part time jobs
-
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
రూ.120 కోసం యువతి కక్కుర్తి.. రూ.7.23 లక్షలు మాయం!
ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేలా పని చేయడంలో తప్పులేదు. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఫోన్‌కాల్, మెసేజ్‌లతో ఆమాయకులకు ‘ఆశ’ చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఓ యువతి పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మేడం మీరు ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఈ సువర్ణావకం మీకోసమే. మేం చెప్పిన పని మీరు చేస్తే కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు మీరు ఇంట్లోకూర్చొని యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే. అలా చేస్తే డబ్బు సంపాదించవచ్చు’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ యువతి తనకు వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌కు సంతోష పడింది. సైబర్ కేటుగాళ్లు పంపిన రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందుకు గాను సైబర్ నేరస్తులు ఆమెకు రూ.120 పంపారు. ఆ సంతోషం రెట్టింపైంది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు. స్కామర్లు తెలివిగా ఆమె సబ్‌స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల స్క్రీన్షాట్లను పంపమని అడిగారు. అనంతరం 'జాబ్ కోడ్' కూడా పంపారు. ఆ కోడ్‌ను టెలిగ్రామ్ అకౌంట్ పంపమని కోరారు. పైన పేర్కొన్న టెలిగ్రామ్ ఖాతాకు ఆమె జాబ్ కోడ్‌ను పంపిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ యువతి బ్యాంకు వివరాలను సేకరించారు. వాళ్లు వివరాలు అడిగారని వెనకముందా అలోచించకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, జాబ్ కోడ్ పంపడంతో నిందితులు పని మొదలు పెట్టారు. ముందుగా ఆమె నమ్మేలా పార్ట్‌టైమ్ జాబ్ చేసినందుకు రెండు రోజుల వ్యవధిలో పలు మార్లు ఆమె అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. నమ్మకం కుదిరాక అమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,23,889 మొత్తాన్ని నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బుల్ని మాయం చేశారు. పాపం తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సురక్షితంగా ఉండడం ఎలా? ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండేలా లింక్డ్న్, నౌకరీ, ఇండీడ్ మొదలైన గుర్తింపు పొందిన పోర్టల్స్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో మీకు జాబ్ ఆఫర్ చేస్తే సదరు వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు, వారి కంపెనీ పేరు మొదలైన వివరాలను అడగాలి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి ఆన్లైన్లో సమాచారం సేకరించండి. అలాగే, పేరు, ఫోన్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపడం, లేదంటే బ్యాంక్ వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్‌టైమ్ వర్క్‌లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్‌టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్‌టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్‌షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్‌టైమ్ జాబ్‌లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్‌గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్‌టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది. -
వొడా–ఐడియా యాప్‌తో మహిళలకు ఉద్యోగావకాశాలు
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
యువతరం మారుతోంది
యువతరం ఆలోచన మారుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు వారి ఆలోచనలో మార్పు తెస్తుంటే.. అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఉపాధి అవకాశాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. హుందాగా పనిచేస్తూ కష్టాన్ని బట్టి సంపాదన పెంచుకునే అవకాశం వారిని ఆకర్షిస్తోంది. దీంతో చదువుకుంటూనే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే కుటుంబంపై ఆధారపడకుండా అవసరమైన ఖర్చుల కోసం ఆహారం, సరుకులు, వస్తువుల ఆన్లైన్ డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది (80 శాతం) విద్యాధికులు కావడం ఆసక్తి కలిగించే అంశం. – సాక్షి, హైదరాబాద్ నగర బాట.. ఉపాధి వేట మొత్తం మీద విద్య కోసమో, ఉద్యోగం కోసమో లక్షలాది మంది యువత హైదరాబాద్ మహా నగరానికి వలస వస్తోంది. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. మొన్నటి వరకు ఇంటి నుంచి పంపించే డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటూ చదువుకోవడమో, మంచి ఉద్యోగం వెతుక్కోవడమో చేస్తూ వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో ఇక తల్లిదండ్రుల డబ్బులపై ఆధారపడి ఉండాలని అనుకోవడం లేదు. తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న డెలివరీ రంగం వీరికి గొప్ప అవకాశంగా మారింది. 75 వేల మందికి పైనే.. మహానగరంలో 75 వేల మందికి పైగానే ఫుడ్, గ్రోసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ రంగంలో కొనసాగుతున్నట్లు ఆయా కంపెనీల ఆధికార గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్‌పాండా, రాపిడో తదితర సంస్థలు తమ మార్కెట్‌ను విస్తరించుకోవడంలో భాగంగా యువతను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో వంటి సంస్థలు కూడా తమ సరుకులు, వస్తువుల డెలివరీకి యువతను వినియోగిస్తున్నాయి. పని చేయాలనే తపన ఉంటే సరి.. పార్ట్ టైం ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేయొచ్చు. కనీస విద్యార్హతతో పాటు లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ వివరాల ఒరిజినల్స్‌తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్‌కు ఆర్డర్ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి. బీకాం చేస్తూనే డెలివరీ... బీకాం కంప్యూటర్ ఫైనల్ ఇయర్ చేస్తూ పార్ట్‌టైంగా ఫుడ్ డెలివరీ బోయ్‌గా పనిచేస్తు న్నా. ప్రతిరోజు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నా. కాలేజీ, ట్యూషన్ ఫీజులు, చేతి ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లిదండ్రులపై ఆధార పడకుండా సొంతంగా సమకూర్చుకుంటుండటంతో సంతృప్తిగా ఉంది. నా మిత్రు లు చాలామంది ఇలా చదువుకుంటూనే పార్ట్‌టైంగా పని చేస్తూ సంపాదిస్తున్నారు. – మొహియొద్దీన్, ఫుడ్ డెలివరీ బాయ్, మల్లాపూర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే బీటెక్ పూర్తి కావడంతో అదనపు కోర్సుల కోసం నగరానికి వచ్చాను. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఏడాది పాటు ఇంటి నుంచి డబ్బులు పంపించారు. తర్వాత కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఫ్రెండ్ బైక్‌తో పార్ట్ టైం జాబ్‌లో చేరాను. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. – వెంకటేశ్వర్లు, నల్లగొండ డిగ్నిటీ ఆఫ్ వర్క్.. సిటీలో ఫుడ్, గ్రాసరీ డెలివరీ, బైక్ ట్యాక్సీ డిగ్నిటీ ఆఫ్ వర్క్‌గా మారాయి. నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సైతం పార్ట్‌టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటున్నారు. – షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ -
పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై మహిళల ఆసక్తి
న్యూఢిల్లీ: అవసరాల రీత్యానే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం కోసం కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. తీవ్ర పోటీతో కూడుకున్న జాబ్ మార్కెట్లో తమకంటూ గుర్తింపు సాధించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా శ్రమతో కూడుకున్నవి, నైట్ షిఫ్టులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. 2022లో ట్రెండ్స్‌కి సంబంధించి ఉద్యోగాలు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ’అప్నా’ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులు 67 శాతం పెరిగాయి. అదే సమయంలో ఫుల్ టైమ్ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్లు 34 శాతమే పెరిగాయి. అటు నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది. శ్రమ ఎక్కువగా ఉండే డెలివరీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు, డ్రైవర్ల ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 34 శాతం పెరిగినట్లు అప్నాడాట్‌కో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. పేటీఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ కార్యాలయాల్లో సిబ్బందిపరమైన వైవిధ్యాన్ని పాటించేందుకు మహిళల కోసం అత్యధికంగా ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. హైదరాబాద్, చెన్నైలాంటి పెద్ద నగరాలతో పాటు ఇండోర్‌లాంటి చిన్న పట్టణాల్లోనూ పోస్టింగ్‌లు 28 శాతం పెరిగినట్లు అప్నా నివేదిక పేర్కొంది. -
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
చైనా ‘ఉద్యోగ’ యాప్‌పై ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీ వీడియోలను ‘లైక్’ చేయడం, ‘అప్లోడ్’ చేయడం వంటి పలు విభాగాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పిస్తామని అనేక మంది యువకులను మోసగించిన చైనీస్ ‘నియంత్రిత’ మొబైల్ యాప్– ‘కీప్షేర్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. బెంగుళూరు కేంద్రంగా యాప్‌తో కలిసి పనిచేస్తున్న 12 అనుబంధ సంస్థల పై దాడిజరిపి రూ.5.85 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ పేర్కొంది. ఈ యాప్ నిర్వాహకులు యువత నుంచి అక్రమంగా, మోసపూరితంగా డబ్బు వసూలు చేసినట్లు కూడా ఈడీ ప్రకటన తెలిపింది. ‘‘చైనీయులు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది భారతీయులను డైరెక్టర్లుగా, అనువాదకులుగా (మాండరిన్ నుండి ఇంగ్లీష్– ఇంగ్లీష్ నుంచి మాండరిన్, హెచ్ఆర్ మేనేజర్లు, టెలి కాలర్లుగా నియమించుకున్నారు’’ అని ఈడీ తెలిపింది. వాట్సాప్, టెలి గ్రామ్‌ల ద్వారా ఉపాధి కల్పనకు సంబంధించి చైనీయులు విస్తృతంగా ప్రకటనలు చేశారని తెలిపింది. ఇండియన్ల డాక్యుమెంట్లు పొందారని, బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించారని వివరించింది. -
విదేశాల్లో చదువుకుంటూనే సంపాదన కావాలా?
స్టడీ అబ్రాడ్.. లక్షల మంది భారతీయ విద్యార్థుల స్వప్నం! విదేశీ యూనివర్సిటీ పట్టా చేతిలో ఉంటే.. అంతర్జాతీయంగా అవకాశాలు అందుకోవచ్చనే భావన!! స్వదేశానికి తిరిగొచ్చినా..కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. కాని విదేశీ విద్య అంటే రూ.లక్షల్లో ఖర్చు. అమెరికా మొదలు ఆస్ట్రేలియా వరకూ.. ఇదే పరిస్థితి! దీంతో.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలంటే.. చాలామంది విద్యార్థులు జంకుతున్నారు. ఇలాంటి వారికిæకొంత ఉపశమన మార్గం.. పార్ట్ టైమ్ జాబ్స్!! అంటే.. విదేశీ యూని వర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి ఖర్చుల మేరకైనా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం స్టడీ అబ్రాడ్‌కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఆయా దేశాల్లో పార్ట్ టైమ్ వర్క్ విధానాలు, నిబంధనలపై ప్రత్యేక కథనం... $ అమెరికాలో ఎంఎస్, ఇతర పీజీ కోర్సులు చదవాలంటే.. సగటున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ట్యూషన్ ఫీజు. $ యూకేలో పీజీ కోర్సులకు రూ.పది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ట్యూషన్ ఫీజు. $ ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ట్యూషన్ ఫీజులు లక్షల్లోనే! వీటికితోడు అదనంగా 30నుంచి 40 శాతం మేర నివాస ఖర్చులు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చులు భరించడం ఎవరికైనా కష్టమే! దాంతో ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్ టైమ్ వర్క్‌తో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఫీజులు కాకున్నా.. నివాస ఖర్చులకు సరిపడే స్థాయిలోనైనా సంపాదించుకునే వీలుంది. అమెరికా.. పార్ట్ టైమ్ వర్క్ $ స్టడీ అబ్రాడ్ అనగానే మన విద్యార్థుల తొలి గమ్యం అమెరికా. కాని ఇక్కడ ట్యూషన్ ఫీజులు భారీగా ఉంటాయి. నివాస ఖర్చులు కూడా ఎక్కువే. అమెరికా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు పార్ట్ టైమ్ వర్క్ సౌలభ్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో అమలవుతున్న విధానం ప్రకారం– విదేశాలకు చెందిన విద్యార్థులు రెండు మార్గాల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేసే అవకాశం ఉంది. $ కోర్సు మొదటి సంవత్సరంలో ఆన్లైన్ లేదా ఆన్–క్యాంపస్ విధానంలో పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ సంపాదించుకోవచ్చు. $ రెండో మార్గం–ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానంలో 12 నుంచి 24 నెలల పాటు క్యాంపస్ వెలుపల కంపెనీల్లో పని చేసే అవకాశం. దీని ప్రకారం–ప్రీ కంప్లీషన్ ఓపీటీ విధానంలో విద్యార్థులు కోర్సు చదువుతున్న సమయంలోనే వారానికి 20 గంటలపాటు, సెలవు రోజుల్లో పూర్తి సమయం పార్ట్ టైమ్ వర్క్ చేయొచ్చు. ఇది సదరు విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుకు సంబంధించిన విభాగానికి చెందిన కంపెనీల్లోనే ఉండాలి. ఇలా పార్ట్ టైమ్ వర్క్ ద్వారా నెలకు కనిష్టంగా 800 వందల డాలర్ల వరకూ సంపాదించొచ్చు. యూకేలో.. వారానికి 20 గంటలు విదేశీ విద్య పరంగా మన విద్యార్థుల మరో ముఖ్య గమ్యం.. యూకే. ఇక్కడ కూడా పార్ట్ టైమ్ వర్క్ అవకాశం అందుబాటులో ఉంది. యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం–టైర్–4 స్టూడెంట్ వీసా కేటగిరితో ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండే కోర్సుల్లో చేరిన విద్యార్థులు వారానికి కనిష్టంగా పది గంటలు, గరిష్టంగా 20 గంటలు పని చేయొచ్చు. అలాగే సెలవు రోజుల్లో వారానికి 40 గంటలు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇలా.. వారానికి 120 నుంచి 150 పౌండ్ల వరకు సంపాదించుకునే వీలుంది. ఆస్ట్రేలియా... ఇలా ఆస్ట్రేలియాలో పార్ట్ టైమ్ వర్క్ నిబంధనల ప్రకారం–స్టూడెంట్ వీసాతో అడుగు పెట్టిన విదేశీ విద్యార్థులు.. వారానికి 20 గంటలు లేదా రెండు వారాలకు గరిష్టంగా 40 గంటలు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా సెలవు రోజుల్లో పూర్తి సమయం పని చేసుకొని సంపాదించుకోవచ్చు. అలా వారానికి 300 నుంచి 400 వరకు ఆస్ట్రేలియా డాలర్లు ఆర్జించే అవకాశం ఉంది. అక్కడా ఇరవై గంటలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాలు కూడా విదేశీ విద్యార్థులకు పార్ట్ టైమ్ వర్క్ అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ కూడా వారానికి ఇరవై గంటలు పని చేసే అవకాశం ఉంది. కెనడా, సింగపూర్లలో పని గంటల ప్రాతిపదికగా వేతనం చెల్లిస్తారు. ఆయా దేశాల కరెన్సీలలో గంటకు కనిష్టంగా పది డాలర్లు, గరిష్టంగా 20 డాలర్లు సంపాదించుకోవచ్చు. సింగపూర్‌లో వారానికి 150 డాలర్ల వరకు ఆదాయం పొందొచ్చు. ఇంటర్న్షిప్తోనూ ఆర్జన ప్రస్తుతం పలు దేశాల్లో విదేశీ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ అవకాశం అందుబాటులో ఉంది. ఆయా కోర్సుల వ్యవధిని బట్టి ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు.. తమ యూనివర్సిటీ అనుమతితో అక్కడి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎంపికైతే సదరు సంస్థలు పెయిడ్ ఇంటర్న్‌గా గరిష్టంగా మూడు నెలల కాలానికి నియమించుకుంటున్నాయి. ఈ సమయంలో మన కరెన్సీలో నెలకు గరిష్టంగా రూ.50వేల వరకు వేతనంగా పొందొచ్చు. రీసెర్చ్ అసిస్టెన్స్ విదేశీ విద్య విద్యార్థులకు పార్ట్‌టైమ్ వర్క్ పరంగా అందుబాటులో ఉన్న మరో విధానం.. రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్. అంటే..విద్యార్థులు తాము చదువుకుంటున్న యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రీసెర్చ్ చేస్తుంటే.. వారికి సహాయకులుగా ఉండొచ్చు. సదరు ప్రొఫెసర్లు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ పేరిట ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. ఇది కూడా గంటల ప్రాతిపదికన ఉంటుంది. ఈ విధానంలోనూ వారానికి కనీసం రూ.40వేల వరకు అందుకోవచ్చు. ఎక్కువగా వీటిలోనే ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న రిటెయిల్ స్టోర్స్, రెస్టారెంట్స్, ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్స్, ఫుడ్ స్టోర్స్, కెఫెటేరియాల్లో ఎక్కువగా పార్ట్‌టైమ్ వర్క్ అవకాశాలు లభిస్తున్నాయి. తాము చదువుకుంటున్న విభాగానికి చెందిన రంగంలో పనిచేస్తే.. ఇటు ఆదాయంతోపాటు అటు అనుభవం సైతం సొంతమవుతుంది. అందుకే యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్స్ వద్ద టీచింగ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ ఇంటర్న్స్‌గా కుదురుకునే విధంగా వారిని మెప్పించాలి. ఇలా టీచింగ్ అసిస్టెంట్స్‌గా చేరిన వారికి సదరు రీసెర్చ్ ప్రొఫెసర్ స్టయిపెండ్ అందిస్తారు. దీనివల్ల విద్యార్థులకు తమ చదువుపై ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించడమే కాకుండా.. ఖర్చులకు కొంత ఆదాయం కూడా సమకూరుతుంది. పార్ట్ టైమ్ టు ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ వర్క్ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే.. అది ఫుల్ టైమ్ ఉద్యోగంగా మారే అవకాశం ఉంది. విద్యార్థి పనితీరు నచ్చితే.. సదరు సంస్థలోనే ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చి.. ఇమిగ్రేషన్ అనుమతి కూడా లభించేలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత మేరకు విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్స్‌ను తమ అకడమిక్స్ సంబంధిత విభాగాల్లోనే చేయడం మేలు. అన్వేషణకు మార్గాలు విదేశాల్లో విద్యనభ్యసిస్తూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీల స్థాయిలో సపోర్ట్ సెంటర్స్ సహకరిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉన్న పార్ట్ టైమ్ జాబ్ అవకాశాలను విద్యార్థులకు తెలియజేస్తున్నాయి. అదే విధంగా స్థానిక విద్యార్థి సంఘాలు, ఆయా యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల సంఘాలు కూడా చేయూత అందిస్తున్నాయి. దాంతోపాటు విద్యార్థులు లోకల్ జాబ్ సెంటర్స్‌లో తమ వివరాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు పేర్కొని.. అందుకు తగిన ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఆయా జాబ్ సెంటర్స్ ఉద్యోగావకాశాల వివరాలను తెలియజేస్తాయి. రెజ్యుమేకు అదనపు బలం విద్యార్థులు తమ అకడమిక్స్‌కు సంబంధించిన విభాగాల్లో పార్ట్ టైమ్ వర్క్ చేస్తే.. అది రెజ్యుమేకు అదనపు బలం చేకూరుస్తుంది. కోర్సు పూర్తయ్యాక.. ఆయా దేశాల్లో పోస్ట్ స్టడీ వర్క్ అన్వేషణ సమయంలో సంస్థల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి అనుభవం ఉన్న విద్యార్థుల తరఫున ఇమిగ్రేషన్ పిటిషన్లు లేదా స్పాన్సర్షిప్ లెటర్లు ఇవ్వడానికి సదరు సంస్థలు ఆసక్తి చూపుతాయి. ఫలితంగా విద్యార్థులు ఆ దేశంలోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి. అకడమిక్స్‌కు ఆటంకం లేకుండా పార్ట్ టైమ్ వర్క్ చేయాలనుకుంటున్న విద్యార్థులు అకడమిక్స్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లోని పలు వర్సిటీల్లో క్లాసులు, లేబొరేటరీస్, ప్రాక్టికల్స్.. ఇలా అన్నింటికీ కలిపి సాయంత్రం ఆరేడు గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా నైట్ షిఫ్ట్ జాబ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరుసటి రోజు తరగతులు వినడం, నేర్చుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులు తరగతి బోధనతోపాటు స్వీయ అభ్యసనానికి ఆటంకం లేని పార్ట్‌టైమ్ జాబ్స్ ఎంచుకోవాలి. స్టడీ అబ్రాడ్–పార్ట్ టైమ్ జాబ్స్–ముఖ్యాంశాలు * అమెరికాలో వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్ వర్క్‌కు అవకాశం. కోర్సు రెండో ఏడాది నుంచి ప్రీ–కంప్లీషన్ ఓపీటీ విధానంలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసే అవకాశం. * యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో వారానికి ఇరవై గంటలు.. సెలవుల్లో పూర్తి సమయం పని చేసుకోవచ్చు. * ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ వద్ద అసిస్టెంట్స్‌గా పని చేస్తే ఆదాయంతోపాటు స్టడీస్ పరంగా ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగవుతాయి. * ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఆయా సంస్థల్లో శాశ్వత ఉద్యోగానికి స్పాన్సర్షిప్ పొందొచ్చు. సమతుల్యత ప్రధానం – శ్రీకర్, డైరక్టర్, గ్లోబల్ ట్రీ అకాడమీ విదేశీ విద్యలో చేరిన విద్యార్థులు అకడమిక్స్‌కు, వర్క్‌కు మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చుల భారం తగ్గించుకుందామని పార్ట్ టైమ్ జాబ్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడం సరికాదు. నిర్ణీత వ్యవధి కంటే ఎక్కువ సమయం పని చేసేందుకు ఆయా దేశాల ఇమిగ్రేషన్ చట్టాలు కూడా అనుమతించవు. -
వయస్సు ఏడాదే..సంపాదన ఎంతో తెలిస్తే ముక్కున వేసుకోవాల్సిందే
న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్‌ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా మార్చేసింది. టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్‌ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా ఉన్న బ్రిగ్స్‌కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి. -
పార్ట్–టైమ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోరడం కుదరదు
న్యూఢిల్లీ: పార్ట్–టైమ్ ఉద్యోగులు మంజూరైన పోస్టుల్లో పని చేయడం లేదని, వారు క్రమబద్ధీకరణ(రెగ్యులరైజేషన్) కోరడం కుదరని సుప్రీంకోర్టు గురువారం తేల్చిచెప్పింది. ప్రభుత్వాలు ప్రకటించే రెగ్యులరైజేషన్ పాలసీకి అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. ఎవరూ క్రమబద్ధీకరణను తమ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం పార్ట్–టైమ్ ఉద్యోగుల విషయంలో వర్తించదని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో పార్ట్–టైమ్, తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నవారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని కోరడం సమంజసం కాదని సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఆర్డర్‌ను సవరిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేసింది. నిర్దిష్టమైన రెగ్యులరైజేషన్ పాలసీ రూపొందించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విభాగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఆదేశించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడం కేవలం ప్రభుత్వం బాధ్యత అని, దాంతో కోర్టుకు సంబంధం లేదని తెలియజేసింది. -
బెత్తెడు జీతం..దుర్భర జీవితం
చింతలపూడి : దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని పంచాయతీ పాలన ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలతో కుంటు పడుతోంది. ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పంచాయతీల్లో పని చేస్తోన్న ఉద్యోగులపై ఉండటం లేదు. ముఖ్యంగా మైనర్ గ్రామ పంచాయతీల్లో 30 ఏళ్లుగా పని చేస్తోన్న కార్మికుల(పార్ట్‌టైం గుమస్తాల) వెతలు అన్నీ, ఇన్నీకావు. కనీస వేతనాలు లేక కుటుంబాలను పోషించుకోలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్న చందంగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. జిల్లాలో 908 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పోయినోళ్లు పోగా 98 మంది పంచాయతీ గుమస్తాలు మాత్రం ఇంకా ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తుందన్న గుడ్డి ఆశతో కాలం వెళ్ల దీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 480 మంది పని చేస్తున్నట్టు అంచనా. వీరు కాక కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరత్రా పని చేస్తున్న సిబ్బంది వేలల్లో ఉన్నారు. పేరుకే పార్ట్ టైం పేరుకు పార్ట్‌టైం గుమస్తాలే కాని వారు చేసేది మాత్రం ఫుల్‌టైమ్ ఉద్యోగాలే అని చెప్పవచ్చు. పంచాయతీల్లో ఇస్తున్న అరకొర జీతాలతో వెట్టి చాకిరీ చేస్తూ వీరు తమ జీవితాలను వెళ్ల దీస్తున్నారు. తమను రెగ్యులర్ చేయమని ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేడుకొంటున్నా ఎవరూ వీరి గోడు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తూ రిటైర్మెంట్ స్టేజీకి చేరినా వీరి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. సర్పంచ్ల దయా దాక్షిణ్యాలపైనే వీరి ఉద్యోగాలు ఆధారపడి ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ పనులతో పాటు సర్పంచ్ల సొంత పనులు కూడ వీరే చేసి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఎక్కడ ఉద్యోగాలు పోతాయోనని వీరి భయం. సర్పంచ్‌లు మారినప్పుడల్లా వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాక ఏటా జిల్లా పంచాయతీ అధికారి అనుమతి తీసుకుని తమ పోస్టులను కొనసాగించుకోవాల్సిన దుస్థితిలో గుమస్తాలు ఉన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, బందెల దొడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు చేయించడం అన్నీ వీరే చూసుకోవాలి. ఇంతచేసినా వీరికి ఇస్తున్న జీతాలు మాత్రం నెలకు ఆరు నుంచి పది వేల రూపాయలు మాత్రమే. మైనర్ పంచాయతీల్లో ఈ మాత్రం జీతాలు కూడ ఇవ్వలేక రెండు, మూడు పంచాయతీలకు కలిపి ఒక గుమస్తాను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పని భారం పెరిగి, చాలీచాలని జీతాలతో అరకొర జీవితం సాగిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీస వేతన చట్టం కూడా వీరికి వర్తించడం లేదు. 1993 నవంబర్ 25న అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఆ తేదీ నాటికి ఇన్ సర్వీస్‌లో ఉన్న పార్ట్‌టైమ్ కార్మికులను రెగ్యులర్ చేయాల్సి ఉంది. కాని ఆ జీఓను అమలు చేయరు. 