న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు.
అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్‌ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర‍్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్‌ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్‌గా మార్చేసింది.
టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్‌ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్‌గా ఉన్న బ్రిగ్స్‌కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment