
పృథ్వీ , సుమయా
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీలోని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, రచయిత కోన వెంకట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సాయి రాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తి జీవితంలో ఉండే ఓ అంశం మా చిత్ర కథలో ఉంటుంది. స్క్రిప్ట్‌పై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ కథపై నమ్మకంతో నేను సినిమా నిర్మించడంతో పాటు హీరోయిన్‌గా నటిస్తున్నాను’’ అన్నారు సుమయా రెడ్డి. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో పాటు మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు పృథ్వీ అంబర్.
Comments
Please login to add a commentAdd a comment