నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్ | Jessy granted bail | Sakshi
Sakshi News home page

నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్

Published Tue, Mar 1 2016 5:48 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్ - Sakshi

నటుడి ఆత్మహత్య కేసులో టీవీ నటికి బెయిల్

భువనేశ్వర్: ఒరియా టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్పీకి బెయిల్ లభించింది. మంగళవారం బలాసోర్ జిల్లా సెషన్స్ కోర్టు 2 లక్షల రూపాయల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

ఈ నెల 6న రంజిత్, జెస్సీ ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు బలాసోర్ జిల్లా ఖైరా ప్రాంతానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి జెస్సీతో పాటు చందన్ అనే మరో నటుడ్ని ఆహ్వానించారు. రంజిత్కు ఆహ్మానం లేకపోయినా జెస్సీకి తోడుగా వెళ్లాడు. జెస్సీ, చందన్ కలసి ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా, నిర్వాహకులు రంజిత్ను ఆహ్వానించారు. ఈ విషయం గురించి కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో వస్తూ జెస్సీ, రంజిత్ గొడవపడ్డారు. జెస్సీ పరుష పదజాలంతో నిందించింది. రంజిత్ కారును ఆపాల్సిందిగా డ్రైవర్కు చెప్పాడు. రంజిత్ కారు దిగి బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన రంజిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రంజిత్ పట్నాయక్ ఆత్మహత్యకు కారణమైందంటూ ఫిబ్రవరి 16న పోలీసులు జెస్సీని అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement