అతనికి సినిమా అంటే ఫ్యాషన్.. యంగ్ హీరోకు బాలకృష్ణ ప్రశంస | Nandamuri Balakrishna Released Vishwak Sen Dhamki Movie Trailer | Sakshi
Sakshi News home page

Das Ka Dhamki Movie Trailer: పదివేల కోట్ల టర్నోవర్.. ఒక్కరాత్రిలో ఫట్‌.. ఆసక్తిగా ట్రైలర్

Published Fri, Nov 18 2022 9:37 PM | Last Updated on Sat, Nov 19 2022 6:28 AM

Nandamuri Balakrishna Released Vishwak Sen Dhamki Movie Trailer - Sakshi

యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజు జంటగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'దాస్‌ కా దమ్కీ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీలీజ్ చేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ట్రైలర్ విడదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

(చదవండి: అర్జున్‌ సర్జా-విశ్వక్‌ సేన్‌ వివాదం.. తెరపైకి మరో యంగ్‌ హీరో!)

ట్రైలర్‌ విషయానికొస్తే.. 'ఆరేళ్ల వయసున్న కంపెనీ, పదివేల కోట్ల టర్నోవర్, ఇవన్నీ ఒక్కరాత్రిలో స్టేట్‌లో పడిపోయాయి. సాయానికి ఒక గడ్డిపోచైనా దొరకపోతుందా. ఆదుకోవడానికి ఒక మనిషైనా ఉండకపోతాడా' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీతో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. 

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..'  ట్రైలర్ చాలా కనువిందుగా  ఉంది. విశ్వక్ సేన్‌కి సినిమా అంటే ఫ్యాషన్. ఎన్నో ఒడిదొడుకులను దాటి రిలీజ్ చేస్తున్నాడు. ఇలాంటి సినిమా చేస్తే నన్ను నేను ఊహించేసుకుంటాను. నాకు అన్ని జోనర్స్ చేయాలని ఉంటుంది. వచ్చే ఏడాది ఆదిత్య 999 ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.' అని అన్నారు.  హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్లో అంత స్వీట్ కూడా. నేను ఎంతో నమ్మిన సినిమా అందరికీ నచ్చుతుంది.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement