New Movie Launch
-
అన్లిమిటెడ్ నవ్వులు
నయనతార లీడ్ రోల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమా ఆరంభమైంది. సుందర్ సి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డా. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్నారు. కోటి రూపాయలతో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ‘‘నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్: పార్ట్ 1’ భారీ విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది. ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రం అన్లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎగ్జయిటింగ్ కథాంశంతో ఉంటుంది. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ మూవీని అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, సి. కల్యాణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘K ర్యాంప్’ ప్రారంభం (ఫొటోలు)
-
పాయల్ రాజ్‌పుత్ ‘వెంకటలచ్చిమి’ కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
New Year 2025 : న్యూ ఇయర్ విషెస్ సినీ పోస్టర్స్ (ఫోటోలు)
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటుడు ప్రభాకర్ కూతురిని చూశారా (ఫొటోలు)
-
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. నిర్మాతగా హీరో నాని (ఫొటోలు)
-
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
‘నాగబంధం’ సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
హీరోయిన్ సంయుక్త మీనన్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
#NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ధమాకా రిపీట్.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు)
-
'ధమాకా' కాంబో రిపీట్.. రవితేజ 75వ సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
సరికొత్త కథతో శ్రీకారం
‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా కొత్త చిత్రానికి శ్రీకారం జరిగింది. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకుడు. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఏఎం రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, బసిరెడ్డి క్లాప్ కొట్టగా, వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ– ‘‘ఇండియన్ సినిమాలో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘మాలాంటి కొత్త వాళ్లకి ఎం3 మీడియా చాన్స్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మాల్యాద్రి రెడ్డి. ‘‘బిగ్ బాస్’కి వెళ్లకముందే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు అమర్దీప్ చౌదరి. సుప్రీత, నటీనటులు సురేఖా వాణి, తేజస్వి, గౌతమ్ కృష్ణ, రఘు, నటుడు, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: దాస్ కడియాల, కెమెరా: బాల సరస్వతి. -
రష్మిక మందాన్నా ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ మొదలైంది!
రష్మికా మందన్నా ప్రధాన ప్రాత్రలో నటించనున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
'బేబి' మూవీ టీమ్ నుంచి మరో ప్రేమకథ
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సంకృత్యాన్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సుమన్ పాతూరి. ‘‘హీరోయిన్గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్కేఎన్. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేశ్ పెద్దింటి. -
కొత్త క్యారెక్టర్‌కి క్లాప్
హీరో రవితేజ కెరీర్లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఒక పవర్ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
ఒక సామాన్యుడి ఘర్షణ
సందీప్ కిషన్ హీరోగా సోమవారం కొత్త చిత్రం ఆరంభమైంది. సందీప్ కిషన్‌తో త్వరలో రిలీజ్‌కు రెడీ కానున్న ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం రూ΄÷ందించిన ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ‘మాయవన్’ చిత్రం తర్వాత సందీప్ కిషన్, దర్శకుడు సీవీ కుమార్ కాంబినేషన్లో ‘మాయవన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూ΄÷ందనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేయగా, దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. పి. కిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘ఒక సూపర్ విలన్‌తో ఓ సామాన్యుడి ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ని నవంబర్‌లో ఆరంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: కార్తీక్ కె. తిల్లై, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: కిషోర్ గరికి΄ాటి (జీకే). -
మేఘా ఆకాశ్ కొత్త సినిమా.. డిఫరెంట్ టైటిల్
మేఘాఆకాశ్ హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమాకు 'సఃకుటుంబనాం' పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం లాంచనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. రామ్ కిరణ్ హీరోగా నటిస్తుండగా.. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం నిర్మిస్తున్నారు. ఉదయ్‌శర్మ దర్శకుడు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగాఫ్రర్ చిన్నిప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. (ఇదీ చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!) సినిమాలో తన పాత్ర గురించి వినగానే కొత్త హీరో అని చూడకుండా మేఘా ఆకాష్ వెంటనే ఒప్పుకున్నారని దర్శకుడు చెప్పాడు. క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం అందరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర. ఇందులో నటించడం ఆనందంగా వుందని చెప్పింది. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విజేత చేతికి అందని రూ.25 లక్షలు.. పట్టించుకోని టీమ్) -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్‌పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్. -
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్‌గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
మెగాస్టార్‌తో సినిమా ప్రకటించిన సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి నేడు (ఆగష్టు 22) 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ నుంచి ఒక శుభవార్తను ఫ్యాన్స్ కోసం వెల్లడించారు. సుష్మిత నిర్మాతగా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలిపారు. (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందుకు సంబంధిచిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీ చేసి చిరంజీవికి వినిపించారని టాక్ నడుస్తోంది. ఆ కథను ఆయన ఫైనల్ కూడా చేశారట. ఇకపోతే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను ఒక యంగ్ దర్శకుడికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టాలీవుడ్ నుంచే కాకుండా ఒక తమిళ దర్శకుడు కూడా లైన్లో ఉన్నారని సమాచారం. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ నుంచి ఒక సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వారు ఒక పోస్టర్‌ను కూడా తాజాగ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో భోళా శంకర్ తర్వాత ఆయన నుంచి రెండు భారీ ప్రాజెక్ట్‌లు రెడీ అవుతున్నాయి. A legacy of ruling the silver screen for 4 decades! A personality which evokes a plethora of emotions! A man who is celebrated on and off the screen After 155 films, now #MEGA156 will be a MegaRocking entertainer Happy Birthday to @KChiruTweets Garu🤗#HBDMegastarChiranjeevi pic.twitter.com/TnMlon63li — Gold Box Entertainments (@GoldBoxEnt) August 22, 2023 The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
టాప్ టెక్నీషియన్స్‌తో వచ్చేస్తున్న ‘రౌడీ బాయ్స్’ హర్షిత్ రెడ్డి
‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా మూడో చిత్రం సోమవారం ఆరంభమైంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు. ‘‘రొమాంటిక్ హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ‘రౌడీ బాయ్స్’తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆశిష్ ప్రస్తుతం నటిస్తున్న ‘సెల్ఫిష్’ 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడో సినిమాగా రూ΄పొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కెమెరా: పీసీ శ్రీరామ్. -
డీజే టిల్లు కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్. -
Bommarillu Bhaskar-Siddhu Jonnalagadda New Movie Launch: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
Narne Nithin: అల్లు అరవింద్ సమర్పణలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ షురూ
దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్‌పై ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. నరేన్ వనపర్తి హీరోగా, పాయల్ గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బి.గోపాల్ క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు అవినాష్ కొకటి. ‘‘నాన్నగారి (జేపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్మాణంలోకి వచ్చాను’’ అన్నారు మల్లికా రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శివ. -
మహిళల నేపథ్యంలో...
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్‌ని అందించారు. ‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్‌ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ. -
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త సినిమా లాంచ్
-
మర్డర్ మిస్టరీ
అరుణ్, సృజన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో ‘వేటాడతా’ చిత్రం తెరకెక్కుతోంది. ఎమ్.అంకయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. వైజాగ్ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయివెంకట్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్ అందించగా, నిర్మాత రామ సత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీగా ‘వేటాడతా’ చిత్రం రూపొందుతోంది. ఈ నెలాఖరులో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. అరకు, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు అంకయ్య. ‘‘మా నాన్న(అంకయ్య) సిద్ధం చేసిన కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్. ఈ సినిమాకు సహ–నిర్మాత: డి.శివ ప్రసాద్, సంగీతం: శేఖర్ మోపూరి. -
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
ప్రేమ.. సందేశం
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీలోని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, రచయిత కోన వెంకట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయి రాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి వ్యక్తి జీవితంలో ఉండే ఓ అంశం మా చిత్ర కథలో ఉంటుంది. స్క్రిప్ట్‌పై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ కథపై నమ్మకంతో నేను సినిమా నిర్మించడంతో పాటు హీరోయిన్గా నటిస్తున్నాను’’ అన్నారు సుమయా రెడ్డి. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో పాటు మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు పృథ్వీ అంబర్. -
పురుషోత్తముడు షురూ
రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ చిత్రం షురూ అయింది. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాసినీ సుధీర్ కథానాయిక. రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘ఆకతాయి’ చిత్రం తర్వాత నేను చేస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. హైదరాబాద్, రాజమండ్రి, కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్ అయ్యాం. రామ్‌గారు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్. సినిమాటో గ్రాఫర్ పీజీ విందా, సంగీత దర్శకుడు గోపీసుందర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు దామోదర్ ప్రసాద్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: వెంగళరావు. -
పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్న 'మసూదా' హీరో
‘మసూద’ వంటి హిట్ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ద్వారా జీజీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై వ్యాపారవేత్త రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ చిత్రమిది. గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టైటిల్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు రవి కుమార్ పనస. -
సెంటిమెంట్.. యాక్షన్
శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని అన్నారు. -
గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా విశ్వ కరుణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శివం సెల్యులాయిడ్స్‌పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాతలు డి. సురేష్‌బాబు, ఏఎమ్ రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. ‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. సురేష్ రెడ్డి, సంతోష్, సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: విశ్వాస్ డానియేల్. -
ఘనంగా గల్లా అశోక్ కొత్త సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
Vijay67: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని కొత్త సినిమా (ఫొటోలు)
-
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా షురూ
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కనున్న సినిమా షురూ అయింది. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదల చేస్తాం. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం పని చేయనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్. -
మిస్ రెబల్
మేఘా ఆకాష్, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాటే మంత్రము’. అభిమన్యు బద్ది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిందు ఆకాష్ (మేఘా ఆకాష్ తల్లి) సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథ అందించారు. అక్టోబరు 26 మేఘా బర్త్ డే సందర్భంగా ‘మాటే మంత్రము’లోని ఆమె క్యారెక్టర్ నేమ్, లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కావ్య అనే రెబల్ అమ్మాయిగా నటించారు మేఘా ఆకాష్. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. చిత్రయూనిట్ పేర్కొంది. -
పొలిటికల్ డ్రామా షురూ
వెండితెరపై పొలిటికల్ టర్న్ తీసుకున్నారు శర్వానంద్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఆ నిర్మాణ సంస్థలో రెండోసారి విజయ్ సినిమా..
Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films: 'ఉరియడి' చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కుమార్. ఆ తర్వాత సూర్య, జ్యోతికల నిర్మాణా సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'ఉరియడి-2' చిత్రం చేసిన ఈయన తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. రీల్ గుడ్ ఫిలీంస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇది ఈ సంస్థలో ఆయన చేస్తున్న రెండో చిత్రం. ప్రీతి అస్రాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి 'సేతుమాన్' చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్ జయ రాజ్ ఛాయగ్రహణం, వసంత గోవింద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ సంఘటనలతో పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
రాకింగ్ రాకేష్ హీరోగా 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'..
Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్‌లు ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ–‘‘కామెడీతో కూడుకున్న హారర్ సినిమా ఇది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘76 సూపర్ హిట్స్ ఇచ్చిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అన్నారు తుమ్మల ప్రసన్నకుమార్. చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్. చదవండి:👇 నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి: నిర్మాత బన్నీ వాసు
‘‘కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ జీరో నుంచి మళ్లీ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం’’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘యానం’ అనే టైటిల్ ఖరారు చేశారు. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణాకర న్ దర్శకుడు. కేఎస్ఐ సినిమా అన్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బ్యానర్ లోగోను బన్నీ వాసు, ‘యానం’ టైటిల్ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ–‘‘నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ఫిల్మ్స్కు కరుణాకరన్ వర్క్ చేశాడు. ‘యానం’ తో దర్శకునిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ‘యానం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్’’ అన్నారు కరుణాకరన్. -
క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా.. త్వరలో షూటింగ్
చెన్నై సినిమా: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్‌ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. నటుడు శరత్‌కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్‌కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? -
తెరపైకి మరో 'అల్లూరి' సీతారామరాజు..
Ravi Teja Launched Sree Vishnu Alluri Movie Poster: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో ఫైర్ ఎలిమెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను, వాటర్ ఎలిమెంట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించారు. క్యారెక్టర్లకు తగినట్లుగానే అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ ప్రేక్షకులను మెప్పించాడు. ఎంతలా అంటే ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా. అలా ఇదివరకూ 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతగా ఆకట్టుకున్నాయి వారి పాత్రలు. చదవండి: రామ్ చరణ్ చుట్టూ ఎగబడ్డ జనం.. వీడియో వైరల్ ఇప్పుడు మరో అల్లూరి సీతారామరాజు వెండితెరపై సందడి చేయనున్నాడు. 'అల్లూరి' పేరుతో మరో సినిమా రానుంది. శ్రీ విష్ణు హీరోగా డైరెక్టర్ ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశాడు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మూవీలో పోలీసు అధికారి అల్లూరి సీతరామరాజుగా విష్ణు కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని గొప్ప పోలీసు అధికారి పాత్రను ఈ మూవీ ద్వారా తెలియజేస్తున్నామని పోస్టర్లో రాసి ఉంది. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. హర్ష వర్ధన్ సంగీతం అందిస్తున్నారు. TITLE ASSAULT of My next as A Sincere Cop #𝗔𝗟𝗟𝗨𝗥𝗜 👮♂️ Witness The Greatest Police Story, Ever Told 🤙🏾 Directed by #PradeepVarma Produced by @BekkemVenugopal #Babita @luckymediaoff 🎶 @rameemusic 🎥#RajThota pic.twitter.com/Oe7PPXrCfI — Sree Vishnu (@sreevishnuoffl) April 5, 2022 చదవండి: సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్‌తో పోటీ ! -
యాక్షన్ ఎంటర్టైనర్
సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా షురూ అయింది. రచయిత, నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. సుధీర్ బాబు సరికొత్తగా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
రాంచరణ్ శంకర్ #RC15 సినిమా ప్రారంభం ఫోటోలు
-
శాండల్‌వుడ్‌కి సై అంటున్న పాయల్ రాజ్‌పుత్
కన్నడ పరిశ్రమ నుంచి ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు పిలుపొచ్చింది. కన్నడ హీరో ధనుంజయ నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్ బుష్’లో హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ నటించనున్నారు. ఆదివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. శూన్య డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. ఓ డాన్ జీవితం ఆధారంగా 1960–1980 కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందనేది శాండల్‌వుడ్ టాక్. బెంగళూరుతో పాటు మైసూర్, కోలార్ ప్రాంతాల్లో ‘హెడ్ బుష్’ సినిమా షూట్‌ను ప్లాన్ చేశారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు తెలుగులో ఆదీ సాయికుమార్ సరసన ‘కిరాతక’, తమిళ చిత్రం ‘ఏంజెల్’ చిత్రాలు చేస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. ఇక పోలీసాఫీసర్‌గా పాయల్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘5 డబ్ల్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
రొమాంటిక్ కామెడీ
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. టి.జి. కీర్తి కుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సుమంత్. ‘‘రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జి.ఆర్.ఎన్. శివ కుమార్. -
జై లవకుశలా విజయం సాధించాలి
‘‘జగదానంద కారక’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. టైటిల్ లోగో బాగా నచ్చింది. నా సినిమా ‘జై లవకుశ’ తరహా పాజిటివిటీ కనిపించింది. ‘జగదానంద కారక’ కూడా ‘జై లవకుశ’ అంత హిట్ అవ్వాలి’’ అని డైరెక్టర్ బాబీ అన్నారు. వినీత్ చంద్ర, అని షిండేలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జగదానంద కారక. వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక– నిర్మాత వీరశంకర్ స్క్రిప్టును చిత్రయూనిట్‌కి అందించగా, దర్శకుడు బాబీ క్లాప్ కొట్టారు. రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. కడియం–రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘ఆకతాయి’ తర్వాత మళ్లీ రామ్ భీమనతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ సతీష్ కుమార్. ఈ చిత్రానికి మరో లైన్ ప్రొడ్యూసర్: మాదాసు వెంగళరావు. -
లుక్ అదుర్స్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) అందించిన విజయంతో హీరో సూర్య రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా ఘన విజయం సాధించడంతో తర్వాతి చిత్రాన్ని మంచి జోష్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లారు సూర్య. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సూర్య కెరీర్లో 40వ చిత్రమిది. కాగా ఈ చిత్రంలోని సూర్య లుక్ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కత్తి పట్టుకొని పంచెకట్టులో నడుస్తూ వెళుతున్న సూర్య లుక్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. ఆయన హెయిర్ స్టయిల్ కూడా కాస్త మాస్‌గా అనిపిస్తోంది. తాజా ఫొటోను బట్టి చూస్తే యాక్షన్ సీక్వెన్స్‌లో విలన్ల భరతం పట్టబోతున్నారు సూర్య. ఆయన ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా సామాజిక అంశాలతో కూడిన మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారట పాండిరాజ్. -
'హిట్ 2'.. లాంఛనంగా ప్రారంభం
-
`శాకుంతలం` షూటింగ్ ప్రారంభం
-
నవ్వులే నవ్వులు
అనురాగ్ కొణిదెన, అవికాగోర్ జంటగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. జెమిని ఎఫ్ఎక్స్ సమర్పణలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కోటేశ్వరరావు నిర్మిస్తుండగా, అవికా గోర్ మరో నిర్మాత. తొలి సీన్‌కి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిత్ర సమర్పకులు పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. తమిళం, కన్నడలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నిర్మాణ సంస్థను ప్రారంభించి, జెమిని వారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అవికా. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది’’ అన్నారు అనురాగ్. ‘‘మార్చి 4న తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు సత్వం ద్వారపూడి. ‘‘ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన గాయనీ– గాయకులకు చాన్స్ ఇస్తాం’’ అన్నారు సంగీత దర్శకుడు శక్తికాంత్. ఈ చిత్రానికి కెమెరా: రఘు. -
గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..
బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన అరియానా గ్లోరీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్ ఇప్పుడు హీరోయిన్గా మారనుందని తెలుస్తోంది. యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ షోలో అరియానా టాప్ 4లో ఉండడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడుఈ అమ్మడుకి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది. యువ నటుడు రాజ్ తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్‌బాస్ తర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్‌తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్నపూర్ణ బ్యానర్‌ని హ్యాష్ ట్యాగ్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు అర్దమవుతుంది. పూజా కార్యక్రమం కూడా పూర్తయినట్టు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: వైరల్: ఈ బిగ్‌బాస్ హీరోను గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
ఇద్దరికి సమ్మతమే
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించనున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనా«ద్ రెడ్డి దర్శకత్వంలో యు.జి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశానికి కూనుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, భువనగిరి ఎం.ఎల్.ఏ పైలా శేఖర్‌రెడ్డి క్లాప్‌కొట్టారు. గోపీనా««ద్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచే మొదలుపెడుతున్నాం. మార్చిలో షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం’’ అన్నారు. ‘‘టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి చిత్రం అందించాలనే ఈ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు కె.ప్రవీణ. కిరణ్ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమా కోసం మూడేళ్లుగా వర్క్ చేస్తున్నాం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాత్రి, పగలు కష్టపడి రెడీ చేసుకున్నాం. వరుస సినిమాలతో డే అండ్ నైట్ వర్క్ దొరకటం హ్యాపీగా ఉంది. చాందినీ, నేను ఇద్దరం షార్ట్‌ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లమే’’ అన్నారు. చాందినీ మాట్లాడుతూ–‘‘ ‘కలర్‌ఫోటో’ తర్వాత లుక్ అండ్ క్యారెక్టర్ పరంగా డిఫరెంట్‌గా ఉండే పాత్ర కావాలని ఎదురుచూశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం– శేఖర్ చంద్ర. -
హీరోగా మారిన జానీ మాస్టర్
డాన్స్ మాస్టర్ స్థాయి నుంచి హీరోలుగా, దర్శకులుగా ఎదిగారు ప్రభుదేవా, లారెన్స్. తాజాగా డ్యాన్స్ మాస్టర్ జానీ హీరోగా మారారు. సుజి విజువల్స్ పతాకంపై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో కె.వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయ్యింది. తొలి సీన్‌కి నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు. జానీ మాట్లాడుతూ – ‘‘నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్నాక నటించాలని నిర్ణయించుకున్నాను. ‘నువ్వు హీరోగా చేయకపోతే నేనీ సినిమా తీయను’ అని నిర్మాత చెప్పటంతో మరింత కనెక్ట్ అయ్యాను’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు వెంకటరమణ. ‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంది’’ అన్నారు కథానాయిక దిగంగనా సూర్యవంశీ. -
అందరూ బాగుండాలి...
‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే మంచి కథ ఉన్న సినిమాలో అలీ, నరేశ్ నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడు అలీ ‘అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలీ, సీనియర్ నరేశ్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొనతాల మోహనకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కెమెరామేన్ ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఈ చిత్రదర్శకుడు కిరణ్ చెన్నైలో రూమ్ మేట్స్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్’’ అన్నారు అలీ. ‘‘అలీ ఓ చిత్రం చేస్తున్నాడంటే దానికి ఒక బ్రాండ్ వస్తుంది’’ అన్నారు నరేశ్. ‘‘బుధవారమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు శ్రీపురం కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ పళిడమ్, కెమెరా: ఎస్. మురళీ మోహన్ రెడ్డి. -
కామెడీ.. థ్రిల్
‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు విరాట్ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్ అయ్యాను’’ అన్నారు రాహుల్. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్. -
శివరాత్రికి ఫాలోయింగ్
తిలక్ శేఖర్, ఖ్యాతి శర్మ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఫాలోయింగ్’. విస్లా స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సాపిరెడ్డి నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌరీదేవి సాపిరెడ్డి క్లాప్ ఇవ్వగా, రాధికా చిలకలపూడి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సాపిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌తో ఇండస్ట్రీకి పరిచయం కావాలని వేచిచూశాను. మా బాబాయ్ ఛోటా కె.నాయుడుగారు కథ విని చాలా బాగుందని ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘నేను కన్నడలో 12 చిత్రాల్లో హీరోగా నటించాను. తెలుగులో ‘త్రిపుర’ లో నెగెటివ్ రోల్ చేశాను. ఆ తర్వాత నేను చేస్తున్న చిత్రం ‘ఫాలోయింగ్’’ అన్నారు తిలక్ శేఖర్. ‘‘2021 మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రాధాకృష్ణ. ఖ్యాతి శర్మ, కెమెరామెన్ నిమ్మ గోపి, మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మాణిక్, ప్రమోద్ మాట్లాడారు. -
సైకో థ్రిల్లర్
అనిల్, జాస్మిన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టీఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు గోపాల్ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల. -
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
నిజానికి దగ్గరగా...
‘గెటప్’ శీను, అంకితా కరత్ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాగర్ కె. చంద్ర క్లాప్ ఇచ్చారు. వేణు ఉడుగుల, సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌ను కృష్ణమాచారికి అందించారు. సూడో రియలిజమ్ జానర్లో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికకు దగ్గరగా మా సినిమా ఉంటుంది’ అన్నారు కృష్ణమాచారి. ‘డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు ప్రశాంత్ రెడ్డి. -
ఆనందంగా ఉంది
ఇంటర్నెట్ను బాగా ఫాలో అయ్యేవాళ్లు షిర్లీ సేతియా పేరు వినే ఉంటారు. యూట్యూబ్ సెన్సేషన్ తను. న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్కి చెందిన ఈ భామ పేరున్న గాయని. ‘బాలీవుడ్‌కి కాబోయే సెన్సేషన్’ అని ఫోర్బ్స్ మేగజీన్ రాసింది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘మస్కా’లో కనిపించారు షిర్లీ. అలానే ‘నికమ్మా’ అనే హిందీ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. నాగశౌర్య హీరోగా అనీష్ కష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో షిర్లీ సేతియాని కథానాయికగా ఎంపిక చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు షిర్లీ. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సహనిర్మాత: బుజ్జి, కెమెరా: సాయి శ్రీరామ్, సమర్పణ: శంకర్‌ప్రసాద్ ముల్పూరి, సహనిర్మాత: బుజ్జి. -
రెండేళ్ల తర్వాత మేకప్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. సున్నాకి సున్నా అని కొంతమంది జోకులు కూడా వేశారు. ఈ సినిమాకి ముందు షారుక్ చేసిన ‘జబ్ హ్యరీ మెట్ సెజల్’ కూడా అంతగా ఆడలేదు. దాంతో షారుక్ డైలమాలో పడ్డారు. ఇక లాభం లేదు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తపడాలనుకున్నారు. 2018 డిసెంబర్లో ‘జీరో’ విడుదలైంది. ఆ తర్వాత ఏడాది పాటు కథలు విన్నారు షారుక్. అయినా ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈలోపు ఈ ఏడాది కోవిడ్ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ లో బాగా ఆలోచించుకుని, ‘పఠాన్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు షారుక్. రెండేళ్ల తర్వాత హీరోగా మేకప్ వేసుకుని, బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్. మరి.. పరాజయాల్లో ఉన్న షారుక్‌కి ఈ చిత్రం భారీ విజయాన్ని అందిస్తుందా? అనేది వేచి చూడాలి. -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్‌ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
పండగకి టైటిల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, ‘విజేత’ ఫేమ్ కళ్యాణ్ దేవ్ హీరోగా నటించనున్న కొత్త చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించనున్నారు. రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ తళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. రామ్ తళ్లూరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ నటించనున్న మూడో చిత్రమిది. ‘కల్కి’ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. ‘ఛలో, భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి సాగర్ మా చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళతాం. దీపావళి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నాం’’ అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో దర్శకులు వెంకీ కుడుముల, ప్రణీత్, వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రఘుతు. -
అతడెవడు.. సస్పెన్స్
సాయికిరణ్ హీరోగా, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోయిన్లుగా వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అతడెవడు’. ఎస్ఎల్ఎస్ సమర్పణలో తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మొదటి సన్నివేశానికి తోట నాగేశ్వర్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట సుబ్బారావు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు నంది వెంకట్‌రెడ్డి. ‘‘ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానిగా నటిస్తున్నాను’’ అన్నారు సాయి కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: డమ్స్ర్ రాము, కెమెరా: డి. యాదగిరి. -
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేక్షకులకు నచ్చే విధంగా ‘సమాజం’
‘తీరం, క్రియేటివ్ క్రిమినల్’ వంటి సినిమాలు నిర్మించిన కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాజాగా తెరకెక్కుతోన్న మూడో సినిమా ‘సమాజం’. మనికాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్. రవినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. నర్సింహ్మ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింహ్మ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్. రవి నాయక్ క్లాప్ కొట్టారు. ‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. నవంబర్ మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయనున్నాం’’ చిత్ర బృంధం పేర్కొంది. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: అళహరి. -
సరికొత్త తిమ్మరుసు
‘బ్లఫ్ మాస్టర్’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందుతోంది. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్ . శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ ఇవ్వగా, రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుంది. ఈ నెల 21న రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అన్నారు. ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: అప్పూ ప్రభాకర్. -
తెలివిగా ఆడు
రవితేజ హీరోగా ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చిత్రం షురూ అయింది. ‘ప్లే స్మార్ట్’ (తెలివిగా ఆడు) అనేది ఉపశీర్షిక. డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్ ) సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హవీష్ క్లాప్ ఇచ్చారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. సత్యనారాయణ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో రమేష్ వర్మ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ వంటి టెక్నీషియన్లతో పర్ఫెక్ట్ టీమ్‌తో సినిమా చేస్తున్నాం. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది’’ అన్నారు. ఈ చిత్రానికి బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్స్: హవీష్ ప్రొడక్షన్స్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి. -
బ్యాక్ డోర్లో...
నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాక్ డోర్’. ఇందులో పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా సహజం అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు కర్రి బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్. -
ఒక్కసారి కమిట్ అయితే...
కల్యాణ్ గల్లెల, మౌనికారాజ్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఒక్కసారి కమిట్ అయితే’. రవి ములకలపల్లి దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్, నటరాజ శ్రీనివాస క్రియేషన్స్ పతాకాలపై పి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ క్లాప్‌నివ్వగా, సాయివెంకట్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు ప్రేమ్‌రాజ్ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. దర్శకుడు రవి మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ మూవీగా యువతకు సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈ సినిమాను తీస్తున్నాం. ఈ చిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, వైజాగ్, కోనసీమ, కర్నూల్ తదితర ప్రాంతాలలో మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. -
ప్రీలుక్ రిలీజ్: ‘చెక్’ పెట్టనున్న నితిన్
ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రంగ్‌దే సినిమానే కాకుండా నితిన్.. బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి(నితిన్ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నవంబరులో సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నితిన్ ఇటు కొత్త సినిమాలను కూడా వెనువెంటనే ఓకే చెప్పెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే నితిన్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. (అన్ని జాగ్రత్తలతో సెట్స్ పైకి...) ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం,సాహసం, మనమంతా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో కొత్త సినిమాను చేసేందుకు నితిన్ తయారయ్యాడు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు(గురువారం) డైరెక్టర్ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును చెక్‌గా ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. Happy and delighted to launch the title and pre look of my favourite director #ChandraSekharYeleti and @actor_nithiin’s new movie. Wishing all the best to #BhavyaCreations pic.twitter.com/bmyT8KPPjy — koratala siva (@sivakoratala) October 1, 2020 వీ ఆనంద్ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్ జోనర్లో సాగే థ్రిల్లర్ మూవీగా, ఇప్పటి వరకు నితిన్ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. (డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్) -
అంతా కొత్తవారితో...
శ్రీకాంత్, రీతూరెడ్డి జంటగా గురువారం హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో ఓ సినిమా ప్రారంభం అయ్యింది. వరుణ్. కె దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వి ప్రొడక్షన్స్ çసంస్థ నిర్మిస్తోంది. గతంలో ‘జ్యోతిలక్ష్మీ’, ‘సఖియా’,‘చిన్నదాన’ తదితర షార్ట్ఫిల్మ్స్కి దర్శకత్వం వహించారు వరుణ్. దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పల్లెటూర్లలో ఉండే పగప్రతీకారాలతో 1998 ప్రాంతంలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కనుంది ఈ చిత్రానికి సంగీతం: రోహిత్. -
వైకుంఠ ఏకాదశి రోజున..
‘నరసింహా, నరసింహ నాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత చిన్నికృష్ణ తాజాగా రాసిన కథతో తెరకెక్కనున్న చిత్రం ‘వైకుంఠ ఏకాదశి రోజున..’. చిన్నికృష్ణ స్టూడియోస్ సమర్పణలో బిల్వా క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందనున్న ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ, ఆయన తనయుడు ఆకుల చిరంజీవి నిర్మించనున్నారు. హైదరాబాద్‌లోని చిన్నికృష్ట ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రచయిత–నిర్మాత చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అద్భుతమైన అమృత ఘడియలుగా పెద్దలు నిర్ణయించారు. 1850వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ముహూర్తం రాలేదు. ఇలాంటి అరుదైన ముహూర్తంలో మా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు–కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళం–మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్ష¯Œ కు మరో దర్శకుడు పని చేయనున్నారు. ఆయా భాషల్లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వారందరి పేర్లు త్వరలో చెబుతాం. ఫస్టాఫ్ కథ గోవాలో, సెకండాఫ్ కాశీలో జరుగుతుంది. నా ఐదేళ్ల కష్టానికి ఫలితం ఈ కథ. కరోనా వ్యాప్తి తగ్గాక షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ ప్రసాద్ చేయనున్నారు. -
వర్మ తేడా
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ కథానాయికలు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ‘సైకో వర్మ’ను తెరకెక్కిస్తున్నారు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నట్టి కరుణ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతంరాజు క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ అభిమానిగా కనిపిస్తాడు హీరో. రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు’’ అన్నారు నట్టికుమార్. ‘‘డిసెంబర్లో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: జనార్ధననాయుడు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణా రెడ్డి. -
ఓ క్రిమినల్ కథ
మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్ ఉద్దీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘క్రియేటివ్ క్రిమినల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింగ్ గౌడ్ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, సునీల్ క్లాప్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి తొలి సన్నివేశానికి దర్శకత్వం చేశారు. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. క్రిమినల్ నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని మొదట చిన్న బడ్జెట్ సినిమాగా చెయ్యాలి అనుకున్నా కథను బట్టి భారీగా నిర్మించబోతున్నాం’’ అన్నారు నర్సింగ్ గౌడ్. ‘‘ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు సునీల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలీమ్ మాలిక్, కెమెరా: గణేష్ రాజు. -
భయం.. వినోదం
శ్రీకాంత్, సందీప్తి జంటగా అప్పాజీ కొండా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సిరంగి’. పత్రి మాధ్య చార్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్రి మాధ్య చార్య క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అప్పాజీ కొండా మాట్లాడుతూ –‘‘మంచి కథ కుదిరింది. కొత్తవాళ్లతో మంచి ప్రయోగం చేస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం. సెప్టెంబర్ 25కి షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘సిరంగి’ కథ చాలా బాగా నచ్చింది. అప్పాజీ కొండా ఈ సినిమాని బాగా చిత్రీకరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు పత్రి మాధ్య చార్య. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. శివా రెడ్డి, సంగీతం: జయ సూర్య. -
ఏదీ శాశ్వతం కాదు
‘సహచరుడు’ చిత్ర దర్శక–నిర్మాత ప్రభాకర్ ఇప్ప ‘అనుచరుడు’ పేరుతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రభు హీరోగా నటించనున్నారు. వెరీగుడ్ సినీ స్కూల్ పతాకంపై ప్రభాకర్ ఇప్ప స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ బాల మురళి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ‘‘ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అనే కథాంశంతో రూపొందనున్న సందేశాత్మక చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు హీరో ప్రభు. దర్శకుడు వరకోటి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్, సంగీత దర్శకుడు సాయి శ్రీనివాస్, పాటల రచయిత రామారావు, కెమెరామేన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
అహం బ్రహ్మాస్మి అదిరిపోతుంది
మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియాభవానీ శంకర్ కథానాయిక. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ కుమార్ మంచు, నిర్మలాదేవి మంచు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మనోజ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. మంచు లక్ష్మి, చిరంజీవి కుమార్తె సుస్మిత కెమెరా స్విచ్చాన్ చేశారు. లక్ష్మి కుమార్తె బేబీ విద్యా నిర్వాణ మంచు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించింది. నటుడు మోహన్‌బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణలు దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. యంగ్ టీమ్‌తో పనిచేస్తున్న ఈ సినిమా అదిరిపోతుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని, మా అభిమానుల్ని అలరిస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ నెల 11నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మే నెలలో పీటర్ హెయిన్స్ సారథ్యంలో హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జూన్‌లోగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటాయి. అనంత శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి చక్కని పాటలు రాశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అచ్చు రాజమణి. ‘‘ఈ చిత్రంలో ఒక పాటకు సంగీతాన్ని అందిస్తున్నా’’ అన్నారు రమేష్ తమిళమణి. ‘‘మంచి సినిమాలో నన్ను భాగం చేసిన మోహన్ బాబుగారికి, మనోజ్, శ్రీకాంత్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ప్రియాభవానీ శంకర్. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల. -
18 పేజీల ప్రేమకథ
సుకుమార్ ప్రేమకథలన్నీ విభిన్నంగా ఉంటాయి. వాటి టైటిల్స్ కూడా. సుకుమార్ కథా స్క్రీన్‌ప్లే అందిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’. నిఖిల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్యకుమార్ పల్నాటి దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా క్లాప్ ఇవ్వగా, ‘బన్నీ’ వాస్ కుమార్తె హన్విక కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: యువరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్రాపర్తి, బి. అశోక్. -
‘చావుకబురు చల్లగా’ మొదలైంది
-
చావు కబురు చల్లగా
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించనున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ మనమరాలు బేబి అన్విత క్లాప్ ఇచ్చింది. ఈ సన్నివేశానికి అల్లు అరవింద్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: సునీల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవ కరుటూరి. -
కొత్త ప్రయాణం ప్రారంభం
‘అశ్వథ్థామ’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. తాజాగా ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కించనున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు కెమెరా: వంశీ పచ్చి పులుసుల, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
క్లాప్ కొట్టారు
‘రాజావారు రాణివారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా, ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీధర్ గదె ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎలైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌లో వస్తోన్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ముçహూర్తపు సన్నివేశానికి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నటుడు సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. తులసి, శ్రీకాంత్, కశ్యప్ శ్రీనివాస్, అరుణ్ నటిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ స్వరకర్త. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్‌కె కులపాక. -
ఇచ్చట.. గ్యారంటీ ఇస్తున్నా
సుశాంత్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉప శీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కొయలగుండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వెంకటరత్నం కెమెరా స్విచాన్ చేయగా, యోగేశ్వరమ్మ క్లాప్ ఇచ్చారు. నాగసుశీల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ– ‘‘కొత్తరకం సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా కొత్తదనం ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలను. దర్శన్ మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు’’ అన్నారు. ‘‘ప్రపంచమంతా తిరిగినా మళ్లీ ఇంటికే రావాలని మా గ్రాండ్‌మదర్ భానుమతి (దివంగత నటి, గాయని, దర్శకురాలు) గారు నాకు చెప్పేవారు.. అలా కొంతకాలం తర్వాత నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీకి, మా హీరో సుశాంత్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు రవిశంకర్శాస్త్రి. ‘‘నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నేను నిర్మాతగా మారతానని ఊహించలేదు. అందులోనూ భానుమతిగారి మనవడు రవిశంకర్శాస్త్రిగారితో కలిసి ఈ సినిమా చేయడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇదంతా సుశాంత్‌గారి వల్లే’’ అన్నారు హరీష్. ‘‘2010లో నా స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలకు కొన్ని సినిమాటిక్ అంశాలను ఈ కథలో జోడించాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు దర్శన్. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం కావాలనే నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనాక్షి. ‘‘ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు వెంకట్. ఇంకా నటులు అభినవ్ గోమటం, ప్రియదర్శి, చైతన్య మాట్లాడారు. -
శ్రీకాంత్ కొత్త చిత్రం ప్రారంభం
-
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
152.. షురూ
‘సైరా: నరసింహారెడ్డి’ వంటి భారీ పీరియాడికల్ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా నటించనున్న కొత్త చిత్రం చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది చిరంజీవి కెరీర్లో 152వ చిత్రం. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి షెడ్యూల్లో ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఇందులో చిరంజీవి రైతుగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో చిత్రబృందం ప్రకటిస్తుంది. -
నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం
‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అంటూ తన తాజా చిత్రం కోసం పవర్ఫుల్ డైలాగ్‌ను చెప్పారు బాలకృష్ణ. ‘సింహా, లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష¯Œ లో వస్తోన్న మూడో చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘బోయపాటి, నా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అంచనాలుంటాయి. గతం గతః అన్నది మా సిద్ధాంతం. మా గత సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తిగా ఈ సినిమాపైనే మా దృష్టి ఉంచుతాం. ఈ చిత్రంలో ఆధ్యాత్మికం కూడా ఉంటుంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘భద్ర’ వంటి మంచి సినిమాతో ఇండస్ట్రీలో నా లైఫ్ స్టార్ట్ అయింది. ‘సింహా’ వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. ‘సింహా, లెజెండ్’ చిత్రాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను’’ అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీయొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆయన అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుంచి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమా నిర్మిస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, సి.కల్యాణ్, కెమెరామేన్ రాంప్రసాద్, రచయిత ఎం.రత్నం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్. -
బాలకృష్ణ కొత్త చిత్రం ప్రారంభం
-
రీసౌండ్
సాయిరామ్ శంకర్ రీసౌండ్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రీ సౌండ్’ కి కొబ్బరికాయ కొట్టారు. ఎస్ఎస్ మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీసింగ్ కథానాయికగా నటించనున్నారు. జె. సురేష్ రెడ్డి, రాజు, ఎన్వీఎన్ రాజా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి కెమెరా సిచ్చాన్ చేయగా, మరో దర్శకుడు సుకుమార్ క్లాస్ ఇచ్చారు. నటుడు పోసాని కృష్ణమురళి గౌరవ దర్శకత్వం వహించారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నేటి నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరించనున్నాం’’ అన్నారు . ‘‘అందరికీ నచ్చే మంచి వాణిజ్య అంశాలున్న సినిమా ఇది’’ అన్నారు మురళీ కృష్ణ. సాయిరామ్‌శంకర్ కెరీర్లో ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు నిర్మాత రాజారెడ్డి. నటుడు ఆకాష్ పూరి పాల్గొన్నారు. ఈ మూవీకి సంగీతం: స్వీకర్ అగస్తి. -
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం
-
అశోక్ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే
‘‘గల్లా జయదేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా భావిస్తారు. ఆయన నిర్మాతగా కొడుకు అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, నిధీ అగర్వాల్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయవుతున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రానా కెమెరా స్విచ్చాన్ చేయగా, రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ, కథనాలతో అశోక్ హీరోగా పరిచయం కాబోతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు రానా. గల్లా జయదేవ్ మాట్లాడుతూ–‘‘టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. మా మామ కృష్ణగారి సినిమాల్లో అశోక్ చిన్నప్పుడు నటించాడు. తన తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే. మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోనూ అశోక్ నటించాడు. మా బ్యానర్లో కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘హీరో కావాలని అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు’’ అన్నారు పద్మావతి. ‘‘ఈ కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడు’’ అని శ్రీరామ్ ఆదిత్య అన్నారు. ‘‘నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’అన్నారు గల్లా అశోక్. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, నటులు వీకే నరేష్, సుధీర్‌బాబు, సుశాంత్, నిధీ అగర్వాల్, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రచయిత సత్యానంద్, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, నన్నపనేని రాజకుమారి, డా.రమాదేవి పాల్గొన్నారు. -
బట్టల రామస్వామి బయోపిక్కు
అల్తాఫ్, శాంతీరావు, లావణ్యా రెడ్డి, సాత్వికా జై ముఖ్యతారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సతీష్‌కుమార్ ఐ నిర్మించనున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. కెమెరామన్ జయరామ్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చంద్రమోహన్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రతిభావంతులును ప్రోత్సహించడానికే ఈ సినిమా నిర్మిస్తున్నా. విభిన్నమైన ఈ చిత్రానికి కొన్ని కమర్షియల్ హంగులు జోడించబోతున్నాం. వచ్చే వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు సతీష్ కుమార్. ఈ కార్య క్రమంలో రచయిత భాస్కరభట్ల, నటులు రామ్ కార్తీక్, గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మ్యాజిక్ రిపీట్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాకు సహ – నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘‘ఆర్య (2004), ఆర్య 2 (2010) సినిమాల తర్వాత నా డార్లింగ్ సుక్కు (సుకుమార్)తో మూడో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాన్నగారికి (అల్లు అరవింద్), దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డిగార్లతో పాటు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇతర అతిథులకు ధన్యవాదాలు. మైత్రీ మూవీస్, ముత్తం శెట్టి మీడియాలకు థ్యాంక్స్. సంగీతదర్శకుడు దేవీతో నాది ఎప్పుడూ స్పెషల్ కాంబినేషనే’’ అన్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకు కెమెరా: మిర్‌స్లోవ్ కుబ బ్రోజెక్, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి. -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
కొత్త కొత్తగా...
సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్ ప్రధాన తారలుగా ఓ చిత్రం ప్రారంభమైంది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా.పర్వతరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలించాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు భానుచందర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇటీవల వస్తున్న సినిమాలకు భిన్నంగా కొత్త కథతో మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు, నిర్మాత శేఖర్‌రెడ్డి, డైరెక్టర్ బి. వేణు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీపతి, శ్రీనివాస్‌గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు, సంగీతం: ఉదయ్‌కిరణ్. -
మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా
నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం శనివారం హైదరా బాద్‌లో ప్రారంభమైంది. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్‌తో కలిసి లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయి శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘నన్ను బెల్లంకొండ సురేశ్ దర్శకునిగా పరిచయం చేస్తే, వాళ్ల పెద్దబ్బాయి సాయిని నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు గణేష్ హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ చిత్రదర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం’’ అన్నారు. ‘‘మా అబ్బాయిని నేనే లాంచ్ చేద్దామనుకున్నాను. కానీ, బెక్కం వేణు, పవన్ సాదినేని మంచి కథతో వచ్చారు’’ అన్నారు బెల్లంకొండ సురేష్. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. గణేష్ ఈ కథకు సరిపోతాడని భావించి సురేష్‌గారికి చెప్పటంతో ఆయనకు కథ నచ్చి సరే అన్నారు’’ అని చెప్పారు. గణేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణమైన నా ఫ్యామిలీకి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘నా తమ్ముడు హీరోగా పరిచయం అవటం సంతోషంగా ఉంది. మంచి కథతో హీరోగా లాంచ్ అవుతున్నాడు’’ అన్నారు సాయి శ్రీనివాస్. పవన్ సాదినేని మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. గణేశ్ ఈ కథకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. రథన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాను’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. -
సరికొత్త యాక్షన్
యాక్షన్ చిత్రాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపించే గోపీచంద్ తాజాగా మరో యాక్షన్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్–బీవీఎస్ఎన్ ప్రసాద్‌ల కాంబినేషన్లో గతంలో ‘సాహసం’ (2013) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కొత్త సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘గోపీచంద్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్న చిత్రం ఇది. యాక్షన్ అడ్వంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీశ్ కురుప్ కెమెరామన్‌గా వ్యవహరిస్తున ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీహెచ్ నరసింహాచారి. -
న్యూ ఏజ్ లవ్
శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. నేహా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్ కాప్ ఇచ్చి, దర్శకునికి స్క్రిప్ట్‌ని అందించారు. ‘రథం’ నిర్మాత రాజా కెమెరా స్విచాన్ చేశారు. నటి, నిర్మాత సుప్రియ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కూడా అతిథులుగా పాల్గొన్నారు. దయానంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ‘బాయ్స్’ నా తొలి చిత్రం. న్యూ ఏజ్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కథ నచ్చి. నిర్మాతలు సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. నేహా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. టాకీ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరించి, పాటలకు గోవా వెళతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, కెమెరా: వెంకట్ ప్రసాద్, కో–ప్రొడ్యూసర్: బాలచంద్ర. -
నవ్వుల్ నవ్వుల్
కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్ జంటగా మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మీ శ్రీమతి’. హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. ఎమ్.ఎస్. రెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదభరితమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. కృష్ణచంద్ర ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. నిర్మాత డి.ఎస్. రావ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు’’ అన్నారు. ‘‘అక్టోబర్ మొదటి వారంలో మా సినిమా రెగ్యులర్ షూటింగ్ విజయవాడలో ప్రారంభం కానుంది. 35 రోజులు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు మురళి బోడపాటి. ‘‘ఈ సినిమాలో నా పోలీస్ పాత్ర గుర్తుండిపోతుంది’’ అన్నారు డి.ఎస్. రావ్. ‘‘ఇందులో మంచి కథ, కథ నాలున్నాయి’’ అన్నారు కృష్ణచంద్ర. కారోణ్య కట్రీన్ పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: వెంగీ, కెమెరా: తోట.వి.రమణ. -
కొత్త ఆరంభం
లక్ష్, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ బ్యానర్‌పై ‘బిచ్చగాడు’, ‘డి 16’, ‘టిక్..టిక్..టిక్’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజా చిత్రం చిత్రీకరణ త్వరలోనే మొదలు కానుంది. రవి ప్రకాశ్, రవి వర్మ, నోయల్ సేన్, చిత్రం శీను, కృష్ణేశ్వర్ రావ్, రామకృష్ణ, శరత్ తదితరులు నటించనున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తారు. ఈ చిత్రానికి రామకృష్ణ ఛాయాగ్రహకుడు. -
అదృష్టం వచ్చేలోపే ఆపద
రమాకాంత్ హీరోగా మోనల్, సిమర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బాదావత్ కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామోజీ జ్ఞానేశ్వర్, పి. రామారావు, సోములు సహ–నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రమేష్ వర్మ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత ముత్యాల రామదాసు కెమెరా స్విచ్చాన్ చేశారు. మల్టీడైమెన్షన్ వాసు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ మాట్లాడుతూ– ‘‘ప్రాణాలతో నిత్యం చెలగాటాలాడుతూ కష్టాలు అనుభవిస్తున్న జాలర్లకు అదృష్టం రాబోయే సమయంలో ఓ ఆపద వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా సాగుతుంది’’ అని అన్నారు. ‘‘అన్ని రకాల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాం. స్క్రిప్ట్ కోసం నగేష్ ఆరునెలలు కష్టపడ్డారు’’ అన్నారు రమాకాంత్. ‘‘ఇదివరకు నగేష్‌తో ‘శ్రీసత్యన్నారాయణ వ్రతం’ అనే సినిమా చేశాను. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సుమన్. ‘‘ఎన్ఆర్ఐ పాత్ర చేస్తున్నా’’ అన్నారు మోనల్. ‘‘టీచర్ రోల్లో కనిపిస్తా’’ అన్నారు సిమర్. -
అద్దెకు బాయ్‌ఫ్రెండ్
ప్రేమ మీద నమ్మకం లేని ఓ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌గా ఉండమని ఓ అబ్బాయితో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ వెంటనే మరో అమ్మాయి వీరిద్దరి మధ్యలోకి వస్తుంది. అప్పుడు ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయనే అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు ‘బీఎఫ్‌హెచ్’ (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కేరింత, మనమంతా’ చిత్రాల ఫేమ్ విశ్వంత్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో మాళవికా సతీషన్, పూజా రామచంద్రన్ కథానాయికలుగా నటించనున్నారు. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వేణు మాధవ్ పెద్ది నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత యశ్ రంగినేని, హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ దేవరకొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. శివాజీరాజా, రాజా రవీందర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. -
ఒక ట్విస్ట్ ఉంది
‘‘మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు . యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో, హీరోయిన్లపై వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణంరాజులు కెమెరా స్విచాన్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు హరీశ్ శంకర్ శివకుమార్‌కు స్క్రిప్ట్ అందిచారు. దర్శకుడు శివకుమార్.బి మాట్లాడుతూ– ‘‘టైటిల్లో ఉన్న 22 నంబర్‌కు కథలో ఓ ట్విస్ట్ ఉంది. మర్డర్ మిస్టరీతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఈ 29న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నా బలం మా అమ్మ డైరెక్టర్ జయగారు. ఆవిడ ఎక్కడ ఉన్నా సంతోషిస్తారు. నాన్న బి.ఎ. రాజుగారు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు’’ అన్నారు. రూపేశ్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ– ‘‘నేను వెంకటేశ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలు ఒక్కోటి 15 సార్లు చూసి ఉంటాను. అలాంటిది నా మొదటి సినిమాకు ఆయన వచ్చి క్లాప్ కొట్టడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు.‘‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్‌లతో అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు సలోని. -
సస్పెన్స్ లవ్ స్టోరీ
హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం మొదలైంది. ఈ చిత్రంతో చిరుమామిళ్ల కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ ఇచ్చారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ–‘‘నేను ఇదివరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుంది. నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్రైమ్, సస్పెన్స్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అన్నారు చిరుమామిళ్ల కృష్ణ. -
సంక్రాంతికి శ్రీకారం
వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాతో కిశోర్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యువరాజ్ కెమెరామెన్. ‘శ్రీకారం’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... శర్వానంద్ కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’(2016), ‘శతమానం భవతి’ (2017) చిత్రాలు సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రణరంగం’, ‘96’ తెలుగు రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్. -
తలచినదే జరిగినదా...
షైన్ పిక్చర్స్ పతాకంపై రామ్‌కార్తీక్, ఊర్వశి పరదేశి జంటగా సూర్యతేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ‘తలచినదే జరిగినదా’ చిత్రం సోమవారం ప్రారంభమైంది. శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్. హరికృష్ణారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దండు’ చిత్రదర్శకుడు సంజీవ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యతేజ మాట్లాడుతూ– ‘‘2000 ఏళ్ల క్రితం మొదలైనటప్పటి జీవితాలకు ఇప్పటి జీవితాలకు ఉన్న తేడాను తెలిపే ఫిక్షన్ స్టోరీనే మా చిత్రం. ‘జెర్సీ’ చిత్రానికి అసిస్టెంట్ దర్శకునిగా, అనేక ప్రభుత్వ ప్రకటనలకు డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తీస్తున్నాను’’ అన్నారు. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జూలై 8న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’ చిత్రం తర్వాత నేను చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు రామ్‌కార్తీక్. -
పండగ ఆరంభం
సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దాసరి దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతిరోజు పండగే’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ‘సుప్రీమ్’ వంటి హిట్ సినిమా తర్వాత మళ్లీ సాయి తేజ్, రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2యూవీ పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చర్స్ సంస్థగా ఏర్పడి సినిమాలు నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా చిత్రంలో సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, హరితేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.కె.ఎన్, సంగీతం: తమన్. ఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
వేట మొదలైంది
మధు సాయివంశీ హీరోగా, శ్రావణి నిక్కీ, హిమబింధు హీరోయిన్లుగా కె.రవీంద్ర కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జునవేట’. రోజా శ్రీనివాస్ సినిమాస్ పతాకంపై వాయల శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రైస్ పుల్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. జూలై 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. సుబ్బరాజు, ‘వెన్నెల’ కిశోర్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: డి. ఇమామ్. -
వారేవా ఏమి స్పీడు
కెరీర్ ట్రాక్‌లో స్పీడ్ గేర్ వేశారు నితిన్. ఇటీవలే ‘భీష్మ’ షూటింగ్‌ను షురూ చేసిన నితిన్ తన తర్వాతి చిత్రానికి ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ముహూర్తపు సన్నివేశానికి వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నితిన్ కెరీర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా ఉంటుంది. చంద్రశేఖర్ యేలేటిగారు తీసుకున్న పాయింట్ గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నితిన్. -
ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా...
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి మంచి హిట్ చిత్రాల తర్వాత మా బేనర్లో చేస్తున్న మరోమంచి కథా చిత్రమిది. ఆగస్ట్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. ‘‘మూడేళ్లు కష్టపడి తయారు చేసిన కథ ఇది. కథ విని రాధామోహన్‌గారు వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు. రాజ్ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నా దర్శకత్వంలో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది’’ అని కొండా విజయ్‌కుమార్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూస్. -
‘విరాటపర్వం’ చిత్రం ప్రారంభం
-
విరాటపర్వం ఆరంభం
అజ్ఞాతవాసం కోసం పూర్వం విరాటరాజు కొలువులో పాండవులు కొలువు దీరి కార్యసిద్ధులయ్యారు. ఇప్పుడు వెండితెరపై రానా ‘విరాటపర్వం’ మొదలైంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా నటించనున్న ‘విరాటపర్వం’ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నటుడు వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరిలు దర్శకుడు వేణు ఉడుగులకు స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, దర్శకులు చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్ మణి కెమెరామేన్. -
లవ్ అండ్ మ్యూజిక్
అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ షురూ చేశారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. కోలీవుడ్‌లో వెంకటకృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అమలా పాల్ నటి స్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. సంగీతం, ప్రేమ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మ్యుజిషియన్‌గా నటిస్తున్నారని తెలిసింది. చెన్నై షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఊటీలో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది. అమలాపాల్‌తో పాటు ఓ విదేశీ నటి ఈ సినిమాలో మరో హీరోయిన్గా కనిపించనున్నారని టాక్. ‘సంగతమిళన్, లాభం’ ఇలా తమిళ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నారు. -
బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
-
కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ–కె.ఎస్.రవికుమార్– సి.కల్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్. -
మనుషులా? దెయ్యాలా?
ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సత్యప్రకాష్ (‘పోలీస్ స్టోరీ’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉల్లాలా.. ఉల్లాలా’. ఈ చిత్రంతో ఆయన తనయుడు, కన్నడ హీరో నటరాజ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. నూరిన్ షెరీఫ్, అంకిత మహారాణ, గురురాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు బెనర్జీ, అశోక్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ తేజ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘రక్షక భటుడు, ఆనందం, లవర్స్ డే’ సినిమాలు విడుదల చేశాను. వాటి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉల్లాలా.. ఉల్లాలా’. సత్యప్రకాష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి. పాత్రలన్నీ వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు వెన్నెముక గురురాజ్‌గారు. మా సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు. ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కారు. మా చిత్రంలో ఉన్నది లేదు, లేనిదే ఉన్నట్టు... ఒక వైవిధ్యమైన చిత్రమిది’’ అని సత్యప్రకాష్ అన్నారు. ‘‘మా నాన్న ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం నాకు చాలా రోజుల వరకు తెలియదు. తీరా తెలిశాక నేను చేయగలనా? అని కాస్త సందేహించాను’’ అన్నారు నటరాజ్. అంకిత మహారాణ, నూరిన్ షెరీఫ్, సంగీత దర్శకుడు జాయ్, కెమెరామేన్ జె.జి.కృష్ణ తదితరులు మాట్లాడారు. పృథ్వీ, ‘అదుర్స్’ రఘు, లోబో, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
తండ్రీ కూతుళ్ల అనుబంధం
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. డా.లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధంపై సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉండిపోరాదే...’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టడంతోనే సగం సక్సెస్ అయ్యారు దర్శక–నిర్మాతలు’’ అన్నారు ఏపీ ఫిల్మ్‌చాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్. నవీన్ నాయని మాట్లాడుతూ– ‘‘పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా మా సినిమా ఉంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్ట్ అవుతూ, మనసులు కదిలించేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన జీవితంలో మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకూ మనల్ని ప్రేమించేది తల్లిదండ్రులే అనే సందేశంతో రూపొందిన చిత్రమిది’’ అని డా. లింగేశ్వర్ చెప్పారు. తరుణ్ తేజ్, లావణ్య, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం, సంగీత దర్శకుడు సబు వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
లవ్‌స్టోరీకి క్లాప్
హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం కానున్న చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దేవాన్ష్ నామా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు అతి«థిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సదానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్ప. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ‘లడ్డు, నన్ను క్షమించు’ వంటి లఘుచిత్రాలను తీశాను. వాటికి నంది అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జూలై చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరపనున్నాం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటిస్తున్నందుకు, ఆనందంగా ఉంది. శశి ప్రతిభ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. అభిషేక్‌గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్’’ అన్నారు హీరో హవీష్. ‘‘సుకుమార్, మేం నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో శశిధర్ మొదటి బహుమతిని పొందారు. అలా శశిధర్‌కు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించాం’’ అన్నారు అభిషేక్ నామా. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ స్వరకర్త. -
సత్యమేవ జయతే 1948
ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 1948’. ఈశ్వరబాబు. డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచాన్ చేయగా శరద్ దద్భావాలా క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై. మహర్షి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన టైమ్‌లోని ముఖ్య నేతలు గాంధీ, నెహ్రూ, గాడ్సే, మహ్మద్ అలీ జిన్నా తదితర పాత్రలతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించి, గాడ్సే పాత్ర చేస్తున్న ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ– ‘‘11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి కథ తయారు చేయడం జరిగింది. 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రోపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో. 9 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. -
విశ్వక్ కార్టూన్
‘ఈ నగరానికి ఏమైంది’లో సైకో వివేక్ పాత్రలో ఆకట్టుకున్నారు యంగ్ హీరో విశ్వక్సేన్. లేటెస్ట్గా ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో హీరోగా నటించారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారు. నూతన దర్శకుడు ప్రదీప్ పులివర్తి దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా ఓ చిత్రం ఆదివారం ప్రారంభం అయింది. ఆర్య క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వనాథ్ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘కార్టూన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిఫరెంట్ జానర్లో ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూన్ 3న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: ఉదయ్ గుర్రాల. -
థ్రిల్లర్ నేపథ్యంలో...
విహారి, షెర్రీ అగర్వాల్‌ని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు చిత్రపరిశ్రమలో కొరియోగ్రాఫర్, దర్శకత్వ శాఖలో పని చేసిన వీర గనమాల స్వీయ దర్శకత్వంలో వీజీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీర గనమాల మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. గురువారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
యువతి ప్రతీకారం
ఆత్మాభిమానం గల ఓ యువతి తనకు జరిగిన అవమానానికి తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంవద’. అనికా రావు, ఆదిత్య అల్లూరి జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీ చలనచిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘అహం దెబ్బ తిన్న అమ్మాయి కథ ఇది. అవమానిస్తే స్వాభిమానం గల యువతి ఎలా తిరగబడుతుంది? అలాంటి పరిస్థితిలో యువతి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అని ఆకట్టుకునేలా తెరకెక్కించాం. జానపథ కథల్లోని ఓ అందమైన యువతి పాత్రను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రం తీశాం. ఆరు విభిన్న ఛాయలతో నాయిక పాత్ర సాగుతుంది. ‘స్వయంవద’ టైటిల్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్, టీజర్, పాటలు బాగున్నాయి అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే హారర్ కథతో సినిమా చేద్దామనుకున్నాను. నిర్మాతలు సహకరించలేదు. తర్వాత దాదాపు అలాంటి కథతోనే నయనతార నటించిన కొన్ని హారర్ చిత్రాలు వచ్చాయి. హారర్ అంశాలు మాత్రమే ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోలేమని థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ లాంటి అంశాలను చేర్చాం. పోసానిగారు వెంకట్రాముడు అనే మంచి పాత్రలో నటించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి. -
సినిమాలో సినిమా
‘ఎన్నో ఆశలు, ఆశయాలతో సినిమా రంగంలోకి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులను కొంత మంది అవకాశాల పేరిట ఎలా మోసాలు చేస్తున్నారు? ఎలా మోసపోతున్నారు?’ అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ద ఫిలిం డైరక్టర్ 8500400789’. వరుణ్ తేజ్ పినికాశి టైటిల్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. మేఘనా చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఫిలిం రిక్రూట్మెంట్ సర్వీసెస్ పతాకంపై పి.నాగలక్ష్మి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పి.నాగలక్ష్మి మాట్లాడుతూ– ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథాంశమిది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌లో జరుగుతున్న మోసాలను చూపిస్తున్నాం. మోసం చేసే వ్యక్తుల నుంచి తప్పించుకుని చివరకు మా డైరెక్టర్ ఎలా సినిమా తీశాడు? దాన్ని ఏ విధంగా రిలీజ్ చేశాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ఇందులో కామెడీ, ప్రేమకథ ఉంటుంది. ఇటీవల మార్షల్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న వరుణ్ తేజ్ పినికాశి చేతులపై కార్లు ఎక్కించుకునే సన్నివేశంలో నటించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు’’ అన్నారు. జీవా, జ్యోతితో పాటు పలువురు కొత్తవారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర భైరి, కెమెరా: బాలకిషన్. -
అక్కా తమ్ముడైన అన్ని–మచ్చాన్
నిజ జీవితంలో అన్ని (వదిన)– మచ్చాన్ (మరిది) జ్యోతిక–కార్తీ ఓ సినిమా కోసం అక్కాతమ్ముళ్లుగా మారారు. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ ముఖ్య తారలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘‘అన్నితో తొలిసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీతూగారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇక మా టీమ్‌కు సత్యరాజ్ వంటి నటులు మరింత బలం’’ అని కార్తీ పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. సినిమాలో కార్తీ, జ్యోతికలకు సత్యరాజ్ తండ్రి పాత్ర చేస్తున్నారని కోలీవుడ్ టాక్. -
శ్రుతీ లాభం
రెండేళ్లుగా తమిళ, తెలుగు సినిమాలేవీ అంగీకరించలేదు శ్రుతీహాసన్. సూర్య ‘సింగం 3’, పవన్ కల్యాణ్‌తో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత సౌత్‌లో కనిపించలేదు. ఈ రెండు సినిమాలు 2017 ప్రథమార్ధంలో రిలీజయ్యాయి. అప్పటి నుంచి తనలోని నటికి కొంచెం బ్రేక్ ఇచ్చి మ్యూజిషియన్పై శ్రద్ధ పెట్టారు. లండన్‌లో సొంత బ్యాండ్‌తో మ్యూజిక్ షోలు చేశారు. ఓ టీవీ చానెల్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. లేటెస్ట్గా మళ్లీ తమిళ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్ దర్శకత్వంలో ‘లాభం’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా పూజ సోమవారం జరిగింది. గతంలో విజయ్ సేతుపతితో ‘పురమ్బోక్కు ఎన్గిర పొదువుడమై’ అనే సినిమా రూపొందించారు జననాథన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘లాభం’తో మళ్లీ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. -
ఇద్దరి లోకం ఒకటే
యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్నారు. ఆయన హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దిల్’రాజు మనవడు మాస్టర్ ఆరాన్‡్ష గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరా లను తెలియజేస్తాం’’ అన్నారు. -
కామెడీ అండ్ ఫాంటసీ
‘ఈ నగరానికి ఏమైంది?’ ఫేమ్ సాయి సుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రాఘవేంద్ర వర్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు బీఏ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ–ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సాయి, సిమ్రాన్, చాందిని.. ఇలా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు కుదిరారు. మంచి సాంకేతిక నిపుణులతో తెరెక్కిస్తున్నాం’’ అన్నారు విశ్వాస్. తనికెళ్ల భరణి, ప్రియదర్శి, మకరంద్ దేశ్ పాండే, శిశిర్ వర్మ, ఝాన్సీ, వినీత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బి. జోష్ సంగీతం అందిస్తున్నారు. -
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ప్రారంభం
-
గెట్.. సెట్... గో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది. ‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి హ్యాట్రిక్ పై గురి పెట్టారని ఊహించవచ్చు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలు. శనివారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. ప్రత్యేక పాత్రలో హీరో సుశాంత్ కనిపిస్తారు. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ తమన్. కెమెరా: పి.యస్ వినోద్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, ఎడిటర్: నవీన్ నూలి. -
జెట్ స్పీడ్
ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను పట్టాలెక్కిస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు సూర్య. ఆల్రెడీ సూర్య నటించిన పొలిటికల్ మూవీ ‘ఎన్జీకే’ రిలీజ్‌కు రెడీ అయింది. ‘కాప్పాన్’ అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ముహూర్తం ఆదివారం జరిగింది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సూర్య సొంత బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్ర చేయనున్నారు. ‘సర్వం తాళ మయం’ ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్. జీవీ ప్రకాశ్ స్వరకర్త. -
తలకోన అడవుల్లో...
ఆది సాయికుమార్, వేదిక జంటగా కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. నిఖిల్‌తో ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ బ్యానర్‌పై కావ్య వేణుగోపాల్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కనున్న చిత్రమిది. చిత్తూరు జిల్లాలోని తలకోనలో ఈ నెల 25న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘రోబో, 2.0’ చిత్రాలకు అసోసియేట్ కెమెరామేన్‌గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో నాని, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం పూజాకార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్ ఇవ్వగా, నిర్మాత సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘తొలిసారి ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా సినిమాలో ఉంటుంది. అదేంటో స్క్రీన్‌పైన చూస్తేనే బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ఈరోజు నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, రచనా సహకారం: ముకుంద్, మాటలు: Ðð ంకీ, ‘డార్లింగ్’ స్వామి. -
ఫుల్ స్పీడ్
మొదటి చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించారు శివ కందుకూరి. ‘పెళ్ళి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే శివ కందుకూరి. ఈరోజు శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త చిత్ర విషయాలను ప్రకటించారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన భరత్ ఈ చిత్ర దర్శకుడు. ఈ ప్రేమ కథను నరాల శ్రీనివాస రెడ్డి, పుత్తాకర్ రోన్ సన్ నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని వేసవి తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతోంది. శేష సింధు ఈ చిత్రానికి దర్శకురాలు. ఫస్ట్ సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమా అంగీకరించి ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు శివ కందుకూరి. భరత్ దర్శకత్వంలో చేసే ప్రేమకథా చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
ఇస్మార్ట్ శంకర్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటి, నిర్మాత చార్మీ కౌర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం అవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట ఛాయగ్రాహకుడు. -
సరిహద్దులో సాహసం
సినిమాను స్టార్ట్ చేయడమే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు గోపీచంద్ అండ్ టీమ్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ స్పై థ్రిల్లర్ రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ‘‘50 రోజుల పాటు సాగే షెడ్యూల్లో ఫైట్ మాస్టర్ సెల్వన్ కంపోజ్ చేసిన సాహసోపేతమైన ఫైట్ సీన్స్ షూట్ చేస్తాం. అలాగే రాజస్థాన్, న్యూ ఢిల్లీలో షూటింగ్ జరపనున్నాం. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి, మాటలు: అబ్బూరి రవి. -
మ్యాచ్ టైమ్ ఫిక్స్
ఫుట్‌బాల్ సాధన చేస్తున్నారట తమిళ హీరో విజయ్. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. ఈ సినిమాలో మహిళల ఫుట్‌బాల్ టీమ్‌కి విజయ్ కోచ్‌గా నటించనున్నారని కోలీవుడ్ టాక్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోసం లాస్ ఏంజిల్స్‌లో లొకేషన్స్‌ని సెలెక్ట్ చేశారు టీమ్. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20న స్టార్ట్ కానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలోని 16 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్‌గా 16 మంది కొత్తమ్మాయిలను పరిచయం చేయనుండటం విశేషం. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదలవుతుంది. -
మౌన ప్రేమ
రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘మనసు పలికే మౌన ప్రేమ’. నందు, ప్రియ, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్ బాబు ముఖ్య తారలుగా బాబీ వేంపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏఎస్పీ ప్రొడక్షన్స్ పతాకంపై బొట్రేపల్లి ఆవులకుంట్ల సూర్యప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, కె.ఎస్. నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘1980లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమాకి కథ నేనే అందించా. స్టోరీ చెప్పినప్పుడు నా స్నేహితుడు బాబీ ఎగ్జయిట్ అయ్యి దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి. జనవరి 18న రెగ్యులర్ షూట్ ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్ లవ్ స్టోరీతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూర్యగారు స్టోరీ బాగా రాశారు. నాపై తను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు బాబీ. ‘‘టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది’’ అని హీరో నందు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కుమారన్. -
అది నా బాధ్యత
‘‘అనిల్ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. నేను ఏ సినిమా ఓపెనింగ్లకు వెళ్లను. కానీ అనిల్, ప్రవీణల మొదటి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యతగా అనిపించింది’’ అని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందించారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు హీరోపై క్లాప్ ఇచ్చారు. నటులు అలీ, ప్రవీణ కడియాల కెమెరా స్విచ్చాన్ చేశారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘నాతో పన్నెండేళ్లుగా అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్ నాకు తమ్ముడులాంటివాడు. తనలో మంచి టాలెంట్, టైమింగ్ ఉంది. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ద్వారా కార్తికేయకి మంచి పేరు వస్తుందని చెప్పగలను’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత నేను విన్న అన్ని కథల్లో బెస్ట్ కథ ఇది’’ అని కార్తికేయ అన్నారు. ‘‘నా గురువు, సోదరుడు అన్నీ బోయపాటిగారే. ఇది నా తొలి సినిమా అయినా ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా తీస్తా’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం’’ అని అనిల్ కడియాల అన్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు డీవీవీ దానయ్య, మిర్యాల రవీందర్ రెడ్డి, ప్రవీణ్, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరధ్వాజ్, కెమెరా: రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
థ్రిల్లర్‌కి రెడీ
స్పైగా మారి ఏవో రహస్యాలను ఛేదించడానికి రెడీ అవుతున్నారు హీరో గోపీచంద్. మరి... ఆ రహస్యాలు ఎవరికి సంబంధించినవి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. తొలి సన్నివేశానికి ఏషియన్ సినిమాస్ సునీల్ క్లాప్ ఇచ్చారు. ఏకే ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 18న ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రాహకునిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటల రచయిత.