2017 జూలైలో ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ఏళ్ల తరబడి పని చేస్తున్న పంచాయతీ గుమస్తాలను అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించవచ్చునని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ నివేదిక పీఆర్ జాయింట్ సెక్రటరీ వద్ద పెండింగ్‌లో ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు వెట్టి చాకిరీలో మగ్గడానికి ప్రభుత్వాల విధానాలే కారణం. గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం, పంచాయతీల పరిపుష్టికి తోడ్పాటు అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నామని విమర్శలు వస్తున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీల అధికారాలను, నిధులను విడుదల చేయక పోవడం ఫలితంగా సిబ్బందికి జీతాలు కూడ ఇవ్వలేని దుస్ధితిలో మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికైనా తమ సర్వీసుల్ని రెగ్యులర్ చేసి పంచాయతీల అబివృద్ధికి చర్యలు తీసుకోవాలని వీరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కల్లలవుతున్న‘డాలర్ డ్రీమ్స్’
► పనిచేస్తే పంపేయడమే! ► అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న వారిని వెతికి పట్టుకుంటున్న ఎఫ్‌బీఐ ► వర్సిటీల నుంచి విదేశీ విద్యార్థుల ► వివరాల సేకరణ.. నివాసాల్లోనూ సోదాలు ► టెక్సాస్, కాలిఫోర్నియాలో 150 మంది గుర్తింపు.. తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ► వారిలో 38 మంది వరకు ► తెలుగు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం ► సరైన ఆర్థిక వనరులు లేకపోయినా, గుర్తింపు లేని వర్సిటీల్లో చేరినా ► తప్పని ఇబ్బందులు... గుర్తింపు లేని 38 విశ్వవిద్యాలయాల ► జాబితాను కాన్సులేట్లకు అందజేసిన అమెరికా ► త్వరలో మరో 100 గుర్తింపు లేని వర్సిటీల జాబితా ప్రకటించే అవకాశం సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో విద్యను అభ్యసించేందుకు వెళ్లి వర్సిటీల వెలుపల పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారత విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు తనిఖీలు చేపట్టారు. గడచిన మంగళ, బుధవారాల్లో (క్రిస్మస్కు ముందు) వర్సిటీ వెలుపల పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న దాదాపు 150 మందిని ఎఫ్‌బీఐ పట్టుకుంది. వారంతా కాలిఫోర్నియా, టెక్సాస్, డెలావర్‌లో ఎంఎస్ డిగ్రీ చదువుతున్నవారే. వారిలో కొందరు ఒక సెమిస్టర్ పూర్తిచేసుకోగా మరికొందరు రెండు, మూడు సెమిస్టర్లు పూర్తి చేశారు. ఇలా పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిన వారి విషయంలో అమెరికా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే వారి పాస్‌పోర్టులను మాత్రం ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. ‘కొందరు విద్యార్థులను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. యూనివర్సిటీలకు సెలవుల కారణంగా బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్ల మొదటి తప్పుగా భావించి వదిలేయాలని మేం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..’’ అని తానా అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని.. వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 38 మంది ఉన్నారని ఇప్పటివరకు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఆందోళనలో స్ప్రింగ్ సీజన్ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు చూపని మరో 20 మంది భారత విద్యార్థులను షికాగోలో పోలీసులు వెనక్కి పంపిన నేపథ్యంలో... స్ప్రింగ్ సీజన్ (డిసెంబర్లో మొదలయ్యే విద్యాసంవత్సరం)లో చదువుకునేందుకు అమెరికా వీసా పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రయాణాలు పెట్టుకున్న ఈ విద్యార్థులంతా.. తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. భారత్ నుంచి అమెరికా వెళ్లాల్సిన విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది తాత్కాలికంగా ఆగిపోయారని... ఆయా వర్సిటీల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత బయలుదేరుతారని న్యూయార్క్‌లో భారత విద్యార్థుల స్థితిగతులను చూసే ఓ కన్సల్టెన్సీ యజమాని హర్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. భారత విద్యార్థులు చదువు కంటే పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తున్నారని ఎఫ్‌బీఐ పేర్కొన్న నేపథ్యంలో... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కొంత స్పష్టత వచ్చేదాకా విద్యార్థులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. గుర్తింపు లేని ‘ఐ20’తో ఇక్కట్లు గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు ఇచ్చిన ‘ఐ20 (అడ్మిషన్ ధ్రువపత్రం)’తో అమెరికా వెళుతున్న విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపుతున్నారు. అయితే ఆ వర్సిటీలు ఏమిటో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అమెరికా కాన్సులేట్ వీసా మంజూరు చేసిందంటే అది మంచి యూనివర్సిటీయేనని నమ్ముతున్నారు. ‘‘మా అబ్బాయికి జీఆర్ఈలో 287, టోఫెల్లో 75 స్కోర్ వచ్చింది. షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్‌లో సీటు వచ్చింది. ఆ ‘ఐ20’తో వీసా కూడా వచ్చింది. ఆర్థిక వనరులు ఉన్నట్లు అన్ని ఆధారాలు కూడా మా అబ్బాయితో ఉన్నాయి. కానీ ఎందుకో మా వాడిని తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించి అధికారులు వారి కస్టడీలో పెట్టుకున్నారు..’’ అని హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్ నివాసి రెడ్డిగారి సత్యనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని ఓ కన్సల్టెన్సీ సంస్థ నుంచి 38 గుర్తింపు లేని యూనివర్సిటీల జాబితాను సాక్షి సంపాదించింది. ఇలాంటి మరో వంద యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నాయని.. వాటి వివరాలను త్వరలోనే అమెరికా ప్రభుత్వం వెల్లడించే అవకాశముందని ఆ కన్సల్టెన్సీ ప్రతినిధి చెప్పారు. అమెరికాలో గుర్తింపులేని యూనివర్సిటీలు అరిజోనాలోని.. అమెరికన్ బైబిల్ కాలేజీ యూనివర్సిటీ, అమెరికన్ సెంట్రల్ యూనివర్సిటీ; న్యూమెక్సికోలోని అమెరికన్ సెంచరీ యూనివర్సిటీ; కాలిఫోర్నియాలోని అమెరికన్ కోస్ట్‌లైన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా స్కూల్ అఫ్ టెక్నాలజీ, క్లేటన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, గోల్డెన్ స్టేట్ బాప్టిస్ట్ కాలేజ్, గోల్డెన్ స్టేట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ అమెరికన్ యూనివర్సిటీ, వెస్ట్‌కోస్ట్ బాప్టిస్ట్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబిల్ యూనివర్సిటీ, పసిఫిక్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బెర్క్లీ; హవాయిలోని అమెరికన్ స్టేట్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హవాయి; ఫ్లోరిడాలోని ఏమ్స్ క్రిస్టియన్ యూనివర్సిటీ, బ్యారింగ్టన్ యూనివర్సిటీ, బెల్ఫోర్డ్ యూనివర్సిటీ; జార్జియాలోని అండర్సన్ విల్లే టెక్నాలజికల్ యూనివర్సిటీ; టెక్సాస్‌లోని బీహెచ్ కారోల్ టెక్నలాజికల్ వర్సిటీ, కార్నర్ టెక్నాలజికల్ హౌస్; ఒరెగాన్లోని బిలవ్డ్ కమ్యూనిటీ యూనివర్సిటీ, క్యాంబీ బైబిల్ కాలేజ్; ఆర్కన్సాస్లోని బెట్టిస్ క్రిస్టియన్ యూనివర్సిటీ; మిసిసిపిలోని బిన్విల్లే యూనివర్సిటీ, కాల్ సదరన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి స్టేట్ యూనివర్సిటీ, కెన్బోర్స్యూనివర్సిటీ, కొలంబస్ యూనివర్సిటీ; లూసియానాలోని క్యాపిటల్ సిటీ రిలీజియన్ ఇనిస్టిట్యూట్, క్రిసెంట్ సిటీ క్రిస్టియన్ కాలేజ్; వర్జీనియాలోని కరోలినా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ; అలబామాలోని చాడ్విక్ యూనివర్సిటీ; నార్త్ కరోలినాలోని క్రిస్టియన్ బైబిల్ కాలేజ్; న్యూయార్క్‌లోని క్రిస్టియన్ లీడర్షిప్ యూనివర్సిటీ; టెన్నెస్సీలోని క్లర్క్వెల్లీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ; వాషింగ్టన్‌లోని క్రౌన్ కాలేజ్; మిషిగాన్‌లోని వెస్టర్న్ మిషిగాన్ బైబిల్ యూనివర్సిటీ.