ఈ సీజన్‌లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి.
కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్‌లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.
ఆరోగ్యానికి మేలు..
ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్‌గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు.
మరెన్నో రుచులు..
ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్‌లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్‌తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్‌ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్‌పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్‌లో పరిపాటిగా మారింది.
స్వీట్ విత్ ఫ్రూట్..
రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు.
ఐస్‌క్రీమ్స్ షురూ..
నగరంలో పలు ఐస్‌క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్‌లో సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్‌క్రీమ్స్‌ను అందించడంలో పేరొందిన నేచురల్స్‌లో ఇప్పటికే సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్‌స్టోన్ తదితర పేరున్న పార్లర్స్‌లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్‌కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్‌గా ఉన్న ఫేమస్ ఐస్‌క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్‌లో ఉన్న నార్సింగ్ భేల్‌పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్‌లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్‌కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్.
Comments
Please login to add a commentAdd a comment