AP04 Ramapuram Movie Trailer Launch Event at Prasad Labs - Sakshi
Sakshi News home page

AP04 Ramapuram Movie: గ్రామీణ ఫ్యాక్షన్ నేపథ్యంగా 'ఏపీ04 రామాపురం' .. ట్రైలర్ విడుదల

Published Sat, Nov 26 2022 5:36 PM | Last Updated on Sat, Nov 26 2022 6:07 PM

AP04 Ramapuram Movie  trailer released Today At Prasad Labs - Sakshi

రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపీ 04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను సినీ, రాజకీయ ప్రముఖ అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సీ, నటుడు పృథ్వి కూడా పాల్గొన్నారు. 
 
బిగ్ బాస్ నటుడు జెస్సీ మాట్లాడుతూ.. ' ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.' అన్నారు. నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా డైరెక్టర్ మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్‌లో హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని అన్నారు.  

హీరో నందు మాట్లాడుతూ.. 'ఒక టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్స్. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్లేమే. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తక్కువ బడ్జెట్లో తీశారు. ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యండి.' అని అన్నారు.  

దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ..'19 ఏళ్లప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశా. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశా. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్.' అని అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. మాకు ఉన్న చిన్న బడ్జెట్‌లో సినిమాను చేశాం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement