Vishwak Sen turned as waiter for 'Das Ka Dhamki' promotions - Sakshi
Sakshi News home page

Vishwak Sen: హోటల్‌లో వెయిటర్‌గా విశ్వక్‌ సేన్.. ఎందుకో తెలుసా?

Mar 21 2023 4:14 PM | Updated on Mar 21 2023 4:35 PM

Tollywood Hero Vishwak Sen Turns Into Waiter In A Hotel - Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమాతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే విశ్వక్ సేన్‌ ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. అందులో భాగంగా కొత్త అవతారంలో కనిపించిన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. 

వెయిటర్‌గా మారిన విశ్వక్ సేన్

విశ్వక్‌ సేన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా హోటల్‌లో వెయిటర్‌ అవతారమెత్తాడు. ఇదేంటీ అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే?
ఎందుకంటే ఉగాదికి రిలీజవుతున్న దాస్‌ కా ధమ్కీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ హోటల్‌కెళ్లి వెయిటర్ పాత్ర పోషించారు. కస్టమర్లను అడిగి ఆర్డర్లు తీసుకుని సర్వ్ చేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ పెట్టుకుని కస్టమర్లకు సర్వ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అసలు కారణం ఇదే

విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రంలో వెయిటర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏకంగా వెయిటర్‌ అవతారమెత్తి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. సాధారణ వెయిటర్‌గా హోటల్‌కు వచ్చిన వారికి వడ్డించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న కస్టమర్లు విశ్వక్‌సేన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చాలామంది గుర్తు పట్టలేకపోయామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏకంగా హీరో వచ్చి సర్వ్ చేయడం చాలా సర్‌ప్రైజ్‌గా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దాస్ కా ధమ్కీ మూవీ ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement