prithvi
-
పృథ్వీ వ్యాఖ్యలపై సారీ చెప్పిన విశ్వక్ సేన్
-
Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!
బిగ్‌బాస్ 8వ సీజన్ 13వ వారంలోకి ప్రవేశించింది. యష్మి ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. ఎప్పటిలానే సోమవారం మళ్లీ నామినేషన్స్ రచ్చ మొదలైంది. ప్రస్తుతం హౌసులో తొమ్మిది మంది ఉండగా.. ఇద్దరిని తప్పితే మిగిలిన అందరూ నామినేట్ అయ్యారట. ఇప్పటికే షూట్ జరగ్గా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)ప్రోమో బట్టి చూస్తే నబీల్.. గౌతమ్-విష్ణుప్రియని, పృథ్వీ.. అవినాష్‌ని నామినేట్ చేసినట్లు చూపించారు. వీళ్లతో పాటు రోహిణి-విష్ణుప్రియ మధ్య కూడా గతవారం పోటీల్లో చేసుకున్న 'క్యారెక్టర్' గొడవ గురించి ఈసారి నామినేషన్లలో రచ్చ జరిగిందట.మెగా చీఫ్ అవడంతో రోహిణి, ఈమెతో పాటు నబీల్.. ఈ వారం నామినేషన్లలో లేరట. మిగిలిన పృథ్వీ, నిఖిల్, అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ, తేజ, గౌతమ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 13వ వారం కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వీక్ అంతా ఏమేం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
తెలీదు!
నివాస్, అమిత శ్రీ జంటగా వినోద్ కుమార్, రఘుబాబు, పృథ్వీ, భరద్వాజ్, ఖయ్యూం కీలక ΄పాత్రల్లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ సినిమా గురువారం ఆరంభమైంది. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ నెల 18న రెగ్యులర్ షూట్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘మా సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది’’ అని శరత్‌బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్ .ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్. -
పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!
బిగ్‌బాస్ 8లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఎంతలా అంటే పృథ్వీ నిజంగా పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రేరణని టార్గెట్ చేశాడు. అవినాష్ వ్యక్తిగత విషయాలు తీసి దారుణంగా మాట్లాడాడు. ఇంతా చేశాడు గానీ ఏదైనా గట్టిగా అనుకున్నాడో అది మాత్రం సాధించలేకపోయాడు. వీళ్లిద్దరి వల్ల హరితేజ అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 15) ఏమేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.యష్మి డబుల్ ఫేస్ఏడో వారం నామినేషన్స ప్రక్రియ మధ్యలో ఆగడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టోపీని ప్రేరణకి దక్కకుండా చేయాలని నయని, పృథ్వీ అడ్డుకున్నారు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ, వీళ్లని డిఫెండ్ చేసే క్రమంలో యష్మి కింద పడిపోయింది. తనకు కాలు విరిగినా పర్లేదు కానీ ఏది కరెక్టో దానివైపే నిలబడతా అని చెప్పింది.యష్మి కన్ఫ్యూజన్ మాటలుపోడియం పైకి తేజ, నబీల్ వచ్చారు. నబీల్.. తేజని నామినేట్ చేశాడు. సొంత ఫ్రెండ్‌ని చెప్పి ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మి చెప్పిందని, ఇది తనకు నచ్చలేదని యష్మిని నామినేట్ చేశాడు. అయితే యష్మి.. ఫ్రెండ్ అనే ముసుగు వేసుకుని మరీ ప్రేరణని మోసం చేస్తోంది అని, యష్మిది డబుల్ స్టాండర్డ్ అని చెప్పుకొచ్చాడు. ఈ హంగామా అంతా కాసేపు నడిచింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)టార్గెట్ తేజఓజీ క్లాన్ అందరూ కలిసి తేజని టార్గెట్ చేయాలనుకున్నారు. నిఖిల్ చాలా తెలివిగా తన క్లాన్ అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో పోడియంపైకి వచ్చిన విష్ణుప్రియ.. నయని పావనిని రివేంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఇదంతా చెల్లదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఇదంతా తనని టార్గెట్ చేయడానికే అని తేజ బయటపెట్టాడు. విష్ణుప్రియ డమ్మీ నామినేషన్ వేస్తే.. పక్కనోళ్లు తన పేరు చెబుతారని.. అలా తను నామినేషన్ లోకి వచ్చేలా ఇదంతా చేస్తున్నారని ఓజీ క్లాన్ బండారాన్ని తేజ బయటపెట్టాడు. కానీ నిఖిల్, తేజ పేరే చెప్పాడు. టోపీ ఉన్న హరితేజ.. తేజ పేరునే నామినేట్ చేస్తూ ఫైనల్ చేసింది. దీని తర్వాత గౌతమ్ మరోసారి పసలేని వాదన తీసుకొచ్చి నబీల్ పేరు చెప్పాడు. కాస్త హంగామా నడిచిన తర్వాత ఊహించని విధంగా నబీల్ నామినేట్ అయ్యాడు.పృథ్వీ చీప్ కామెంట్స్బిగ్బాస్ ఎపిసోడ్స్ ఏం చూడకుండా తనని గతవారం అవినాష్ నామినేట్ చేశాడని, అందుకే ఈ వారం అతడిని నామినేట్ చేస్తున్నానని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్ నిజాయతీగా తన వాదన వినిపించాడు. షూటింగ్స్ వల్ల తాను అన్ని ఎపిసోడ్స్ చూడలేదని, ఈ విషయాన్ని నాగ్ సర్కి కూడా చెప్పానని అన్నాడు. తన భార్య ఎపిసోడ్స్ అన్నీ చూసి తనకు కొన్ని పాయింట్స్ చెప్పిందని, వాటి వల్ల పృథ్వీని నామినేట్ చేశానని అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు వచ్చారు, మీ భార్యనే ఇక్కడకు రావాల్సింది అని పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. వైఫ్ మ్యాటర్ తీయకు అని అవినాష్ ఫుల్ సీరియస్ అయ్యాడు.నోరు జారిన పృథ్వీషూటింగ్స్లో బిజీగా ఉండటం తాను చూడలేకపోయానని అవినాష్ ఎంత చెబుతున్నా సరే పృథ్వీ ఊరుకోలేదు. సరికదా సైకోలా ప్రవర్తించి బిగ్‌బాస్‌లోకి వచ్చేందుకు షూటింగ్స్ లేవా? అని వెటకారంగా మాట్లాడాడు. పృథ్వీ పనేం చేయట్లేదని, గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పిందని గుర్తుచేశాడు. 'గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా' అని పృథ్వీ అనేసరికి.. 'రేయ్ రా అనకు' అని అవినాష్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను అలానే అంటాను అని పృథ్వీ పైపైకి వచ్చాడు. అలా తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది అనే రేంజులో తగాదా పడ్డారు. మరో పోడియంపై నిలబడ్డ నయని.. విష్ణుప్రియ పేరు చెప్పింది. కానీ పాయింట్లో బలం లేకపోయింది. దీంతో పృథ్వీ చెప్పిన అవినాష్ పేరునే పరిగణలోకి తీసుకుంది.అనుకున్నది జరగలేఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ, నబీల్, మణికంఠ నామినేషన్స్‌లో ఉన్నారని.. అలానే తక్కువసార్లు టోపీ పట్టుకున్న కారణంగా ప్రేరణ నామినేట్ అయిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉన్నందున ఒకరిని సేవ్ చేసుకోవచ్చని కానీ మరొకరిని ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అవినాష్.. తన బదులు హరితేజ పేరుని చెప్పాడు. అలా ఈసారి ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు.. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్స్‌లోకి వచ్చారు.పృథ్వీ మనిషి కాదు సైకో?రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్‌లో అందరూ గేమ్ పరంగా ఎంత ఉండాలో అంతలా కనిపించారు. పృథ్వీ మాత్రం సైకోలా ప్రవర్తించాడు. ప్రేరణ తనని కావాలనే టార్గెట్ చేసిందని, ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక అవినాష్‌తో అయితే కనీసం బుర్ర లేని పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఇలాంటి వాడిని అసలు బిగ్‌బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో? ప్రేక్షకుల మైండ్ ఎందుకు కలుషితం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర గౌరవం కావాలి: మణి
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటివారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్కవాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. అసలేం జరిగిందో, నేటి(సెప్టెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి..పని చేయట్లేదంటూ..ఆదిత్య ఓం.. వాలంటీర్‌గా పనులు చేయడం లేదని శేఖర్ బాషాను, తక్కువ పని చేస్తున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ ఇద్దరిలో చీఫ్ యష్మి.. శేఖర్ బాషా నామినేషన్‌కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత.. బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్‌ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ.. బాషా, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ బాషా నామినేషన్నే ఫైనలైజ్ చేసి సోనియాను సేవ్ చేశాడు. అన్‌ఫిట్ అయితే పోతా..అనంతరం అభయ్ నవీన్.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎవడికీ అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్‌లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్‌లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకునేవాళ్లే హౌస్‌లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్టేట్ అయ్యాడు. అనంతరం అభయ్.. బేబక్కను నామినేట్ చేశాడు. పుండు మీద కారం చల్లినట్లు చీఫ్ యష్మి.. నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది.మళ్లీ బాధలు చెప్పుకున్న మణితర్వాత ప్రేరణ.. నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. ఏడో తరగతి నుంచి నానాకష్టాలు పడ్డాను. కన్నతండ్రిని పోగొట్టుకున్నా, సవతి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీదా నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో, చచ్చిపోదామనుకుంటున్న క్షణంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికీ అర్థం కావడం లేదు. నేనెక్కడా విక్టిమ్ కార్డ్ వాడటం లేదు.నా జీవితం దగ్గరుండి చూశారా? నా కర్మ కాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు, నేను వెళ్లిపోతున్నానంటూ కోప్పడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదేపదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూశారా? అని అందరినీ నిలదీస్తూనే.. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ.. అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు.ఏడిపించేసిన మణినేను గేమ్ గెలవాలనుకున్నాను. కనీసం ఐదు వారాలైనా ఉండాలనుకున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్నాక అతడి కంటే కూడా యష్మినే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ.. సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్.. నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు.అందుకే తిరిగావా?నాగమణికంఠ.. నేను క్యూట్‌గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ఱుప్రియ ఏమైనా పదాలు జారుతుందేమోనని మూడురోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్నిరోజులు ఫ్రెండ్‌గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా? అని విష్ణుప్రియ ఎమోషనలైంది.సింపతీ కార్డ్అనంతరం బాషాను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మొరిగిందిగా, అది తప్పు కాదా అని బాషా కౌంటరిచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఫ్లాష్‌బ్యాక్ ఉంది, అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు.. నువ్వు ఏదో సింపతీ, రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి.. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ బాషాను సేవ్ చేశాడు.నామినేషన్లో ఎవరంటే?తర్వాత పృథ్వీ.. నీకు సీరియస్‌నెస్ లేదంటూ బేబక్కను, సింపతీ కార్డ్ వాడుతున్నావు, రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటివారం బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. నా చివరి యుద్ధండ్యాం గేట్లు ఎత్తినట్లు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కూ లేదు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, రేపు నేను బయటకు వెళ్లాక నన్ను నెగెటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే విగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.నా భార్య నాక్కావాలిఅతడు కన్నీళ్ల టాప్‌ను కట్టేయకపోవడంతో బిగ్‌బాస్ నను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అక్కడ.. నా భార్య నాక్కావాలి, అత్తామామ దగ్గర నాకు గౌరవం కావాలి. నా సవతి తండ్రి నాక్కావాలి. నా పాప నాకు కావాలి. నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను.. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదంటూ మళ్లీ విలపించాడు. దీంతో బిగ్‌బాస్.. నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేశాడు.మరిన్నిబిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఊహించని మలుపులు
పృథ్వీ కృష్ణ, శ్రీ విద్య జంటగా శ్రావణ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎయిమ్’. ఎంఎన్ రావు, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్ర కథలో పలు మలుపులు ఉన్నాయి. పి. గోపాల్ రెడ్డి స్వరపరచిన ఐదు పాటలు బాగుంటాయి. తల్లిదండ్రులకు.. ముఖ్యంగా యువతరానికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
డిస్కంల ప్రతిపాదనలపై రోత రాతలా?
గడచిన నాలుగేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం చేస్తున్న రుణాలకు ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 650 కోట్ల వరకూ డిస్కం అదనంగా చెల్లిస్తోంది. ఇదేమీ కొత్తగా తీసుకున్నది కాదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. రూ. 1,468.98 కోట్లు ఆ ఐదేళ్లలో తీసుకున్నవే. సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి ఓ అబద్ధపు కథనాన్ని అచ్చేసింది. ‘విద్యుత్ వినియోగదారులపై వడ్డీ బాదుడు’ శీర్షికన మంగళవారం అభాండాలను రాష్ట్ర ప్రభుత్వంపై వేయాలని ప్రయత్నించింది. కానీ ఎప్పటిలాగే రామోజీ రాతల్లో వాస్తవాలు లేవని తేటతెల్లమైంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు, ఈనాడు కథనంలో అంశాలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృథ్వీతేజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ప్రజలపై భారం వేయడానికి కాదు సంప్రదాయ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా విద్యుత్ కొంటే పంపిణీ సంస్థకు దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విద్యుత్ వ్యయ చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం విద్యుత్ ఒప్పందాలు(పీపీఏ)కు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తోంది. దానికి బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ ఖర్చు డిస్కంలు భరిస్తున్నాయి. అదే బహిరంగ మార్కెట్లో రోజు వారీ లోటు విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపు చేయాలి. దానికి డిస్కంల వద్ద తగినంత నగదు లేక పోవడం వల్ల బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకోవలసివస్తోంది. ఆ రుణాలపై వడ్డీలు కట్టవలసిన బాధ్యత కూడా డిస్కంలపై ఉంది. ఆ స్వల్పకాలిక రుణాలపై అయ్యే వడ్డీ మాత్రమే సంస్థ వార్షిక ఆదాయ వ్యయ (ఏఆర్ఆర్) నివేదికలో పొందుపరచాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఏపీఈపీడీసీఎల్ కోరింది. అంతేకానీ ఈనాడు చెప్పినట్లు గత నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చేసిన ఖర్చుపై వడ్డీ లెక్కించి, ఆ మొత్తాన్ని ప్రతి నెలా విద్యుత్ బిల్లుతో కలిపి వసూలు చేయడానికి కాదు. ఏపీఈఆర్సీకి చెప్పాల్సిందే విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణకు సహేతుకంగా అయ్యే ఖర్చు మొత్తం నిబంధనల ప్రకారం ఈఆర్సీకి నివేదించాల్సిందే. వాటిపై కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వాడుకుంటున్నందుకు వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అప్పులపై వడ్డీ, వీలింగ్ చార్జీలు వర్కింగ్ కేపిటల్ పరిధిలోకి వస్తాయి. అందువల్ల వీటిని కూడా వాస్తవ ఆదాయ వ్యయాల పద్దులో చేర్చాలని నివేదికలో డిస్కం పొందుపరిచింది. ప్రభుత్వం సక్రమంగానే ఇస్తోంది వివిధ సంక్షేమ పథకాలకు, వ్యవసాయ వినియోగానికి ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ ప్రతినెల సకాలంలోనే వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలకు ప్రతినెల సర్ చార్జీలు విధిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సరిపోవటం లేదనే వాదన వాస్తవం కాదు. అంతే కాకుండా విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్‌పై ప్రతి ఏటా మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రేట్ల ప్రకారం వడ్డీ మొత్తాన్ని వినియోగదారులకు డిస్కంలు చెల్లిస్తున్నాయి. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బు విద్యుత్తు కొనుగోలు అవసరాలకు సరిపోదు. -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
ప్రేమ.. సందేశం
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీలోని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, రచయిత కోన వెంకట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి రాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తి జీవితంలో ఉండే ఓ అంశం మా చిత్ర కథలో ఉంటుంది. స్క్రిప్ట్‌పై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ కథపై నమ్మకంతో నేను సినిమా నిర్మించడంతో పాటు హీరోయిన్గా నటిస్తున్నాను’’ అన్నారు సుమయా రెడ్డి. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో పాటు మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు పృథ్వీ అంబర్. -
మనవడితో ముఖేష్ అంబానీ మురిపెం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియో!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కొడుకు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోక మెహతా, మనవడు పృథ్వీతో కలిసి సిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనవడు పృథ్వీని ముఖేష్ అంబానీ ఎత్తుకుని కనిపించారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు, ఆలయంలో ఉన్నంత సేపు ఆయన తన మనవడిని ఎత్తుకునే ఉన్నారు. వారి వెంట పృథ్వీ తల్లి, ప్రస్తుతం గర్భిణిగా ఉన్న శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ కుటుంబం గత వారం కూడా సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించింది. అప్పుడు కూడా ముఖేష్ అంబానీ మనవడిని ఇలాగే ఎత్తుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు, బుల్లెట్ తగలడంతో..
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ షూటింగ్లో గాయపడ్డాడు. సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి స్పెషల్ ప్రోమో షూట్ చేసే క్రమంలో అతడికి గాయాలయ్యాయి. సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం అన్‌స్టాపబుల్. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఓ ప్రోమో షూట్ నిర్వహించింది. ఇందులో పోలీస్ గెటప్‌లో ఉన్న సప్తగిరి అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు? అని గన్ పట్టుకుని పృథ్వీరాజ్‌ను బెదిరించాడు. ఇంతలో అటువైపుగా సన్నీ రావడంతో పృథ్వీ అతడిపైకి గన్ ఎక్కుపెట్టాడు. పొరపాటున అది పేలడంతో సన్నీకి బుల్లెట్ తగిలింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ సన్నీకి గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ డమ్మీ గన్ను కావాలనే పేల్చారని, సన్నీకి ఏ గాయమూ కాలేదని, ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలోనూ సన్నీ డబ్బులు దొంగతనం చేసిన వీడియో వైరల్ అయింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ కోసం అలా స్టంట్ చేశాడని ఇట్టే పసిగట్టారు ఆడియన్స్. ఇకపోతే గతంలో సీరియల్స్‌లో నటించిన సన్నీ బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. షూటింగ్ లో బిగ్ బాస్ సన్నీకి ప్రమాదం బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలింపు#vjsunny #UnstoppableEknath pic.twitter.com/CO3Vqtf3Kn — yenugula somasekhar (@yenugulasomase1) May 12, 2023 చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
ఘనంగా ఆకాశ్ అంబానీ కుమారుడు పృథ్వీ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
గ్రామీణ ఫ్యాక్షన్ నేపథ్యంగా 'ఏపీ04 రామాపురం' .. ట్రైలర్ విడుదల
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపీ 04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను సినీ, రాజకీయ ప్రముఖ అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సీ, నటుడు పృథ్వి కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ నటుడు జెస్సీ మాట్లాడుతూ.. ' ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.' అన్నారు. నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా డైరెక్టర్ మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్లో హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. 'ఒక టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్స్. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్లేమే. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తక్కువ బడ్జెట్లో తీశారు. ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యండి.' అని అన్నారు. దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ..'19 ఏళ్లప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశా. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశా. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్.' అని అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. మాకు ఉన్న చిన్న బడ్జెట్లో సినిమాను చేశాం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. -
Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి..
Cooch Behar Trophy: బెంగాల్‌తో జరుగుతున్న కూచ్‌బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ పేస్ బౌలర్ పృథ్వీ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. పృథ్వీ (5/54) ధాటికి మ్యాచ్ తొలి రోజు సోమవారం బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ పొరేల్ (145 బంతుల్లో 104; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తౌఫీకుద్దీన్, అభిషేక్ పొరేల్, ఇర్ఫాన్ ఆఫ్తాబ్, సిద్ధార్థ్ సింగ్, శశాంక్ సింగ్‌లను పృథ్వీ రెడ్డి అవుట్ చేశాడు. ఓవరాల్‌గా పృథ్వీ రెడ్డి 14 ఓవర్లు వేయగా అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. ఇతర హైదరాబాద్ బౌలర్లలో శశాంక్, అభిషేక్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
మిస్సింగ్ కథతో...
పృథ్వీ, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటి కృష్ణమూర్తి’. శ్రీవర్థన్ దర్శకత్వంలో ప్రసాద్ నేకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్‌తో, మిస్సింగ్ కథతో థ్రిల్లర్‌గా మా చిత్రం తెరకెక్కింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఐఐటి కృష్ణమూర్తి’ ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రేక్షకులను అలరిస్తుందని అభినందనలు తెలిపారు’’ అన్నారు. మైరా దోషి మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ నాకెంతో స్పెషల్ ఫిల్మ్. ఇందులో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు. శ్రీవర్థన్ మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి నాతో ఈ ప్రాజెక్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే జానర్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించటం జరిగింది’’ అన్నారు. ‘‘సినిమా కాన్సెప్ట్ బావుంది. దర్శకుని కథ, కథనాల ఎంపిక నచ్చింది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
ఆది@ అథ్లెట్
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ కథను రాసుకుంటున్నంత సేపు నా మనసులో ఆదిగారే మెదిలారు. కథ విన్న ఆయన చేస్తానని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయనతో పని చేయడానికి ఉత్సాహంగా ఉంది. అథ్లెటిక్స్ (క్రీడాకారులు)కు సంబంధించిన కథ ఇది. తన కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఇతర వివరాలు చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్), కెమెరా: ప్రవీణ్ కుమార్. -
కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్
పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ’. శ్రీ వర్థన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను నిర్మాత కె.ఎస్ రామారావు విడుదల చేశారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం టీజర్ ఇంటెన్స్‌గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. యూత్ అంతా కలిసి చేసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్‌ను అందించాలి’’ అన్నారు. ‘‘కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. నేటి తరానికి నచ్చేలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. ప్రేక్షకులందరికీ మా ‘ఐఐటి కృష్ణమూర్తి’ నచ్చుతాడని నమ్ముతున్నా’’ అని శ్రీ వర్ధన్ అన్నారు. ‘‘నాకు సినిమా ఫీల్డ్ కొత్త. ఈ చిత్ర దర్శకుడు, రైటర్ పట్టుదల, కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది’’ అని ప్రసాద్ నేకూరి అన్నారు. ‘‘నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్సే ఈ చిత్రానికి రియల్ హీరోస్’’ అని పృథ్వీ దండమూడి అన్నారు. చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పాత్ర, సంగీత దర్శకుడు నరేష్ కుమారన్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని, బాబ్జీ, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యేసు.పి, లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి. -
అపానాన్ని క్షయం చేసిన సాయి
ఎంతో ఎత్తుకి ఎక్కిన వ్యక్తికి ఎలా ఇదీ అదీ అనే భేదం లేకుండా అన్ని వస్తువులూ ప్రకృతిలో కనిపిస్తాయో, అలాగే తనదైన తపస్సు శక్తిలో ఎంత ఎత్తు సాధించాలో అంత ఎత్తుకీ ఎదిగిన సాయినాథునికి సర్వసిద్ధులూ లభించాయి. ఆ కారణం చేతనే పంచభూతాలు తనకి వశమయ్యాయి. తనకి వశమయ్యాయి కదా! అని శ్రీమద్రామాయాణంలో రావణునిలాగా ఆ పంచభూతాలకీ వ్యతిరేకదిశలో కాకుండా అనుకూల దిశలోనే సానుకూలంగా సాయి ప్రవర్తించాడు కాబట్టే, ధర్మబద్ధమైన ఆయన ప్రవర్తనకి అనుగుణంగా పంచభూతాలు ఆయనకి లోబడిపోయాయి. ఆ నేపథ్యంలో క్రమంగా పృథ్వి అప్ తేజస్సు అనేవి ఎలా లోబడ్డాయో ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాక వాయువులోని ప్రాణవాయువు వశమైన తీరుని కూడా సోదాహరణంగా అర్థం చేసుకున్నాక అపానమనే వాయువు ఆయనకి ఎలా వశమయ్యిందీ తెలుసుకుందాం! ఈ వాయువు గొప్పదనం హృది ప్రాణో గుద్వేపానః సమానో నాభిసంస్థితః ఉదానః కంఠదేశస్థః వ్యాస స్పర్వశరీరగః అని శ్లోకం. హృదయంలో ఉండేది ప్రాణవాయువు. గుదంలో ఉండేది అపానవాయువు. కంఠంలో నిలిచి ఉండేది ఉదానవాయువు. నాభి(బొడ్డు)లో ఉండేది సమాన వాయువు. ఎక్కడ ఏ వాయుశాతం తగ్గిందో గమనించుకుంటూ ఆ వాయువు ఎంత పరిమాణంలో తగ్గిందో అంతనీ పూరించి – ఏ ప్రదేశంలో ఎంత వాయువుండాలో అంత స్థాయిలోనూ, అంత పరిమాణంలోనూ, ఆయా వాయువు ఉండేలా చేసే లక్షణమున్నదీ ప్రాణవాయువులాగా కంఠంలో మాత్రమే, సమానవాయువులాగా నాభిలోనే కాకుండా, శరీరం నిండుగా సంచరిస్తూనే ఉండేది వ్యానవాయువు అని ఈ శ్లోకానికర్థం. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా శ్మశానానికి దగ్గరగా, పెద్ద భవంతిలో ఉంటే అతడ్ని ఎలా తక్కువగా అనుకుంటారో ఆయన చిరునామా చెప్పబోయినా శ్మశానం దగ్గర.. అని ఎలా చెప్తారో అలాగే అపానమనే వాయువు ఎంతో గొప్పదే అయినా అది ఉండే ప్రదేశం గుదం అయిన కారణంగా దాన్ని తక్కువగా లెక్కిస్తారు. హేయంగా పరిగణిస్తారు. మరి నిజంగా ఇది నీచమూ, హేయమూ అయిన వాయువే అయిన పక్షంలో సర్వులూ ఆరాధించే పరమాత్మకి మహా నైవేద్యాన్ని పెట్టే సందర్భంలో కూడా ‘ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా...’ అంటూ ఈ వాయువుని ఎందుకు చెప్తారు? ఈ తీరుగా ఆలోచించినప్పుడు మాత్రమే ఏది అపార్థమో మనకి అర్థమయ్యే అవకాశముంటుంది. అందుకే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘పురాణవైర గ్రంథమాల’ అనే ఒక గ్రంథాన్ని రచించి పురాణాన్ని ఎలా వంకరదృష్టితో అనుమానిస్తూ దాని ‘లో విశేషాన్ని’ అర్థం చేసుకోవాలో తెలిపారు. సరే! ఆ విషయాన్ని అలా ఉంచి అపానమనే వాయువు గొప్పదనాన్ని తెలుసుకుని, దాన్ని ఎలా సాయినాథుడు అదుపు చేసి ఎవర్ని ఎలా రక్షించాడో చూద్దాం! మనకి శరీరంలో నవ రంధ్రాలున్నాయి. మొదటిది త్వక్– అంటే చర్మం. చర్మానికుండే ప్రతి వెంట్రుక కిందా ఒక చిల్లుంటుంది. దాన్నే రోమరంధ్రం అంటారు. ఈ కోట్లసంఖ్యలో ఉండే చిల్లుల్లో నుండి అపానమనే వాయువు, శరీరంలో దాక్కుని, వ్యాధిని కల్గించడానికి సిద్ధంగా ఉంటూ ఏ మాత్రమూ కనిపించకుండా దాగిన క్రిముల్నీ కీటకాలనీ స్వేదం(చెమట) రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది. అందుకే చెమట పట్టేలా శ్రమచేయాలంటారు వైద్యులు.రెండువది చక్షువు– అంటే కన్ను. పగలంతా దుమ్ములో ధూళిలో ఉంటాం కాబట్టి వాటి వల్ల నేత్రాలకి వ్యాధి రాకుండా ఉండేలా చేస్తుంది అపానమనే వాయువు తెల్లని ఓ పదార్థాన్ని (ఉదయానే లేచి శుభ్రం చేసుకుంటాం. ‘పుసి’ అంటారు దాన్నే) బయటికి పంపించేస్తూ.మూడవది శ్రోత్రం– అంటే చెవి. గులిమి అనే పేరుతో అశుభ్ర పదార్థాన్ని బయటికి పంపించేది ఈ వాయువే. వ్యాధి వచ్చిన సందర్భంలో చీముని పంపించేది కూడా ఇదే. అలాగే (జిహ్వ) నాలుక ఉపరితలం మీద ‘పాచి’ అనే అశుభ్రపదార్థాన్నీ (ఘ్రాణ) ముక్కు నుంచి జలుబు చేసినప్పుడు నీటినీ, అలాగే అశుభ్రపదార్థాన్నీ(చీమిడి) వీటితో పాటు రెండు విసర్జకావయవాల నుండీ వేగాలనీ (మలమూత్రాలనీ) స్త్రీలకైతే నెలసరి రజస్సునీ బయటికి పంపించేది ఈ వాయువే.తినరాని పదార్థాన్ని తానులోపల ఉన్న వ్యక్తి నోటి నుంచి వమన (డోకు–వాంతి) రూపంగా నెట్టేసేదీ, వాయునాళంలోనికి పొరపాటున ఆహారపు మెతుకు వెళ్లినట్లయితే పెద్దతుమ్ము రూపంలో (నలభై కిలోమీటర్ల వేగం ఎంతగా ఉంటుందో) పెద్ద వేగంతో ఆ పదార్థాన్ని బయటికి నెట్టేసేదీ ఇదే వాయువు.మన ఇళ్లలో కుళాయిలన్నింటిలోనూ నీరు నిలువ ఉన్నప్పటికీ ఎలా గాలి వెళ్లడం కోసం ఒక గొట్టాన్ని మేడ మీద ఉండే నీటి తొట్టికి అమర్చి ఆ గాలితోపుడు కారణంగా కుళాయి తిప్పగానే నీటిని కిందికి వచ్చేలా అమరికని చేసామో, అలాగే శరీరం నిండుగా పుట్టుకతో లభించిన రక్తాన్ని మొత్తం అన్ని అవయవాలకీ ప్రసరణం జరిగేలా చేసి వ్యక్తిని రక్షిస్తున్నది కూడా ఈ వాయువే. ఇలా ఈ వాయువు గురించిన గొప్పదనాన్ని ఎంతైనా వ్రాయవలసింది ఉంది ఉంటుంది. ఇంత గొప్పది ఈ వాయువైన కారణంగానే భగవద్గీతలో కృష్ణుడు కూడా ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ – ప్రాణ అపానాలనే వాయువుల కారణంగానే ప్రతి జీవీ తింటున్న ఆయా ఆహారపదార్థాలని వండటం నాకు సాధ్యమౌతోందని తెలియజేశాడు. అంతటి అపానమనే వాయువు సాయినాథునికి ఎలా అదుపులో ఉంచ వీలయిందో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం! అనన్యచింత పూనా జిల్లాలో జున్నార్ తాలూకాలో నారాయణ అనే గ్రామంలో భీమాజీ పాటిల్ అనే ధార్మికుడు ఉండేవాడు. ఎప్పుడూ వ్రశాంత చిత్తంతో చిరునవ్వు ముఖంతో ఉంటూ ఉండేవాడు. తనకి ఎంతో ధనం ఉన్నా అహంకారం లేకుండా ప్రవర్తించేవాడు. అతిథి సత్కారాలు చేసేవాడు. బంధువుల్ని ఆదరించేవాడు. ఎవరైనా సాయమడిగితే కాదు, లేదు, కూడదనకుండా పాత్రత ఎరిగి దానం చేస్తూ ఉండేవాడు. అన్నసంతర్పణలు చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఇంతటి ఉత్తముడు చిరకాలం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఉండేవారు.రోజులన్నీ ఒకేలా గడిస్తే భగవంతుడెక్కడున్నాడంటూనూ, అంతా తన ప్రతిభే అనుకుంటూనూ, పూర్వజన్మలూ, పాపాలూ ఈ జన్మలో అనుభవించడాలూ.. ఇదంతా ఓ కట్టుకథే అనుకుంటూనూ ఉంటారుగా లోకజనం. అందుకేనేమో 1909లో పాటిల్‌కి అకస్మాత్తుగా దగ్గు ప్రారంభమైంది. ఏవో మందులూ మాకులూ వాడారు. ప్రయోజనం లేకపోయింది సరికదా దీపాన్ని అలా వత్తిని పెంచి ప్రకాశాన్ని మరింత చేసినట్లుగా రోజురోజుకీ వ్యాధి తీవ్రమై అది క్షయవ్యాధిగా నిర్ధారింపబడింది. దగ్గుధ్వనిని కుటుంబసభ్యులు కూడా తట్టుకోలేకపోతుండేవారు. కఫం, రక్తం కూడా నోటి నుంచి పడుతూ ఉంటే భరించలేకపోయేవారు. నోటి నుంచి ఉమ్మి నురుగలు నురుగలుగా పడుతూంటే, అది కూడా దుర్వాసనతో పడుతూ ఉంటే కుటుంబసభ్యుల అసహనాన్ని గమనిస్తూ పాటిల్ మెల్లగా మంచానికే అతుక్కుని ఉండాలని భావించి అలాగే మంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఒక మట్టికుండని పెట్టుకుని ఈ వాంతి రక్తం ఉమ్మినంతా దాంట్లో పడేలా జాగ్రత్త పడేవాడు.కుటుంబసభ్యులు వైద్యుల్ని సంప్రదించారు. ఆంగ్ల, హోమియో, యునానీ, గిరిజన, ఆయుర్వేద... ఇలా అన్ని రకాల వైద్యాలూ పూర్తయ్యాయి కానీ ఏ ఒక్కటీ గుణాన్ని ఇయ్యలేదు. ఇది ఏ మాత్రమూ తగ్గే వ్యాధి కాదని వైద్యులయితే చెప్పలేదు గానీ, పాటిల్‌కి తన అనుభవం మీద అర్థమవుతూ వచ్చింది.జ్యోతిష్కులెందరో వచ్చి ఆ గ్రహప్రభావం, ఈ గ్రహ నీచ దృష్టీ అంటూ ఈ హోమాలూ, ఆ యాగాలు, మరో యజ్ఞాలు, దానాలూ, జపాలూ, శాంతులూ... ఇలా చేయించి చేయించి తొందరలో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఎవరేమి చెప్పినా పాటిల్‌కి అర్థమైంది తనకొచ్చిన వ్యాధి లొంగేది కానే కాదని.ఇక సోది చెప్పించడాలు.. దృష్టి(దిష్టి) తీయడాలూ.. భూతవైద్యచికిత్సలు... వంటి తాంత్రిక వైద్యాలు కూడా చేయించారు కుటుంబ సభ్యులు. అయినా ఏ ఫలితమూ లేదు.‘పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే’ పూర్వజన్మలో జన్మల్లో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధిగా పరిణమించి అనుభవించేలా చేస్తుందని పెద్దలు చెప్పిన మాటలు చెవిలో గింగిర్లాడసాగాయి పాంటిల్కి.పాటిల్ గొప్పదనమేమంటే.. వైద్యులంతా మా శక్తిమేరకి వైద్యం చేసాం! అని వెళ్లిపోతుంటే.. మీలో దోషం లేదు. అనుభవించాల్సిన యోగం నాకుంది’ అని పలికేవాడే తప్ప ధనం ఖర్చుపెట్టించారనీ, అసమర్ధులనీ వాళ్లని గురించి ఒక్కమాటని వాళ్ల సముఖంలోగానీ పరోక్షంగా గానీ అనకపోవడమే. అలాగే జ్యోతిషులతో కూడా మీరు చేయగలిగిందంతా ఆ భగవంతుడ్ని మెప్పించడానికే చేశారు. ఆ భగవంతుడు నా పట్ల కరుణ చూపకపోతే మీ దోషమేముంది? అని అన్నాడే తప్ప ఒక్కమాటని చులకన చేస్తూ అననేలేదు పాటిల్. ఇక తాంత్రిక వైద్యులతోనూ ఆ ప్రక్రియలని పాటించినవారితోనూ కూడా ఒక్కమాటని వ్యతిరేకిస్తూ పలకలేదు సరికదా నా విషయంలో ఫలించలేదనే భావంతో ఇతరులకి ఈ చికిత్సని చేయడం మానకండి. ఏ పుట్టలో ఏ పాముందో? ఎవరికి తగ్గుతుందో? తప్పక కొనసాగించండి మీ వైద్యవిధానాన్ని! అనే అన్నాడు.అందుకే పాటిల్‌ని ఎరిగున్నవారూ, చికిత్సలు చేసినవారూ, జ్యోతిష్యులూ, బంధుమిత్రులూ, ఆప్తులూ, శ్రేయోభిలాషులూ ఇలా అందరూ కూడా పాటిల్‌కి ఈ తీరు వ్యాధిని రప్పించిన భగవంతుడెంత నిర్దయుడంటూ భగవంతుడి గురించే మనసులో మరోలా ఆలోచించుకున్నారు–అనుకున్నారు.వ్యాధివచ్చాక దాదాపుగా ప్రతిరోజూ ఓ రెండుగంటలపాటే నిద్రపోయే పాటిల్‌కి ఓ రోజు రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. అప్పటివరకూ ఏదో ఒక రోజున వ్యాధి నుంచి బయటపడగలననే నమ్మకం ఉండేది గానీ ఆ రాత్రి తనకి ఓ దృఢనిశ్చయం కలిగింది. తప్పక తొందర్లో అంటే రోజుల్లోనే మరణిస్తానని. అందుకే తనకెవరూ దిక్కులేరనే భావంతో (అనన్య చింత అంటే ఇదే) భగవంతుడ్నే ధ్యానించసాగాడు మౌనంగా దుఃఖంతో, నిర్వేదంతో, అందరికీ మంచినే చేసే తనకీ కష్టం ఎందుకు కలిగిందా? అనే సమాధానం తెలియని ప్రశ్నతో.అంతే! ఆకాశంలో చిమ్మచీకటిలో ఒక్కసారిగా మెరుపు కనిపించి మొత్తం పరిసరాలని కళ్లకి కట్టినట్లు చూపించినట్లుగా ఓ ఆలోచన తట్టింది. తనకి బాగా మిత్రుడైన ‘నానా’ నిరంతరం సాయి సేవలో తరిస్తూ ఉండే నానా(నానా సాహెబ్/నారాయణ గోవింద ఛాందోర్కర్) మనసులో మెదిలాడు. తన బాధని ప్రతి అక్షరం వివరించే తీరులో ఉత్తరం రాసి నానాకి పంపించాడు చిట్టచివరి ఉపాయంగా.నానాకి పాటిల్ రాసిన ఉత్తరంలోని ప్రత్యక్షరమూ పాటిలే దుఃఖంతో పూడిపోయిన కంఠస్వరంతో మాట్లాడుతూ చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఆ మనోబాధకి తట్టుకోలేకపోయాడు నానా. దానికి కారణం పాటిల్ అజాతశత్రుత్వం, దయాదాన ధర్మగుణం, సంపూర్ణ సజ్జన లక్షణం, సంస్కార సంప్రదాయధోరణీ.. ఇలాఒకటేమిటి? అన్నీ అతనిలో ఉండటమే.పరిష్కారం!నానా వెంటనే ఉత్తరాన్ని రాసాడు పాటిల్! నీకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అనుభవపూర్వకంగానూ వాస్తవజ్ఞానంతోనూ అనేక సాక్ష్యాధారాలతోనూ రాస్తున్నాను నీకు. మనకి ఒకే ఒక పరిష్కారం సాయినాథుడ్ని ఆశ్రయించడమే. రుణాన్ని తీర్చలేకపోతే ఒక భయం, పిల్లలు ఆరోగ్యవంతులూ లేదా విద్యావంతులూ కాకపోతే ఒక భయం, భార్య అనుకూలవతి కాకపోతే ఒక భయం ఇలా అనేక తీరుల భయాలు ఉంటాయి వ్యక్తులకి. అందరికీ అన్నీ ఉండవుగానీ పైవాటిలో ఏదో ఒకటో రెండో ఉండి తీరుతాయి. అయితే ఈ పై చెప్పుకున్న భయాలన్నీ ఇప్పుడో మరొకప్పుడో తీరే భయాలే అయినా అన్నింటికీ మించినదీ ఎప్పటికీ తీరనిదో మృత్యుభయం ఒక్కటే. నీ ఉత్తరం ఆసాంతం చదివాక నీ ప్రత్యక్షరంలోనూ నీకున్న ఆ భయమే గోచరించింది నాకు. సాయిలోని గొప్పదనమేమంటే ఆయన ఆ భయాన్ని పూర్తిగా తొలగించగల సమర్ధ వైద్యుడు. ఒక్కసారి ఇక్కడికొచ్చి ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ‘అన్య«థా శరణం నాస్తి..’ అని నీకు నువ్వుగా హృదయపూర్వకంగా ప్రార్థించు. నేను నీకు ఆ సర్వసమర్థ సాయినాథ దర్శనం వెంటనే లభించేలా చేయగలను. మానవమాత్రుడు కాని ఆయన దర్శనానికి వెంటనే రా!’ అని. పెద్దవరదలో కొట్టుకుపోతున్నవానికి బలమైన చెట్టుకొమ్మ లభించినట్టుగా, చెప్పలేనంత వేసవి వేడిమికి గురౌతున్న వ్యక్తికి ఎదురుగా ఒక పాకా అక్కడే ఓ చెరువూ కనిపించినట్టుగా ఒంటరిగా భయం భయంతో ప్రయాణిస్తున్న బాటసారికి తీర్థయాత్రకి వెళ్తున్న భక్తజనసమూహం తోడైనట్లుగా అనిపించి తాను జీవించగలననే ధైర్యం వచ్చేసింది నానాకి.అప్పటివరకూ ఏనాడూ సాయినాథుని గురించిన ఊహే లేని పాటిల్‌కి ఎప్పుడెప్పుడు సాయిని దర్శించి ఆయన పాదాల మీద పడి వేడుకోవాలా? అనే ఆత్రుత పెరిగిపోసాగింది. ధనవంతుడు తలుచుకుంటే అసాధ్యమేముంది సుఖప్రయాణానికి వెతుక్కోవాల్సినదేముంటుంది ప్రయాణానికి?అనుకున్నట్లుగానే షిర్డీ చేరుకున్నాడు పాటిల్. అతడ్ని తెచ్చిన బండి షిర్డీలోని మసీదు వాకిలి దగ్గర నిలబడింది. ఏ మాత్రమూ నడవలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని నలుగురు మనుషులు మంచం మీద పడుకోబెట్టి సాయినాథుని దర్శనం కోసం మెట్లెక్కి తెచ్చారు. బాబా సమక్షంలో ఉంచారు. నానా ఈ పాటిల్‌ని సాయికిపరిచయం చేయబోతుంటే శ్యామా పాటిల్ గురించి చెప్ప ప్రారంభించాడు.సాయి పాటిల్‌ని చూస్తూనే ‘శ్యామా! ఇదేమైనా నీకు బాగుందా చెప్పు? ఇలాంటి దొంగల్ని నా దగ్గరికెందుకు పట్టుకోచ్చావ్? నా కెందుకు ఇలాంటివి అంటగడతావు? అంటూ వెళ్లిపోబోతుంటే పాటిల్ నేలబారుగా ఉన్న మంచం నుంచి ముందుకి జరిగి తన తలని సాయి పాదాలకి ఆనేలా ఉంచి... ‘సాయినాథా! ఈ దీనుడ్ని రక్షించు! నువ్వే నాకు రక్ష–రక్షణ! నిస్సహాయుడ్ని! ఈ జీవిని కాపాడు!’ అని పరమదీన ఆర్ద్రకంఠంతో వేడుకున్నాడు. సాయి అతడ్ని పూర్తిగా చూసాడు పరిశీలనగా.ఒక్క క్షణం ఆగి ‘బేటా! ఈ ఫకీరు దయలేనివాడు కాడు. ఈ ద్వారకామాయిదర్శనం సర్వదుఃఖాలనీ పొగొట్టే దివ్యశాంతినికేతనం. వ్యథ పడకు. నువ్విక్కడే షిర్డీలో భీమా బాయి ఇంట్లో ఉండు! భయాన్ని విడిచెయ్! రెండు మూడు రోజుల్లో నీకు ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది. ఎంతటి లోతైన కష్టసముద్రంలో పడిపోయినా, దుఃఖాల బురదలో తలతో సహా కూరుకుపోయి చూచేవారికి ఏమీ కనిపించకపోయినా ఈ ద్వారకామాయి ఆ వ్యక్తిని ఉద్ధరించి తీరుతుంది! వెళ్లు!’ అన్నాడు. మన మాటల్లో ఆ జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకోడానికి రెండు నిమిషాల సమయం పట్టింది గానీ, పాటిల్పైని రాయడం శ్యామా పరిచయం చేయబోవడం సాయి తిరస్కరించడం... ఈ సంఘటన మొత్తం జరగడానికి గంటకిపైగా సమయం పట్టింది. పాటిల్‌కి తాను జీవించగలననే సంపూర్ణ ధైర్యం– సాయినాథుణ్ణి చూడటం, ఆయన తనని దీవిస్తూ పలకడం వంటి వాటి కారణంగా వచ్చింది.మరో కారణం కూడా ఉంది పాటిల్‌కి ధైర్యం కలగడానికి. పాటిల్‌కి ప్రతి ఐదునిమిషాలకే వాంతిరావటం దాంట్లో రక్తం పడుతూ ఉండటం ఆ దృశ్యాన్ని చూస్తూ అతను జీవితధైర్యాన్ని కోల్పోతూ ఉండటం జరుగుతూ ఉండేది. అయితే సాయి దర్శనానికొచ్చాక ఈ గంటపైన గడిచిన సమయంలో ఒక్క వాంతి రానూ లేదు. వాంతి వచ్చే సూచన కూడా అతనిలో కలగలేదు. దాంతో పాటిల్ మంచి ధైర్యం ఆశాకలిగాయి జీవితంపట్ల.సాయి చెప్పినట్లు భీమాబాయి ఇంట్లోనే ఉన్నాడు పాటిల్. సాయి అన్నట్లే పాటిల్ అనారోగ్యం మూడురోజుల్లో పూర్తిగా తొలగిపోయింది.ఎలా నయమైంది?అపానమనే వాయువుకున్న లక్షణం శరీరంలో అనవసరంగా ఉన్న పదార్థాన్ని బయటికి నెట్టివేయడం అని అనుకున్నాం కదా! బయటికి నెట్టివేయగల శక్తి ఉన్న అపానమనే వాయువుకి ఆ వాయువుని నెట్టివేయకుండా తనలో దాచుకునే శక్తి కూడా ఉంటుంది గదా!ఆ కారణంగా ఎప్పుడు అపానమనే వాయువు ద్వారా రక్తంతో కూడిన వాంతి బయటికి వెళ్లిపోవలసిన పరిస్థితి కల్గినా సాయి కృపాకటాక్షం ద్వారా ఆ రక్తంతో కూడినవాంతి బయటికి వచ్చేదే కాదు. కనీసం బయటికి వచ్చే సూచన కూడా కనపడలేదు. వాంతి అవుతుందేమో అనే మనోభయం కూడా పాటిల్‌కి కలగలేదు.అంటే సాయి ఏం చేసాడన్నమాట? తన కున్న అపానమనే వాయువు మీద ఉండే అధికారంతో ఆ వాయువుని అదుపు చేసి లోనున్న వాంతిని బయటికి రాకుండా చేయడమే కాక, మిగిలిన రంధ్రాల నుండికూడా ఆ వాంతి రాకుండా ఉండేలా అదుపుచేసాడు సాయి. ఇదీ అపానమనే వాయువుమీద సాయికున్న అధికారమంటే! అలాగని ప్రతిసారీ అలా వాయువులని నిరోధించలేదు సాయి. అంటే ఆ అవకాశాన్నిదుర్వినియోగపరచలేదనేది దీనినుంచి గ్రహించాల్సిన విషయమన్నమాట! ఇలాంటి అధికారాన్ని వినియోగించిన మరి రెండు చోటులని కూడా తెలుసుకుని అంతరార్థాన్ని తెలుసుకుందాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
పంచభూతాధికారి వాయువు
ఏ తాతగారింటికో వెళితే గ్రామీణప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావి పైకి మాత్రం ‘చక్కగా దిగెయ్యచ్చు’ అనిపించేలా కనిపిస్తుంది. అలాగే ఏ శ్రీశైలమో వెళ్తే అక్కడున్న పాతాళగంగని చూస్తే.. ‘ఇన్నేగా మెట్లు! దిగెయ్యచ్చు’ అనిపిస్తుంది. అక్కడ దిగుడుబావిలోకి దిగుతూ ఉంటేనూ, ఇక్కడి పాతాళగంగలో మెట్లని దిగుతూ ఉంటేనూ ఒక పక్క సంతోషం.. మరో పక్క ఎవరూ చేయలేని పనిని చేయగలుగుతున్నాననే అనిర్వచనీయ ఆనందం.. అనుభవపూర్వకంగా కలుగుతుంది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తోందంటే.. దిగుడుబావిలోకి దిగుతుంటే భలే సంతోషంగా ఉంటుంది. అలాగే పాతాళగంగ మెట్లను దిగుతూ గంగని సమీపించి స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుందని కేవలం చెప్పడం వేరు. అదే మరి అనుభవంలో దానిని గమనిస్తే కలిగే అహ్లాదం వేరు అని చెప్పడానికే. సాయి గురించిన ఎన్నో కథలనీ.. లీలలనీ.. సంఘటనలనీ.. వినెయ్యడం, వినిపించడం, చదివేయడం, చదివించెయ్యడం కాదు చేయాల్సింది. దానిలోనికి వెళ్లి పరిశీలించగలగాలి సాయి అనుగ్రహ దృష్టిని. అప్పుడు సాయి చరిత్ర అర్థమవుతుంది మరింత హృదయ స్పర్శతో.లేని పక్షంలో ‘సాయి ఒకరికి ప్రాణాలు పోతుంటే బతికించాడు. మరొకరికి జ్వరాన్ని తగ్గించాడు. ఇంకొకరికి ప్రమాదం జరగకుండా రక్షించాడు, మరొకరికి జరిగిందాన్ని చెప్పాడు...’ అని ఈ తీరుగా అర్థమవుతూ సాయిచరిత్రలో సాయి, ఒక కథానాయకునిలాగానూ, ఆయన అన్నింటా విజయాలనే సాధించినవానిగానూ కనిపిస్తూ సాయి స్వరూపం సాయితత్త్వం తేలిపోతూ కనిపిస్తుంది. అది సరికాదు. ఈ నేపథ్యంలో సాయి.. పంచభూతాల మీదా ఆధిపత్యాన్ని కలిగిన సిద్ధునిగా అర్థం చేసుకుంటూ పృథ్వి–అప్–తేజస్సులని గురించి వివరించుకున్నాక వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని సాధించగలిగాడో, సాధించాడో ఇప్పటివరకూ ఎలా ఉదాహరణ పూర్వకమైన సంఘటనలతో తెలుసుకున్నామో అలాగే తెలుసుకుందాం! బ్రహ్మాండ /పిండాండాలు వాయువు అనగానే వీచే గాలే కదా! అనేసుకుంటారు. అది కాదు దానర్థం. వాయువు రెండు తీరుల్లో ఉంటుంది. పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లోనూ కనిపించే వాయువూ, అలాగే శరీరంలో ఉండే పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లో ఉండే వాయువూ అని రెండు తీర్లుగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే వాయువు పేరు బ్రహ్మాండ వాయువు. శరీరం అంటే పిండాండం. ఈ శరీరంలో కనిపించే వాయువు పిండాండ వాయువు.పంచభూతాలనేవి బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ కూడా ఉన్నాయి. అందుకే బ్రహ్మాండాన్ని ప్ర–పంచ–ము అన్నారు. శరీరాన్ని ‘పాంచభౌతిక దేహము’ అన్నారు.బ్రహ్మాండంలో ఆ పిండాండంలో అంటే రెంటిలోనూ పంచభూతాలున్నాయి. వాటి ఉనికిని బట్టే ప్రపంచం పుట్టిందనే అర్థంలో ‘బ్రహ్మ+అండము’ అనీ శరీరం పుట్టిందనే అర్థంలో ‘పిండ+అండము’ అనీ పేరుని పెట్టారు ఋషులు.బ్రహ్మాండంలో కనిపించే పృథ్వి అంటే ఎక్కడెక్కడా ఉండే నేల. పిండాండంలో కనిపించే పృథ్వి మాంసమూ మజ్జా (ఎముకలోపల ఉండే మెత్తని పదార్థం– రక్తాన్ని ఉత్పత్తి చేసే పదార్థం) అనేవి. బ్రహ్మాండంలో కనిపించే అప్(జలం) అంటే నదులూ నదాలూ (పశ్చిమాన పుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి) సముద్రాలూనూ. పిండాండంలో కనిపించే ‘అప్’(జలం) శరీరంలో ఉండే తడితనం. ఈ తడితనం ఉన్న కారణంగానే చర్మాన్ని కొద్దిగా పైకి లాగి విడవగానే మళ్లీ మామూలుగా అయిపోతోంది. అదే మరి తడితనం లేకపోతే ఆ లాగబడిన చర్మం అలాగే ఉండిపోతుంది. వేసవిలో కొందరికి వచ్చే వ్యాధి అదే. ఇక కంటిలో.. నోటిలో.. ఇలా అన్ని అవయవాల్లోనూ ఉండే తడితనమే పిండాండంలోని అప్(జలం). బ్రహ్మాండంలోని తేజస్సు– సూర్యుడు. పిండాండంలోని తేజస్సు– చల్లటి పదార్థాలని తిన్నాతాగినా, వేడిపదార్థాలని తిన్నాతాగినా కూడా ఒకే తీరుగా(98.4ౌ ఫారన్‌హీట్) ఉండే వేడిమితనం. బ్రహ్మాండంలోని వాయువు కనిపించకుండా వీస్తూ ఉండే గాలి. ఈ గాలిలో ఎన్నో భేదాలున్నాయి. అవి మనకి ప్రస్తుతానికి అప్రస్తుతమవుతుంది. ఇక పిండాండంలోని వాయువు ఒక్కటి కాదు. వాయువు 10గా విభజింపబడి కనిపిస్తుంది. ఆ పదింటిలోనూ అతి ముఖ్యమైనవి ఐదు. అవే ప్రాణ–అపాన–వ్యాన–ఉదాన–సమానమనే పేర్లతో ఉండేవి.అలాగే బ్రహ్మాండంలో కనిపించే ఆకాశమనేది ఎంత ఎత్తుకి ఎగిరినా ఉండనే ఉండదు గానీ ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. (ఆకాశో అవకాశ శ్శూన్యమ్) నిజంగా ఆకాశమనేది లేదు. సముద్రపు ప్రతిబింబం కారణంగా నీలి రంగుతో కనిపిస్తుంది. ఇక పిండాండంలో ఉండే ఆకాశమనేది అనుభవంలో ప్రతి వ్యక్తికీ కనిపిస్తూ నిజానికి ఉండని ‘మనసు’ అనేది.ఈ వివరణనంతా ఎందుకంటే.. సాయి భూతాల్లో ఉన్న వాయువుని తన అధీనంలోనికి తీసుకున్నాడంటే కేవలం బ్రహ్మాండంలోని వాయువునే కాక, ప్రతివ్యక్తి శరీరంలోనూ ఉండే పిండాండపు 5 వాయువులనీ కూడా స్వాధీనపరుచుకున్నాడని చెప్పడానికీ.. ఉదాహరణ పూర్వకంగా వివరించడానికేను. ఆ క్రమంలో ముందు బ్రహ్మాండ వాయువుని ఎలా అదుపు చేశాడో తన అధీనంలోకి తెచ్చుకున్నాడో చూద్దాం! ఆపు నీ తీవ్రత షిర్డీ చాలా చిన్న గ్రామం. దీన్నే నాటివాళ్లు కుగ్రామం అంటూ ఉండేవారు వారి సాధారణ పరిభాషలో. ఏ చిన్న అలజడి వచ్చినా.. ఆనందం వచ్చినా.. కొత్త సంఘటన జరిగినా.. ఊరంతా ఓ కుటుంబంలానే దాదాపుగా ఉండే కారణంగా అందరికీ తెలిసిపోతూ ఉండేది. షిర్డీనే కాదు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఆ పద్ధతి ఉండనే ఉంది. సరే!ఓసారి షిర్డీలోని సాయి భక్తులంతా ఎప్పటిలాగానే చక్కని భజనలని చేయాలనే ఆలోచనతో సాయి మందిరానికి అంటే ద్వారకామాయికి బయలుదేరారు. కొందరు ద్వారకామాయికి చేరిపోయారు. కొందరు త్రోవలో ఉన్నారు. మరికొందరు మిగిలిన పూజాసామగ్రిని కొనేందుకు అంగడి దగ్గరా,ఇంకొందరు ఇళ్ల నుండి బయటికి వచ్చి బయలుదేరడానికి సిద్ధంగానూ ఉన్నారు.ఇంతలో మెల్లగా మేఘాలన్నీ ఎక్కడి నుండో తరుముకొచ్చినట్టు రాసాగాయి. చూస్తున్నంతలోనే మరింత నల్లగా మేఘాలన్నీ ఒకచోటికి చేరిపోయాయి. వాయువు వీచడంలో రెండు పద్ధతులుంటాయి. ఒక తీరు వాయువు ఎంతటి బలమైన మేఘాన్నైనా బలంగా వీచి చెదరగొట్టి మేఘాన్ని తునుకలు తునుకలుగా చేసి తరమికొట్టేస్తుంది. ఇంకొక తీరు వాయువు వచ్చిన మేఘాన్ని చెదిరిపోనీకుండా చేస్తూ తనలో ఉన్న చల్లనిదనాన్ని మేఘానికి తగిలేలా చేసి వర్షింపజేస్తుంది.ఇలా సాయి భక్తులంతా తలొకచోటా ఉన్న వేళ ఈ రెండు తీరుల వాయువులూ గట్టిగా వీస్తూ తన లక్షణాలతో మేఘాన్ని ఒకచోటికి చేరేలానూ మెల్లగా చినుకులు ప్రారంభమయ్యేలానూ చేశాయి. ‘పెద్దవర్షమేముండదులే!’ అని అనుకుంటూ భక్తులందరూ భజనమీది అభిలాషతో ద్వారకామాయి వైపే నడవడం మొదలెట్టారు. నిజానికి ద్వారకామాయి పెద్ద దూరంలో లేనే లేదు.ఇంతలో వాయువు మరింత వీచడం మొదలెట్టింది. చినుకులు మరింత వేగంగానూ మీద పడసాగాయి. శరీరాలకి దెబ్బ తగులుతోందా? అన్నంతబలంగా చినుకులు పడుతుంటే సాయి భక్తులంతా ఎవరికీ వీలైన ప్రదేశాల్లో అంటే... కొందరు శనీశ్వరాలయంలో, మరికొందరు శివపార్వతుల ఆలయంలో, ఇంకొందరు మారుతి మందిరంలో ఇంకా కొందరు గ్రామదేవత అయిన ఖండోబా దేవాలయంలో తాత్కాలికంగా తలదాచుకునేందుకు వెళ్లారు.ఇళ్ల నుంచి బయలుదేరి ఇవతలకి వచ్చి వెళ్లబోతున్నవారు ‘అయ్యో! వెళ్లలేమేమో!’ అనుకుంటూ మళ్లీ ఇళ్లలోకే వెళ్లిపోయి వాయువూ వర్షమూ తగ్గాక బయలుదేరవచ్చనుకుంటున్నారు. ఈ దశలో వాయువు, వర్షముతో పాటు కళ్లు బైర్లు కమ్మేంత స్థాయిలో మెరుపులు మెరవసాగాయి. మెరుపులొస్తే మేంమాత్రం రాలేమా అన్నట్లుగా ఉరుములు తీవ్రంగా చెవులు చిల్లులు పడేలా.. గుండెలు బద్దలవుతాయేమో.. అన్నంతగా ధ్వనింపసాగాయి. పిడుగులెక్కడా పడలేదు కానీ, వాయు తీవ్రత, వర్షఆధిక్యం, ఉరుములు, మెరుపులు క్రమక్రమంగా పెరగసాగాయి. ద్వారకామాయిలో ఉన్న వారికి ఖండోబా ఆలయంలో ఎవరు ఉన్నారో.. ఈ ఆలయంలో ఉన్నవారికి ఎవరు ఏ త్రోవలో చిక్కుబడిపోయారో.. ఇళ్లలో ఉన్నవారికి తమ కుటుంబసభ్యులు ఎక్కడెక్కడున్నారో.. తెలియకనే పోయింది. అంత తీవ్రమైన గాలివానని దాదాపు ఆ దశాబ్దంలో ఎవరూ ఎరగమని నలుగురు కూడిన ప్రతిచోటా అనుకోనివారు లేరు. ఎప్పటికి తెరిపి ఇస్తుందో, త్రోవ ఎలా ఉండబోతోందో, ఇళ్లకి ఎలా చేరుకోవాలో అంతా అగమ్యగోచరం కాసాగింది.ఎవరికి వారు తామున్న ఆయా దేవాలయాల్లో వాయుతీవ్రత తగ్గాలనీ, వర్షం ఆగిపోవాలనీ భజనలని చేస్తూ ఉండిపోయారు. నేటికాలంలో లాగా నాడు వీధి దీపాల్లేని కారణంగా షిర్డీ మొత్తం చీకటితో నిండిపోయి అక్కడొక గ్రామం ఉందనే విషయం అర్థం కాకుండా పోయింది. ఏ అడవిలోనో ఉన్న భయం అందరికీ కలిగింది. ఈ దశలో కొందరు చొరవ తీసుకుని మనందరికీ రక్షకుడు,తోడునీడా ఆ సాయి మాత్రమే కదా! దృఢవిశ్వాసంతో అంతటి వర్షంలోనూ సాయి వద్దకి వెళ్లారు అందరి తరపునా ప్రార్థించడానికి.బట్టలు తడిసి వర్షంతో నీరు కారుతూ ఉన్న భక్తులందరూ ఒక్కొక్క మేఘంలా అనిపిస్తున్నారు. అందరూ సాయి పాదాల మీద ఒకరి వెంట ఒకరు చొప్పున పడుతూ.. ‘‘బాబా! పెళ్లాం బిడ్డలు.. గొడ్డు గోద.. పూరిపాకలు, వంటకట్టెలు, కొద్దిపాటి నగానట్రా.. అంతా ఏమైపోతుందోననే భయం ఆవరించేసింది మా అందరినీ. నువ్వే దిక్కు’’ అంటూ దీనాతిదీనంగా ప్రార్థించసాగారు.బాబా ఒక్కసారి అందరినీ అలా వ్యక్తివ్యక్తిని పరిశీలించి చూసి బయటి కొచ్చాడు. చేతిలోని సటకాని తీసుకుని... ‘వాయూ! ఆగు! ఆగు! ఆపు నీ తీవ్రతని! తగ్గించు! మందగించు! నెమ్మదించు!!’ అన్నాడు సార్ద్ర నయనాలతో ఆ భక్తులందరినీ ఓ పక్క చూస్తూ.ఏదో ఓ తండ్రి తన బిడ్డడితో ఓ మాటని అంటే ఆ బిడ్డ తన తండ్రి చెప్పిన మాటని వినినట్లుగా.. ‘వెంటనే వాయువు తన తీవ్రతని తగ్గించడం మొదలైంది. ఆ వెంటనే వర్షం ఆగుతున్నట్టుగా ఆ చూసేవారందరికీ తెలిసింది. దాదాపు 10 నిమిషాల సమయంలో మొత్తం వాయువూ వర్షమూ కూడా ఆగిపోయాయి.భక్తులందరికీ ఆశ్చర్యమయింది. సాయి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూసి నట్టయింది వాళ్లకి. అందరూ కృతజ్ఞతాపూర్వకంగా సాయికి సాష్టాంగపడి ఆయనని చూసి మళ్లీ వాయువూ వర్షమూ ఉరుములూ మెరుపులూ రానే రావని చెప్పినట్లుగా కనిపిస్తున్న సాయి కళ్లని దర్శించి మెల్లగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే సాయి అలా ‘నెమ్మదించు!’ అనగానే ఆకాశం కొద్దిసేపట్లో నిర్మలమయింది. నక్షత్రాలూ చంద్రుడూ కూడా కొద్ది సమయంలోనే కనిపించారు. ఆకాశం ప్రశాంతంగా కనిపించసాగింది. కృతజ్ఞత అందరూ దాదాపుగా ద్వారకామాయిని విడిచి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. అంతలా పెద్దగా భజన వినవచ్చింది. ‘ఏమిటా?’ అని ఆశ్చర్యపడుతూ చూస్తే సాయి అనుగ్రహం లభించి షిర్డీ వాసులందరికీ క్షేమం కలిగిందనీ, ఆందోళన తొలిగిందనీ హృదయపూర్వకంగా సాయి సమక్షంలో భజనని ప్రారంభించారు.ఎవరైనా గమనించాల్సిన అంశం ఇదే. సాధారణంగా కష్టం ఏదైనా వచ్చినప్పుడూ పరిస్థితి అగమ్యగోచరం అనిపించినప్పుడూ వెంటనే మొక్కుకోవడమనే పనిని చేస్తూ ఉంటాం. పని జరిగిన వెంటనే దర్శనానికి వస్తామనో లేక ఫలానిదాన్ని సమర్పించుకుంటామనో మొక్కేస్తాం. మొక్కుకునేప్పుడు ‘వెంటనే’ అనకుండా ఉండలేం. అనేస్తాం. తీరా పని పూర్తి అయ్యాక ‘ఫలాని పని ఉంది– ఫలానిది అడ్డొచ్చింది’ అంటూ మొక్కు తీర్చడాన్ని వాయిదా వేస్తూ వెడతాం. ప్రతి వాయిదాకీ ఓ గట్టి కారణాన్ని చెప్తాం. చూపిస్తాం. మరి అదే వాయిదాని దేవుడు కూడా వేయదలిచి – నీ పనిని ఫలాని రోజు వరకు తీర్చడం కుదరదంటున్నాడా? వెంటనే తీర్చేస్తున్నాడు కదా! ఆ కోరిన కోరికగాని సమంజసమైనదయ్యుంటే!మనకి సత్యనారాయణ వ్రతకథలో ఆ వైశ్యుని కథ మొక్కుని వాయిదా వేసే విధానంతో సాగలేదూ? ఎప్పుడైతే ఆ వైశ్యుడు మొక్కుకుని తీరా పని పూర్తయ్యాక తీర్చలేదో, తీర్చడం కాదు సరికదా అప్పుడు తీరుస్తా– ఇప్పుడు తీరుస్తానంటూ వాయిదా వేస్తూ ఉండేసరికి భగవంతుడు తనని శక్తిహీనునిగానూ అసమర్థునిగానూ లెక్కిస్తున్నాడనే నెపంతో ఓ పరీక్షని పెట్టి ఆ వైశ్యకుటుంబం వంకతో మన కందరికీ మొక్కుని ఎలా ఎప్పుడు తీర్చుకోవాలో తెలియజేసాడు.అదే పద్ధతిలో సాయిని శరణుకోరాక వాయుప్రకోపం వర్షం వీటి కారణంగా ఆందోళనా తగ్గేసరికి వెంటనే సాయి దగ్గరుండే భక్తులు దైవానికి కృతజ్ఞతలని ఘటిస్తూ భజన చేయసాగారు.అలాగని ఇళ్లకి వెళ్లిపోయినవారిని కృతఘ్నులుగా లెక్కించకూడదు. వాళ్లంతా గృహిణులైన కారణంగా బాధ్యతనీ కర్తవ్యాన్నీ విస్మరించరానివారు కాబట్టి వెళ్లారని భావించాలి తప్ప, సాయి విషయంలో శ్రద్ధాభక్తులు లేనివారూ లేదా మన పని మనకి ముఖ్యమనుకుంటూ ఇళ్లకి వెళ్లినవారు గానూ భావించకూడదు. భక్తుల ప్రశ్న ఇది సాయి చరిత్రలో కన్పడదు గానీ సాయి గురించి రాయబడిన ఓవీల్లో (మరాఠీ భాషలో ఓ ఛందస్సు శార్దూలం మత్తేభం వంటి పద్యాల్లో కనిపించే విధానం) మాత్రం కనిపిస్తోంది. ఏమని?సాయిభక్తులు కొందరు సాయిని ప్రశ్నిస్తూ... ‘దేవా! వాయువూ వర్షమూ అంత తీవ్ర స్థాయికి చేరేంతవరకూ నువ్వెందుకు ఊరుకున్నావు? పైగా పంచభూతాలనీ నీ అధీనంలో ఉంచుకున్నావు కాబట్టి ఆ వాయువూ వర్షమూ అనేవి ఎందుకని నీకు జడిసి అంతటి తీవ్రస్థితికి రాకుండా ఎందుకుండలేదు?’ అని.సాయి నిదానంగా సమాధానమిచ్చాడు. ప్రపంచమంటే మనం మాత్రమే కాదు. మనకి ధాన్యాన్నిచ్చే రైతూ, మనకి ధాన్యం లభించేందుకు కావల్సిన భూమి, మన పొలాన్ని దున్నే ఎద్దూ, ఆ ఎద్దుకి తల్లి అయిన ఆవూ, ఇంతేకాక ఏదో ఓ విధంగా మనకి సహాయపడే 84 లక్షల జీవరాసులు ఏం ఉన్నాయో వాటికి వర్షం అవసరమయ్యుండిఉంటుంది. అంత శాతం వర్షం వారి కానందం కాబట్టి వర్షించాడు దైవం. ఆయన సర్వసముడు. వాళ్లకి ఈ వర్షం ఎంతో ఆనందాన్ని కల్గించి ఉండి ఉంటుంది. మనకది అసౌకర్యం అనిపించవచ్చు.ఎక్కువ మందికి ప్రయోజనకరమనిపించే దేన్నైనా దైవం చేస్తాడు. ఆ సందర్భంలో కొందరికి తాత్కాలిక బాధ తప్పదు మరి’ అని. ఎంతగొప్ప తాత్త్విక దృష్టి సాయిది!పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని బ్రహ్మాండపరంగా చూపిన సాయి, పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని పిండాండపరంగా ఎలా చూపించాడో తెలుసుకుందాం! అంటే వ్యక్తుల ప్రాణవాయువుల్ని ఎలా పోబోతుంటే ఆధిపత్యాన్ని చూపించి ప్రాణాలు నిలిచేలా చేసాడో గమనిద్దాం! సశేషం! -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
తిరుమలాయపాలెం: అమెరికాలో బీటెక్ చదువుతున్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం విద్యార్థి కొండబాల పృథ్వీ (21) రేస్ బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. టీడీపీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు కొండబాల కరుణాకర్ ఏకైక కుమారుడు పృథ్వీ బీటెక్ కోసం రెండేళ్ల క్రితం యూఎస్‌లోని కొలంబస్ ఫ్రాక్లిన్ యూనివర్సిటీలో చేరాడు. ప్రస్తుతం ఉన్నత చదువు కొనసాగిస్తూనే.. ఉద్యోగం చేస్తున్న ఇతను.. ఆదివారం రేస్ బైక్‌పై సరదాగా వెళుతూ.. వెనుక వస్తున్న స్నేహితులను చూసే క్రమంలో అదుపుతప్పి డివైడర్ని ఢీకొన్నాడు. పక్కనున్న లోయలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. రెండు, మూడు రోజుల్లో స్వదేశానికి అతడి మృతదేహాన్ని తీసుకొస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
యువత కోసం
బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏక్’. ‘బీయింగ్ హ్యూమన్’ అనేది ఉపశీర్షిక. రుద్రారపు సంపత్ డైరెక్షన్లో కె.వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవీయ విలువలతో, మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తీసిన చిత్రమిది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన మా చిత్రం పాటలను హీరో నాగార్జునగారు విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి ఘనపాటి, స్టోరీ– స్క్రీన్‌ప్లే– డైలాగ్స్– నిర్మాత: హరికృష్ణ కొక్కొండ. -
ఇట్లు ప్రేమతో...
జో దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘యువర్స్ లవింగ్లీ’. కథనాయకుడు పృథ్వీ పొట్లూరి నిర్మిస్తున్నారు. సౌమ్యా శెట్టి కథానాయిక. కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను తాండ్ర పాపారాయ విద్యాసంస్థల అధినేత తుమ్మల భాస్కరరావు, బొబ్బిలి పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి అచ్చుతవల్లి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తుమ్మల దంపతుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉంది. పృథ్వీ పొట్లూరికి మంచి భవిష్యత్ ఉంటుంది. మొదటి సినిమా అయినా బాగా నటించాడు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు. -
కుమారులతో సహా తల్లి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కుమారులతో కలిసి ఓ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని యువజన కాలనీలో శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. వీరికి లోకేష్(9), పృథ్వి(6) కుమారులు ఉన్నారు. బోరు లారీ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఇద్దరు కుమారులతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్నిచోట్ల వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో బాధితురాలి తల్లి లక్ష్మీదేవి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హాస్య నటులు కూడా హీరోలే
‘‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అదే ఐడియా నలుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చిందన్నదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కథ’’ అన్నారు కథానాయిక సలోని. నవీన్‌చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య పాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సలోని చిత్ర విశేషాలు పంచుకున్నారు. ⇒ లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మహేశ్ పాత్రలో ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, సమంత పాత్రలో నేను ఇంటర్మీడియట్ విద్యార్థులుగా కనిపిస్తాం. మా ఇద్దరి మధ్య వచ్చే పాటకు సెట్స్‌లో క్లాప్స్, విజిల్స్ కొట్టారు. ⇒ కామెడీ సీన్స్ చేయడం చాలా కష్టం.నా దృష్టిలో హాస్య నటులు కూడా హీరోలే. నా మనసుకు నచ్చితే ఎవరితోనైనా నటిస్తా. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రా వదులుకోను. ఈ చిత్రదర్శకుడు సత్తిబాబు కూల్ పర్సన్. తనకు కావాల్సిన నటన రాబట్టుకున్నారు. రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ⇒హిందీలో అమితాబ్ బచ్చన్‌గారితో ఓ చిత్రం డిస్కషన్స్‌లో ఉంది. కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
ఫేస్బుక్ లవ్: అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి
కులం, మతం, జాతి, ప్రాంతం, దేశం.. వీటిన్నిటికీ ప్రేమ అతీతమైనదని చెబుతారు. ఇంటర్నెట్ రాకతో ప్రపంచం ఓ కుగ్రామమైంది. ఇక సోషల్ మీడియా వల్ల ముక్కు మొహం తెలియని వారు స్నేహితులుగా, ప్రేమికులుగా మారుతున్నారు. ఫేస్బుక్లో పరిచయమైన రెండు దేశాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమికులుగా మారారు. ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని బికనీర్ నగరానికి చెందిన పృథ్వీకి, హాంకాంగ్‌కు చెందిన హెయిలీ అనే అమ్మాయి ఆరేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేస్తూ ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని ఇద్దరూ భావించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది హెయిలీ గతవారం తన తల్లితో కలసి హాంకాంగ్ నుంచి బికనీర్‌కు రావడం.. గత బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పృథ్వీని వివాహం చేసుకోవడంతో ఆరేళ్ల ప్రేమకథ సుఖాంతమైంది. -
’పృథ్వీ’ తో సరదాగా కాసేపు
-
సర్దార్ ఓ గొప్ప ఫీలింగ్
సిటీలో చాలామంది డీజేలున్నా.. వారెవరికీ దక్కని అవకాశం పిన్న వయస్కుడైన డీజేగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులరైన పృథ్వికి దక్కింది. పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా కోసం ఒక పాటను రీమిక్స్ చేయడం... పవన్ పాడిన బీట్ సాంగ్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం... ఆ సినిమాలో డీజేగా కాసేపు కనిపించడం... లాంటి అరుదైన అవకాశాలను తన ఖాతాలో వేసుకున్నారీ కుర్ర డీజే. పృథ్వి ‘సాక్షి’తో పంచుకున్న తన సినిమా అనుభవం ఆయన మాటల్లోనే... - ఎస్.సత్యబాబు ఓ రోజు రాత్రి ఆర్టిస్ట్ మేనేజర్ అహ్మద్ నుంచి ఫోన్ కాల్.. ‘సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఒక పాట మిక్సింగ్ కోసం నిన్ను కావాలనుకుంటున్నారు. పొద్దున్నే వచ్చి కలవండి’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నా ఫేవరెట్ స్టార్‌ను కలవడమే కాదు.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమూ దక్కింది. హెల్ప్ చేస్తావా..? అంత పెద్ద స్టార్ నాకు కబురు పెట్టడమే గొప్ప. అంతేకాకుండా ‘నాకు హెల్ప్ చేస్తావా..?’ అని అడగడంతో నా ఆశ్చర్యానందాలకు అవధుల్లేవు. మహదానందంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించాను. గబ్బర్‌సింగ్ సినిమాలో అంత్యాక్షరి లాగానే ఇందులో పలు హిట్ సాంగ్స్‌ను ఏర్చి కూర్చి ఒకే పాటలా మిక్స్ చే సిన సాంగ్ చూసే ఉంటారు. ఆ మిక్సింగ్ వర్క్ నాకు అప్పగించారు. డీజేగా రెగ్యులర్‌గా చేసే పని, పైగా నా అభిమాన హీరో కోసం చేస్తున్నాననే సంతోషం.. నాతో మరింత ఉత్సాహంగా పని చేయించింది. మిక్స్డ్ ట్రాక్స్‌తో మేళవించిన పాటలో కమెడియన్స్‌తో పాటు నేనూ తెరమీద కనిపిస్తాను. పవన్ అన్నయ్యకు నా వర్క్ చాలా బాగా నచ్చింది. అందుకే అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా.. తరహాలో సర్దార్లో తాను స్వయంగా పాడిన పోతురాజు బీట్ సాంగ్‌కి మ్యూజిక్ చేసే అవకాశమిచ్చారు. మరిచిపోలేని జ్ఞాపకం... సిటీలో డీజేలు ఇంత మంది ఉన్నా... అంత పెద్ద సినిమాలో పిలిచి ఛాన్స్ ఇవ్వడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. పవన్ అన్నయ్యతో దాదాపు 20 రోజులు కలిసి ఉండే గొప్ప అదృష్టం కలిగిందీ సినిమాతో. గతంలో నేను ఆయన పాటల్ని రీమిక్స్ చేసి ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాను. అయితే ఇప్పుడు ఆయన నా దృష్టిలో మరింత గొప్ప స్థానం దక్కించుకున్నారు. అందుకే మరోసారి పవర్ స్టార్ పాటల రీమిక్స్ మరింత అద్భుతంగా రూపొందించాలని అనుకుంటున్నాను. -
క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ చాలా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో నవ్వులు పూయించాను. కానీ హారర్ నే పథ్యంలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది’’ అని హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స’ పృథ్వి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో డాక్టర్ పృథ్విగా నటించిన పృథ్వి ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు... ♦ నేను ఇప్పటివరకూ చాలా అనుభవమున్న దర్శకులతో పనిచేశాను. చేస్తున్నాను. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి దగ్గరా సహాయకునిగా పనిచేయకపోయినా ఆయన క్లారిటీ అద్భుతం. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. కొత్త దర్శకులతో అయినా నేను పనిచేయడానికి రెడీ. ♦ షూటింగ్ టైమ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. రామకృష్ణారెడ్డి చాలా చక్కగా ఈ సీన్స్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టానికి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల వరల్డ్‌కప్ టీ 20లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ సినిమా బాగా ఆగుతోందని చెప్పడానికి ఇదొక్కటి చాలు. ♦ ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చే సినిమా ఇది. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ♦ సినిమా ద్వితీయార్ధంలో భూతవైద్యుడిగా హీరో ఇంట్లోకి ప్రవేశించిన నాకు హఠాత్తుగా ఎదురయ్యే పిల్లదెయ్యాలు, అవి నన్ను భయపెట్టే సన్నివేశాలకు ముఖ్యంగా పిల్లలు బాగా కనె క్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ♦ ఇక, ఈ సన్నివేశాలకు గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరాయి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో ‘ప్రాణం’ కమలాకర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ‘దృశ్యకావ్యం-2’లో నటించనున్నా. అందులో కూడా నవ్విస్తాను. ♦ ఆ మధ్య చేసిన ‘లౌక్యం’ తర్వాత నుంచి నాకు వరుసగా మంచి పాత్రలు వస్తున్నాయి. ‘సరైనోడు’, మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో చాలా మంచి రోల్స్ చేస్తున్నా. -
కామెడీ క్రాకర్స్
పొట్ట చెక్కలైతే అది.. ‘బ్రహ్మీ’ బులెట్ బాంబ్. డొక్కలు ముక్కలైతే అది... పృథ్వీ రాకెట్ షాట్. బాడీ మొత్తం షేకైతే అది... షకలక శంకర్ పాంబిళ్ల. పడీపడీ నవ్వుతుంటే అది.. అలీ గ్రౌండ్ చెక్కర్. కిందపడి కొట్టుకుంటే అది.. పోసాని విష్ణు చక్రం. రివ్వున గింగరాలు తిరిగితే అది... సప్తగిరి భూచక్రం. కితకితలొస్తే అది... శ్రీనివాస్‌రెడ్డి ఫ్లవర్ పాట్. కళ్లు తేలేసి తలకిందులైతే అది... సంపూర్ణేష్ లడీ. తెలుగు సినిమాల్లో లేటెస్టుగా ఇప్పుడు... సౌండ్ అదిరిపోతున్న కామెడీ క్రాకర్స్ ఇవి. హ్యావ్ ఎ నైస్ అండ్ నవ్వుల దీపావళి. కిల్ బిల్ పాండే @ రేసుగుర్రం ‘రేసుగుర్రం’లో రేసుగుర్రంలా పరుగులుపెట్టే పాత్ర నాది. అప్పటివరకూ సినిమా ఒక మూడ్‌లో నడిస్తే, నేనొచ్చాక ఇంకో మూడ్‌లో నడుస్తుంది. అసలు నా ఎంట్రీనే ఓ ఫ్రస్టేషన్ మూడ్‌లో ఉంటుంది. పోలీసాఫీసర్‌గా అన్నేళ్లు పనిచేసినా ఏం శాటిస్ఫేక్షన్ లేక చాలా ఫ్రస్టేషన్‌తో గడిపే కిల్‌బిల్ పాండే వేషం నాది. విలన్ ఇంటిలోకి నేను కారులో దూసుకె ళ్లడం, కదులుతున్న కారులో నుంచి దూకేయడం... ఇవన్నీ ఆడియన్స్‌కు బాగా నచ్చేశాయి. ముఖ్యంగా పిల్లలు నేనెక్కడ కనబడ్డా ‘కిల్‌బిల్ పాండే’ అని పిలవడం మొదలెట్టారు. ఈ మధ్యకాలంలో బాగా పేలిన పాత్ర అంటే ఇదే! - బ్రహ్మానందం బాయిలింగ్ స్టార్ బబ్లూ@ లౌక్యం ‘ఖడ్గం’ సినిమాలో నాపాత్రకు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ ఓ మేనరిజం ఉంది.అప్పట్నుంచీ నా ఇంటిపేరు ‘థర్టీ ఇయర్స్’ అయిపోయింది. ఆ తర్వాత చాలా పాత్రలు చేసినా, ఆ పేరు మాత్రం బ్రేక్ కాలేదు. ‘లౌక్యం’లో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ చేసేవరకు నా పరిస్థితి ఇంతే. ఈ సినిమా దెబ్బతో ఇప్పుడు నన్నందరూ ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ అనే పిలుస్తున్నారు. అంతలా లక్ష్మీ బాంబులా పేలిందా పాత్ర. స్క్రిప్టులో ఈ కేరక్టర్ రాస్తున్నప్పుడే రచయిత శ్రీధర్ సీపాన, దర్శకుడు శ్రీవాస్ ఇదేదో బాంబులా పేలేటట్లు ఉందే అనుకున్నారట. నిజంగానే ‘లౌక్యం’ రిలీజయిన వారానికే ఓవర్‌నైట్‌లో కమర్షియల్ కమెడియన్ని అయిపోయా. ఆ తర్వాత మిస్సైల్స్ లాంటి పాత్రలు వచ్చాయి... వస్తున్నాయి... వస్తాయి కూడా. - పృథ్వీ శుక్లాభాయ్@ నాయక్ నేను హీరోగా, డెరైక్టర్‌గా ‘బొంగుస్వామి’ పేరుతో ఓ సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. ఆ టైమ్‌లో దర్శకుడు వినాయక్ దగ్గర్నుంచి ఫోన్..‘‘ సార్.. ‘నాయక్’ సినిమాలో ఓ వేషం ఉంది. మూడురోజులు కాల్షీట్స్ కావాలి’’ అనడిగాడు. నాకు అలాంటి చిన్న వేషం వేయడం ఇష్టం లేదు. కానీ వినాయక్ కోసమని ఒప్పుకొని వెళ్లా. ఆ రోజు నా మీద కొన్ని సీన్స్ తీశారు. నా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చూసి వినాయక్, కెమేరామెన్ ఛోటా కె.నాయుడు ఒకటే నవ్వులు. యూనిట్ సభ్యులు కూడా పగలబడి నవ్వుతున్నారు. దాంతో వినాయక్ వెంటనే రచయిత ఆకుల శివను పిలిచి-‘‘పోసాని గారు సెకండాఫ్ మొత్తం కనబడేట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చెయ్’’ అని ఆర్డర్ వేశారు. అలా 3 రోజులు అనుకున్న నా వేషం 13 రోజులకు వెళ్లింది. చివరకు క్లైమాక్స్‌లో కూడా నా పాత్రను ఇరికించారు. చిరంజీవి గారు రష్ చూసి నా పాత్రను బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్‌తో ఈ సినిమా హిట్ అని ముందే చెప్పేశారట. నా పాత్ర ఇంతలా పేలుతుందని నేను కూడా అస్సలు ఊహించలేదు. రిలీజ్ తర్వాత ఫోన్ల మీద ఫోన్లు. దాసరి గారు ప్రత్యేకంగా నన్ను అప్రిషియేట్ చేశారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా. ఆ దెబ్బతో రాత్రికిరాత్రే స్టార్ కమెడియన్ని అయిపోయా. ఈ ఒక్క పాత్ర వల్ల నాకు 37 సినిమాలు వచ్చాయి. దీంతో డెరైక్షన్ పక్కన పెట్టేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన వినాయక్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. - పోసాని కృష్ణ మురళి మైదానం@ రాజు గారి గది ‘ఎమ్.వై దానం....ై మెదానం’... ఇప్పుడు ఎక్కెడికెళ్లినా నన్ను ఇలానే పిలుస్తున్నారు. ఇప్పటివరకూ నేను ఎన్ని సినిమాలు చేసినా, ఈ పాత్ర మాత్రం ప్రేక్షకుల హృదయాల్లోకి తారాజువ్వలా దూసుకెళ్లింది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర మాత్రం ‘రాజు గారి గది’ లోని మైదానం పాత్రే. ‘గీతాంజలి’ తర్వాత ఫుల్‌లెంగ్త్ రోల్ చేసింది ఈ సినిమాలోనే. నా మొదటి సినిమా ‘రన్ రాజా రన్’. అందులో నాది కానిస్టేబుల్ వేషం. అది చూసి కోనవెంకట్‌గారు నాకు ‘గీతాంజలి’ సినిమాలో ఆరుద్ర పాత్ర ఇచ్చారు. ఆరుద్ర వల్ల ఈ మైదానం దక్కింది. ఈ మైదానం మాత్రం నాకే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. శ్రీను@ గీతాంజలి ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ తెరపై బాంబుల్లా పేలినవే. ‘ఇడియట్’లో రవితేజ ఫ్రెండ్‌గా, ‘సోలో’ సినిమాలో నారారోహిత్ పక్కన నేను చేసిన కామెడీ నన్ను ప్రామిసింగ్ కమెడియన్ని చేశాయి. నా కెరీర్‌ను ఒక్కసారిగా తారాజువ్వలా తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘గీతాంజలి’. తొలిసారిగా మెయిన్ రోల్ చేస్తూనే కామెడీ పండించే అవకాశం దక్కింది. ఇందులో నాది డెరైక్టర్ కావాలని కలలు కనే పాత్ర. అందులోనూ ఓ దెయ్యం కథ తయారు చేసుకుని నిర్మాత కోసం వెతుకుతుంటా. ఈ నేపథ్యంలో నిజంగా దెయ్యం రావడం... ఎందుకండీ నేను చెప్పడం ఆల్రెడీ మీరు చూశారు... ఎంజాయ్ చేశారు కదా. దెయ్యం సినిమాతో నవ్వించడం అంటే మాటలు కాదు కదా. మొత్తానికి డెరైక్టర్ శ్రీను పాత్ర నా లైఫ్ టైమ్ మెమొరీలో నిలిచిపోతుంది. - శ్రీనివాసరెడ్డి నెల్లూరు గిరి@ ప్రేమకథా చిత్రమ్ నేను మొదట్లో ‘పరుగు’లో నటించాను. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశా. కానీ నా కెరీర్‌ను మలుపు తిప్పి, టపాకాయ్‌లా పేలిన సినిమా అంటే ‘ప్రేమకథా చిత్రమ్’. అందులో నా పాత్ర పేరు ‘నెల్లూరు గిరి’. ఆత్మహత్య చేసుకోవడం కోసం హీరో బ్యాచ్‌తో కలిసి ఊరు చివరి గెస్ట్‌హౌస్‌కు వెళ్తాడు. అక్కడ కథ ఎలా మలుపు తిరిగిందో మీకు తెలుసు. అక్కడ నుంచీ నా కెరీర్ కూడా ఎలా మలుపు తిరిగిందో కూడా మీకు తెలుసు. - సప్తగిరి సంపూర్ణేశ్‌బాబు@ హృదయకాలేయం అందరికీ దొరకని అదృష్టం నాది. ఎవ్వరికీ దొరకనంత క్రేజ్ నాకు ఫస్ట్ సినిమాతోనే వచ్చేసింది. అదే ‘హృదయకాలేయం’. ముందు సోషల్ మీడియాలో సూపర్‌హిట్ అయ్యి, తర్వాత సెల్యులాయిడ్ మీద సూపర్‌హిట్ అయ్యా. మొదటి చిత్రమే నా కెరీర్‌కు యూటర్న్ అయిందంటే విచిత్రంగా ఉంది కదూ. నేను ఎన్ని సినిమాలు చేసినా, ‘హృదయకాలేయం’ సంపూర్ణేశ్‌బాబు అంటేనే చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. ఆ ట్యాగ్ ఇప్పటికీ, ఎప్పటికీ నాకు ప్లస్ పాయింట్. - సంపూర్ణేశ్‌బాబు రాజారత్నం @ శ్రీమంతుడు ‘‘బాబూ... నువ్వు రానంతవరకూ ఆవిడ తోటకెళ్తూనే ఉంటుంది’’ అని నేను ‘శ్రీమంతుడు’ సినిమాలో రాజారత్నం పాత్రలో చెప్పిన డైలాగ్‌కు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఈ మధ్య కాలంలో నాకు బాగా పేరు తె చ్చిన పాత్ర అంటే ఇదే. అలాగే ‘బ్రూస్లీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ స్కూప్ కూడా బాగా క్లిక్ అయ్యింది. - అలీ -
వాళ్లు కూడా మనుషులే...!
‘‘దేవుని సృష్టిలో ఆడ, మగ మాత్రమే కాదు, మూడో తెగ కూడా ఉంది. వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తోంది సమాజం. వాళ్లను మనుషుల్లో ఒకరిగా గుర్తించని పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. హిజ్రాలూ మనుషులే, వారికీ మనోగతాలుంటాయి... వ్యథలుంటాయి... ఆత్మాభిమానాలుంటాయని తెలిపే కథాంశంతో మేం తెరకెక్కించిన సినిమానే ‘థర్డ్ మేన్’’ అని హెచ్.ఎం.ఇమ్రాన్ (ఇంద్రమోహన్) చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో నటుడు పృధ్వీ హిజ్రాగా కీలక పాత్ర పోషించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 80 మంది హిజ్రాలు ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘హిజ్రాలకు కూడా చట్ట సభల్లో సమాన హక్కు కల్పించిన ఈ శుభ సందర్భంలో మా సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. ఇందులో మూడు పాటలు కూడా ఉంటాయి. ఇది నేను ఆత్మసంతృప్తి కోసం మాత్రమే తీసిన సినిమా. దీనికి ప్రభుత్వం నుంచి కూడా తగు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెల రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అలైఖ్య, పూజా, యాన, మల్లిక, షమ, రేష్మ, శ్రీదేవి, టీనా తదితర హిజ్రాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, సంగీతం: బొంబాయి బోలే, కెమెరా: ప్రసాద్ కొల్లి. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల -
వాటితో తృప్తి లేదు
ఆ అవకాశాలు తృప్తి కలిగించలేదు, అందుకే అంగీకరించలేదు అంటోంది నటి ఇషా తల్వార్. ఈ బ్యూటీ తిల్లుముల్లు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం హిట్టయినా అమ్మడికి మరో అవకాశం రాలేదు. దీనిపై ఈ ఉత్తరాది భామ బదులిస్తూ తాను మలయాళంలో పలు చిత్రాలు చేశానని తెలిపింది. హమారా దిల్ ఆప్ కే పాస్ హై చిత్రంలో పృథ్వికి చెల్లెలిగా నటించానని చెప్పింది. దీంతో రెండో హీరోయిన్ అవకాశాలు రావ డం మొదలైనట్లు చెప్పింది. అలాంటి పాత్రలు చేయడం తనకిష్టం లేదని అంది. తాను హీరోయిన్‌గానే నటించాలని భావిస్తున్నానన్నారు. అందుకే సెకండ్ హీరోయిన్ అవకాశాలు నిరాకరించినట్లు పేర్కొంది. ఇటీవల తెలుగులో మైనేప్యార్కియా చిత్రంలో హీరోయిన్గా చేశానని చెప్పింది. తమిళంలో తొలి చిత్రం తిల్లుముల్లు తరువాత వచ్చిన అవకాశాల్లో ఏదీ సంతృప్తి కలిగించకపోవడంతో అంగీకరించలేదని చెప్పింది. మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇషా సెలవిచ్చింది. -
ఆ బాధతోనే ఓసారి ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయా!
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’... ఈ ఒక్క డైలాగ్‌తోనే వంద సినిమాలు చేసినంత గుర్తింపును తెచ్చుకున్న నటుడు పృథ్వీ. ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నా... నటనపట్ల మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తాజాగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘భీమవరం బుల్లోడు తదితర చిత్రాలతో అలరించారు. తన ఆటుపోట్ల సినీప్రయాణం గురించి పృథ్వీ చెప్పిన విశేషాలు... మా అబ్బాయిని చిన్నప్పుడు... ‘బాల రామాయణం’లో ఇంద్రజిత్ పాత్ర కోసం తీసుకున్నారు గుణశేఖర్. ట్రెయినింగ్ కూడా ఇచ్చాక వేరే అబ్బాయిని తీసుకున్నారు. దాంతో డిజప్పాయింట్ అయ్యాడు. ఇక సినిమాల జోలికి రాకూడదని అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు. మా అమ్మాయి చెన్నై టీసీఎస్‌లో పని చేస్తోంది. తనకీ ఈ ఫీల్డ్ మీద ఆసక్తి లేదు. వాళ్లు వస్తానంటే నాకు అభ్యంతరమూ లేదు! థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎలా ఉంది ఎక్స్‌పీరియెన్స్? (నవ్వుతూ) నేను ఇండస్ట్రీకొచ్చి ఇంకా థర్టీ ఇయర్స్ అవ్వలేదండీ... ఇరవయ్యేళ్లే అయ్యింది. ‘ఖడ్గం’లోని ఆ డైలాగ్ మీ జీవితాన్నే మార్చేసింది కదా... అందుకని...? అవును. నిజానికి అది ముందు అనుకుని పెట్టిన డైలాగ్ కాదు. వేరే ఏదో అనుకున్నాం. కానీ రోజంతా ఎన్ని టేకులు చేసినా తృప్తికరంగా రాలేదు. సాయంత్రం సడెన్‌గా కృష్ణవంశీ ఆ డైలాగ్ చెప్పారు. అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చింది. నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ సిన్మాతోనే మీ గురించి అందరికీ తెలిసింది. అంతకుముందు ఏం సినిమాలు చేశారు? చాలానే చేశాను.‘గండిపేట రహస్యం’ చిత్రంలో హీరోగా చేశాను. అయితే అది పక్కా పొలిటికల్ చిత్రం కావడంతో విడుదల తరువాత చాలా గొడవలయ్యాయి. నేను ఎన్టీయార్‌ని ఇమిటేట్ చేశానని చాలామంది విమర్శించారు. చివరికి ఎన్టీయారే పిలిచి... ‘డెరైక్టర్ చెప్పింది చేశావ్, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు, నీ తప్పేమీ లేదు’ అన్నారు. దాంతో నా టెన్షన్ తగ్గింది. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించాను కానీ అంత గుర్తింపు రాలేదు. అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు? మాది తాడేపల్లిగూడెం. మా నాన్న సుబ్బారావు నటుడే. నాటకాలు, ఓ పదిహేను పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయన ప్రభావం కొంత ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఏ. చేస్తున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అప్పుడందరూ నటుడిగా ట్రై చేయొచ్చుగా అనేవారు. దాంతో ఆసక్తి ఏర్పడింది. నటుడు ప్రభాకర్‌రెడ్డిగారు నాన్న స్నేహితుడు. ఆయన సహకారంతో 1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆయనే నా నట గురువు. సక్సెస్ కావడానికి చాలా టైమ్ పట్టిందే? ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడంటే చదువుకున్నవాళ్లు వస్తున్నారు, ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు, ఎదుటివారిని గౌరవిస్తున్నారు. అప్పట్లో అలా కాదు. చాలా యాటిట్యూడ్ ప్రాబ్లెమ్స్ ఉండేవి. నాకు ఇస్తామన్న రోల్స్ చివరి నిమిషంలో వేరేవాళ్లకి ఇచ్చేసేవారు. చాలా డిజప్పాయింట్ అయ్యేవాడిని. ఇంత చదువుకున్నాం, ఇలా అవమానాలు భరించడం అవసరమా అని కుమిలిపోయేవాడిని. చివరికి ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లిపోయాను. వెళ్లిపోయారా.. మళ్లీ ఎలా వచ్చారు? నన్ను నటుడిగా చూడాలని మా అమ్మ కలలు కంది. కానీ తన కల నెరవేరకముందే కన్నుమూసింది. ఆ బాధతో కొంత ఇక సినిమాలు వద్దనుకుని, ఓ కాలేజీలో లెక్చెరర్‌గా చేరిపోయాను. కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ ఫోన్ చేశారు. ఆయనది మా ఊరే కావడంతో నేను ఆయనకు బాగా తెలుసు. ‘ఖడ్గం’లో నటించడానికి రమ్మని పిలిచారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో కొత్త జీవితాన్నిచ్చారు. ఇప్పుడు హ్యాపీనా...? హ్యాపీనే. ‘ఆగడు’, ‘అవతారం’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. ‘గే’ల సమస్యల ఆధారంగా తీసిన ‘థర్డ్ మ్యాన్’ అనే కన్నడ సినిమాలో లీడ్ రోల్ చేశాను. ఇది తెలుగులో కూడా రానుంది. ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా? ‘అంతఃపురం’లో ప్రకాశ్‌రాజ్ పాత్రలాంటిది చేయాలి. అంతేకాదు... కైకాల సత్యనారాయణగారు నా రోల్ మోడల్. ఆయన చేయని పాత్ర లేదు. ఆయనలానే నేను కూడా రకరకాల రోల్స్ చేయాలి. నటన కాకుండా మీకున్న మరో లక్ష్యం? సమాజ సేవ. మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదైనా చేయాలి. అందుకు రాజకీయాలు ఓ మంచి మార్గమని నా నమ్మకం. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. తీరిక దొరికినప్పుడల్లా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను. వైఎస్సార్‌ని ఆరాధించేవాడిగానే కాదు... ఓ వ్యక్తిగా ఈ సమాజం పట్ల నా బాధ్యతను కాస్తయినా తీర్చుకోవాలన్నదే నా ఆశ, ఆశయం. - సమీర నేలపూడి