
స్కూళ్లు, కాలేజీలకు విరామం వచ్చిన ఈ సమయం యువతకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, స్వల్ప ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశం. ఆదాయం, అనుభవం రెండింటికీ అనేక రంగాల్లో సమ్మర్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో అడుగేస్తే, ఈ వేసవి తమ జీవితానికే మార్గనిర్ధేశం చేసేదిగా మారవచ్చని భావిస్తున్న విద్యార్థులు సెలవుల్లో పలు ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో కొన్ని..
కాల్ సెంటర్ / బీపీఓలు..
ఐటీ హబ్‌గా మారుతున్న నగరంలో పలు కంపెనీలు తాత్కాలిక కాల్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి 10వ తరగతి నుంచి ఇంటరీ్మడియట్ విద్యార్థులు సైతం అర్హులే. పనివేళలు షిఫ్ట్ ప్రాతిపదికన ఉండటంతో సెలవులు ముగిశాక కూడా అవసరం అనుకుంటే క్లాసుల వేళలతో సమన్వయం చేయవచ్చు. నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు.
ట్యూటరింగ్ /హోం ట్యూషన్లు..
పాతదే అయినా ఇప్పటికీ వన్నెతగ్గని ఉపాధి ఇది. ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్న యువత, పాఠశాల విద్యార్థులకు హోమ్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు రూ.15 వేల వరకూ ఆదాయం వస్తోంది. కొంతమంది ఆన్‌లైన్ ట్యూటర్‌గా కూడా పని చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
రిటైల్, కస్టమర్ సర్వీస్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ షోరూమ్స్‌లో కస్టమర్ సర్వీస్, క్యాషియర్, స్టాక్ మేనేజ్‌మెంట్ వంటి ఉద్యోగాలు వేసవిలో తాత్కాలికంగా లభిస్తాయి. వీటిలో నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుతుంది. ఈ ఉద్యోగం వల్ల ప్రధాన లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
కంపెనీలూ రెడీ..
స్వల్పకాలిక ప్రాజెక్ట్‌ల కోసం వేసవి సెలవుల్లో విద్యార్థులను నియమించుకోవడం అనేది కొంత కాలంగా కంపెనీలు అనుసరిస్తున్న విధానం. నగరంలోని ప్రొఫెషనల్ రెగ్యులర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ వేసవిలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పని చేయబోతున్నామని చెప్పారు.
కళలు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన విద్యార్థులు కంటెంట్ రైటింగ్ నుంచి ఫీల్డ్ రీసెర్చ్ వరకు ఉద్యోగాలపై పని చేస్తుంటే, ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వారు కంపెనీల ద్వారా అవుట్‌సోర్స్ చేసే ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం, వేసవి ఉద్యోగాల ద్వారా నెలకు సగటున రూ. 20 వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయాలు ఉంటాయి.
సెలవులు ప్రారంభం కావడానికి ముందే కళాశాలలు విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు అందుకోవడంలో సహకరిస్తున్నాయి.ఫుడ్ డెలివరీ అంతకంతకూ విస్తరిస్తున్న ఊబర్ ఈట్స్, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎప్పుడూ ఉద్యోగుల అవసరం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసిన యువతకు డెలివరీ బాయ్‌తో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చు. ‘నేను ప్రస్తుతం ఒక ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.12 వేల జీతంతో రెండున్నర నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇది తక్కువ జీతానికి పని చేసినట్లుగా అనిపించవచ్చు. అయితే ఈ అనుభవం దీర్ఘకాలంలో సహాయపడుతుంది.‘ అని నగరానికి చెందిన విద్యార్థి హరితా సింగ్ చెప్పింది.
(చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు)