నిజజీవితంలో కాకుండా డిజిటల్ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రదర్శించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి దూరమవుతూ, తాము అంతా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ‘ఫేక్ హ్యాపీనెస్’ను క్రియేట్ చేస్తుంటారు కొందరు. అది ఫేక్ అని తెలియని వాళ్లు, తాము కూడా తమ ఫేక్ హ్యాపీనెస్‌ను మరింత క్రియేటివ్‌గా పోస్ట్ చేస్తుంటారు. వ్యసనంలా మార్చే ఈ చట్రంలో రోజుకు ఎంతోమంది చేరుతున్నారు.
అవగాహనా లోపం
మనమంతా మన చుట్టూ ఉన్నవారితో కలిసి జీవిస్తున్నాం. ఇందులో కొందరు తమపై తమకు సరైన అవగాహన లేని కారణంగా ఎదుటివారిని అనుకరించడం, విలువలు లేని వారి ప్రవర్తనలను కాపీ చేయడం చూస్తుంటాం. అంటే, ఉదాహరణకు.. స్నేహితుల్లో ఒకరు తాగతాగడాన్ని చూస్తూ, కొన్నాళ్లకు ఆ గ్రూప్‌లో ఉన్న మిగతావారూ అదేపని చేస్తుంటారు. ఇది సమయాన్ని వృథా చేస్తుంది. మానసికంగా, శారీరకంగా చెత్తను తయారు చేస్తుంది. ఇదే సోషల్ మీడియా విషయంలోనూ జరుగుతుంది. చాలామంది ఒకేరకమైన కంటెంట్‌ను చూడటానికి అలవాటు పడుతున్నారు.అది నిజం కాదని స్పష్టంగా తెలిసినప్పటికీ. ఏదో ఆనందం కోసం చూస్తున్నాం అంటారు. అదే కంటెంట్‌ను చూస్తూ కొంతకాలానికి తామూ కూడా అదే రకమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తారు. ఒకరిని చూసి ఒకరు ఫేక్ కంటెంట్‌ను సోషల్‌మీడియాలో వదిలితే.. కొన్నాళ్లకు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది.
ఆత్మగౌరవ సమస్య
మీలో ఆత్మబలం లేకపోతే ఇతర వ్యక్తులపై ఆధారపడతారు. అప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఎప్పుడూ బాధ, భయపడుతూ ఉంటారు. నిజానికి చుట్టూ ఉన్నవాళ్లకు మన గురించి పట్టించుకునేంత తీరిక లేదు. మన సొంత అవగాహనే తప్ప ఎవరూ ఎవరికీ తీర్పులు చెప్పరు. ఆత్మగౌరవ సమస్యలు ఉన్న ఎవరైనా సోషల్‌మీడియా ద్వారా తమ జీవితం గొప్పగా, సంతోషకరంగా ఉందని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఎవరైనా ఇప్పటికీ అంతా బాగానే ఉన్నట్లు నటించడానికి సోషల్‌మీడియాను ఉపయోగించవచ్చు. వారి బంధాల గురించి, సంతోషకరంగా గడిపిన సందర్భాలను ఫొటోలతో సహా పోస్ట్ చేయవచ్చు. అవే నిజం అనుకోవడానికి లేదు. వాటికి ప్రతిగా మరికొందరు తాము సంతోషంగా ఉన్న ఎప్పటి సందర్భాన్నో ఇప్పుడు పంచుకోవచ్చు. ఇలాంటి విధానాల వల్ల ఆత్మగౌరవం, బలం పెరగవు అని గుర్తుంచుకోవాలి.
ఫేక్ సర్కిల్
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతిదీ ఏదైనా డిలీట్ చేయలేరు. దశాబ్దాలుగా ఇంటర్నెట్‌లో కనిపించే అవకాశం ఉంది. మీరు మీ మెసేజ్‌ను లేదా ఫొటోని డిలీట్ చేయవచ్చు. అయితే, ఇంటర్నెట్‌లో స్క్రీన్‌షాట్, డౌన్‌లోడ్ వంటి సాధనాలపై మీ కంట్రోల్ ఉండదని గుర్తించాలి. మీ ప్రొఫైల్‌ని ఆర్ట్ గ్యాలరీగా పరిగణించాలి. అంటే, మీ సొంత భావోద్వేగాలతో సహా గొప్పగా కనిపించని దేన్నీ పోస్ట్ చేయరని అర్ధం. కానీ, కాలక్రమేణా ఫేక్ హాపీనెస్ షేరింగ్ ఒక అలవాటుగా మారొచ్చు. అలాంటప్పుడు కొన్నాళ్లకు ప్రోఫైల్‌లోని మొత్తం కంటెంట్ ఫేక్ అవ్వచ్చు. దీనిని కొన్నాళ్లుగా చూస్తున్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు కూడా అదే అలవాటుగా మార్చుకుంటే... ఫేక్ హాపీనెస్ చట్రం క్రియేట్ అవుతుంది.
గుర్తింపు కోరుకోవడం
ఈ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. సోషల్ మీడియాను అదే పనిగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలలో ఇది ఒకటి. కాలక్రమేణా మిమ్మల్ని మీ ఆన్‌లైన్ ప్రోఫైల్‌తోనే జనాలు గుర్తించవచ్చు. అప్పుడు మీ ప్రోఫైల్ మీరు కావచ్చు. మన మనసుకు ఏది నిజం, ఏది అబద్ధం.. వాటి మధ్య ఉంటే తేడా అన్నీ తెలుసు. కానీ, అది ఒక్కటే సరిపోదు. సోషల్ మీడియాలో తమ సొంత ఇమేజ్‌తో గుర్తింపు పొందేందుకు ఇష్టపడే ఎవరైనా చివరికి వారి సొంత నిజ జీవితాన్ని, నిజమైన అవసరాలను విస్మరించవచ్చు. మీరు సంతోషంగా లేని సమయాల్లో గుర్తింపు పోతుందేమో అనే ఆలోచనతో ఫేక్ హ్యాపీనెస్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేయవచ్చు. మీరు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, దానిపై ఆధారపడే వ్యాపారాన్ని చేస్తుండవచ్చు. కానీ, అన్నింటికన్నా జీవితంపై దృష్టి పెట్టడం ఇప్పుడే మొదలవ్వాలి. ఎందుకంటే జీవితం ఆన్‌లైన్‌లో కాదు ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది.
వ్యసనం
లైక్‌లు, కొత్త ఫాలోవర్లు, నోటిఫికేషన్లను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు చేసిన పోస్ట్‌కి వచ్చిన కామెంట్స్‌కు రిప్లై కూడా ఇవ్వండి. వచ్చే నోటిఫికేషన్స్‌కి అడిక్ట్ అవకండి. మీరు చేసిన పోస్ట్‌కు కామెంట్స్, వ్యూస్, లైక్స్.. నంబరింగ్‌పై దృష్టి పెట్టకండి. సంతోషకరమైన ఫొటోలన పోస్ట్ చేయడం వల్ల వచ్చే లైక్‌లు, వ్యూస్ పెరుగుతుంటే వాటి వల్ల వచ్చేదేంటో ఊహించండి. లైక్స్ ఎన్ని ఎక్కువ వస్తే అంత బలం పొందినట్టుగా అనిపిస్తుంది. దీనివల్లే మళ్లీ మళ్లీ అదే పని చేయాలనుకుంటారు.
పొంచి ఉండే స్కామర్లు
- మీరు ఫేక్‌హ్యాపీనెస్ కోసం ప్రయతిస్తుంటే మిమ్మల్ని నకిలీ ఖాతాలతో మోసం చేసేవారూ ఉండచ్చు..
- మీరు చేసే పోస్ట్‌లకు ఉన్న ఫలంగా ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తే అనుమానించండి. ఎందుకంటే, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీతో పరస్పర చర్యలు జరిపి, దారితప్పించవచ్చు..
- వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా లేదా ఆర్థిక స్కామ్‌లలో పాల్గొనేలా మోసగించవచ్చు.
- స్కామర్లు ఫేక్ స్పాన్సర్‌షిప్ అవకాశాలను అందిస్తూ, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు.
- పాస్‌వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు మొదలైన సమాచారాన్ని పంచుకునేలా మోగిసించవచ్చు.
మోసగించబడుతున్నాం అని గుర్తిస్తే వెంటనే...
ఈ క్రింది సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రి΄ోర్ట్ చేయండి.
♦ https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet
♦ https://www.facebook.com/help/1380418588640631
https://www.linkedin.com/help/linkedin/answer/a1344213/recognize-and-report-spam-inappropriate-and-abusive-content?lang=en https://help.instagram.com/192435014247952
♦ https://faq.whatsapp.com/1142481766359885/?cms_platform=android
పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటే.. https://www.cybercrime.gov.inË లో రిపోర్ట్ చేయండి.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల
డిజిటల్ వెల్‌బీయింగ్
ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment