చావు కబురు చల్లగా | Chavu Kaburu Challaga Movie Launch | Sakshi
Sakshi News home page

చావు కబురు చల్లగా

Published Fri, Feb 14 2020 12:57 AM | Last Updated on Fri, Feb 14 2020 12:57 AM

Chavu Kaburu Challaga Movie Launch - Sakshi

కార్తికేయ

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించనున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ సమర్పణలో జిఏ2 పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి హీరో అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు ఆయాన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, అల్లు అరవింద్‌ మనమరాలు బేబి అన్విత క్లాప్‌ ఇచ్చింది. ఈ సన్నివేశానికి అల్లు అరవింద్‌ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 19న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఆమని, శ్రీకాంత్‌ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్, కెమెరా: సునీల్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాఘవ కరుటూరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement