ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్ యూట్యూబ్.. పేరు బ్రెట్‌మ్యాన్. ఫిలిప్పీన్స్‌లో పుట్టాడు, హానలూలూలో పెరిగాడు. అమెరికన్ సిటిజన్‌గా సెటిల్ అయ్యాడు. బ్రెట్‌మ్యాన్ అసలు పేరు Sacayanan Laforga. వాళ్ల నాన్నకు.. రెజ్లర్స్ బ్రెట్ ‘ద హిట్‌మన్’ హార్ట్, డ్వైన్ ‘ద రాక్’ జాన్సన్ అంటే చాలా ఇష్టమట. అందుకే కొడుకును.. ఆ ఇద్దరి పేర్లు కలిసొచ్చెటట్టు బ్రెట్‌మ్యాన్ రాక్ అని పిలవడం షురూ చేశాడట.
ఒరిజినల్ పేరు కన్నా నాన్న పెట్టిన బ్రాట్‌మ్యాన్ రాకే మంచిగా ఉందని దానికే ఫిక్స్ అయ్యాడట కొడుకు. 2015లో మేకప్ టిప్స్ వీడియోస్‌తో సోషల్ మీడియాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోస్‌లో కాండిడ్ హ్యూమర్ కామెంట్రీతో పాపులర్ అయ్యాడు. ఇన్నోవేటివ్ ఫ్యాషన్ సెన్స్‌కీ ఫేమస్ అయ్యాడు.
ఇవన్నీ కలిసే బ్రెట్‌మ్యాన్‌ని యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చేశాయ్. అకార్డింగ్ టు ఆన్‌లైన్ సోర్స్ .. బ్రెట్‌మ్యాన్ రాక్‌కి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 9 మిలియన్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్, 18.5 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 15.1 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment