్లో మాత్రమే మర్యాద!
‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి. ‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య. ‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి. ‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది. ‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య. ∙∙ సంధ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్ సైట్లో పెట్టారు పేరెంట్స్. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్ పాస్‌పోర్ట్ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్ సైట్ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య. ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ∙∙ నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య. ‘డియర్.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్ కాల్. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్ ఓన్లీ సైట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు. డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలివిగా ఎదుర్కోవాలి... దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్. కానీ, ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్ కాల్ అయితే రికార్డ్ కాదని అతని ప్లాన్. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్ వాట్సప్ కాల్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మరో ఫోన్లో అది రికార్డ్ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్ పడింది. కేసు ఫైల్ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ధైర్యంగా ఉండాలి మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్ అయినప్పుడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, మూవ్ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఇంజనీర్ నీచ బుద్ధి.. 12 మంది యువతులను..
ముంబై: బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక మెకానికల్ ఇంజనీర్ తప్పుబాటను ఎంచుకున్నాడు. పెళ్లి పేరుతో మాట్రియోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అలా 12 మంది యువతులను వేధించిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముంబైలోని మలాద్ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. మొదట వారితో చనువుగా ఉంటూ వారి ఫోన్ నెంబర్లను సంపాదించేవాడు. అనంతరం లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఇదే విషయమై డీసీపీ సురేష్ మెన్ గేడ్ మాట్లాడుతూ.. ప్రతీసారి నేరానికి పాల్పడే ముందు కొత్త మొబైల్ నంబరును ఉపయోగించేవాడు. ప్రతీసారి తన సిమ్‌ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్‌లను బుక్ చేసేవాడు. పైగా అతను ఉపయోగించే సిమ్లన్ని తన పేరిట ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. కానీ మహేష్ దానిని తప్పడు మార్గంలో ఉపయోగిస్తున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు మహేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ తెలిపారు. చదవండి: ఆన్లైన్ పోర్న్ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు -
ఆ నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నాడు
డైలాగులు లేకుండా స్లాప్స్టిక్ కామెడీ(ఫిజికల్ మూమెంట్స్), తన మైమ్ యాక్టింగ్‌తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు నటుడు రోవాన్ ఎట్కిన్సన్. తన మెస్మమరైజింగ్ యాక్టింగ్‌తో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌ను ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా తీర్చిదిద్దడంతో పాటు నవ్వుల రారాజు ట్యాగ్ లైన్ దక్కించుకున్నాడు. అలాంటి రోవాన్ చనిపోయాడంటూ ఓ వార్త ఫేస్బుక్లో.. అది కూడా మిస్టర్ బీన్ ఫేస్బుక్ పేజీ నుంచే విపరీతంగా షేర్ అయ్యింది. బ్రిటిష్ యాక్టర్ రోవాన్ ఎట్కిన్సన్ అలియాస్ మిస్టర్ బీన్ చనిపోయాడంటూ మే 29న వార్త ఫేస్బుక్లో స్ప్రెడ్ అయ్యింది. అది మిస్టర్‌బీన్ ఫేస్బుక్ పేజీ కావడంతో ఆ వార్తను వేల మంది షేర్ చేస్తారు. తీరా ఆరా తీస్తే తేలింది ఏంటంటే.. అది బోగస్ పేజీ అని. చాలాకాలం నుంచి రన్ అవుతుండడంతో ఆ పేజీని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ వార్త, ఆ పేజీ ఫేక్ అని తెలియగానే ఆ పోస్ట్‌పై కొందరు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పేజీ నిర్వాహకులు ఆ పోస్ట్‌ను పేజీ నుంచి డిలీట్ చేశారు. కాగా, నైంటీస్‌లో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు ఎట్కిన్సన్. పోగో ఛానెల్ ద్వారా మిస్టర్ బీన్ మన టీవీ ఆడియొన్స్‌కు రీచ్ అయ్యింది కూడా. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు ఆయన చావుపై ఫేక్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. కాగా, రోవాన్ ఎట్కిన్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇద్దరూ క్లాస్మేట్స్ కూడా. మరిన్ని హాలీవుడ్ వార్తల కోసం క్లిక్ చేయండి -
ఫేస్బుక్: సెర్చ్ చేసి అనువైనవి గుర్తించి..
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ వినియోగదారుల ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరిచి, స్నేహితుల జాబితాలోని వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, డబ్బు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరి బారిన పడకుండా ప్రొఫైల్స్ లాక్ చేసుకుంటే... వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి బుట్టలో పడేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగాయని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ “సాక్షి’కి తెలిపారు. ఖాతాల వివరాలు సెర్చ్ చేసి అనువైనవి గుర్తించి.. ఈ తరహా నేరాలు చేస్తున్న నేరగాళ్లు ప్రాథమికంగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశిస్తున్నారు. వీలైనన్ని ఖాతాల వివరాలు సెర్చ్ చేసి అనువైనవి గుర్తిస్తున్నారు. ఆయా ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆపై ఆ ప్రొఫైల్ నేమ్‌లు, డౌన్లోడ్ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుంచి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికే మళ్లీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూసిన ఎదుటి వ్యక్తులు తమ పరిచయస్తులే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్లు చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు అసలు కథ ప్రారంభిస్తున్నారు. తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్‌కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్‌లోని బదిలీ చేయించుకుంటున్నారు. ఈ సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరగడంతో అనేక మంది తమ ప్రొఫైల్స్‌ను లాక్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడంతో సైబర్ క్రిమినల్స్ వారి ఫొటోలు, పేర్లు కాపీ చేస్తున్నా... ఫ్రెండ్స్ లిస్టు చూడలేకపోవడంతో కొత్త రిక్వెస్ట్‌లు, చాటింగ్స్, డబ్బు డిమాండ్ సాధ్యం కావట్లేదు. దీంతో నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తూ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన యువతుల ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటి ద్వారా టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. వారు యాక్సెప్ట్ చేస్తే ‘స్నేహితులుగా’ మారిపోతున్నారు. ఆపై వీరికి వాళ్ల ఫ్రెండ్స్ లిస్టులు కూడా చూడటం సాధ్యమవుతోంది. ఆపై పాత కథే మొదలెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరగాళ్ల వద్ద బాధితులుగా మారకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్స్ లాక్ చేసుకోవడంతో పాటు అపరిచిత ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు అంగీకరించ వద్దని సూచిస్తున్నారు. చదవండి: ధాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు -
అమ్మాయిగా ఫేక్ ప్రోఫైల్: సుమంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రోఫైల్‌తో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్ క్రియోట్ చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు: అతడు ఆమెగా..) ఇలా అమ్మాయి మాదిరిగా వాళ్లతో చాటింగ్ చేయడంతో అవతల వాళ్లు కూడా అమ్మాయి అనుకొని క్లోజ్‌గా మాట్లాడేవారన్నారు. ఈ క్రమంలో వారంతా తమ బలహినతలను నిందితుడితో చెప్పుకోవడం చేశారని, అది ఆయుధం చేసుకున్న నిందితుడు వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేవాడన్నారు. అమ్మాయిల అశ్లీల ఫొటోలను నెట్‌నుంచి డౌన్లోడ్ చేసి అవి వారికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ నిందితుడు సుమంత్ కామావాంఛలు తీర్చుకునేవాడని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ఇలాంటి వారిని గుర్తించడం కష్టం అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్ చేయకూడదని, చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని ఏసీపీ హెచ్చారించారు. -
మాదాపూర్ రూమ్‌కు రమ్మనేవాడు..
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతిగా ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఓ యువకుడు పలువురు యువతులతో ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఈ ముసుగులో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. అదును చూసుకుని బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించాడు. దాదాపు 70 మందిని బాధితులుగా మార్చిన ఈ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన సుమంత్ మాదాపూర్‌లో ఉంటూ అమేజాన్‌లో కస్టమర్ కేర్ విభాగంలో పని చేస్తున్నాడు. గత ఏడాది కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్డౌన్ నుంచి దారి తప్పాడు. యువతి మాదిరిగా ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీనికి డిస్ప్లే పిక్చర్‌గా (డీపీ) ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటో పెట్టాడు. దీనిని వినియోగించి అనేక మంది మహిళలు, యువతులను ఆన్లైన్ ఫ్రెండ్స్‌గా మార్చుకున్నాడు. వారితో కొన్నాళ్ల పాటు యువతి మాదిరిగానే చాటింగ్ చేశాడు. ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని గుర్తించిన తర్వాత అసలు కథ మొదలు పెట్టేవాడు. ఓ దశలో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకుంటూ వారితో సెక్స్ చాటింగ్స్ చేసేవాడు. ఇలా కొన్ని రోజుల అనంతరం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఏదో ఒక అమ్మాయి అర్ధ నగ్న ఫోటోలు, నగ్న ఫొటోలను అవతలి వారికి పంపి తనవేనని నమ్మించేవాడు. ఆపై వారినీ అలాంటివే పంపమంటూ ఒత్తిడి చేసేవాడు. సుమంత్ వల్లో పడిన అనేక మంది తమ ఫొటోలను కూడా పంపించారు. ఆ ఫొటోలు తన దగ్గరకు వచ్చిందే తడవుగా బ్లాక్‌మెయిలింగ్ మొదలెడతాడు. తాను యువకుడిననే విషయం వారితో చెప్పే సుమంత్ ఫొటోలు బయటపెడతానంటూ భయపెట్టేవాడు. తనకు మాదాపూర్‌లో రూమ్ ఉందని, అక్కడికి వచ్చి కలవాలంటూ చెప్పేవాడు. ఇప్పటి వరకు చాటింగ్స్‌లో చర్చించిన అంశాలను ప్రాక్టికల్‌గా చేయడానికి సహకరించాలని బెదిరించేవాడు. ఇలా దాదాపు 70 మంది బాధితురాళ్ల ఫొటోలు, స్క్రీన్ షాట్స్‌ను తమ ఫోన్లో సేవ్ చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన ఓ బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై మహిపాల్ సాంకేతికంగా దర్యాప్తు చేశారు. నిందితుడు సుమంత్‌ను గుర్తించిన అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు నేరం అంగీకరించడంతో పాటు ఫోన్లో ఆధారాలు లభించడంతో అరెస్టు చేశారు. -
ఓఎల్ఎక్స్ టు ఫేస్బుక్!
సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజలతో పాటు ఏకంగా పోలీసు అధికారులకు చెందిన ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను కాపీ చేసి, నకిలీవి సృష్టించి డబ్బు డిమాండ్ చేస్తున్న ముఠాలు రాజస్థాన్‌కు చెందినవిగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వివిధ ఈ–వాలెట్స్ ద్వారా డబ్బు పంపాలంటూ ఆయా నేరగాళ్లు ఫేస్బుక్ చాటింగ్‌లో ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్లను విశ్లేషించడంతో పాటు వాటి లొకేషన్స్‌ను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం తేల్చారు. ఒకప్పుడు ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ వాహనాలు, వస్తువుల విక్రయం/ఖరీదు పేరుతో నేరాలకు పాల్పడిన వారే ఇప్పుడు ఈ ఫేస్బుక్ క్రైమ్‌కు తెగబడుతున్నట్లు నిర్ధారించారు. వీరి ఆచూకీ గుర్తించినా పట్టుకోవడం దుర్లభం అని పోలీసులు చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్ యాప్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్‌పై ప్రజల్లో కొంత మేర అవగాహన రావడంతో రాజస్థాన్ గ్యాంగ్స్ ఈ కొత్త నేరానికి తెరలేపినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్పూర్, ఉన్నవ్ అడ్డాలు. అక్కడ ఉండే యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తుంటారు. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల కేసులు ఉంటున్నాయి. అయితే ఎవరైనా భరత్పూర్ వెళ్లి వారికి పట్టుకోవాలని భావిస్తే మాత్రం తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నది. గ్రామం అంతా కలిసి విచక్షణారహితంగా పోలీసులపై దాడులకు పాల్పడుతుంటారు. ఈ నకిలీ ఫేస్బుక్ ఫ్రాడ్ రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పోలీసుల అధికారుల పేరుతోనూ వీటిని ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అనేక మంది అధికారులు తమ ఫేల్బుక్ వాల్స్‌లో తనకు ఈ ఒక్క ఖాతానే ఉందని, తన ప్రొఫైల్‌తో ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే నమ్మవద్దని కోరుతున్నారు. మరికొందరు అధికారులైతే ఏకంగా తన ఫేస్బుక్ ఖాతాలనే క్లోజ్ చేసుకుంటున్నారు. ఈ నేరగాళ్ల విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. వ్యక్తిగతంగా లేదా ఫోన్లో సంప్రదించనిదే ఎవరూ ఆర్థిక లావాదేవీలు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. ఈఎంఐల వాయిదా అంటూ టోకరా... కరోన విజృంభణ, లాక్డౌన్ ప్రభావాలతో వివిధ రుణాలకు సంబంధించిన ఈఎంఐలపై గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు నెలల మారిటోరియం విధించింది. ఈ మారిటోరియం సమయంలో వడ్డీ తదితర అంశాలపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మారిటోరియంను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికీ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఈఎంఐల మారిపోరియం పొడిగింపు పేరుతో ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులుగా ఫోన్లు చేస్తున్నారు. బాధితుల నుంచి బ్యాంకు ఖాతాలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు, ఓటీపీలు తెలుసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నగర కొత్వాల్ అంజనీకుమార్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. -
ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఓపక్క పోలీసు అధికారుల్ని, మరోపక్క సాధారణ ప్రజల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. అప్పటికే ఫేస్బుక్ ఖాతాలు ఉన్న వారి ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, చాటింగ్ చేసి, డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా బాధితులుగా మారిన ముగ్గురు సామాన్య ప్రజలు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా నేరాలు చేయడానికి తెగబడుతున్న సైబర్ నేరగాళ్ళు ప్రాథమికంగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశిస్తున్నారు. వీలున్నన్ని ఖాతాల వివరాలు సెర్చ్ చేసి ప్రైవసీ సెట్టింగ్స్ లేని వాటిని గుర్తిస్తున్నారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆపై ఆ వారి ప్రొఫైల్ నేమ్‌లు, డౌన్లోడ్ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృషిష్టిస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుంచి ఆయా అసలు ఖాతాదారుల ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికే మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూస్తున్న ఎదుటి వ్యక్తులు ఆయా తమ ఫ్రెండ్సే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మొదటి ఘట్టం పూర్తయిన తర్వాత ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్ళు ‘కొత్త ఫ్రెండ్స్’తో చాటింగ్ చేస్తున్నారు. ఆపై తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్‌కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్‌లోని బదిలీ చేయాలంటున్నారు. అయితే అనేక మంది ‘స్నేహితులు’ మాత్రం నకిలీ ఖాతా నుంచి డబ్బు ప్రస్తావన వచ్చిన వెంటనే అసలు వ్యక్తుల్ని సంప్రదించి అప్రమత్తం చేస్తున్నారు. ఇలా బుధవారం ముగ్గురు నగవాసులకు తమ పేరులో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు ఉన్నట్లు, వాటి ద్వారా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వీళ్ళు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మరోపక్క పోలీసు విభాగంలో పని చేస్తున్న అనేకమంది అధికారులు, సిబ్బంది పేర్లతో నకిలీ ఖాతాల సృష్టి ఆగలేదు. ఓ పక్క బాధ్యుల్ని పట్టుకోవడానికి ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. మరోపక్క ఆయా అధికారులు, పోలీసు విభాగాలు ఈ క్రైమ్‌పై అవగాహన కల్పించడానికి సోషల్‌మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
ఫేక్ అకౌంట్లతో విద్యార్థినుల నగ్న చిత్రాలు..
గుంటూరు ఈస్ట్: సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనుకకు పంపించారు. ఫేక్ వాట్సప్ , ఫేక్ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి తనతో చదువుకున్న పూర్వ విద్యార్థులను, పరిచయం ఉన్న యువతుల నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో వివరాలు వెల్లడించారు. నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలోని కొచ్చిలో యానిమేషన్ మల్టీ మీడియాలో బీఎస్సీ పూర్తి చేశాడు. గుంటూరులో కొంతకాలం సొంతంగా ఐటీ కంపెనీ నిర్వహించాడు. లాక్డౌన్ సమయంలో తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. రెండు నెలల క్రితం మొబైల్ ఫోన్ ద్వారా numero Sim యాప్ ద్వారా ఒక నెల వ్యాలిడిటీ గల ఫేక్ వర్చువల్ నంబర్లు తీసుకుని వాటితో ఫేక్ వాట్సప్ సృష్టించాడు. PIC AQTయాప్ ద్వారా తనతో పాటు 9వ తరగతి వరకు చదువుకున్న యువతుల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్ చేసి పంపాడు. తిరిగి ఆ యువతుల అసలైన నగ్నఫొటోలను తనకు పంపాలని..లేకపోతే తన వద్ద ఉన్న నగ్నఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, మిత్రులకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. కొంతమంది ఆ ఫేక్ నంబర్‌ను దైర్యం చేసి బ్లాక్ చేయగా ఓ యువతి భయపడి అతను చెప్పినట్లు చేసింది. దీంతో మరింత బరితెగించిన రఘుబాబు numero Sim యాప్ ద్వారా మరొక ఫేక్ నంబర్ తీసుకుని దానితో ఫేక్ వాట్సప్, ఫేక్ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించాడు. చిన్ననాటి సహ విద్యార్థినీల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. మొదటి యువతులను బ్లాక్ మెయిల్ చేసిన విధంగానే వీరిని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో గుంటూరు నగరంపాలెం పరిధిలో నివశించే యువతి ధైర్యం చేసి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు యువతి తనకు లొంగిపోయిందనే ధైర్యంతో తన మొబైల్ ఫోన్ ద్వారా 10MINUTEMAIL.COM అనే వైబ్‌సైట్ ద్వారా రెండు డిస్పోజబుల్ మెయిల్స్ తీసుకుని వాటి ద్వారా రెండు ఫేక్ ఇన్‌స్ట్రాగామ్‌లను సృష్టించి యథాతదంగా ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. మొత్తం 10 మంది విద్యార్థినీలను ఇలా బెదిరించినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్ అకౌంట్లను ఛేదించారు. నిందితుడి ఫోన్ నంబర్, అడ్రస్ గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో బాపట్ల డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేపల్లె రూరల్ సీఐ జి.శ్రీనివాసరావు, నగరం ఎస్ఐ ఎం.వాసు, సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
డేటింగ్ యాప్.. బాప్రే బాప్
‘కొత్తగా స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే అందుకోసం ఏవేవో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు.. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి.. మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంతే మీ ఆలోచనలకు సరితూగే వేలాది మంది మీ కోసం ఎదురుచూస్తున్నారు.. వెంటనే వారితో ముచ్చటించండి.. స్నేహితులుగా మారండి..’ ఇవీ డేటింగ్ సైట్లు చెబుతున్న మాటలు.. ఇటీవల ఢిల్లీలో 52 ఏళ్ల మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిసి స్నేహితులుగా మారారు. ఓ రోజు నేరుగా కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ కలుస్తుండేవారు.. కానీ ఓ రోజు ఆ మహిళ తన అపార్ట్మెంటులో హత్యకు గురైంది. తీరా చూస్తే ఆ ‘స్నేహితుడే’ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండకపోతే జరుగుతున్న పరిణామాలకు ఇదో చిన్న ఉదాహరణ. దేశంలో ఇప్పుడు డేటింగ్ యాప్‌లు, సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లు ఉండటంతో వెంటనే ముందూ వెనుక చూడకుండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వీటిని వాడుతున్నారు. కొందరేమో నిజంగానే స్నేహితుల కోసం ఈ యాప్‌లను వాడుతుండగా.. మరికొందరేమో మోసం చేయాలనే దురుద్దేశంతోనే వీటిని వాడుకుంటున్నారు. అయితే వీరి వలలో పడి మోసపోయిన వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు కానీ చెప్పడానికి భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే మథనపడుతున్నారు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘స్కౌట్’యాప్‌తో మోసాలు.. విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని స్కౌట్ అనే డేటింగ్ యాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని కొందరు బాధితులు ‘సాక్షి’తో వాపోయారు. అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడిస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. వీడియో కాల్ మాట్లాడాలంటే డబ్బులు పంపాలని అడిగారని.. నిజంగానే మాట్లాడతారేమోనన్న ఆశతో డబ్బులు పంపామన్నారు. డబ్బులు పంపిన వెంటనే తమ నంబర్లు బ్లాక్‌లో పెట్టారని, మోసపోయామని తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో ప్రకటన ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నామని, ఈ యాప్ తో అనేకమంది విద్యార్థులు ఇందులో ఇరుక్కుని, నష్టపోతున్నారని, ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణ, ఏపీల్లో కూడా ఈ దందా జరుగుతోందని పేర్కొన్నారు. సాధారణంగా చేసే తప్పులు... ► వీడియో కాల్ లేదా వెబ్ కెమెరా ద్వారా మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరుపాటు ప్రదర్శించినా చిక్కుల్లో పడతారు. స్క్రీన్ షాట్లు తీసి, మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ► డేటింగ్ సైట్లలో ప్రతి పది మందిలో ఒకరు నగ్న చిత్రాలను పంచుకుంటున్నారట. బాగానే మాట్లాడుతున్నారు కదా అని నగ్న చిత్రాలను వారితో షేర్ చేస్తే అంతే సంగతులు.. ► వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో సులువుగా పంచుకుంటారు. మీ అడ్రస్.. మీ తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యం ఇలా ఏవీ కూడా ఎవరితోనూ డేటింగ్ యాప్‌లల్లో పంచుకోకూడదు. ► డేటింగ్ యాప్‌లల్లో ఉన్నవారు దాదాపు 57 శాతం మంది తమ గురించి పూర్తిగా అబద్ధాలే చెబుతున్నారట. ఉద్యోగం, పెళ్లి, రూపం, ఆకారం, నేపథ్యం ఇలా అన్ని విషయాల్లో అబద్ధమే చెబుతున్నారని తేలింది. మోసగాళ్లను ఎలా గుర్తించవచ్చు.. డేటింగ్ సైట్లలో మోసగాళ్లను ఎలా గుర్తించాలో సైబర్ నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. వాటిని పాటిస్తే కొంతలో కొంత వారి బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. వాటిలో కొన్ని.. అవతలి వ్యక్తి భాష, వాక్య నిర్మాణం, ఇంగ్లిష్ సరిగా లేకపోయినా, అక్షర దోషాలున్నా వారిని దూరంగా ఉంచడమే మంచిది. ప్రొఫైల్‌పై ఉన్న ఫొటోను గూగుల్ సెర్చ్ చేయాలి. ఒకవేళ మోసగాళ్లయితే ఆ ఫొటో గూగుల్‌లో ఉంటుంది. స్నేహితులుగా మారిన తర్వాత.. ఏవేవో కష్టాలు, కథలు చెబుతూ.. డబ్బులు అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు పంపకూడదు. డబ్బుల గురించి మాట్లాడారంటే వారు మోసగాళ్లే. మోసపోయామని తెలిసిన వెంటనే ఇంట్లో వారికి కానీ.. పోలీసులకు కానీ కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. మోసగాళ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. అప్పుడే వేరే ఎవరూ మోసపోకుండా జాగ్రత్తపడతారు. ఆన్లైన్లో బాగా మాట్లాడుతున్నారు కదా.. నేరుగా కలుద్దామంటే ముందూ వెనుక ఆలోచించకుండా వెళ్లకూడదు. వెళితే ఏదైనా దారుణం జరగొచ్చు. ఇటీవలే ఫేస్బుక్ స్నేహితుడు.. లైంగిక కోరికలు తీర్చలేదని ఓ అమ్మాయిని దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఏవేవో లింకులు పంపి వాటిని చూడమంటే అస్సలు చూడకండి. ఆ లింకుల్లో అశ్లీల చిత్రాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి లింకులు తెరిస్తే మీ ఫోన్ లేదా కంప్యూటర్లో మాల్వేర్ డౌన్లోడై మీ వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.