jessy
-
గ్రామీణ ఫ్యాక్షన్ నేపథ్యంగా 'ఏపీ04 రామాపురం' .. ట్రైలర్ విడుదల
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపీ 04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను సినీ, రాజకీయ ప్రముఖ అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సీ, నటుడు పృథ్వి కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ నటుడు జెస్సీ మాట్లాడుతూ.. ' ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.' అన్నారు. నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా డైరెక్టర్ మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్లో హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. 'ఒక టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్స్. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్లేమే. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తక్కువ బడ్జెట్లో తీశారు. ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యండి.' అని అన్నారు. దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ..'19 ఏళ్లప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశా. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశా. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్.' అని అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. మాకు ఉన్న చిన్న బడ్జెట్లో సినిమాను చేశాం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. -
వయస్సు ఏడాదే..సంపాదన ఎంతో తెలిస్తే ముక్కున వేసుకోవాల్సిందే
న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్‌ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా మార్చేసింది. టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్‌ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా ఉన్న బ్రిగ్స్‌కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి. -
అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్
ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగిటివిటి ఒకరూ బయటపెట్టడంతో రచ్చ రచ్చ జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వల్ల హౌజ్‌మెట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు జస్సీని నామినేట్ చేశారు. చదవండి: బిగ్‌బాస్ 5: నాగార్జున రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా! కాగా జస్సీ మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా జస్సీ ఓ సందర్భంలో మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్ సమయంలో విశ్వకు, జస్సీకి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్లో జస్సీ బాధపడ్డాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా జస్సీని నామినేట్ చేస్తూ ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్న’ అంటూ లిన చెప్పడంతో వెంటనే జస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్ దీంతో అందరూ అతడి ఓదార్చడం జరిగింది. దీనిపై బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్‌గా జస్సీకి మద్దతుగా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేస్తూ.. ‘నా తర్వాత, సీజన్ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌజ్ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్ ది బెస్ట్’ అని సూచించాడు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు ఈ వీకెండ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లే సభ్యులుగా డేంజర్ జోన్లో ఉన్నారు. -
భయపెట్టే జెస్సీ
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి.అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతోంది. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొదటి సినిమాగా విడుదల కావాల్సింది. కొన్ని కారణాలతో ఆలస్యం కావడంతో రెండో సినిమాగా విడుదవుతోంది. ఈ చిత్రంలో మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా మా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అశ్వినికుమార్. ‘‘ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్ చేశాను’’ అని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల అన్నారు. ‘‘మంచి చిత్రం చేశాం. ఇందులో హారర్ కంటే ఇద్దరు సిస్టర్స్ మధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు విమల్ కృష్ణ. అభినవ్ గోమటం పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్.ఎన్. -
వృత్తిపట్ల నిబద్ధతున్న వ్యక్తి.. జెస్సీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్: పనిలో నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జె.శ్రీనివాసులు (జెస్సీ) అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమీ తరఫున లక్ష నగదు, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్ అతి త్వరలో కల్పిస్తామని, అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ఆదివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సాక్షి స్పోర్ట్స్ జర్నలిస్టు జెస్సీకి ఆత్మీయ నివాళి కార్యక్రమం జరిగింది. జెస్సీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని జెస్సీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిజంలో జెస్సీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తాను అనుకున్నది కథనంలో చూపేవారని అన్నారు. జెస్సీ పేరుతో గేమ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆప్తుడిని కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. జెస్సీ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అని కొనియాడారు. సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చూస్తున్నామని అన్నారు. జెస్సీ స్నేహితుడు మైహోం ఇండస్ట్రీస్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వి.మహేశ్‌బాబు జెస్సీ కుటుంబానికి రూ.50 వేలు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి, జెస్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్
భువనేశ్వర్: ఒరియా టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్పీకి బెయిల్ లభించింది. మంగళవారం బలాసోర్ జిల్లా సెషన్స్ కోర్టు 2 లక్షల రూపాయల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 6న రంజిత్, జెస్సీ ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు బలాసోర్ జిల్లా ఖైరా ప్రాంతానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి జెస్సీతో పాటు చందన్ అనే మరో నటుడ్ని ఆహ్వానించారు. రంజిత్‌కు ఆహ్మానం లేకపోయినా జెస్సీకి తోడుగా వెళ్లాడు. జెస్సీ, చందన్ కలసి ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా, నిర్వాహకులు రంజిత్‌ను ఆహ్వానించారు. ఈ విషయం గురించి కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో వస్తూ జెస్సీ, రంజిత్ గొడవపడ్డారు. జెస్సీ పరుష పదజాలంతో నిందించింది. రంజిత్ కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పాడు. రంజిత్ కారు దిగి బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన రంజిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రంజిత్ పట్నాయక్ ఆత్మహత్యకు కారణమైందంటూ ఫిబ్రవరి 16న పోలీసులు జెస్సీని అరెస్ట్ చేశారు. -
నటుడి ఆత్మహత్య: టీవీ నటి అరెస్ట్
ఒడిషాలోని పాపులర్ టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సహనటుడి ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో టీవీ నటులు జెస్పీ, చందన్ పాల్గొనాల్సి ఉంది. రాజాను పిలవకపోయినా అతడు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే అసలు వెళ్లాల్సిన చందన్ మాత్రం గైర్హాజరయ్యాడు. దీంతో నిర్వాహకుల అభ్యర్థన మేరకు రాజా షో లో పాల్గొన్నాడు. షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది. ఇద్దరు కారులో వెడుతుండగా వివాదం మరింత ముదిరింది. రాజాను అవహేళన చేసిన జెస్సీ.. అతడిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని అవమానంగా భావించిన అతను డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి వంతెన పిట్టగోడ మీద నుంచి దూకేశాడు. దీనిపై రాజా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం, ప్రొఫెషనల్ విభేదాలే ఘర్షణకు కారణమని ఎస్పీ నితిశేఖర్ మీడియాకు తెలిపారు. జెస్సీతో పాటుఈవెంట్ కో ఆర్డినేటర్ ప్రాలే జెనా, డ్రైవర్ ధానేశ్వర్లకు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించామని ఎస్పీ తెలిపారు.