Karthikeya
-
అబద్ధమేవ జయమే.. టైటిల్ వెరైటీగా ఉంది: కార్తికేయ
సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అబద్దమేవ జయతే’. కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోని యంగ్ హీరో కార్తికేయ విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతు.. టైటిల్ చాలా వెరైటీగా ఉందని అభినందిస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విలేజ్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. వికాస్ చిక్బల్లాపూర్ కెమెరామెన్‌గా, షాడో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. -
ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత అండర్–19 జట్టు శుభారంభం చేసింది. పుదుచ్చేరి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ హోగన్ (42), రిలీ కింగ్సెల్ (36) రాణించారు. యువ భారత బౌలర్లలో మహమ్మద్ ఇనాన్ 4, కేపీ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన కార్తికేయ..అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని భారత యువ జట్టు 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో కేపీ కార్తికేయ (99 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ప్రదర్శన కనబరచగా.. అమాన్ (58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో పాటిర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అటు బంతితో, ఇటు బ్యాట్‌తో సత్తాచాటిన టీమిండియా ఆల్‌రౌండర్ కేపీ కార్తికేయకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య సోమవారం(సెప్టెంబర్ 23) రెండో మ్యాచ్ జరగనుంది. -
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్‌తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్‌కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్‌లాండ్‌లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్‌ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్‌తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్‌కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్‌ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్‌కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్‌లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా, మోడల్‌గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
ఓటీటీలో కార్తికేయ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఎలాంటి అంచనాలు లేకుండా మే 31న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మొదటి ఆట నుంచి సినిమా బాగుందంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.ప్రశాంత్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. బెట్టింగ్ మాఫియా చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించగా తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ అభిమానులకు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj— Kartikeya (@ActorKartikeya) June 24, 2024 -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్‌తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్‌గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్‌గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
‘‘ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్ డౌన్ టైమ్‌లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్ రెడ్డి. ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్‌లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్‌లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు.సెకండాఫ్‌లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్‌లో ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్‌గా నటించినందుకు ఫీల్ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్‌గా చాన్స్ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
అప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నా: టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం "భజే వాయు వేగం". ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం. ఐశ్వర్య మాట్లాడుతూ..' సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ క్యారెక్టర్ చేశా. ఇందులో ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించడానికే ఇష్టపడతా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.' అని అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ..'తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న పట్టణం మాది. మధ్య తరగతి కుటుంబం. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్లో చదువుకుంటున్న కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ అయ్యాక నటన మీద ఫోకస్ చేశా. ఇప్పటివరకు తెచ్చుకున్న గుర్తింపు పట్ల గర్వంగా ఉంది. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమాకు సైన్ చేశా. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా' అని వెల్లడించింది. -
'భజే వాయు వేగం' ట్రైలర్ విడుదల
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.'బెదురులంక 2012' చిత్రం విజయం తర్వాత మరో విభిన్నమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలంగా ఉండనున్నాయి. ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా మే 31న విడుదల కానుంది. -
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, అభినందనలు తెలిపారు. ‘‘ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
ఫహాద్ ఫాజిల్ హీరోగా రెండు తెలుగు సినిమాలు!
మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ రెండు తెలుగు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి ‘ఆక్సిజన్’ కాగా మరొకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ లో నటిస్తున్న ఆయన హీరోగా రెండు తెలుగు చిత్రాల ప్రకటన వచ్చింది. మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి, హిట్ కొట్టిన కార్తికేయ (డైరెక్టర్ రాజమౌళి తనయుడు) ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌పై ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఈ సినిమాలను నిర్మించనున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ‘ఆక్సిజన్’ చిత్రంతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
'మీకు నంద్యాల తెలుసు కదా'.. అక్కడేదో ఊహించనిది జరుగుతోంది..!
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే రాయలసీమ నంద్యాల ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రధానంగా మదర్ సెంటిమెంట్‌తో పాటు సస్పెన్ష్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు అర్థమవుతోంది. నల్లమల ప్రాంతంలో జరిగే సస్పెన్ష్ సంఘటనలతో ట్రైలర్ చూపించారు. చివర్లో ‘ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే డైలాగ్.. ఇది కలియుగం అని కౌంటర్ చెప్పడం ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
కలియుగం పట్టణంలో మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం చూసుకున్నారు. ప్రస్తుతం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారభించింంది చిత్రబృందం. ఈక్రమంలోనే ఈ చిత్రం నుంచి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చంద్రబోస్ రాసిన గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. అజయ్ అరసాద అందించిన బాణీలు అందించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
ప్రేమలు చూసి నవ్వుతూనే ఉన్నాను: రాజమౌళి
‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్ స్టైల్. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నస్లేన్ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్ , మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఎస్ఎస్ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కూడా మాట్లాడారు. -
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
విదేశీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు. ‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్‌గారు’’ అన్నారు పాయల్. -
రాజమౌళి వచ్చాక మా జీవితాలు మారిపోయాయి
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానినికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. (ఇది చదవండి: పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్) అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2012లో యుగాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనలే కథాంశంగా చూపించారు. 2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. -
రాజమౌళి కి ఓపిక చాలా ఎక్కువ...!
-
చైల్డ్ ఆర్టిస్ట్ టూ హీరో.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ!
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన నటుడు విశ్వ కార్తికేయ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ స్టార్స్ వద్ద చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అంతే తన నటనతో నంది, ఇతర అంతర్జాతీయ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) బాల్యనటుడిగానే కాదు.. జై సేన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు.ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది. (ఇది చదవండి: పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!) ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్త్ అవర్ (Nth Hour) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో విశ్వ కార్తికేయ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
సిక్కోలు థియేటర్లో కార్తికేయ సందడి, ఆ కొరత ఇన్నాళ్లకు తీరింది..!
బెదురులంక సినిమా యూనిట్ సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌కు వచ్చిన హీరో కార్తికేయ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారన్నారు. గతంలో ఆర్ఎక్స్ 100 సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీకాకుళం వచ్చానని, ఇపుడు బెదురులంక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇక్కడకు మళ్లీ వచ్చానని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బెదురులంక సినిమా షూటింగ్ జరిగిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి లొకేషన్లు ఉన్నాయని, అవకాశం వచ్చినపుడు ఇక్కడ కూడా తప్పకుండా షూటింగ్ చేస్తామన్నారు. మంచి కథలను ఒక్కొక్కటిగా ఎంచుకుని చిత్రాలు చేయడం జరుగుతుందన్నారు. అల్లు అర్జున్‌కు జాతీయస్థాయి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో బెస్ట్ యాక్టర్ అవార్డు లేదనే కొరత ఉండేదని, అది ఇన్నాళ్లకు ఇలా తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యమహల్ యాజమాన్యం ధనంబాబు, నాగరాజు, మేనేజర్ నాగభూ షణం తదితరులు ఉన్నారు. చదవండి: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే.. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
ఆయన నా బ్రెయిన్‌ని మార్చేశారు
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్‌గోపాల్ వర్మగారు నా బ్రెయిన్‌ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్ ఫార్మ్ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం. ఇలా చెప్పేలా హాలీవుడ్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి. మణిశర్మగారితో వర్క్ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు. -
చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగ విడుదల చేశారు. ఆగష్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన గత చిత్రం 'ఆర్ఎక్స్ 100' ట్రైలర్‌ని కూడా రామ్ చరణే రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని కార్తికేయ తెలిపారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్ చెప్పానన్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కార్తికేయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే చాలా బాధేస్తుందని కార్తికేయ అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని అనడం వరకు ఓకేగానీ.. కొంతమంది పనికట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారు. అలాంటి వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందని కార్తికేయ అన్నారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి.. అందుకే ఆయన మెగాస్టార్!) చిరంజీవినే కాదు అలా ఎవరినీ కూడా అనకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరమైనా కథ నచ్చే సినిమా తీస్తాం.. అనుకున్నంత స్థాయిలో అది ఆడకపోతే నేరమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి తన కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం మాత్రమే. ఇలాంటి వాటికి ఆయన ఏమాత్రం ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని ఇదీ అందరికీ తెలుసని కార్తికేయ తన అభిప్రాయం తెలిపారు. -
కార్తికేయ, నేహా శెట్టి బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూ
-
ఆత్మాభిమానం.. అహంభావం కాదు
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్‌లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
అందరొక్కటే..
‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడుకాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..’ అంటూ మొదలవుతుంది ‘బెదురులంక 2012’ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ పాట. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ‘‘ఓ ఊరి ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు ఎలా దోచుకుంటారనేది ఈ పాటలో చూపించాం’’ అన్నారు క్లాక్స్. -
చెప్పరా శివా...
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా, నువెవడివి సొల్లుడా శివా (చెప్పరా శివా)...’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పా టని అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర పా డారు. -
గోదావరి నేపథ్యంలో 'బెదురులంక'.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల. -
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
ఆరోపణలకు చెక్, ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ
తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిందంటే యావత్ భారతదేశం పొంగిపోయింది. కానీ కొందరు మాత్రం ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు గుమ్మరించారు, అవార్డును కొన్నారంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజమౌళి తనయుడు, ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాపై విదేశీయులు మక్కువ చూపించారు. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పటికీ అమెరికాలో రిలీజ్ చేయాలనుకున్నాం. కేవలం ఒక రోజు 60 స్క్రీన్లలో ప్రదర్శిద్దామనుకున్నాం. ఒక రోజు కోసం అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక అందులో మీకు ఏం నచ్చింది? అని అక్కడి ప్రేక్షకులను అడిగాం. చరణ్‌ను తారక్ అన్న ఎత్తుకుని ఫైట్ చేసిన సన్నివేశం తెగ నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారు. వారికి మాత్రమే ఆహ్వానం కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రేమ్‌రక్షిత్, కాలభైరవలకు అకాడమీ ఆహ్వానం పంపింది. నామినీలకు, స్టేజీపై పర్ఫామ్ చేసేవాళ్లకు అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే! ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు కమిటీకి ఈమెయిల్ పంపుతారు. కీరవాణి, చంద్రబోస్ మాకోసం ఈమెయిల్ చేశారు. వాళ్లు అది చూసిన తర్వాత లింక్ పంపుతారు. దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టికెట్లలో కూడా రకరకాల క్లాసులుంటాయి. లోయర్ లెవల్ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు పెట్టి కొన్నాం. ఒక్కో టికెట్‌కు ఎంతంటే? టాప్‌లో కూర్చుని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం. ఆస్కార్ కొనడమనేది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుంది. అయినా ఆడియన్స్ ప్రేమను కొనగలమా? స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా.. హాలీవుడ్ సినిమాలు ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఆస్కారం లేదు. ప్రచారం కోసం రూ.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చయ్యాయి. నామినేషన్స్ అయ్యాక ఆ సెకండ్ ఫేజ్‌లో మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తంగా రూ.8.5 కోట్లు ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. -
ఆస్కార్‌తో తిరిగొచ్చిన RRR టీమ్, జై హింద్ అంటూ..
ఆర్ఆర్ఆర్ అనుకున్నది సాధించింది. తెలుగువారికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. మహామహుల సమక్షంలో నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సంతోషంలో చిత్రయూనిట్‌కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేయగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి రాజమౌళి వెళ్లిపోయాడు. చదవండి: తొలిసారి నెగెటివ్ రోల్లో ఒకరు, ఎమోషనల్ క్యారెక్టర్లో మరొకరు -
నాటునాటుకు ఆస్కార్.. అతడు లేకపోతే అవార్డు వచ్చేదే కాదు!
నాటు నాటు.. కేవలం రెండక్షరాల పదం.. ఏముంది ఆ పాటలో అంటారా? అక్కడికే వస్తున్నాం.. అమ్మచేతి పెరుగు ముద్దలో ఉన్నంత కమ్మదనం.. తండ్రి గంభీరం వెనక దాగి ఉన్న ప్రేమ.. పరీక్షలో ఫెయిలై అభాసుపాలైతే ఎలాగైనా క్లాస్ ఫస్ట్ రావాలన్న కసి.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. డీజే పాటలు, అర్థం కాని సంగీతం, తెలుగు, ఇంగ్లీష్ కలగలిపిన లిరిక్స్.. ఇవే ట్రెండ్‌గా మారిన తరుణంలో మట్టిలో మాణిక్యాంలా వచ్చింది నాటు నాటు. అన్నింటినీ పక్కకు నెట్టి అందరి చెవుల్లో అమృతం పోస్తూ, మర్చిపోతున్న పల్లెదనాన్ని ముందుకు తెస్తూ అందరినీ కదిలించిందీ సాంగ్. కేవలం విని సంతోషించేలా కాదు అందరిచేత స్టెప్పులేయించింది. అదీ ఈ పాట గొప్పతనం.. ఈ పాట ఆస్కార్ వరకు వెళ్లడం అంత చిన్న విషయం కాదు. మరి దీని వెనక ఉన్నదెవరో తెలుసా? కార్తికేయ. ఈ విషయాన్నే కీరవాణి స్వయంగా ఆస్కార్ అందుకునే సమయంలో చెప్పాడు. అంత పెద్ద వేదికపై కార్తికేయకు థ్యాంక్స్ చెప్పడంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఎవరీ కార్తికేయ? కార్తికేయ మరెవరో కాదు రమాకు మొదటి భర్త వల్ల కలిగిన సంతానమే కార్తికేయ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కథ రచన మొదలు.. ఆస్కార్ గెలుపుదాకా అన్నింట్లో కార్తికేయ కృషి ఉంది. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్ చేసింది కార్తికేయ. ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా 'కార్తికేయ వెంటపడతాడు, కార్యశూరుడు' అంటూ మెచ్చుకున్నాడు. విమర్శలు, వివాదాల జోలికి పోకుండా తెర వెనుక సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతాడు. తెరపై మాత్రం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు కనిపిస్తారు. ఆస్కార్ గెలుపుతో చంద్రబోస్, కీరవాణికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఈ అవార్డు రావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాలభైరవే! తను లేకపోతే ఆ అవార్డే లేదు. కనీసం దాని ముంగిటకు కూడా రాకపోయేవారేమో! అందుకే కార్తికేయ కష్టాన్ని గుర్తించిన కీరవాణి అకాడమీ వేదిక మీద తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరుసకు కొడుకైనా కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు. పాట రూపొందించడం ఒక ఎత్తయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. మన పాటకు ప్రపంచమే ఊగిపోవాలె అన్న రీతిలో ప్రమోషన్స్ చేశాడు. ఈ విషయంలో కార్తికేయను మెచ్చుకోవాల్సిందే! తనే కనక పట్టుబట్టి ఉండకపోతే ఆస్కార్ కల నిజం కాకపోయేదేమో! గతంలో మనకు ఆస్కార్ రాలేదా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటే! భారత్ గెలిచిన తొలి ఆస్కార్ ఇదే అన్నంత రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో మనకు ఆస్కార్ రాలేదా? అంటే వచ్చాయి. భాను అథైయా(బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్), సత్యజిత్ రే, రసూల్ పూకుట్టి(బెస్ట్ సౌండ్ మిక్సింగ్), గుల్జర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్), ఏఆర్ రెహమాన్(బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్) వివిధ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు అందుకున్నారు. మదర్ ఇండియా, లగాన్, సలాం బొంబాయి వంటి సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఏ సినిమా ఇప్పటివరకు ఆస్కార్‌ను గెలుచుకోలేదు. ఈసారి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు పంపుతారనుకుంటే మొండిచేయి ఎదురైంది. భారత్ నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షోను పంపారు కానీ ఆదిలోనే దాన్ని తిరస్కరించడంతో సినీప్రియులు నిరాశచెందారు. ఆర్ఆర్ఆర్ను పంపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఆడియోన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. -
ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి – కార్తికేయ
‘‘నేను నటించిన గత సినిమాల్లో జరిగిన తప్పులు ‘బెదురులంక 2012’లో జరగకుండా చూసుకున్నా. ఈ సినిమాను సపో ర్ట్ చేసి, నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి.. థ్యాంక్యూ’’ అని హీరో కార్తికేయ అన్నారు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ మూవీ చేశా.. బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు బెన్నీ ముప్పనేని. ‘‘నాకు తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్లాక్స్. -
‘లెహరాయి’ పెద్ద హిట్ అవ్వాలి: కార్తికేయ
‘కొత్తగా వచ్చే సినిమాలు ఎంత హిట్ అయితే అంతమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది. లెహరాయి చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని యంగ్ హీరో కార్తికేయ అన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ వేణుగోపాల్ గారే. ఇది ఒక మంచి కథ. ఈ కథను పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది’ అని హీరో రంజిత్ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు లెహరాయిలో ఉన్నాయి. డిసెంబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. -
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
Vadu Evadu: సస్పెన్స్.. థ్రిల్
‘‘వాడు ఎవడు’ టీజర్ చాలా బాగుంది. వాస్తవ ఘటనలతో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్తికేయ, అఖిలా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘వాడు ఎవడు’. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్‌పై ఎన్. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సందేశం ఇస్తున్నాం. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘వైజాగ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’’ అని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్ కుమార్, నేపథ్య సంగీతం: రాజేష్. -
గోద్రెజ్ ఇంటీరియో స్టోర్‌ను ప్రారంభించిన హీరో కార్తికేయ
-
కార్తీకేయతో జతకట్టిన ‘డీజే టిల్లు’ హీరోయిన్
Karthikeya and Neha Shetty Movie Launch: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి.యువరాజ్ సమర్పిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజకార్యక్రమాన్ని జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ కెరీర్లో ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. దివంగత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు మా చిత్రంలో ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టు జీవించే ఓ యువకుడి కథ ఇది’’ అని క్లాక్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. -
అర్థరాత్రి చార్మినార్‌లో సందడి చేసిన రాజమౌళి.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ చార్మినార్‌లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌లో షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
యూవీ క్రియేషన్స్‌తో కార్తికేయ సినిమా.. పోస్టర్ రిలీజ్
‘‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి రాజశేఖర్. Super proud & excited to be associated with the Prestigious @UV_Creations banner 😇 Directed by @Dir_Prashant, #Kartikeya8 Title revealing soon 🏎️✨️ pic.twitter.com/SqKI2IOOyR — Kartikeya (@ActorKartikeya) April 8, 2022 -
'వలిమై' రన్‌టైం తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే
వలిమై చిత్ర నిడివిని యూనిట్ కొంత మేరకు కుదించింది. వివరాలు.. అజిత్ కథానాయకుడిగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గురువారం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అజిత్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. అయితే చిత్ర నిడివి ఎక్కువైందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన యూనిట్ వెంటనే 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత బోనీకపూర్ చెన్నైలో వలిమై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను విజిట్ చేస్తున్నారు. ఆయనపై అజిత్ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్‌ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్గా ఉంటారు: బోనీ కపూర్
‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్ హై పాంచ్’గా రీమేక్ చేశాను. ఈ రీమేక్‌తోనే నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్‌గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్ స్క్రీన్‌లో కూల్‌గా ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్‌పై షేర్లా యాక్ట్ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్ (శ్రీదేవి భర్త బోనీ కపూర్)లో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ. -
Valimai Pre Release Event: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
స్టార్ హీరో అజిత్‌పై బోనీ కపూర్ ప్రశంసలు
Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film: నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్ అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఈయన జి.స్టూడెంట్స్ సంస్థతో కలిసి (అజిత్ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్ చిత్రమని నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. అజిత్ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్.వినోద్ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు. -
కోలీవుడ్ స్టార్‌తో కార్తికేయ సినిమాపై కీలక అప్డేట్
Ajith, Karthikeyas Valimai Movie All Set To Release: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లెటెస్ట్ మూవీ 'వాలిమై'. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి4న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. -
ఆకట్టుకుంటున్న అజిత్ ‘వాలిమై’ మూవీ ట్రైలర్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత అజిత్ ఈ మూవీ ప్రకటించడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. న్యూయర్ సందర్భంగా ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ వాలిమై ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా పెంచుతోంది ఈ ట్రైలర్. ముఖ్యంగా అజిత్, కార్తికేయ బైక్ స్టంట్స్ ఫ్యాన్స్ చేత ఈళలు వేయించేలా ఉంది. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పకోవచ్చు. కాగా బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీని డబ్ చేయనున్నారు. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
3 వేల కోసం ముగ్గురిని చంపాడు
నిజామాబాద్ అర్బన్: చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి.. 16ఏళ్ల వయసులోనే హత్యాయత్నం చేసి మూడేళ్లు జైలుకెళ్లాడు.. బయటికొచ్చి రెండు నెలలైనా కాలేదు.. డబ్బుల కోసం దొంగతనాలు మొదలుపె ట్టాడు. రూ.3 వేల కోసం ముగ్గురిని కిరాతకం గాచంపేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులో ముగ్గురు హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్ (19)ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను నిజామాబాద్ సీపీ కార్తికేయ మీడియాకు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే నేరాలతో.. నవీపేట మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్‌కు చిన్న వయసు నుంచే నేర చరిత్ర ఉంది. నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు దొంగతనాలు చేసి జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు. 2016లో నిజామాబాద్ హమాలీవాడిలోని సాయిబాబా ఆలయంలో హుండీని దొంగిలించేందుకు యత్నించాడు. అడ్డువచ్చిన వాచ్‌మన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనకు సంబంధించి మూడేళ్లు జైల్లో ఉన్న శ్రీకాంత్.. అక్టోబర్ 13న విడుదలయ్యాడు. అప్పటి నుంచి నిజామాబాద్‌లోని గాజుల్పేట్(కడ్డా) ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దొంగతనం కోసం వెళ్లి.. ఈ నెల 8న రాత్రి నిజామాబాద్‌లోని మిర్చి కాం పౌండ్లో మద్యం తాగిన శ్రీకాంత్.. డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడేందుకు బస్సు ఎక్కి డిచ్పల్లికి వెళ్లాడు. అక్కడి ఓ గ్యారేజీలో పంజాబ్ చెందిన హర్పాల్సింగ్ (33), జోగిందర్‌సింగ్ (48), సంగా రెడ్డి జిల్లాకు చెందిన బానోత్ సునీల్ (22) నిద్రపోతుండటం చూశాడు. తొలుత గ్యారేజీ ఆవరణలో నిద్రిస్తున్న సునీల్ వద్ద డబ్బు, సెల్‌ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సునీల్ మేల్కొ నడంతో సుత్తితో తలపై కొట్టాడు. లోపల నిద్రిస్తున్న హర్పాల్సింగ్, జోగిందర్సింగ్లనూ తలపై సుత్తితో మోది చంపేశాడు. వారివద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.3 వేల నగదు తీసుకుని పరారయ్యాడు. ఒకేచోట జరిగిన ఈ ముగ్గురి దారుణహత్యలు కలకలం రేపాయి. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు పాత నేరస్తులపై నిఘా పెట్టారు. ఈ క్రమం లో గాజుల్పేట్ ప్రాంతంలో తనిఖీలు చేసి.. శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. అతడి గదిలో రక్తం మరకలు ఉన్న చొక్కాను, ఎత్తుకెళ్లిన మూడు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్తికేయ దంపతులు
Actor Karthikeya Visits Tirupati With Wife And Family: హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం(నవంబర్26)న నూతన దంపతులిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు. -
అట్టహాసంగా హీరో కార్తీకేయ వెడ్డింగ్ రిసెప్షన్, కళ్లు చెదిరె అరెంజ్మెంట్స్..
యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మూడు రోజులకు బుధవారం(నవంబర్ 24) రాత్రి వారి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితులు, సన్నిహితులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్‌కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరెంజ్‌మెంట్స్‌తో వీరి రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. వరంగల్ నీట్లో బీటెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట. 2012లో లోహితకు ప్రపోజ్ చేసిన కార్తీకేయ హీరో అయ్యాకే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడతానని చెప్పాడట. అలా హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికి కూడా కార్తీకేయ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకుని పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. -
హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో
యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. కాగా కార్తీకేయ మెగాస్టార్‌కు పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. ఓ మూవీ ఈవెంట్లో చిరు పాటకు డ్యాన్స్ చేసిన కార్తీకేయ అనంతరం మాట్లాడుతూ.. చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన తనకే కాదు ఈ తరం హీరోలందరి స్ఫూర్తి అంటూ చెప్పకొచ్చాడు. అలాగే చిరంజీవి గారిని కలవడం తన చిరకాల కలగా ఉండేదని చెప్పాడు. ఈ నేపథ్యంంలో తన పెళ్లికి చిరంజీవి రావడంతో కార్తీకేయ సంబరంలో మునిగితేలుతున్నాడు. ఈ పెళ్లిలో నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న చిరు ఫొటోను షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు కార్తీకేయ. చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా? ఈ సందర్భంగా కార్తీకేయ ఓ ఆసక్తిక సంఘటనను పంచుకున్నాడు. ‘చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తారు అని అనేవాడినట. నేను అల అనడంతో మా నాన్నా నా అమాకపు మాటలకు మురిసిపోతూ సరే నాన్నా అంటూ నా భుజాలు తడుతుండేవారట. కానీ విధి ఎంత చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోగా పరిచమైన కార్తీకేయ ఆ తర్వాత గ్యాప్ లేకుండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. View this post on Instagram A post shared by Kartikeya (@actorkartikeya) -
ప్రేయసి లోహితతో ఘనంగా నటుడు కార్తికేయ వివాహం
-
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి ఫోటోలు
-
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్
Karthikeya Marriage Photos: యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. కార్తికేయ వరంగల్ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పడు లొహితతో పరిచయం ఏర్పడింది. 2012లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సల్మాన్ ఖాన్‌ను కలిసిన రాజమౌళి.. కొత్త సినిమా కోసమేనా ?
Director Rajamouli Met Salman Khan In Mumbai: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నవంబర్ 19న ముబైలోని ఫిల్మ్ సిటీలో కనిపించారు. వారిద్దరూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. వీరి సమావేశం కొన్ని గంటలపాటు సాగింది. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గాసిప్ మొదలైంది. అయితే వారు ఏ విషయమై కలుసుక్నునారని అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలో ఈ సమావేశం గురించి అధికారికంగా వెల్లడిస్తారాని సమాచారం. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) పలు నివేదికల ప్రకారం రాజమౌళి, కార్తికేయ ముంబైలో సల్మాన్ ఖాన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలే తండ్రి-కొడుకులు ఇద్దరూ నవ్వుతూ ఫోజిచ్చారు. అయితే వీరు కొత్త సినిమా కోసం చర్చించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ సినిమాను దర్శకత్వం చేసే అవకాశాన్ని కోల్పోయారు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సమావేశం తర్వాత రాజమౌళి, సల్మాన్ త్వరలో సినిమా చేయనున్నారా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియాగా జనవరి 7, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఇటీవల మహేశ్ బాబు తెలిపారు. అయితే మహేశ్ బాబు చిత్రం తర్వాత రాజమౌళి, సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లికొడుకుగా ముస్తాబైన హీరో కార్తికేయ.. ఫోటోలు వైరల్
Hero Karthikeya Pellikoduku Function Photos Goes Viral: హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. ఆగస్టులో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ రేపు(నవంబర్21)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహితను పెళ్లాడనున్నాడు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా..కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్ఎక్స్100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ.. -
టాలీవుడ్ యంగ్ హీరో వెడ్డింగ్ కార్డ్ వైరల్!
Karthikeya- Lohitha Wedding Card: ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఒక్క హిట్టుతో బోలెడన్ని అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడీ హీరో. అటు పర్సనల్ లైఫ్‌లోనూ హుషారు మీదున్నాడు కార్తికేయ. త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. 'రాజా విక్రమార్క' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేశారట! ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు హీరో తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట! ఈ మేరకు కార్తికేయ-లోహితల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తికేయ లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్టమొదటిసారి లోహితను కలిసిన ఈ హీరో 2012లో ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లాడబోతున్నాడు. -
గరం గరం ముచ్చట్లు 13 November 2021
-
ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ
Karthikeya Reveals About His Love Story With Lohitha: ఆర్ఎక్స్100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో అతి త్వరలోనే బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రేయసితో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీపై కార్తికేయ చెప్పిన విశేషాలు.. 'నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. 2012లో ప్రపోజ్ చేశాను. సంవత్సరం తర్వాత ఒప్పుకుంది. బీటెక్ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది. మా ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబసభ్యులకు తెలిసిందే. లోహితను ప్రేమిస్తున్న విషయం తొలుత మా ఇంట్లోచెప్పా. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులను ఒప్పించాం. మా మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి చాలా కాలంగా అందరికి తెలియడం వల్ల అర్థం చేసుకొని పెళ్లికి అంగీకరించారు. రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను'అని కార్తికేయ చెప్పుకొచ్చారు. -
వీవీఐటీలో హీరో కార్తికేయ సందడి
Raja Vikramarka Movie Team: శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై శ్రీసరిపల్లి నూతన దర్శకుడుగా పరిచయమవుతూ ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కధానాయకుడిగా తాన్యా రవిచందన కధానాయికగా నటిస్తున్న చిత్రం రాజా విక్రమార్క చిత్ర యూనిట్ వీవీఐటీలో సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక హంగులతో రూపొందించి అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీసరిపల్లి సినిమాని తెరకెక్కించారన్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర సంగీతానికి మంచి స్పందన లభించిందన్నారు. తన తొలి చిత్రం నుంచి ప్రచారంలో భాగంగా వీవీఐటీని సందర్శించడం పరిపాటిగా మారిందన్నారు. దర్శకుడు శ్రీసరిపల్లి మాట్లాడుతూ మంచికథతో ప్రేక్షకులకు పరిచయవ్వడం సంతోషంగా ఉందని, నవంబరు 12న విడుదల కానున్న రాజా విక్రమార్క చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్నారు. హీరో కార్తికేయ విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, చిత్ర నిర్మాత రామారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టైటిల్ చెప్పినప్పుడు ఆయన గుడ్ లక్ అన్నారు!: కార్తికేయ
‘‘నేనిప్పటికే యాక్షన్ సినిమాలు చేశాను కాబట్టి ఓ నమ్మకం వచ్చింది. కానీ, నేను కామెడీ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే క్యూరియాసిటీ ఉంది. నేను బయట చాలా సరదాగా ఉంటాను కాబట్టి ‘రాజా విక్రమార్క’లో కామెడీ చేయడం కష్టం అనిపించలేదు. ట్రైలర్ విడుదలయ్యాక నా కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు సంతోషపడ్డాను’’ అని కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు... శ్రీ సరిపల్లి చెప్పిన ‘రాజా విక్రమార్క’ కథ నచ్చింది.. తనతో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత నిజాయతీగా చేయగలడనే నమ్మకం వచ్చింది. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా పట్టుదలతో థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్న రామారెడ్డి, ఆదిరెడ్డిలకు థ్యాంక్స్. ∙ఈ చిత్రంలో యాక్షన్ కూడా స్టయిలిష్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ∙ఒక రోజు శ్రీతో ‘రాజా విక్రమార్క’ టైటిల్ బావుంది.. పెట్టేద్దాం అన్నాను. ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. టైటిల్ రిజిస్టర్ చేశాక చిరంజీవిగారికి పంపించాను. ఆయన ‘గుడ్ లక్’ అన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్నాను. ∙ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ వినాలని నిర్ణయించుకున్నా. నా ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారు. బాడీ అలా మెయింటైన్ చేయడం కష్టమే.. అయితే అవకాశాలు వస్తున్నప్పుడు కష్టపడొచ్చు. ∙అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘వలిమై’లో విలన్‌గా చేస్తున్నాను. ఈ సినిమా కోసం కొంచెం తమిళ్ నేర్చుకున్నాను. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత క్లాక్స్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా ఉంటుంది. శివలెంక కృష్ణప్రసాద్గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయింది. ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను. -
కాబోయే భార్యకు స్టేజ్‌పై ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్లోనే భార్యకు లవ్‌ప్రపోజ్ చేశాడు. 'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. -
ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్‌కు ప్లస్ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘‘ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , నవీన్, ఎడిటర్ జస్విన్ ప్రభు పాల్గొన్నారు. -
రాజా విక్రమార్క హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ఫొటోలు..
-
‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తన్యా గురించి ఈ విషయాలు తెలుసా!
Here Is About Raja Vikramarka Movie Heroine Tanya Ravichandran: యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరియం అవుతోంది. 2016లో ‘బల్లె వెళ్ళయ్యతేవా’ అనే తమిళ చిత్రంతో తన్యా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించిన తన్యా కథల ఎన్నికల్లో ఆచీతూచి అడుగులెస్తోంది. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తన క్యూట్ క్యూట్ స్మైల్, ఆకర్షించే అందంతో కుర్రకారు మతి పోగోడుతోంది. సినిమా విడుదల కాకముందే తన్యా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు నెట్టంట సందడి చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే తన్యా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఆమె సినీ కుటుంబ నేపథ్యం నుంచి పరిశ్రమలోకి వచ్చింది. ఆమె ఓ స్టార్ హీరోకు బంధువు. ఆయన ఎవరో కాదు తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు. ఆయన నట వారసురాలిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది. కాగా ‘రాజా విక్రమార్క’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదని, కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారని చెప్పింది. ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పారని, అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్ సర్ నుంచి అవకాశం వచ్చింది. కానీ తన పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక తాతయ్యా రవిచంద్రన్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఉండుంటే ఎంత సంతోషించేవారోనని, దురదృష్టవశాత్తూ తను కెమెరా ముందుకు రాకముందే ఆయన దూరమయ్యారంటూ భావోద్వేగానికి లోనయ్యింది. ఆయన పట్టుదల, క్రమశిక్షణే తన స్ఫూర్తి అని, ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదంటూ తాన్యా చెప్పుకొచ్చింది. -
ఒక్క సినిమా అంటూ మూడు చేసేశా!
‘‘రాజా విక్రమార్క కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో నా పాత్ర పేరు కాంతి. తను హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి’’ అని తాన్యా రవిచంద్రన్ అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. అయితే, మా పేరెంట్స్ ‘పీజీ పూర్తి చెయ్.. ఆ తర్వాతే సినిమాలు’ అన్నారు. అయితే పీజీ చేస్తున్న టైమ్‌లో చాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. కానీ వరుసగా తమిళంలో మూడు సినిమాలు చేశాను. అవి పూర్తయ్యాక పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ – హెచ్ఆర్) పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. మా తాతయ్య (తమిళ హీరో రవిచంద్రన్) చాలా హార్డ్ వర్కింగ్.. ఆయనకు అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. ఆ మూడూ నేర్చుకున్నాను. నేను సినిమాల్లోకి వస్తా నని తెలియకముందే తాతయ్య మాకు దూరమయ్యారు. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
Raja Vikramarka: ఏజెంట్ విక్రమ్ రెడీ
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘88’ రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కార్తికేయ లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఆయన జీవించారు. శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు’’ అన్నారు. శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ లుక్ బాగుంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. -
సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: కార్తికేయ భార్య
దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, తన స్నేహితురాలు, సింగర్, జగపతి బాబు బంధువైన పూజను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ 28 జైపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. వారి వివాహం జరిగి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా ఈ జంట సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి ప్రేమ, పెళ్లి పరిచయం గురించి ఏం చెప్పారో వారి మాటల్లోనే విందాం రండి. కార్తికేయ మాట్లాడుతూ.. ఏడాది ఫ్రెండ్షిప్ తర్వాత పూజకు ప్రపోజ్ చేశా. కొన్ని నెలల తర్వాత ఓకే చేసింది. ఆమె పాట నాకు ఇష్టం.. కావాలన్నప్పుడల్లా నా కోసం పాడతుంది. ⇔ కాలేజ్ డేస్‌లో సొంత జీతం అనే కిక్‌ని ఎంజాయ్ చేయడం కోసం ఐస్‌క్రీమ్ పార్లర్లో పని చేశాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ చూశా. ఇప్పుడు మార్కెటింగ్ చూస్తున్నాను. ⇔ నేను వింటర్ వెడ్డింగ్ కావాలనుకున్నాను. నాకు చలి ఇష్టం.. తనకు (పూజకి) కష్టం. జైపూర్ ప్యాలెస్‌లో డిసెంబరు 28 మా పెళ్లి ముహూర్తం రావడం లక్కీ. 15 ఏళ్లలో కోల్డెస్ట్ 10 డిగ్రీల చలిలో మా పెళ్లయింది. మ్యారేజ్ అంటే... సెక్యూరిటీ, అండర్స్టాండింగ్, ట్రస్ట్, లవ్. ⇔ చాలామంది నమ్మరు కానీ బాబా (రాజమౌళి).. టీ, కాఫీ పాలు సహా ఏమీ తాగరు. పెరుగన్నంలో మాత్రం తప్పకుండా స్వీట్ ఉండాల్సిందే. పెరుగు వేసుకుంటుండగానే స్వీట్ ఏది అని అడుగుతారు రాజమౌళి. రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు. సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: పూజ ⇔ చిన్నప్పటి నుంచీ సినిమా ఫీల్డ్ వాళ్లని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. అందుకే కార్తికేయ అడగ్గానే, ఆలోచించా. ఆ తర్వాత ఒప్పుకున్నా. తను ప్రతి విషయంలో నా వైపే ఉంటాడు. హైపర్ యాక్టివ్, ఓర్పుకి కేరాఫ్.. ప్రేమించిన వారి కోసం ఏమైనా సరే చేస్తాడు. ⇔ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నాను. ప్రాక్టీస్ తప్పింది కాబట్టి మళ్లీ సాధన పెంచుకుని సినిమాలకి పాడతానేమో తెలియదు. కానీ నటించడం అంటే కష్టమే... కెమెరా ముందు నెర్వస్ అయిపోతా. మీకీ ఇంటర్వ్యూ ఇవ్వడానికే కష్టమైంది. ⇔ పెళ్లికి ముంతు.. తర్వాత కూడా చుట్టూ ఉన్న శక్తివంత మైన మహిళల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. అమ్మ దగ్గర క్రమశిక్షణ, హార్డ్ వర్క్.. ఎవరిపైనా ఏ నెగటివ్ ఫీల్ ఉంచుకోకపోవడం అత్తయ్య (రమా రాజమౌళి) దగ్గర, పిల్లల్ని చూసుకోవడం ఎలా అనేది వల్లీ పిన్ని దగ్గర... ఇలా... ⇔ మా పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా రాజమౌళిగారు అలానే ఉన్నారు. పదేళ్ల తర్వాత కూడా ఆయనలో మార్పు చూడలేనేమో... ⇔ జగపతి బాబాయ్‌కి చిన్నప్పటి నుంచీ నన్ను అమ్మ దగ్గర నుంచి సేవ్ చేయడమే పని.. ⇔ ట్యాంగిల్ ఆర్ట్ అనే ఆర్ట్ ఫార్మ్ ఉంది. ఆర్డర్స్ మీద డ్రాయింగ్స్ చేస్తాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నైట్ షూట్స్ టైమ్‌లో అందరికీ ఐస్‌క్రీమ్స్ తెప్పించేదాన్ని. ఆ సినిమాలో నా భాగస్వామ్యం అంతే... (నవ్వుతూ) -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్‌తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
Raja Vikramarka: ‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే..’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ గుమ్మకొండ కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. మంగళవారం (సెప్టెంబరు 21)న కార్తికేయ బర్త్ డే. ఈ సందర్భంగా ‘రాజా విక్రమార్క’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే.. ప్రయాసతో పరారు అంతే...’’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, డేవిడ్ సైమన్ పాడారు. ‘‘సినిమాలో ఉన్న నాలుగు పాటలు వేటికవే విభిన్నం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ నటన హైలైట్‌గా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు ‘88’ రామారెడ్డి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రధారులు. -
బ్యాచిలర్‌గా ఇదే నా చివరి చిత్రం : హీరో కార్తికేయ
‘‘ఇటీవల నిశ్చితార్థం (హైదరాబాద్‌కు చెందిన లోహితారెడ్డిని కార్తికేయ వివాహం చేసుకోనున్నారు) చేసుకున్నాను. బ్యాచిలర్‌గా నా చివరి చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి, జీవితంలో మరోస్థాయికి వెళితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ‘రాజా విక్రమార్క’ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు కార్తికేయ. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరో హీరోయిన్లు. శ్రీ చిత్రమూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమా టైటిల్‌ను పెట్టుకునే అదృష్టం ఈ చిత్రం ద్వారా కలిగింది. ఈ సినిమాను మేమే నిర్మించాలనుకున్నాం. ఫైనల్‌గా రామారెడ్డి, ఆదిరెడ్డిగారు నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో ‘రాజా విక్రమార్క’ ఉండాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘ఈ సినిమాకు మూలస్తంభం కార్తికేయ’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. చదవండి : ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ -
ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. 88 రామారెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్ కార్తికేయ, తనికేళభరణి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. టీజర్ విషయానికొస్తే.. కార్తికేయ ఇందులో ఎన్ఐఏ ఎజెంట్‌గా కనిపించాడు. కొత్తగా అపాయింట్ అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్‌లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు. చదవండి: ‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్ రాజ్ దీనిపై తనిళకేళ భరణికి, కార్తికేయకు మధ్య జరిగే సంభాషణలు అలరిస్తున్నాయి. అలాగే చివర్లో ‘చిన్నప్పుడు కృష్ణ గారిని.. పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ని చూసి ఆవేశపడి జాబ్‌లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక కార్తికేయ పాత్రకి యాక్షన్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా రాజా విక్రమార్కలో కార్తికేయకు జోడిగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: 2 ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్ భారీ ఒప్పందం! -
నిట్ వరంగల్‌లో లోహితను కలిశాను: హీరో కార్తికేయ
Karthikeya Shares Photo With Fiance: ‘‘నిట్ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది’’ అంటూ ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అభిమానులతో శుభవార్తను పంచుకున్నాడు. బెస్ట్‌ఫ్రెండ్ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. గుణ 369, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్‌లీడర్ మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్ వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life.. From 2010when i first met #Lohitha in nitwaranagal to now and many more such decades.. pic.twitter.com/xXYp7pcH4K — Kartikeya (@ActorKartikeya) August 23, 2021 -
సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
Karthikeya Got Engaged: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది. కార్తికేయ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తుంది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కాగా కార్తికేయ సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చి మెప్పించాడు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ‘రాజా విక్రమార్క’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్ Rakul: ఓబులమ్మగా రకుల్ ప్రీత్‌సింగ్..ఫస్ట్‌లుక్ రిలీజ్ -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెజవాడ విద్యార్థి
పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బిష్వరూప్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు. -
'డర్టీ హరి' హీరోయిన్‌తో కార్తికేయ..
ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' అనే ప్రాజెక్టులో నటిస్తున్న కార్తికేయ ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా 'రుహాని శర్మ'ను ఫిక్స్ చేశారట. 'డర్టీ హరి' చిత్రంతో రుహాని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్ విడుదల
ఆర్ఎక్స్100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు కార్తికేయ. అయితే ఈ సినిమా అనంతరం ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం వి. వి. వినాయక్ అసోసియేట్ శ్రీసరిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి 'రాజా విక్రమార్క' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 1990లో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ సందీప్ వంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కార్తికేయ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీలో ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కార్తికేయకు జోడీగా నటించనుంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తాన్యా క్లాసికల్ డ్యాన్సర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించింది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తాన్యా క్లాసికల్ డ్యాన్సర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించింది. రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మెంటల్ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్ ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Thank you so much @imvangasandeep sir for unveiling the first look 🤗🤗 https://t.co/MMVDlAbIOC — Kartikeya (@ActorKartikeya) June 20, 2021 చదవండి : హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు వైరల్ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం -
KrishnaLanka: ఉత్కంఠంగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ వీడియో
రంగు’సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కార్తికేయ డైరెక్షన్లో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం నేపథ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్లు, ట్రైలర్లకు భిన్నంగా ఈ వీడియోలో ప్రతి పాత్ర తీరు తెన్నులను పరిచయం చేసాడు దర్శకుడు. ఓ గ్రామంలో కొన్ని బృందాల మధ్య జరిగిన ఘర్షనలు ఇందులో కనిపిస్తున్నాయి. కృష్ణ సురభ్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ప్రేమకు పగకు మధ్య జరిగే యుద్దమే ఈ సినిమా నేపథ్యం అని వీడియోని చూస్తే అర్థమవుతంది. అసలు ‘కృష్ణలంక’లో ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దే. ఈ సినిమాని సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. చదవండి: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్! పోర్న్ మూవీ తీద్దామనుకున్నా: జాక్ స్నైడర్ -
చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్.. ఇక్కడ బ్లాక్‌బస్టర్
కరోనా కారణంగా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫాం హావా నడుస్తోంది. ఇంట్లో కూర్చోనే ఎంచక్కా కొత్త సినిమాలన్ని చూసేయేచ్చు. అయితే బిగ్‌స్రీన్‌పై భారీ విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో నిరాశపరుస్తుంటే.. డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు మాత్రం సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. గత నెల మార్చి 2న విడుదలైన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ బిగ్‌స్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేనప్పటికి.. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపుతోంది.ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లు వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా వైల్డ్ డాగ్ తరహాలో ఓటీటీలో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీని కాస్తా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన 72 గంటల్లోనే అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు తాజాగా ఆహా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో బిగ్‌స్రీన్‌పై నిరాశపరిచిన ఈ మూవీ.. స్మాల్‌స్క్రీన్‌పై బాక్సాఫీసు రేంజ్ హిట్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. థీయేటర్లో చూసిన వారు సైతం ఆహాలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపడం విశేషం. అంతేగాక ఈ మూవీని అద్భుతంగా రీఎడిట్ చేసి అందించారంటు పాజిటివ్ కామెంటు కూడా వస్తున్నాయి. కాగా కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు కొంత పాజిటివ్ టాక్ రాగా.. రెండవ రోజు నుంచి నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ జీఏ2(GA2) నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్ -
‘ఆహా’లో ‘చావు కబురు చల్లగా’, ఎప్పుడంటే..
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక అది అలా ఏంటే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రం ‘ఆహా’లో ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆహా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ 'చావు కబురు చల్లగా'ను ఓ రియలిస్టిక్ పాయింట్‌తో తెరకెక్కించామని, అయితే ఈ సినిమా థియేటర్స్ విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్నారు. ఓటీటీ కోసం సినిమాను కొద్దిగా ఎడిట్ చేశామని చేప్పాడు. ప్రేక్షకులు చెప్పిన పాయింట్స్‌ను పరిగణలోకి తీసుకుని రీ ఎడిట్ చేశాం. థియేటర్ కంటే బెటర్ కట్ చేశాం. థియేటర్ కంటే ఆహాలో ఇంకా బాగుంటుందని పేర్కోన్నాడు. -
క్షమించండి, మరో చాన్స్ ఇవ్వండి: కార్తికేయ
ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు యంగ్ హీరో కార్తికేయ. కానీ ఈ సినిమా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. తర్వాత చేసిన ఆర్ఎక్స్100 సూపర్ డూపర్ హిట్ కావడంతో చిన్నపాటి స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్ అనే పెద్ద బ్యానర్లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు. "చావు కబురు చల్లగా సినిమా నాలో కొత్త నటుడిని పరిచయం చేసింది. బస్తీ బాలరాజుగా ఎన్నో హృదయాలకు నన్ను దగ్గర చేసింది. ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకో అవకాశం ఇవ్వండి. తప్పకుండా దాన్ని సరిదిద్దుకుని మళ్లీ పుంజుకుంటా"నని కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తూ కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు సాధారణమేనని, త్వరలో తప్పకుండా హిట్ కొడుతావ్ అని కామెంట్లు చేస్తున్నారు. #ChaavuKaburuChallaga a movie that explored a new actor in me,got me closer to the hearts of many.Been reading your messages,made me proud of #Basthibalaraju.. And movie nachani andaru chinna thappulunna kshaminchesi inkoka chance ivandi,will definitely rectify and bounce back😊 pic.twitter.com/mf7qE0ACH6 — Kartikeya (@ActorKartikeya) March 29, 2021 చదవండి: 'సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు' శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు వైరల్ -
‘ఆర్ఎక్స్ 100’ ఫీలింగ్ మళ్లీ కలిగింది
‘‘కథల ఎంపికలో నా జడ్జ్మెంట్ తప్పయి నా సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. హిట్ సినిమా కంటే ఫ్లాప్ సినిమానే ఎక్కువ నేర్పిస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. కౌశిక్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► గీతా ఆర్ట్స్ నుంచి 2019లో ఫోన్ కాల్ వచ్చింది. చాలా ఎగ్జయిట్ అయ్యాను. కథ వినడానికి దర్శకుడు కౌశిక్‌ను కలిశాను. కథ వినేప్పుడు చిన్న వయసులోనే దర్శకుడిగా కౌశిక్ ఇంత ఫిలాసఫీ ఎలా మాట్లాడగలుగుతున్నాడని షాక్ అయ్యాను. ఇందులో శవాలబండిని నడిపే బస్తీ బాలరాజు పాత్ర చేశాను. శవాన్ని తీసుకెళ్ల డానికి చావు ఇంటికి వెళ్లి, చనిపోయిన వ్యక్తి భార్యను ఇష్టపడతాడు బాలరాజు. ఆ తర్వాత జరిగే విషయాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ► మనం చావు అంటే చాలా భయపడిపోతాం. కానీ బతుకు ఇచ్చిన దేవుడే, చావును కూడా ఇచ్చాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇలాంటి ఫిలాసఫీ బస్తీ బాలరాజు పాత్రలో ఉంటుంది. అందుకే ఈ పాత్రను మిస్ చేసుకోకూడదని ఓకే చెప్పాను. కామెడీ, ఎమోషన్స్ రెండూ మిళితమై ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నాకు నెక్ట్స్ లెవల్ స్క్రిప్ట్స్ వస్తాయని నమ్ముతున్నాను. కొత్త దర్శకుడైన కౌశిక్ ఓ డిఫరెంట్ పాయింట్‌ను చక్కగా డీల్ చేశాడు. ► ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్లో హిట్ అవసరమే. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా టైమ్‌లో నా చుట్టూ ఉన్న పాజిటివ్‌నెస్‌ను మళ్లీ ఇప్పుడు ‘చావుకబురు చల్లగా.. ’కి ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సినిమాలు సెట్ చేసిపెట్టడానికి నాకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. కెరీర్ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాను. తెలియనివి నేర్చుకుంటూ, చేసిన తప్పులు చేయకుండా ముందుకు సాగిపోతాను. నా వంతుగా సిన్సియర్‌గా కష్టపడతాను. ► నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో విలన్ రోల్ కొత్తగా ఉందనిపించి చేశాను. ఇప్పుడు అజిత్‌గారి తమిళ సినిమా ‘వలిమై’లో విలన్ గా చేస్తున్నాను. హెచ్. వినోద్ (‘వలిమై’ డైరెక్టర్)గారి ‘ఖాకీ’ సినిమా నాకు బాగా నచ్చింది. అందుకే ‘వలిమై’కి ఓకే చెప్పా. సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. -
చావు కబురు చల్లగా: స్టెప్పులు, సెల్ఫీలు..
సాక్షి, విజయనగరం: ‘చావు కబురు చల్లగా...’ చిత్ర యూనిట్ నగరంలో మంగళవారం సందడి చేసింది. ఈ నెల 19న విడుదల కానున్న ఈచి త్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ యాత్ర లో భాగంగా వారు ఇక్కడి ఎస్వీసీ రంజనీ థియేటర్‌కు వచ్చారు. హీరో, హీరోయిన్లు కార్తికేయ, లావణ్యా త్రిపాఠి ఈ సందర్భంగా ప్రేక్షకులతో ఆడిపాడి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన తీన్మార్ డప్పులకు కార్తికేయ లయబద్ధంగా స్టెప్పులేశారు. అభిమానులతో సెలీ్ఫలు దిగారు. అనంతరం కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందనీ, ఆర్ ఎక్స్ 100 చిత్రంతో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్కడి నుంచే వచ్చాయన్నారు. నూటికి నూరు శాతం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోనుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ చిత్రంలో మంచి ఫీల్ ఉందన్నారు. ఇది ఒక సందేశాత్మక చిత్రంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు. దర్శకుడు పి.కౌశిక్ మాట్లాడుతూ హీరో, హీరోయిన్లు చిత్రానికి పూర్తి న్యాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజరు భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకాశ్‌రాజ్‌తో నటించాలంటే భయం: ఆమని
‘‘ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఏ సినిమాకూ ముందు రోజు స్క్రిప్ట్ తీసుకెళ్లి డైలాగులు నేర్చుకున్నది లేదు. ‘చావు కబురు చల్లగా’లో వైజాగ్ యాసలో పెద్ద పెద్ద మాస్ డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో రాత్రిళ్లు బట్టీపట్టి ఉదయం షూటింగ్లో పాల్గొనేదాన్ని. ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని నటి ఆమని అన్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన ఆమని మాట్లాడుతూ– ‘‘అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చేస్తున్నప్పుడు ‘చావు కబురు చల్లగా’లో నటించమని బన్నీ వాసు అనడంతో కథ, నా పాత్ర ఏంటని అడగకుండా ఒప్పుకున్నా. ఇందులోని సన్నివేశాలు చూస్తే కౌశిక్ అనుభవం ఉన్న దర్శకునిలా తీశాడు. నేను ఎంతోమందితో నటించా. కానీ ప్రకాశ్‌రాజ్‌గారితో నటించడం భయం. ఆయన ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకే ఒక్క టేక్‌లో చేస్తారు. ఆయనతో నటించేటప్పుడు నాకు రెండో టేక్ తీసుకోవాలంటే భయం. విలన్ పాత్ర చేయాలన్నది నా కల. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇప్పుడు నటీనటులకు ఉన్నన్ని సౌకర్యాలు లేవు. అప్పుట్లో షాట్ గ్యాప్‌లో చెట్లకింద కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాళ్లం. దీంతో నటీనటుల మధ్య బాండింగ్ బాగుండేది. ఇప్పుడు షాట్ గ్యాప్ వస్తే క్యారవాన్‌లోకి వెళ్లిపోతున్నారు. లేకుంటే మొబైల్స్‌తో బిజీ అయిపోతున్నారు’’ అన్నారు. చదవండి: ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్ శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు -
సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రం ‘కుమారి 21ఎఫ్’ ఘనవిజయం సాధించింది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారాయన. ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘‘కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని చూసి, కార్తికేయ నటనకు ముగ్ధుడైన సుకుమార్ తన బ్యానర్లో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
...అంత హిట్టవ్వాలి
‘‘మిత్ర శర్మ ‘బాయ్స్’ మూవీలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మిస్తున్నారని విని షాక్ అయ్యాను. ఆమె ఎంతో ధైర్యంగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేశారు. ఈ ‘బాయ్స్’ సినిమా శంకర్‌గారి ‘బాయ్స్’ అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. మిత్ర శర్మ హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. గీతానంద్ హీరోగా దయానంద్ దర్శకత్వంలో శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తికేయ విడుదల చేయగా, ‘సుచిర్ ఇండియా’ కిరణ్, ‘కళామందిర్’ కళ్యాణ్‌లు శ్రీ పిక్చర్స్ పోస్టర్స్, లోగోలను రిలీజ్ చేశారు. మిత్ర శర్మ మాట్లాడుతూ– ‘‘2014లో ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా సినిమాల్లో నటించాను. దయానంద్ ఎంతో కాన్ఫిడెంట్‌గా కథ చెప్పిన విధానం నచ్చి తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మిత్ర శర్మగారు నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దయానంద్. ఈ చిత్రానికి సహనిర్మాత: పడవల బాలచంద్ర, సంగీతం: స్మరన్, కెమెరా: వెంకట ప్రసాద్. -
'చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే!
‘‘కోవిడ్ తర్వాత థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తారా? అనే డౌట్ ఉండేది. మీరు సినిమా తీయండి మేం వస్తాం అని... అది ‘క్రాక్’ సినిమాతో కావొచ్చు.. ‘ఉప్పెన’తో కావొచ్చు. మాకు భరోసా ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల దీవెనలు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. నా జీవితంలో నేను సంపాదించుకున్నది నా అభిమానులనే. వారు గర్వపడేలా నేను కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను’’ అని అన్నారు అల్లు అర్జున్ . కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని నేను చూశాను. బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలను. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. వాసుతో ‘గంగోత్రి’ సినిమా నుంచి నా అసోషియేషన్ కొనసాగుతోంది. వాసుకి సినిమా నచ్చడం చాలా అరుదు. తను ఏదైనా ఒక సినిమాను సెలక్ట్ చేసుకుంటే అందులో విషయం ఉంటుంది. ఈ కథ నవదీప్ వల్ల గీతా ఆర్ట్స్‌కి చేరింది. అందరూ ఎంత బాగా చేసినా అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే. కౌశిక్‌లో మంచి మెచ్యూరిటీ ఉంది. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూశాను. ‘చావుకబురు..’లో బస్తీ బాలరాజుగా తన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. బిజోయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌లో లావణ్యాకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ‘పుష్ప’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. తగ్గేదే లేదు’’ అన్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సినిమా అని కాదు.. వాసు స్నేహితుడిగా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వచ్చాడు. కార్తికేయ అమేజింగ్ యాక్టర్. కౌశిక్ మంచి రైటర్. మా సంస్థలో ఎక్కువకాలం ఉండేవారిలో కౌశిక్ ఉంటాడు. ‘‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేయడానికి వాసు ముఖ్యకారణం. గీతా ఆర్ట్స్‌కు మంచి సపోర్టివ్‌గా ఉంటున్నాడు’’ అన్నారు అల్లు అరవింద్. చదవండి: బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్ ‘‘స్టార్ హీరోలను నా సినిమా రిలీజ్ ఫంక్షన్స్‌కు అతిథిగా పిలిపించుకునే అవకాశం రాలేదు. ఈ సినిమాకు బన్నీగారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. గోడదూకి ‘ఆర్య 2’ సినిమాకు వెళ్లాను. ‘రేసుగుర్రం’ సినిమాకు థియేటర్స్‌లో ఆడియన్స్‌లా స్టెప్పులేశాను. ఇప్పుడు బన్నీగారి ప్రొడక్షన్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అరవింద్‌గారి ప్రొడక్షన్లో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కల్యాణ్, ఆమిర్‌ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు గీతా ఆర్ట్స్‌లో నటించారు. వారికి ఎలాంటి గౌరవం దక్కిందో నాకూ అలాంటిదే దక్కింది. కౌశిక్ మంచి డైరెక్టర్ అవుతాడు. ఇక లావణ్యను ‘అందాల రాక్షసి’గా కాదు.. ‘మల్లిక’గా గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. కానీ ఈ సినిమా హిట్ సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు. నేనూ నమ్ముతున్నాను’’ అన్నారు కార్తికేయ. చదవండి: అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ ‘‘సినిమా చూసి బన్నీ ఇచ్చిన కాంప్లిమెంట్స్ను మర్చిపోలేను. అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. బస్తీ బాలరాజుగా కార్తికేయ చితక్కొ ట్టాడు. నవదీప్గారి వల్ల వాసూగారితో పరిచయం కలిగింది. నేను చెప్పిన కథ నచ్చి వాసూగారు అవకాశం ఇచ్చారు’’ అన్నారు కౌశిక్. ‘‘కార్తికేయ హీరోగా, విలన్ గా చేస్తున్నాడు. హీరోగా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్లు. ‘చావు కబురు చల్లగా...’ సూపర్‌హిట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘అరవింద్‌గారు, బన్నీగారు లేకుంటే నేనీ స్థాయికి వచ్చేవాడిని కాదు. హీరోగా కార్తికేయ, దర్శకుడిగా కౌశిక్ మంచి స్థాయికి వెళతారు. ఇలాంటి డిఫరెంట్ కథను ఇచ్చినందుకు కౌశిక్‌కు, విడో క్యారెక్టర్ చేసిన లావణ్యాగారికి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి బన్నీ.. ఐకానిక్ మాస్ స్టార్! ‘స్టైలిష్ స్టార్‌గా కాదు... ఐకానిక్ మాస్ స్టార్లా బన్నీని ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునేలా ‘పుష్ప’ సినిమా ఉంటుంది. కొత్త కథల ఎంపికలో అల్లు అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌కు ఓ నమస్కారం. కార్తికేయ భవిష్యత్‌లో మంచి స్టార్ అవుతాడు. ‘గీతగోవిందం’ గీసిన గీతను ఈ సినిమా దాటిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సుకుమార్ అన్నారు. లావణ్యా త్రిపాఠి, అల్లు అర్జున్, కార్తికేయ, అల్లు అరవింద్, బన్నీ వాసు, కౌశిక్, అనసూయ -
‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ వచ్చేసిందోచ్!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం సినిమా ‘చావు కబురు చల్లగా’. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం చావు కబురు చల్లగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, డాక్టర్ మల్లికగా లావణ్య తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. కార్తికేయ చెప్పే డైలాగులు బాగున్నాయి. కాగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు విశేష స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సాంగ్‌లో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆడిపాడారు. కాగా మార్చి 9న జరగబోయే చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రాబోతున్నారు. ఇదిలా ఉండగా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాతో అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సినిమా రిలీజ్ కోసం ష్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: 'ఆయన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు' -
డ్రైవర్.. నర్స్... ఓ ప్రేమకథ
‘‘చావు కబురు చల్లగా’ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను ఎంచుకున్నందుకు ‘బన్నీ’ వాసుగారికి ధన్యవాదాలు. అల్లు అరవింద్‌గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ క్లారిటీతో ఈ సినిమా తీశాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది’’ అని కార్తికేయ అన్నారు. ‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కదిలే కళ్లనడిగా..’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘ఇదొక లవ్ స్టోరీ. సీరియస్ పాయింట్‌ను ఎంటర్టైనింగ్గా చెప్పాం. ఈ సినిమాలో హీరో డెడ్ బాడీస్‌ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్‌గా, హీరోయిన్ నర్స్‌గా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఫ్రెష్ కంటెంట్‌తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశా. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసినప్పుడు హ్యాపీ. కార్తికేయ, లావణ్య ఈ కథకు పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. సినిమాలో భావోద్వేగాలు బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. గీతా ఆర్ట్స్‌లో రెండో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.. థ్యాంక్స్ టు వాసుగారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
కదిలే కాలాన్ని అడిగా...
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కదిలే కాలాన్ని అడిగా..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ, లావణ్య ఉన్న ఓ పోస్టర్‌తో ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘చావు కబురు చల్లగా’ చిత్రం టైటిల్, కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ వీడియో, లావణ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్, మైనేమ్ ఈజ్ రాజు.. అనే పాటకు అనూహ్య స్పందన లభించింది. మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కరమ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ కరుటూరి, శరత్ చంద్ర నాయుడు. -
డిఫరెంట్ లుక్‌లో షాకిచ్చిన కార్తికేయ
ఆర్ఎక్స్ 100 అనే బోల్డ్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తికేయ. ఆ ఒక్క మూవీతో కార్తి లక్షణాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఆ మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా.. నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు . అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. మార్చి 19వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే కార్తికేయ ఇప్పుడు సిక్స్ ప్యాక్ లుక్‌లో దర్శనమించ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ట్విటర్ వేదికగా కార్తికేయ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో కార్తికేయ కండలు తిరిగిన దేహంతో చాలా కాంఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే తన ట్రైనర్ కుల్దీప్ సేతి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే నెక్స్ట్ సినిమాలో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. మరి ఈ సిక్స్ ప్యాక్ ఏ సినిమా కోసమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E — Kartikeya (@ActorKartikeya) February 16, 2021 -
పెద్ద బీర్ కొంటే.. చిన్న బీర్ ఫ్రీ: మధుర వైన్స్ ట్రైలర్
పెద్ద బీర్ కొంటే.. చిన్న బీరు ఫ్రీ అని వంటివి ఆఫర్స్ ఇవ్వొచ్చుగా అంటూ హీరో సన్నీ నవీన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆర్కే సినీ టాకీస్ బ్యానర్‌పై రాజేశ్ కొండెపు నిర్మిస్తున్న 'మధుర వైన్స్' సినిమా ట్రైలర్ గురువారం విడుదలయ్యింది. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను యువ నటుడు కార్తికేయ విడుదల చేశారు. వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా ఆకట్టుకునేలా ఉందని ఈ సందర్భంగా కార్తికేయ తెలిపారు. మధుర వైన్స్‌కు.. తన ప్రేయసి మధురకు మధ్య ఉన్న సంబంధమే సినిమా కథ అని చిత్రబృందం తెలిపింది. మద్యానికి ప్రేమకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని చెప్పే డైలాగ్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వర ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. -
వేసవిలో కబురు
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు, చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ‘బన్నీ’ వాసు తెలిపారు. -
దివి ఎలిమినేట్: సినిమా ఛాన్స్ కొట్టేసింది
నటనా సామ్రాజ్యపు మహారాణి, సిరివెన్నెల విరబోణి సమంత బిగ్‌బాస్ నాల్గో సీజన్లో దసరా స్పెషల్ మహా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించింది. ముద్దు ముద్దు మాటలతో షో ప్రారంభం నుంచే సందడి మొదలు పెట్టేసింది. కంటెస్టెంట్లు ఒక్కొక్కరి గురించి సమంత తన అభిప్రాయాలను చక్కగా చెబుతూనే అందరినీ తికమక పెట్టింది.. అరియానా ఫైటర్, జాలి గుండె అని చెప్తూనే ఆమెను చూస్తుంటే తనను తాను చూసినట్లే ఉందని తెలిపింది. దివి గేమ్‌పై ఫోకస్ పెట్టడం లేదంది. హారికకు బాగా క్లారిటీ ఉందంది. లాస్య నవ్వుతూనే అందరినీ బుట్టలో వేస్తుందని పేర్కొంది. మోనాల్ బిగ్‌బాస్ హౌస్‌లో చాలామందికి ప్రేమించడం నేర్పుతుందని అంది. ప్రతిసారి ఏడవకూడదని సలహా ఇచ్చింది. అబ్బాయిలు ఫీలైనా సరే వాళ్ల గురించి చెప్పనని తేల్చి చెప్పింది. స్వయంవరం మొదటి రౌండ్ గెలిచిన అఖిల్ బిగ్‌బాస్ హౌస్‌లో సమంత స్వయంవరం ప్రకటించింది. ఇది మూడు రౌండ్లు ఉంటుందని తెలిపింది. మొదట వచ్చిన అభిజిత్ సాంగ్ పాడాడు. సోహైల్.. డైలాగులు చెప్తుంటే అరియానా అడ్డుపడింది. నువ్వూ నేను టామ్ అండ్ జెర్రీ అని ఆమెను కూల్ చేసేందుకు ప్రయత్నించి, ఆపై కండలు ప్రదర్శించాడు. అవినాష్.. తనను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నవ్విస్తానని హామీ ఇచ్చినా అమ్మాయిలు పడిపోలేదు. నా భార్యకు నేనే వండిపెడతా, ఏమడిగినే ఇచ్చేస్తానని చెప్పి మెహబూబ్ చొక్కా తీసేసి డ్యాన్స్ చేశాడు. బంగారు కళ్ల బుచ్చొమ్మో.. అంటూ అఖిల్ పాట పాడాడు. అనంతరం అమ్మాయిలందరూ అఖిల్ నచ్చాడని ఏకగ్రీవంగా ప్రకటించారు. దీంతో అతనికి ఓ స్పెషల్ గిఫ్ట్ అంటూ అఖిల్ ఇంటిసభ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు. (చదవండి: మోనాల్ మళ్లీ సేఫ్, దివి ఎలిమినేట్) నీ రూమ్‌లోకి వెళ్లి నీ కోసమే ఆలోచిస్తున్నాం "నిన్ను చాలా మిస్ అవుతున్నాం, నువ్వు ఏడవడం చూసి బాధపడ్డాం. కానీ మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పిన సంఘటన నా జీవితంలోని కష్టాలను పోగొట్టింది. నీ రూమ్‌లోకి వెళ్లి నీకోసమే ఆలోచిస్తున్నాం. అందరితో కలిసి ఉండు, మంచిగా ఆడు, అదే నాకు సంతోషం" అని అఖిల్ అమ్మ మాట్లాడింది. ఇది చూడగానే అఖిల్ కన్నీటిపర్యంతం అయ్యాడు. తర్వాత మోనాల్‌కు ఆమె ఫ్యామిలీ వీడియో చూపించారు. "మేము నిన్ను మిస్ అవుతున్నాం. నువ్వు లేకపోతే ఇల్లు బోసిగా ఉంది. నిన్ను ఏడుస్తూ చూడటం మాకు నచ్చట్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం" అని అమ్మ మాట్లాడిన వీడియో చూసి మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత నోయల్ వంతు వచ్చింది. "చూడు అన్నయ్యా.. నాన్న తొడగొడుతున్నాడు. నువ్వు కాస్త బాధపడినా మేమూ బాధపడతాం. ఆల్ ద బెస్ట్‌రా" అని అతడి తమ్ముడు మాట్లాడాడు. తర్వాత అరియానా సేఫ్ అయినట్లు సమంత వెల్లడించింది. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అవినాష్.. సోహైల్ రిక్వెస్ట్) రెండో రౌండ్లోనూ గెలిచిన అఖిల్ స్వయంవరంలో 'ఎవడు పోటుగాడు' అని రెండో రౌండ్ మొదలైంది. అరియానా బర్త్ ఇయర్ ఎప్పుడు? అన్న ప్రశ్నకు 1993 అని అవినాష్, దివికి ఏది భయం? అన్న ప్రశ్నకు దెయ్యం అని అఖిల్, హారిక ఫేవరెట్ కలర్ బ్లాక్ అని మెహబూబ్ చెప్పాడు. మోనాల్ లక్కీ నంబర్ 2 అని అవినాష్ తప్పు ఆన్సర్ ఇవ్వడంతో అతికష్టం మీద శీర్షాసనం వేయించారు. తన లక్కీ నంబర్ నాలుగు అని మోనాల్ స్పష్టం చేసింది. దివి చెవికమ్మ రంగు బ్లూ అని మరోసారి తప్పులో కాలేయడంతో అవినాస్ ఈ రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఆడవాళ్లు మగవాళ్ల కన్నా ఎక్కువ మాట్లాడతారా? అన్న ప్రశ్నకు అవునని అభిజిత్, ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తాడన్న ప్రశ్నకు అబ్బాయిలు అని అఖిల్ ఆన్సరిచ్చారు. ఒక చీర ఎంత పొడవుంటుందంటే ఆరు అడుగులు అని అఖిల్, ఆడవాళ్లు వాడే బ్లాక్ కలర్లో మూడు మేకప్ ఐటమ్స్‌ను మెహబూబ్ కరెక్ట్‌గా చెప్పాడు. ఈ రౌండ్లో కూడా అఖిలే గెలిచాడు. ఒక్క పాయింట్ కూడా రాని సోహైల్ ఎలిమినేట్ అయ్యాడు. (చదవండి: నరకం చూపించిన ఆ ఇద్దరే బెస్ట్ పర్ఫార్మర్లు) సింగరేణి ముద్దుబిడ్డ మేం బాగున్నాం. "సింగరేణి ముద్దుబిడ్డ.. నీ గ్రాఫ్ పెరుగుతుంది. కథ వేరే ఉంది. మేం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మేం బాగున్నాం. నాన్న మాత్రం చాలా గర్వంగా ఫీల్ అయితుండు. లవ్ యూ అన్నా" అంటూ తమ్ముళ్లు, "నేను చాలా సంతోషంగా ఉన్నా. నువ్వు బాగా ఆడుతున్నావు. గెలిచి రావాలి" అని తండ్రి మాటలను చూపించడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. నాకు బాగోలేనప్పుడు మెహబూబ్, అఖిల్ బాగా చూసుకుంటూ, తినిపించారని సంతోషం వ్యక్తం చేశాడు. తర్వాత అమ్మ రాజశేఖర్ వంతు రాగా "నీ ఆరోగ్యం చూసుకో. టాస్క్‌ల్లో దెబ్బలు తగిలించుకోకు. నీ గుండు అవతారం బాగుంది. లవ్ యూ" అని భార్య, "మిగతావాళ్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావ్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం" అని కొడుకు, కూతురు మాట్లాడిన వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత దివి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "టాస్కులు బాగా ఆడుతున్నావ్. గెలిచి రావాలి. అదే మా కోరిక" అని చెప్పుకొచ్చారు. ఇది చూసి దివి చాలా సంతోషపడింది. షోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎంట్రీ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ షోలోకి వచ్చాడు. స్వయంవరంలో భాగంగా అఖిల్-మోనాల్, అభిజిత్-దివి, అవినాష్-హారిక డ్యాన్స్ చేయగా.. మెహబూబ్ జోడి బాగా చేసిందని అఖిల్ ప్రకటించాడు. తర్వాత మెహబూబ్, అరియానా, అవినాష్ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియోలను చూపించారు. ఇక హీరో అఖిల్ మాట్లాడుతూ.. మా గురించి మర్చిపోయి నాన్న మీ గురించే మాట్లాడుతన్నారని చెప్పుకొచ్చాడు. అనంతరం స్వయంవరంలో మెహబూబ్- అరియానాలను టాప్ జోడీగా ప్రకటిస్తూ స్నేహమాల వేయించి మెహబూబ్‌తో ఆమెకు రింగు తొడిగించాడు. తర్వాత మోనాల్, అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. స్వయంవరంలో టాప్ జోడీగా మెహబూబ్- అరియానా అనంతరం లాస్య భర్త మాట్లాడుతూ.. "ఇంకెప్పుడూ ఏడవకు. నువ్వేడిస్తే ఇక్కడ చాలా మంది ఏడుస్తాం. జున్ను నీకోసం రాసిన లెటర్ చదువుతాను.. అమ్మ.. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను అల్లరి చేస్తున్నాను. నిన్ను టీవీలో చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ ఏడవద్దు. లవ్ యూ అమ్మ" అని చెప్పుకొచ్చారు. జున్నును చూసి లాస్యకు కన్నీళ్లు ఆగలేవు. "హెయిర్ కట్ టాస్క్ చేసినందుకు ఎమోషనల్ అయ్యాం, కానీ టీమ్ కోసం త్యాగం చేయడం చాలా నచ్చింది. బీ సేఫ్. టాస్కులు ఇరగదీసేయ్" అని హారిక అన్నయ్య వీడియో సందేశం ఇచ్చారు. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం అరియానా త్యాగం) మోనాల్ సొంత క్రష్ అనిపిస్తుంది: హైపర్ ఆది తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, డిటెక్టివ్‌గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే కంటెస్టెంట్లపై పంచులు విసిరాడు. అమ్మ రాజశేఖర్‌ను అపరిచితుడితో పోల్చాడు. సోహైల్ అర్జున్‌రెడ్డిలా ఉండేవాడని, ఇప్పుడు స్వాతిముత్యంలా తయారయ్యాడని చెప్పుకొచ్చాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావ్ కాబట్టే టీవీలో ఉన్నావు, లేదంటే టీవీ ముందు ఉండేవాడన్నాడు. మోనాల్‌ను చూస్తుంటే తన సొంత క్రష్‌లా అనిపిస్తుందని ఆది పులిహోర కలిపాడు. తన పేరు కూడా ఏతో మొదలవుతుందని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అనంతరం నోయల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. తర్వాత దివి ఎలిమినేట్ అని ప్రకటించడంతో మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. కిచెన్ వద్దనుకున్న లాస్యపై బిగ్‌బాంబ్ నీ తర్వాతి సినిమాలో దివికి ఓ మంచి పాత్ర ఇవ్వు అంటూ సమంత షోకు విచ్చేసిన కార్తికేయను అభ్యర్థించగా అతడు ఓకే చెప్పాడు. మరి మీతో ఒక సినిమా చేయాలనుంది అని కార్తికేయ మనసులోని మాటను బయటపెట్టగా సామ్ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇక వారం రోజుల పాటు ఒక్కరే వంట చేయాలన్న బిగ్‌బాంబ్‌ను దివి లాస్యపై వేసింది. తనకు అసిస్టెంటుగా లాస్య అభిజిత్‌ను ఎన్నుకుంది. -
బిగ్‌బాస్‌లో స్వయంవరం: విచ్చేసిన హీరో అఖిల్
అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తానన్న నాగార్జునకు ఇప్పుడు అది వీలు కావడం లేదు. 21 రోజులు హిమాలయాల్లో వరుసగా షూటింగ్ జరుపుకోనున్నారు. దీంతో బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా మామ స్థానాన్ని భర్తీ చేసేందుకు సమంత రంగంలోకి దిగారు. తెలుగులో ఆకట్టుకునేలా మాట్లాడుతూ కంటెస్టెంట్లకే కౌంటర్లు విసురుతున్నారు. ఇక దసరా పండ సంబరాలను రెట్టింపు చేసేందుకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరో అఖిల్ కూడా వచ్చేశారు. వీరిద్దరినీ బుట్టలో పడేసేందుకు ఇంటిసభ్యులు నానాతంటాలు పడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్ : ‘ఆ విషయంలో మోనాల్‌దే తప్పు’) డిటెక్టివ్‌గా హైపర్ ఆది తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం సమంత చేతుల మీదుగా హౌస్‌లో స్వయంవరం జరగనుంది. హారిక, అరియానా, దివి, మోనాల్లను మెప్పించేందుకు మేల్ కంటెస్టెంట్లు డ్యాన్సులతో రఫ్ఫాడిస్తూ కండల ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఇక అఖిల్ మాత్రం తన సింగింగ్ ట్యాలెంట్ ప్రదర్శించాడు. వీరి పర్ఫామెన్స్‌ల గురించి హీరో అఖిల్ స్పందిస్తూ అందరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు హీరోహీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కూడా షోకి విచ్చేశారు. ఇక డిటెక్టివ్‌గా హైపర్ ఆది వచ్చి పంచులు వేశాడు. సింగర్ గీతామాధురి కూడా షోలో తన గాత్రమాధుర్యాన్ని వినిపించారు. (చదవండి: మనాలిలో నాగ్: బిగ్‌బాస్‌కు సమంత?) నోయల్ గురువుగా మారాలి: సమంత ఇక అంతకు ముందు రిలీజైన మరో ప్రోమోలో హీరోయిన్ సామ్ ఒక్కొక్కరికి బాగానే పంచులు విసురుతున్నారు. కోపమొచ్చినప్పుడు సోఫా మీద రాసుకోండి అంటూ అవినాష్ మీద సెటైర్ వేశారు. అఖిల్‌ను డ్రెస్ బాగుందంటూనే గుజరాతీ డ్రెస్సా అని అడిగేశారు. ఇక ఎప్పుడూ నాలుగు మంచి మాటలు చెప్తూ ఉండే నోయల్‌ను ఉద్దేశిస్తూ మీరు గురువు అయిపోవాలనుకుంటున్నానని కోరుకున్నారు. అనంతరం కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగులను చూపించడంతో హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. ఎందరో సెలబ్రిటీలను ఒకే స్టేజీ మీదకు తీసకువచ్చి దసరా వినోదాన్ని రెట్టింపు చేస్తూ కన్నుల పండగ చేయనున్న ఈ ఎపిసోడ్ చూడాలంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఓపిక పట్టాల్సిందే. (చదవండి: అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్‌కు అభిజిత్ డైరెక్షన్) -
బాలరాజు.. ‘మల్లిక’ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కనపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి సంబంధించిన పాత్రను పరిచయం చేసింది. లావణ్య ఇందులో ‘ మల్లిక’ పాత్రలో కనిపించనున్నారు. ఫప్ట్ లుక్ పోస్టర్‌ను లావణ్య తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్’ అంటూ కాప్షన్ జత చేశారు. నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్‌లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మాతగా వ్యహరిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. This character is ❤️ https://t.co/YMv5bj1PEk — LAVANYA (@Itslavanya) October 24, 2020 -
బహుమతి దక్కింది
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. జిఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు కావటంతో జిఏ2 చిత్రనిర్మాతలు తమ హీరోని ఏం కావాలో కోరుకోమని సోషల్ మీడియా వేదికగా అడిగారు. దానికి స్పందించిన కార్తికేయ ‘నాకు టీజర్ ఇవ్వండి’ అన్నారు. వెంటనే స్పందించిన దర్శకుడు సర్ప్రైజ్ అంటూ కార్తికేయకు బర్త్‌డే గిఫ్ట్‌గా టీజర్‌ను అందించారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘మా హీరో కార్తికేయ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మా సినిమాలో కనిపిస్తారు. దర్శకుడికి మొదటి సినిమా అయినా చెప్పిన పాయింట్‌ను చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. -
‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్కు విశేష స్పందన
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో అతడు 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి కార్తికేయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ తేజ్, మంచు లక్ష్మీ, అనుప్ రూబెన్స్, ప్రియదర్శి, గీతా అర్ట్స్, బ్రహ్మజీ, లావణ్య త్రిపాఠి వంటి నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు కార్తికేయ తన పుట్టిన రోజుతో పాటు మరో శుభవార్తను అభిమానులకు అందించారు. (ఎన్ఐఏ ఆఫీసర్) కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. హీరో కార్తికేయ పోషించిన ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో కార్తికేయ గెటప్, యాస, డైలాగ్ డెలవరి బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే దీనిని చూస్తుంటే కార్తికేయ గత చిత్రాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా వుండబోతుందని అర్థమవుతోంది. (మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి) ఈ సినిమాను అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మాతగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 21న కార్తికేయ బర్త్‌డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ వారు కార్తికేయ ని ఏం వరం కావాలో కోరుకోమని సెప్టెంబర్ 17న అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజర్ విడుదల చేయమని అడిగాడు. దీంతో వెంటనే దర్శకుడు సర్ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 11.47 నిమిషాలకి విడుదల చేసిన ఈ విడియో చూసిన నెటిజన్లు నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. -
ఎన్ఐఏ ఆఫీసర్
కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలను వెల్లడించారు. శ్రీ సరిపల్లి, 88 రామారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్‌గా కనిపిస్తారు. కథ వినగానే నటించేందుకు ఒప్పుకున్నారాయన’’ అన్నారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి, సుధాకర్ కోమాకుల, పశుపతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: పి.సి. మౌళి. -
రాఖీ పౌర్ణమి స్పెషల్
తోబుట్టువుల పండగ రాఖీ. ఏడాదంతా ఎంత ఆటపట్టించుకున్నా, మనిద్దరం ఒకటే జట్టు అన్న శాంతి ఒప్పందమే రాఖీ. వీళ్లకు చిన్నప్పటి గొడవలే ప్రస్తుత జ్ఞాపకాలు. నేనున్నా అని ఒకరికొకరు చెప్పుకునే భరోసాయే రాఖీ. మా అన్నయ్య బెస్ట్ అని సూపర్ సిస్టర్ ప్రసీద, మా సిస్టర్ సూపర్ అని హ్యాండ్సమ్ బ్రదర్ అమన్, మా అక్క బంగారు తల్లి అంటూ సిక్స్‌ప్యాక్ కార్తికేయ వాళ్ల రాఖీ బంధం గురించి ఇలా చెప్పారు. అన్నయ్య చిన్నప్పటి నుంచే బాహుబలి – సాయిప్రసీద తండ్రి కృష్ణంరాజు, అన్నయ్య ప్రభాస్‌తో సాయిప్రసీద ► నేను ప్రస్తుతం ప్రభాస్ అన్నయ్య (సాయిప్రసీదకు ప్రభాస్ కజిన్ బ్రదర్) హీరోగా చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి గోపీకృష్ణ మూవీస్ తరపున నిర్మాతగా చేస్తున్నాను. తెలుగు వెర్షన్‌కు యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లతో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ► ప్రభాస్ అన్నయ్య అనగానే నాకు బెస్ట్‌ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు. ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే.. అన్ని విషయాలు షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్ నాకు. నా కెరీర్‌కి ఆయనే మెంటర్. రాఖీ పండగ రోజున నేను, చెల్లెళ్లు కలసి అన్నయ్యతో టైమ్ స్పెండ్ చేస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఈరోజు (సోమవారం) తప్పనిసరిగా ప్రభాస్ అన్నయ్యను కలుస్తాం. ► మా ఫ్యామిలీ అంతా ఫుడ్ లవర్సే. మేము అన్నయ్య దగ్గరికెళ్లగానే ౖహె దరాబాద్‌లో ఉన్న బెస్ట్ ఫుడ్ తెప్పిస్తారు (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి రాఖీ పండగరోజు అన్నయ్య మాకు బెస్ట్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ప్రతి ఏడాది లేటెస్ట్ ట్రెండ్‌లో ఏది ఉంటే అది మా ముందుండేది. అన్నీ బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఇప్పుడంటే అన్నయ్య ‘బాహుబలి’ అయ్యారు కానీ, మాకు మాత్రం చిన్నప్పటి నుంచే ‘బాహుబలి’. ► మొదట్లో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. వ్యాపారం చేద్దామనుకుని లండన్‌లో బిజినెస్ కోర్స్ చదివాను. ఆ కోర్స్ చివరిలో ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది.. అప్పుడు నేను ప్రొడక్షన్ చేశాను. మొదట్లో సినిమా వ్యాపారం ఎందుకు? ఇది రిస్కీ బిజినెస్ కదా? అనుకున్నాను. లండన్‌లో ప్రాజెక్ట్ తర్వాత నాకు నమ్మకం పెరిగింది. తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు అని అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రొడక్షన్లో ఏడాది కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ జరుగుతుండగానే ‘రాధేశ్యామ్’ కి పనిచేస్తున్నా. ► ప్రొడక్షన్ విషయంలో అన్నయ్య నాకు చాలా సహాయం చేస్తున్నారు. ‘ప్రొడక్షన్లోకి రావటానికి నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆసక్తి ఉంటే నాకు తెలిసినదంతా నీకు నేర్పిస్తాను. కంగారు పడాల్సిన పనేంలేదు, నీకు నేనున్నాను’ అంటూ చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు నాన్నకి, అన్నయ్యకి చెప్పి ప్రొడక్షన్లోకి వచ్చాను. ఇద్దరక్కలు నాకుఅమ్మలాంటివాళ్లు – అమన్ లక్ష్మీమంచు, రకుల్‌ప్రీత్ సింగ్‌తో అమన్ ► రాఖీ పండగ వస్తోందంటే అక్క (రకుల్‌ప్రీత్‌సింగ్)కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి ఖరీదైన వస్తువులు ఇచ్చేవాణ్ని కాదు. కానీ, నేను ఏమిచ్చినా చాలా సంతోషంగా తీసుకుంటుంది అక్క. ► గతేడాది మాత్రం ‘బర్బరీ’ బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్ కొనిచ్చాను. తను చాలా ఆనందపడింది. ఈ రాఖీకి నేను హీరోగా నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమా విడుదలవుతుందేమో అనుకున్నాను. నేను నటునిగా కావడమే ఈ ఏడాది అక్కకి ఇచ్చే బహుమతి అని చెబుదాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల మా సినిమా విడుదల కాలేదు. 180 థియేటర్లలో సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత లాక్డౌన్ వచ్చింది. అందుకే, ఈ రాఖీ పండక్కి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ► రాఖీ కట్టించుకున్న తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను.. అది ఇచ్చిన తర్వాత అక్కతో కలిసి సినిమా చూస్తాను. లక్ష్మీమంచును కూడా నేను అక్కలానే భావిస్తాను. ఆమెతో కూడా రాఖీ కట్టించుకుంటాను. ఈ ఇద్దరక్కలు నా లైఫ్‌లో అమ్మలాంటివాళ్లు. త్వరలోనే నా సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. ఏ నిర్ణయం అయినా అక్కదే! – కార్తికేయ అక్క శుక్లతో కార్తికేయ ► మా అక్క శుక్లా అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడు ఆమె వస్తువులు ఎవరన్నా ముట్టుకుంటే చాలా కోప్పడేది. తన వస్తువుల్ని నేను పనికిరాకుండా చేసి, నాకు తెలియదు అనేవాణ్ణి. ఇద్దరం ఫుల్‌గా ఫైట్ చేసేవాళ్లం. కానీ, రాఖీ పండగకి మాత్రం మంచి బహుమతులు ఇచ్చేవాణ్ని. ► అక్క, నేను ఇద్దరం కలసి చిన్నప్పటి నుండి సినిమాలు చూసేవాళ్లం. సినిమా చూసిన తర్వాత దాని గురించి చర్చించుకోవడంతో పాటు హీరోల గురించి మాట్లాడుకునేవాళ్లం. చిన్నప్పటి నుండి అక్క డ్యాన్స్ బాగా చేసేది. నేను కూడా తన దగ్గర డ్యాన్స్ నేర్చుకునేవాణ్ని. ► నాకు సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా అక్కే ఫైనలైజ్ చేసేది. ఉదాహరణకు.. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా.. ఇప్పుడు ఏదన్నా సినిమా ఫైనలైజ్ చేయాలన్నా అక్కతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. తర్వాతి అడుగు ఎలా వేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అక్క, నేను మాట్లాడుకుంటుంటాం. ► నా మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైనప్పుడు అక్క అమెరికాలోనే ఉంది. తనకి పాప పుడితే అన్నప్రాసనకు నేను వెళ్లాను. అక్కడ ఓ భారతీయ సూపర్ మార్కెట్‌కి వెళితే కొంతమంది నన్ను గుర్తుపట్టి ఫొటోలు దిగారు. అది చూసి మా అక్క సర్ప్రైజ్ అయింది. నాకు బాగా సంతోషంగా అనిపించింది. ► గత ఏడాది అక్క ఇండియాలో ఉన్నప్పుడే నేను నటించిన ‘గుణ 369’ విడుదలైంది.. ఇద్దరం కలిసి చూశాం. ఆ సినిమా విడుదలైన టైమ్‌లో రాఖీ పండగ రావటం, అక్క ఇండియాలో ఉండటం.. ఇలా అన్నీ హ్యాపీ మూమెంట్స్ అదే రోజు జరిగాయి. ఆ సినిమా క్లైమాక్స్‌లో నా నటన చూసి నన్ను పట్టుకొని ఏడ్చింది.. చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పింది. ‘నాకు జీవితంలో ఇంతకంటే ఏం కావాలి’ అని ఆ క్షణం అనిపించింది. -
మాస్క్ ధరించడం వీరుడి లక్షణం
‘‘మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి. వీలైనన్ని సార్లు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోండి. సాంఘిక దూరాన్ని పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలా మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్’’ అంటున్నారు నటుడు చిరంజీవి. కరోనా వైరస్‌పై ప్రజలను మరింత చైతన్యపరిచేందుకు హీరోలు చిరంజీవి, కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బాలు కలిసి రెండు వీడియోలను విడుదల చేశారు. ఒక వీడియోలో మీసం మెలేస్తుంటారు కార్తికేయ. అప్పుడు చిరంజీవి... ‘‘మీసం మెలేయడం వీరత్వమే. కానీ అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం వీరుడి లక్షణం’’ అని తనదైన స్టయిల్లో అంటే, ‘ఓకే బాస్’ అంటూ మాస్క్‌ను ధరిస్తారు కార్తికేయ. మరో వీడియోలో లిప్‌స్టిక్ వేసుకుంటుంటారు ఈషా రెబ్బా. అప్పుడు చిరంజీవి ‘‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే ముఖానికి మాస్క్ ధరించడం ఎంతో అవసరం’’ అంటారు. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి ఈ వీడియోలో నటించారు. ‘‘ఆలోచనను పంచుకోగానే ముందుకు వచ్చిన కార్తికేయ, ఈషా రెబ్బా, చేతన్ భరద్వాజ్‌లకు ధన్యవాదాలు. మీకు ఉన్న సామాజిక స్పృహ అభినందనీయం’’ అని పేర్కొన్నారు చిరంజీవి. ‘‘ఓ మంచి కారణం కోసం చిరంజీవిగారితో కలిసి వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా నాకు ఇంత కిక్ రాదు. నాకిది లైఫ్ టైమ్ మెమొరీ’’ అన్నారు కార్తికేయ. -
చిరునవ్వు కలకాలం నిలవాలంటే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్.. అంటూ ట్విటర్లో ఒక వీడియోను ట్వీట్ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటున్న చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందామంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ ఈషా రెబ్బా, కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చదవండి : ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన బన్నీ Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 @WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please! pic.twitter.com/vOTwX3UZPk — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 -
‘చావుకబురు చల్లగా’ వర్కింగ్ స్టిల్స్
-
చావు కబురు చల్లగా
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించనున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ మనమరాలు బేబి అన్విత క్లాప్ ఇచ్చింది. ఈ సన్నివేశానికి అల్లు అరవింద్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: సునీల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవ కరుటూరి. -
సీక్వెల్లో
నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’. లేటెస్ట్గా ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది. మొదటి భాగంలో స్వాతి, నిఖిల్ జంటగా నటించారు. తాజా సీక్వెల్లో అనుపమా పమేశ్వరన్ కూడా నటిస్తారని తెలిసింది. ‘కార్తికేయ 2’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కనిపించిన స్వాతి ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారట. అనుపమ పాత్ర కొత్త జాయిన్ అవుతుందని తెలిసింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, సీక్వెల్ అక్కడి నుంచి ప్రారంభం కానుంది. గతంలో చందు మొండేటి ‘ప్రేమమ్’లో అనుపమ ఓ హీరోయిన్గా నటించారు. -
బాలరాజు కబుర్లు
‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్నారు బస్తీ బాలరాజు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో బస్తీ బాలరాజు అనే పాత్రలో నటించబోతున్నారు కార్తికేయ. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్ రెడ్డి సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ‘‘ఓ కొత్త అంశంతో ప్రేక్షకులను అలరిస్తాం. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సేఫ్ జానర్లో వెళ్లాలనుకోను
‘‘విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయడానికి ఇష్టపడతా. సేఫ్ జానర్ అంటూ ఒకే రకమైన పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఎలాంటి పాత్రౖకైనా కార్తికేయ నటుడిగా న్యాయం చేయగలడు అని రచయితలు నమ్మాలన్నదే నా లక్ష్యం ’’ అన్నారు కార్తికేయ. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘90ఎమ్ఎల్’. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజైంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి రివ్యూలోనూ కార్తికేయ పెర్ఫార్మెన్స్ బాగుందంటున్నారు. సోషల్ మీడియాలోనూ సినిమా గురించి పాజిటివ్ కామెంట్సే కనిపిస్తున్నాయి. విడుదల రోజు రెండు థియేటర్స్‌కు వెళ్లాను. అక్కడ ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం చూశాక చాలా హ్యాపీ ఫీలయ్యాను. థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ లాజిక్‌లు గురించి ఆలోచించకుండా నవ్వుకోవాలనుకుని ఈ సినిమా తీశాం. అందులో సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాం. ► ‘90 ఎమ్ఎల్’ అని టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారనుకోవడం లేదు. టైటిల్ ఆసక్తిగా ఉంటుందని సినిమా చూస్తారనుకున్నాం. అలాగే చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100, హిప్పి, గుణ 369 చితాల్లో నాకు పెద్దగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. అది ఈ చిత్రంతో కుదిరింది. చిన్న సెన్సార్ సమస్య వల్ల సినిమా ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. సినిమాలో ఆల్కహాల్ బ్రాండ్ పేర్లు చెప్పాల్సిన సన్నివేశాల్లోని పదాలను బీప్ చేశాం. ఎటువంటి అసభ్యకరమైన పదజాలం సినిమాలో లేదు. ► నాకు కథ నచ్చే సినిమాను స్టార్ట్ చేస్తా. నా జడ్జ్మెంట్ అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేíషించుకుంటాను. నేను ఎంపిక చేసుకున్న కథలతో తెరకెక్కిన సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా నా ఎంపికల్లో ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంటుంది. ► ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’లో నేను చేసిన విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. మరిన్ని విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ అవి నన్ను ఎగ్జైట్ చేసేలా ఉండాలి. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నా. -
90 ఎంఎల్ ఆరోగ్యకరమైన కిక్ ఇస్తుంది
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మా అమ్మానాన్న, బాబాయ్ మరోసారి నన్ను సపోర్ట్ చేశారు. వాళ్లే నా బ్యాక్‌గ్రౌండ్. ‘ఆర్ఎక్స్ 100’ తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాం, ఈ సినిమాతో మూడింతల లాభాలు అందుకుంటాం’’ అన్నారు కార్తికేయ. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాలు చూసి హీరో అవ్వాలనుకున్నాను. నా దృష్టిలో చిరంజీవి, మహేశ్‌బాబు నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఈ సినిమాకోసం శేఖర్ చాలా కష్టపడ్డాడు. హీరోగా, విలన్‌గా చేసినా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా ‘90 ఎంఎల్’ కాదు. 900 ఎంఎల్ కిక్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన కిక్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ సాధించాలి. కార్తికేయతో మరో సినిమా చేస్తాను’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి. ‘‘కార్తికేయ చాలా కష్టపడతాడు’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ‘‘ఈ సినిమాతో కార్తికేయ ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్లాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ‘‘ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా నిలబడిన కార్తికేయగారికి థ్యాంక్స్’’ అన్నారు శేఖర్ రెడ్డి. ‘‘కార్తికేయతో ఇంకో సినిమా చేయాలనుంది’’ అన్నారు నేహా సోలంకి. -
‘90 ఎంఎల్’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్, కార్తీకేయతో కలిసి చిందులేశారు. 90 ఎంఎల్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు సందీప్, కార్తికేయ ఫుల్ జోషుగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. -
పాట ఎక్కడికీ పోదు
‘‘ఏదైనా చక్కటి పాట విన్నప్పుడు దాన్ని ప్రేరణగా తీసుకొని మనదైన స్టయిల్లో ఒక కొత్త ట్యూన్‌ని సిద్ధం చేసుకోవడాన్ని కాపీ కొట్టడం అని అనుకోను. ఒకవేళ మక్కీకి మక్కీ దించేస్తే కాపీయే అంటారు. నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. కొట్టను కూడా’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నేను మందు తాగను. కానీ శేఖర్ రెడ్డి ‘90 ఎం.ఎల్’ చిత్రకథను చెప్పినప్పుడు మందు తాగినంత కిక్ ఎక్కింది. ఎంత బాగా కథ చెప్పాడో అంతే బాగా చిత్రీకరించాడు కూడా. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో ఆరు పాటలుంటాయి. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ మాస్ సాంగ్స్‌కి కార్తికేయ వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ► నా హిట్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా మెలోడీలు ఉండటంతో మాస్ సినిమాలకు పనిచేసే అవకాశం పెద్దగా రాలేదు అనుకుంటున్నాను. సంగీతం సమకూర్చేప్పుడు సినిమా పెద్దదా, చిన్నదా అనేది పట్టించుకోను. కథానుసారంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. స్టార్ హీరోలతో పని చేసేప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. మనం మంచి మ్యూజిక్ ఇచ్చినా కొన్నిసార్లు సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అప్పుడు మన శ్రమ వృథా అవుతుంది. ఆ సమయంలో కొంచెం బాధపడతాను. ► ఈ మధ్య కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్సయ్యాయి. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు కాబట్టి బాధపడను. ► కొత్త సంగీతం వస్తోంది. ప్రేక్షకులు మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలు ఉంటే థియేటర్స్‌కు వస్తున్నారు. మరోవైపు కార్తీ నటించిన ‘ఖైదీ’ లాంటి సినిమా చూసి ‘భవిష్యత్తులో పాటలు లేని సినిమాలే ఉంటే సంగీత దర్శకులకు దెబ్బే’ అని కొందరు అంటున్నారు. భారతీయ సినిమాల్లో నుంచి పాట ఎక్కడికీ పోదు. పాట లేని సినిమా అయినా నేపథ్య సంగీతం కావాలి. అదీ సంగీతదర్శకుడి పనే. మన సినిమాల్లో పాటలు పక్కా ఉండాలని ఓ సందర్భంలో షారుక్ ఖానే అన్నారు. ► ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. -
ఇది తాగుబోతుల సినిమా కాదు
‘‘కొందరు ప్రేక్షకులకు కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయి. మరికొందరికి యాక్షన్, ఇంకొందరికి థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ జానర్ ఆడియన్స్ ఉంటారు. అన్ని రకాల పేక్షకులను సంతృప్తిపరచేలా సినిమా తీయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో నా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శేఖర్‌రెడ్డి. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శేఖర్ చెప్పిన విశేషాలు. ► నేను నల్గొండ జిల్లా లింగరాజుపల్లిలో పుట్టాను.. హైదరాబాద్‌లో పెరిగాను. ఆసక్తితో సినిమా రంగంవైపు వచ్చాను. చంద్రమహేశ్‌గారి దగ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. కొన్ని సినిమాలకు రచయితగా కూడా ఉన్నాను. నాలో డైరెక్షన్, రైటింగ్ ఇలా రెండు స్కిల్స్ ఉన్నాయి. ► ‘90ఎంఎల్’ దర్శకునిగా నా తొలి సినిమా. టైటిల్ వినగానే ఇది లిక్కర్ నేపథ్యంలో సాగే చిత్రం అని కొందరు ఊహించుకుంటారు. కానే కాదు. ఇది తాగుబోతుల సినిమా కాదు. భావోద్వేగ అంశాలకు వాణిజ్యపరమైన అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం. మంచి వినోదాత్మకంగా ఉంటుంది. ► తన పిల్లాడికి పాలు ఇవ్వాల్సిన తల్లికి.. లిక్కర్ ఇవ్వాల్సి వస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో సినిమాలో చూపించాం. అంతేకానీ మందు సీన్లు పెట్టలేదు. మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలను తెరకెక్కించలేదు. ► మందు తాగకపోతే బతకలేని ఓ డిజార్డర్ ఉన్న వ్యక్తి దేవదాసు పాత్రలో కార్తికేయ నటించారు. అసలు లిక్కర్ వాసన అంటేనే పడని ఓ కుటుంబంలోని అమ్మాయితో దేవదాసు ప్రేమలో పడతాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► తమిళంలో మా సినిమా టైటిల్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు, మా సినిమాకు ఏ సంబంధం లేదు. అలాగే మా ‘90 ఎంఎల్’ చిత్రంపై ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ప్రభావం పడదు. టైటిల్ వల్ల మా సినిమాకు ప్రేక్షకులు దూరంగా ఉంటారు అంటే నేను కాదనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ షో పడగానే కథ, సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ► నిర్మాత అశోక్రెడ్డిగారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
‘90 ఎంఎల్’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
సినిమా నా కల: హీరో కార్తికేయ
సాక్షి, ఒంగోలు మెట్రో: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న నవతరం హీరో కార్తికేయ శనివారం ఒంగోలులో సందడి చేశారు. ఆ సినిమాతో యూత్ మదిలో నిలిచిపోయిన ఆయన కొత్త దర్శకుడు శేఖరరెడ్డితో తీసిన ‘90ఎం.ఎల్’ సినిమా ప్రమోషనింగ్ వర్క్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఒంగోలు నాగార్జున డిగ్రీ కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా తొలుత కాలేజీ సెక్రటరీ వి.రాంప్రసాద్, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మిలు సినీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన 90 ఎం.ఎల్ సినిమా హీరోయిన్ నేహాతో కలిసి విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్టాడారు. సినిమా తనకొక మధురమైన కల అని, దానిని ఆస్వాదిస్తున్నానన్నారు. సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతుందని, టైటిల్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అనూప్ రూబెన్స్ పాటలకు చిందేసి ఆడాల్సిందేంటూ కితాబిచ్చారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు సరదాగా డ్యాన్స్ చేశారు. కార్యక్రమానికి సంచాలకులుగా వైస్ ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి, తెలుగు లెక్చరర్ డాక్టర్ నూనె అంకమ్మరావులు వ్యవహరించగా, సినీ బృందం, పలువురు లెక్చరర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీగాయత్రి కళాశాలలో.. కందుకూరు రూరల్: డిసెంబర్ 5వ తేదీ విడుదల కానున్న 90ఎంఎల్ సినీమా ఆదరించాలని హీరో కార్తికేయ, హిరోయిన్ నెహ అన్నారు. స్థానిక శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాంగ్ లీడర్ సినీమాలో విలన్ పాత్ర చేశానని చెప్పారు. గతంలో కందుకూరుకు వచ్చినట్లు చెప్పారు. వీరి వెంట కళాశాల కరస్పాండెంట్ సీహెచ్ రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు. -
‘ఇది నేను నిర్మిస్తున్న రెండో చిత్రం’
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ‘90 ఎంఎల్’ సినిమా హీరో, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ బుధవారం ఖమ్మం నగరంలో సందడి చేశాడు. తాను నటించిన ‘90 ఎంఎల్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తికేయ వేదికపై పాటలు పాడి అలరించాడు. అలాగే తన చిత్రాల్లోని డైలాగ్‌లు చెప్పి విద్యార్థుల్లో జోష్ నింపాడు. అమ్మాయిలు నృత్యాలు చేస్తూ, హీరోతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ‘90 ఎంఎల్’ సినిమాపై కార్తికేయ ముచ్చటించాడు. ఇది తాను నటించిన 5వ చిత్రమని, తాము నిర్మిస్తున్న రెండో సినిమా అని తెలిపారు. హీరోతో కరచాలనం చేస్తున్న విద్యార్థినులు అలాగే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనకు వచ్చిన పేరు మరోసారి ‘90 ఎంఎల్’తో వస్తుందన్నాడు హీరో కార్తికేయ. 90 ఎంఎల్ సినిమాకి సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశామని, పాటలు బాగా వచ్చాయని, అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంకు తాను రావడం ఇది మూడోసారని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ రవికుల నారాయణ ప్రసాద్, శ్రీచైతన్య జూయనియర్ కళాశాలల ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, జి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వులు పంచే 90 ఎం.ఎల్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘90.ఎంఎల్’ టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో వాణిజ్య అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇటీవల అజర్బైజాన్లో మూడు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ లో కార్తికేయను చూడగానే ‘90 ఎంఎల్’ కథకి కరెక్టుగా సరిపోతాడనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా కార్తికేయకు ఈ పాత్ర కరెక్టుగా సరిపోయిందని అంటారు. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది. అజర్బైజాన్లో చిత్రీకరించిన మూడు పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి ఎర్ర. రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్. -
సికింద్రాబాద్‌లో కార్తీకేయ, నిధీ అగర్వాల్ సందడి
-
‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయి ఈ యంగ్ హీరో ఇప్పుడు హీరోగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 నిర్మాతలు తెరకెక్కించిన 90 ఎంఎల్ సినిమాలో దేవదాసు పాత్రలో అలరించనున్నాడు. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. పూటకో 90 తాగే కేర్‌లేస్ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తుండగా రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
దేవదాస్.. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్
దేవదాస్ అంటే మనకు గుర్తొచ్చేది ‘చెలియ లేదు చెలిమి లేదు’ అంటూ ప్రేయసికి దూరమై, మద్యానికి బానిస అయిన ఏయన్నార్. ‘దేవదాస్’ సినిమాలో ఆయన అంత అద్భుతంగా నటించారు. ఇప్పుడు మనం మరో దేవదాస్‌ని చూడబోతున్నాం. ఈ దేవదాస్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. సినిమా పేరు ‘90 ఎం.ఎల్’. కార్తికేయ హీరోగా రూపొందుతున్న చిత్రం ఇది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడు. శనివారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్. గోల్డ్ మెడలిస్ట్ అయిన దేవదాస్ ‘ఆథరైజ్డ్ డ్రింకర్’గా పాపులర్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు శేఖర్ రెడ్డి. అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ – ‘‘కామన్ మేన్‌కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కాన్సెప్ట్ ఉంటుంది. అక్టోబర్ 7కి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటలను యూరప్‌లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. -
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
-
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘నాని గ్యాంగ్ లీడర్’ జానర్ : కామెడీ రివేంజ్ డ్రామా నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ తెలుగులో ఇష్క్, మనం లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను గ్యాంగ్ లీడర్ అందుకున్నాడా.? ఇటీవల కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వచ్చాడా..? హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించాడా..? కథ : ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్, ఈ రియల్ రివేంజ్ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ దేవ్ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు: నాని నటనకు వంక పెట్టడానికి లేదు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా కార్తికేయ మెప్పించాడు. సినిమా అంతా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్మోహన్ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అనీష్ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : నాని లాంటి నటుడు విక్రమ్ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంతో విక్రమ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. విక్రమ్ సినిమా నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాలో లేకపోవటం నిరాశకలిగించే అంశమే. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో రాను రాను సినిమా బోరింగ్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. దర్శకుడిగా తడబడినా రైటర్‌గా మాత్రం విక్రమ్ కె కుమార్ మెప్పించాడు. కామెడీ, డైలాగ్స్ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్. మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : నాని నటన కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగే కథనం విక్రమ్ కె కుమార్ మార్క్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
‘గ్యాంగ్ లీడర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
90 ఎంఎల్ కహానీ ఏంటి?
‘90 ఎంఎల్’ ఈ కొలమానం మందుబాబులకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ‘90 ఎంఎల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాన్ని నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేహా సోలంకి కథానాయిక. ‘90 ఎంఎల్’ సినిమా గురించి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీలో గుర్తింపు, గౌరవం ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ కలె„ý న్లు ఎలా ఉంటాయో ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా తెలిసింది. ఆ సినిమాతో కార్తికేయకు మంచి బ్రేక్ వచ్చింది. ‘90 ఎంఎల్’ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనే విషయం సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే బావుంటుంది. 2 పాటలు, కొంత టాకీ, క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు శేఖర్‌రెడ్డి. -
నేను మా గల్లీ గ్యాంగ్లీడర్ని
‘‘సాధారణంగా రివెంజ్ డ్రామా సినిమాలు సీరియస్ మోడ్‌లో నడుస్తుంటాయి. ‘గ్యాంగ్‌లీడర్’ మాత్రం సరదా యాంగిల్లో సాగుతుంది. విక్రమ్ నాకు కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో థియేటర్లో ప్రేక్షకులు కూడా అలానే నవ్వితే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ రిలీజ్ కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► విక్రమ్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటూ ఉన్నాం. ఒకరోజు ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ఐడియా చెప్పాడు. విన్న వెంటనే ఓకే అన్నాను. అప్పటికి ‘జెర్సీ’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘జెర్సీ’ పూర్తయ్యేసరికి ‘గ్యాంగ్‌లీడర్’ ప్రీ–పొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. వెంటనే షూట్ స్టార్ చేశాం. విక్రమ్ గత సినిమాలు ‘మనం, 24’లాగా ఈ సినిమా క్లిష్టంగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘జెర్సీ’ చాలా ఎమోషనల్ సినిమా. మానసికంగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. గ్యాంగ్‌లీడర్ చాలా సరదా సినిమా. నవ్వించడం, ఏడిపించడం, దేని కష్టం దానిదే. ఎంత నిజాయితీగా చేస్తాం అన్నదాని మీద ఉంటుంది. ► ఇందులో నేను ‘పెన్సిల్ పార్థసారథి’ అనే ప్రతీకార కథలు రాసే రచయితగా నటించాను. వాడో పెద్ద పాపులర్ రచయిత అని పార్థసారథిగాడి ఫీలింగ్. వాడు రాసిన పుస్తకాలని ఎవడూ కొనడని ఆ పుస్తకాల పబ్లిషర్‌కి కూడా తెలుసు. విలన్ మీద పగ తీర్చుకోవడానికి ఓ ఐదుగురు స్త్రీలు వీడి దగ్గరకు వస్తారు. వాళ్లతో కలసి పగ తీర్చుకుంటూ తన 29వ నవల రాస్తాడు పార్థసారథి. అదే వాడు రాసిన తొలి ఒరిజినల్ కథ. ► ఇందులో విలన్ పాత్రకు నలుగురైదుగురు హీరోల పేర్లు అనుకున్నాం. మొదట అడిగింది కార్తికేయానే. కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాడు. దాంతో రెండో వాళ్లను అడగాల్సిన పని లేకుండా పోయింది. ► కృష్ణవంశీగారి సినిమాల్లో లక్ష్మీగారు భలే ఉంటారనుకున్నాను. ఆయన ఆవిడను భలే చూపించారనిపించేది. ఆవిడతో పని చేశాకే తెలిసింది.. ఆవిడ అలానే ఉంటారని. కృష్ణవంశీగారి క్రెడిట్ కాస్త తగ్గింది. (నవ్వుతూ). ► విక్రమ్ సినిమాల్లో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇదే. తొందర గా పూర్తి చేస్తే ఇంత కిక్ వస్తుందా? నా కళ్లు తెరిపించావు అన్నాడు విక్రమ్ (నవ్వుతూ). ‘జెర్సీ’ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఈ టైటిల్ చెప్పడానికి వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’ అని చెప్ప గానే ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత ‘గ్యాం గ్లీడర్’ టైటిల్‌తో ఏర్పడ్డ చిన్న కన్ఫ్యూజన్ వల్ల ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ గా మార్చాం. ఒకవేళ మాస్ సినిమా చేస్తే భయపడుతూ, వణికిపోతూ ఉండాలి. కానీ ఈ ‘గ్యాంగ్‌లీడర్’ జానర్ వేరే. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పేరుని మా అబ్బాయికి పెట్టాను అనుకుందాం. అప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అని ఆలోచిస్తానా? లేదు కదా. ఇష్టంతో, ప్రేమతో పెట్టుకున్న టైటిల్ ఇది. టైటిల్ పెట్టాం కదా అని ఆ సినిమా గుర్తుగా ఓ షాట్ పెట్టాం. సినిమా ఫుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇది ఏ సినిమాకు రీమేక్, కాపీ కూడా కాదు. ► స్కూల్ రోజుల్లో రిజర్వ్›్డగా ఉండేవాణ్ణి. మార్కులు వస్తే ధైర్యంగా ఉంటుంది. అందుకే సైలెంట్‌గా ఉండేవాణ్ణేమో (నవ్వుతూ). అయితే మా గల్లీలో నేనే గ్యాంగ్‌లీడర్. అందరూ నాకంటే చిన్నోళ్లు ఉండేవారు. అక్కడ రెచ్చిపోయేవాణ్ణి. ► నేను కేవలం యాక్టర్‌ని. కమర్షియల్ సినిమాలో చూస్తే కమర్షియల్ యాక్టర్లా, ‘జెర్సీ’లాంటి సినిమాలో చూస్తే జస్ట్ యాక్టర్‌గానే కనిపిస్తాను. మీరు ఎలా చూస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.. అంతే. ‘సక్సెస్ రేట్’ అనే విషయాన్ని నేను నమ్మడం మానేశాను. పది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా ‘నానీ కష్టాల్లో’ ఉన్నాడు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతి సినిమా ముఖ్యమే. సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఈ సినిమా ఆడుతుందా? ఆడదా అని లెక్కలు వేసుకోవడం మానేశా. నచ్చింది చేస్తున్నాను. ► కథ కచ్చితంగా చెప్పాల్సింది అయితేనే ద్విభాషా చిత్రం చేస్తాను. గతంలో అలా చేసే చాలా సమయం వృ«థా అయింది. బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనలు లేవు. వెళ్లినా నన్ను తరిమేస్తారు. అది నాకు తెలుసు (నవ్వుతూ). ► మా నిర్మాణంలో చేసిన ‘అ!’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. త్వరలోనే కొత్త సినిమా ప్రకటిస్తాం. ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాను. ► ‘జెర్సీ’ సక్సెస్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడుపోతున్న అంశాలేవీ లేకుండా ఈ సినిమా చేశాం. అది 30 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతోంది. దాన్ని ‘సరిగ్గా ఆడలేదు’ అని ఎలా అంటాం? ‘ఎంసీఏ’ అప్పుడు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ‘డబ్బులు సరేగానీ మంచి సినిమాలు చేయడా?’ అన్నారు. ‘జెర్సీ’ అప్పుడు ‘మంచి సినిమాలు సరే, కలెక్షన్లలో ‘ఎంసీఏ’ని కొడుతుందా లేదా?’ అంటారు. ‘జెర్సీ’కి 400 శాతం డబ్బులు వచ్చినట్టు. ► నాకు సినిమా చూడటం బాగా ఇష్టం. కేవలం ప్రేక్షకుడిలానే చూస్తాను. నేను యాక్టర్ కానప్పుడు నాలో ఉన్న ప్రేక్షకుడికి ఆ కాలం సినిమాలు నచ్చాయి. యాక్టర్‌గా మారిన తర్వాత నాలో ఉన్న ప్రేక్షకుడికి ఇప్పటి సినిమాలు నచ్చుతున్నాయి. ప్రేక్షక్షకుడు మారితే నేను మారినట్టే. నా సినిమాలు తప్పితే అన్ని సినిమాలను ప్రేక్షకుడిలానే చూస్తాను. ► నటుడిగా 11 ఏళ్లు అంటే చాలా ఎక్కువ ప్రయణమే అనిపిస్తోంది. నాకు మాత్రం ఎలా గడిచిపోయిందో అర్థం కావడం లేదు. నాకు పని చేయడమే హాలిడే అన్నట్టు. బ్రేక్ తీసుకుంటే టార్చర్‌గా, ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ వస్తుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు రోజులు ఎలా గడుస్తుంటాయో తెలియదు. పూర్తయ్యాక ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బందే (నవ్వుతూ). -
మాది రివెంజ్ ఎంటర్టైనర్
‘‘రెండు ఐకానిక్ సినిమాల (సాహో, సైరా: నరసింహారెడ్డి చిత్రాలను ఉద్దేశించి) మధ్య వస్తున్నాం. ఆ రెండు సినిమాలకు మా చిత్రానికి రిలీజ్‌ల విషయంలో గ్యాప్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ లేదు. నేను కూడా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని నాని అన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘మంచి పాజిటివ్ ఎనర్జీతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. టీమ్ మెంబర్స్ నా బరువునంత పంచుకున్నారు. లక్ష్మి, శరణ్యగార్లతో నటించడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మాకు ఒక హ్యాపీ ప్రాజెక్ట్. వచ్చే బుధవారం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. సినిమాలో సర్ప్రైజ్లు, నవ్వులు ఉంటాయి. వచ్చే నెల మొదటి వారంలో నేను–అనిరు«ద్ చేసిన ఓ ప్రమోషనల్ సాంగ్ వీడియో రిలీజ్ ప్లాన్ ఉంది. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు ప్రియాంక. చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ మంచి ఐకానిక్ మూవీ. ఆ సినిమా జానర్ వేరు. మా సినిమా రివెంజ్ ఎంటర్టైనర్. ఇందులో దేవ్ అనే విలన్ పాత్రలో కార్తికేయ చాలా బాగా చేశాడు. మైత్రీ నిర్మాతలు సినిమాలను చాలా క్వాలిటీగా తీస్తారు’’ అన్నారు. ‘‘యాక్టర్‌గా నాకు తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఈ సినిమాలోని దేవ్ పాత్ర నాకు ఇచ్చిన నాని, విక్రమ్గార్లకు థ్యాంక్స్. హీరో అవ్వాలనుకునే మాలాంటి వారికి నానిగారు ఒక ప్రేరణ. నా రోల్ భయపెట్టేలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయ. ‘‘ఈ చిత్రం నాకు తెలుగులో తొలి సినిమా. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. మంచి డెబ్యూ మూవీ దొరికింది’’ అన్నారు ప్రియాంక. -
ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు
‘‘గుణ 369’ సినిమా చూసి మా అమ్మ తొలిసారి ఏడవటం చూశాను. ఈ చిత్రం తర్వాత నన్ను చూసి అమ్మ గర్వపడుతోంది. కొందరు మహిళలు నన్ను పట్టుకొని ఏడుస్తుంటే సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది’’ అని హీరో కార్తికేయ అన్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మించిన ఈ సినిమా ఈనెల 2న విడుదలైంది. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో జీవితాంతం గుర్తు పెట్టుకొనే చిత్రం ‘గుణ 369’. నాకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో వంద బ్లాక్ బస్టర్లు ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఇకపై నేను ఎంపిక చేసుకునే సినిమా కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రంతో బాధ్యతగల నటుడిగా పేరొచ్చింది. ఆ పేరు ఎంత ఖర్చుపెట్టినా రాదు. ఇందుకు నిర్మాతలకు థ్యాంక్స్.. దర్శకునికి రుణపడి ఉంటాను’’ అన్నారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ–‘‘గుణ 369’ విడుదల తర్వాత కర్నూలు నుండి వైజాగ్ వరకు టూర్‌కి వెళ్లాం. మంచి సినిమా తీశారు.. హ్యాపీగా ఉన్నామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాను యూత్, మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ అభినందిస్తున్నారు. ఏ దర్శకునికైనా ఇంతకన్నా ఏం కావాలి’’ అన్నారు. ‘‘హన్మకొండలో 9నెలల పసికందు శ్రీహితపై అత్యాచారం, హత్య జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ఆ పాప తల్లిదండ్రులు జగన్, చరితలు ఫోన్ చేసి, ‘గుణ 369’ సినిమా చూసి, ఫోన్ చేశాం అని చెబుతుంటే మంచి సినిమా తీశాం అనే ఫీలింగ్‌తో హాయిగా ఉంది. మా చిత్రాన్ని శ్రీహితకు అంకితమిస్తున్నాం’’ అని ప్రవీణ కడియాల అన్నారు. -
‘గుణ 369’ సక్సెస్‌మీట్
-
గుణ అనే పిలుస్తారు
‘‘హిట్లు, సూపర్హిట్లు, బ్లాక్బస్టర్లు, ఫ్లాప్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే మనకు గౌరవం తెస్తాయి.. మనల్ని చూసే విధానం బాగుంటుంది. అలాంటి పాత్ర చేసే అవకాశం ‘గుణ 369’తో వచ్చింది. ఇక నన్ను ‘ఆర్ఎక్స్ 100’ హీరో అనరు. గుణ అనే పిలుస్తారు’’ అన్నారు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందంæ కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ క్షణం కోసం వేచి చూశా. ఇప్పటివరకూ నన్ను యూత్‌ఫుల్ హీరో, షర్ట్‌లెస్, లిప్‌లాక్స్... అనే కోణంలో చూసేవారు. ఈ సినిమాతో మహిళలు నన్ను ఓన్ చేసుకుంటున్నారు. మహిళల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సింది? అనిపించింది. ఇలాంటి మంచి పాత్ర నాతో చేయించిన అర్జున్‌కి రుణపడి ఉంటా. మా కాంబినేషన్లో మరో సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘గుణ 369’ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది. మంచి విషయాన్ని ఎప్పుడు చెప్పినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాతో మేం కచ్చితంగా హిట్ కొట్టాం’’ అన్నారు ప్రవీణ.. ‘‘మా అబ్బాయి హీరో ఎందుకు అయ్యాడా? అనిపించింది. కానీ ‘గుణ 369’ చూశాక చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు కార్తికేయ తల్లి రజనీ అన్నారు. -
‘గుణ 369’ మూవీ రివ్యూ
-
‘గుణ 369’ మూవీ రివ్యూ
టైటిల్ : గుణ 369 జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్, ఆదిత్య, నరేష్, హేమ సంగీతం : చైతన్ భరద్వాజ దర్శకత్వం : అర్జున్ జంధ్యాల నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కార్తికేయ తరువాత హిప్పీ సినిమాతో అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన మాస్ యాక్షన్ ఫార్ములాను నమ్ముకొని గుణ 369గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆడపిల్లలను వేధించే వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలన్న సందేశాన్ని కమర్షియల్ జానర్లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమా కార్తికేయకు మరో సక్సెస్ అందించిందా..? తొలి ప్రయత్నంలో అర్జున్ జంధ్యాల ఏమేరకు ఆకట్టుకున్నాడు.? కథ : గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా తనని ఇష్టపడుతుంది. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు.? అసలు రాధను హత్య చేసింది ఎవరు? వాళ్లను గుణ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : యాంగ్రీ యంగ్‌మేన్‌గా కార్తికేయ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా లవర్ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్ హాఫ్‌లో మాస్ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్ మార్క్స్ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. విశ్లేషణ : యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్ జంధ్యాల ఆ కథను మాస్ కమర్షియల్ స్టైల్లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్, యాక్షన్ సీన్స్‌ను చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. సెకండ్ హాఫ్‌ను ఎమోషనల్, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : లవ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
గ్లామర్ రోల్స్‌కి ఓకే
‘‘నాది కేరళ. మా తల్లిదండ్రులు టీచర్స్. నాకు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. నటన అంటే ఇష్టం. కానీ, అమ్మానాన్న చదువు పూర్తయ్యాక ప్రయత్నించమన్నారు. ఎంటెక్ చదివాక చిన్న చిన్న యాడ్స్‌లో మోడల్‌గా చేశా. కొచ్చిలో పీజీ ఇంటర్న్‌షిప్ చేస్తుండగా మలయాళంలో సెకండ్ లీడ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది’’ అని అనఘ అన్నారు. కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనఘ పంచుకున్న విశేషాలు. ► మలయాళంలో మూడు సినిమాల్లో నటించా. హీరోయిన్గా నా తొలి సినిమా ‘నట్పే తునై’ (తమిళ్). ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగులో నా మొదటి చిత్రం ‘గుణ 369’. అర్జున్ సార్ హైదరాబాద్‌కి పిలిపించి లుక్ టెస్ట్, ఫొటోషూట్ చేశారు. ఇందులో గీత పాత్రకి సరిపోతానని అదే రోజు ఓకే చెప్పారు. ► ‘గుణ 369’ కథ చాలా బాగుంది. పైగా నా పాత్ర కూడా నచ్చింది.. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి గీత పాత్ర చేశా. నా పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కార్తికేయ మంచి సహనటుడు. తన పాత్ర బాగా రావడానికి ఎంతో కష్టపడతాడు. ► రొమాన్స్, లవ్, యాక్షన్... ఇలా అన్నీ ఈ చిత్రంలో రియలిస్టిక్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకి బాగా నచ్చుతుంది. మలయాళ, తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో పనిచేశా. అయితే టాలీవుడ్లో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంది. మంచి గౌరవం ఇస్తారు.. ఓ రాణిలా చూస్తారు. ► మలయాళ హీరోయిన్లు ఎక్కువగా టాలీవుడ్లో ఉండటం గర్వంగా ఉంది. నాకు సమంత, నయనతారలంటే ఇష్టం.. వారి క్రమశిక్షణ అన్నా కూడా ఇష్టమే. ఈ పోటీ ఇండస్ట్రీలో 10–15 ఏళ్లుగా వారు కష్టపడి రాణిస్తున్నారు. ► అల్లు అర్జున్‌గారి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చూశా.. ఆయన గ్రేట్ డ్యాన్సర్. ► ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చే యడానికి రెడీ. -
అది నా ఇమేజ్ కాదు.. సినిమాది!
‘‘హిట్ సాధించిన సినిమాలో నటించిన హీరో చాలా లక్కీ. ఒక యాక్టర్‌గా సినిమాలో నా కృషి పది శాతమే. దర్శకులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒక సినిమా సక్సెస్‌లో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక హిట్ మూవీ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం హీరోలే’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.. ► ఇందులో ఒంగోలులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుణ అనే యువకుడి పాత్రలో నటించాను. చీమకుర్తి క్వారీ ఫ్యాక్టరీలో గుణ వర్క్ చేస్తుంటాడు. అతని వీధి చివర ఉండే సెల్‌ఫోన్ షాప్‌లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హఠాత్తుగా అతను ఖైదీగా మారాల్సి వస్తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటినుంచి గుణ ఎలా బయటప డ్డాడు? అన్నదే కథాంశం. దర్శకుడు అర్జున్, నా అభిరుచులు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. ► ‘ఆర్ఎక్స్ 100’లో నేను చేసిన పాత్రకు మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘హిప్పీ’ నాలోని మరో యాక్టింగ్ యాంగిల్‌ని బయటపెట్టింది. ‘గుణ 369’ కూడా నా నటనలోని మరో కోణాన్ని ఆడియన్స్‌కు తెలిసేలా చేస్తుందనుకుంటున్నాను. నేనేం స్టార్ హీరో అయిపోవాలనుకోవడం లేదు. సినిమా హిట్ సాధించినా, ఫెయిల్ అయినా క్యారెక్టర్ కోసం కార్తికేయ వందశాతం కష్టపడ్డాడు అని ఆడియన్స్ గుర్తిస్తే చాలు. మాలాంటి కొత్తవారికి చిరంజీవిగారే స్ఫూర్తి. మాస్ హీరో కావాలని ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మాస్ హీరో అన్నారు. అయినా అది నా ఇమేజ్ కాదు. మూవీ ఇమేజ్ అనుకుంటున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ ఇతర భాషల్లో రీమేక్ అవుతుందంటే గర్వంగా ఉంది. కానీ నాకు రీమేక్ సినిమాలు చేయడం ఆసక్తిగా లేదు. ► నాని ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్‌గా చేస్తున్నాను అంటే అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టే. ఆ పాత్ర స్పెషల్ కాకపోయి ఉంటే విక్రమ్‌గారు నన్ను అప్రోచ్ అయ్యేవారు కాదేమో. ప్రస్తుతం శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాను. శ్రీ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాను. -
గుణ అందరికీ కనెక్ట్ అవుతాడు
కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘టీవీ సీరియల్స్. ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది. మంచి కథ కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. అర్జున్ జంధ్యాల మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఏదో తీశాం అన్నట్టుగా కాకుండా స్క్రిప్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వర్క్ చేశాం. అర్జున్ ఎలా అయితే కథను చెప్పాడో అలానే తీశాడు. కార్తికేయ చేసిన గత రెండు సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఫుల్ ఎమోషన్స్‌తో నిండిన చిత్రమిది. ప్రొడక్షన్ విషయంలో సినిమా, సీరియల్ రెండూ ఒకటే. కాకపోతే స్కేల్ మారుతుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం దగ్గర వర్క్ చేసిన కిరణ్‌తో తదుపరి చిత్రం అనుకుంటున్నాం’’ అన్నారు తిరుమల్ రెడ్డి. ‘‘టైటిల్లో 369 చూసి ‘ఆదిత్య 369’లా ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా అనుకోకూడదని ట్రైలర్లో కార్తికేయ ఖైదీ అని చూపించేశాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచి లవ్‌స్టోరీ ఇది. సామాజిక అంశాలున్న కమర్షియల్ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. సినిమాలో ఓ కీ పాయింట్ ఉంది. రివ్యూ రాసేవాళ్లు దాన్ని రివీల్ చేయొద్దని కోరుకుంటున్నాం. సినిమాలో యాక్షన్ కూడా ఎమోషన్‌తో ఉంటుంది’’ అన్నారు అనిల్ కడియాల. ‘‘ఆడపిల్లల తల్లిదండ్రులకు, బుద్ధిమంతులైన అబ్బాయిలున్న తల్లిదండ్రులకు ఈ కథ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. టీవీలో వాడే ఫార్మట్‌నే ఇక్కడ కూడా వాడాం. పాత్రలకు మనం కనెక్ట్ అయితే సినిమాకి కనెక్ట్ అయిపోతాం. ‘గుణ’ అందరికీ కనెక్ట అవుతుంది. ఇద్దరు పార్టనర్స్ ఉంటే అభిప్రాయభేధాలు రావచ్చు. కానీ అవేమీ లేకుండా మా ప్రయాణం సాఫీగా సాగింది. ఇలానే కలసి పని చేస్తాం’’ అన్నారు ప్రవీణ కడియాల. -
నో కట్స్
ఒక్క కట్ కూడా లేకుండానే ‘గుణ’ సెన్సార్ పరీక్ష పాస్ అయి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల రూపొందించిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సెన్సార్ బోర్డ్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లందరూ గ్యారెంటీ హిట్ అంటున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు. ‘‘నాలుగు గోడల మధ్య రాసిన కథ కాదిది. యథార్థ గాథే మా చిత్రం ముడిసరుకు. సహజంగా ఉంటుంది. కథలో ఉన్న సహజత్వం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
చాలామందికి నా పేరు తెలియదు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘా జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ బోయపాటిగారి సినిమా ట్రైలర్‌లా అనిపించింది. ఈ సినిమా నిర్మాతలకు ఎంటర్టైన్మెంట్ కొత్త కాదు. సినిమా నిర్మాణం మాత్రమే కొత్త. మొదటి సినిమాతోనే తనలో ఉన్న నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు కార్తికేయ. మా బ్యానర్లో బోయపాటిగారి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అర్జున్ చురుకుగా పని చేశారు. అర్జున్ దర్శకత్వం వహించిన ఈ ‘గుణ 369’ మంచి విజయం సాధించాలి. అలాగే బోయపాటిగారితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అర్జున్ మంచి సినిమా తీశాడు. ట్రైలర్ బాగుంది. కథలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. ‘‘నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది. సినిమాలో హీరోలు హీరోలుగా హీరోయిన్లు హీరోయిన్లుగా ఉండరు. తెలుగులో మంచి ఎమోషనల్ సినిమాలు రావడం లేదనేవారికి ఈ సినిమా గట్టి సమాధానంగా ఉంటుంది. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు ‘ఆర్ఎక్స్ 100’ హీరో అంటారు. ఈ సినిమా తర్వాత గుణ అని పిలుస్తారనుకుంటున్నా. అర్జున్ బాగా తీశారు. గుణ, గీతల జర్నీని సినిమా లవర్స్ మిస్ కావొద్దు’’ అన్నారు కార్తికేయ. ‘‘మాకు చెప్పిన కథను చెప్పినట్లు తీశారు అర్జున్. కార్తికేయకు నటన పట్ల అద్భుతమైన తపన ఉంది’’ అన్నారు తిరుమల్ రెడ్డి. ‘‘టీవీ షోలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి వద్దామనుకున్నాం. ‘గుణ 369’ వంటి పెద్ద సినిమాతో వస్తున్నాం. కార్తికేయ బాగా చేశాడు. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్ ఉంది’’ అన్నారు అనిల్. ‘‘నన్ను, నా కథను నమ్మిన ప్రవీణగారికి థ్యాంక్స్. తిరుమల్‌రెడ్డి, అనిల్ బాగా సహకరించారు. కార్తికేయ మంచి నటను కనబరిచారు. గుణ పాత్రలో ప్రతి ఒక్కరు తమను తాము చూసుకుంటారు’’ అన్నారు అర్జున్. -
‘గ్యాంగ్ లీడర్’ సందడి మొదలవుతోంది!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 15 ఫస్ట్ లుక్, 18న ఫస్ట్ సాంగ్, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. We MET We are READY We are the GANG & I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7 — Nani (@NameisNani) 13 July 2019 -
ఆర్ఎక్స్100లా పెద్ద హిట్ కావాలి
‘‘కమల్ హాసన్‌గారి ‘గుణ’, బాలకృష్ణగారి ‘ఆదిత్య 369’ సినిమాల టైటిల్స్‌లో సగం సగం కలిపి చక్కగా కథకు తగ్గట్టు ‘గుణ 369’ టైటిల్ కుదిరింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘తొలి పరిచయమా.. తొలి పరవశమా ఇది’ ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘తొలి పరిచయమా...’ ఫీల్ గుడ్ సాంగ్లా ఉంది. ఈ సినిమా ‘ఆర్ఎక్స్ 100’లా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. నిజంగా జరిగిన కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇంతకు ముందు సిల్వర్‌స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘గోల్డెన్ హ్యాండ్ ‘దిల్’ రాజుగారితో బోణీ కొట్టినందుకు మా ఆల్బమ్‌కు తిరుగుండదని నమ్మకంగా ఉన్నాం. భరద్వాజ్ కంపోజిషన్, విశ్వనాథ్ సాహిత్యం, హరిహరన్‌గారి గాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
‘RX 100’ లాగే ‘గుణ 369’ కూడా!
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో ‘తొలి పరిచయమా ఇది... తొలి పరవశమా ఇది’ అనే తొలి పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. విశ్వనాథ్ రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తొలి సాంగ్ ‘తొలి పరిచయమా..’ను నేను విడుదల చేశాను. మంచి మెలోడీ సాంగ్. ఫీల్ గుడ్ సాంగ్, అందరికీ నచ్చుతుంది. కమల్‌హాసన్ గారి గుణ.. బాలకృష్ణగారి ఆదిత్య 369 సినిమాల రెండు టైటిల్స్ సగం సగం కలిసి చక్కగా కథకు తగ్గట్టు గుణ 369 అనే టైటిల్ కుదిరింది. టైటిల్లోని 369 ఏంటో ట్రైలర్‌ను చూడగానే అర్థమైంది. ట్రైలర్ బావుంది. కార్తికేయకు, టీమ్‌కు ఆర్ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘ఇదేదో వండి వార్చిన కథ కాదు. జరిగిన కథ. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది. తప్పక ప్రతి వారికీ కనెక్ట్ అవుతుంది. ఇదివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఉన్న కథ ఇది. తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది... అనే తొలి పాటను గురువారం దిల్‌రాజుగారి చేతుల మీదుగా విడుదల చేశాం. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన బాణీ వినగానే ఆకట్టుకుంటోంది. గేయ రచయిత విశ్వనాథ్ తేలిక పదాలతో మంచి భావంతో ఈ పాట రాశారు. తప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజల్లోకి వెళ్తుంది’ అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ‘టాలీవుడడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారి చేతుల మీదుగా మా గుణ 369 చిత్రంలోని తొలి పాట విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండదని నమ్ముతున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు చైతన్ భరద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.విశ్వనాథ్ రాసిన పదాలు కూడా ప్రేమికుల మనసుకు ఇట్టే దగ్గరయ్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలో యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్లోనూ, మా కెరీర్లోనూ గుణ 369 చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం రామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ తమ్మిరాజు. సత్య కిశోర్, శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. -
ఆగస్టు 2న ‘గుణ 369’
‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ఆగస్టు 2న విడుదల కానుంది. అనఘ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా చిత్ర సమర్పకురాలు ప్రవీణ కడియాల మాట్లాడుతూ గుణ 369 టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ‘తెలుగులో మంచి కథలతో సినిమా రావట్లేదని చాలా మంది అంటుంటారు. మా గుణ 369 చూసిన తర్వాత ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి మాటలు అనరు. అంతగా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్రమత్తంగా చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం గుణ 369. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను, ట్రైలర్‌ను విడుదల చేసి, ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చాలా బావుంది. ప్రేక్షకులకు అన్నివిధాలా నచ్చుతుందని నమ్మకం కలిగింద’న్నారు. -
గుణతో మంచి కెమిస్ట్రీ
మాలీవుడ్ నుంచి మరో భామ టాలీవుడ్ తలుపు తట్టారు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన సినిమా ‘గుణ 369’. ఈ సినిమాలోకి అనఘను కథానాయికగా తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘తమిళ చిత్రం ‘నట్పే తునై’లో అనఘ నటించారు. ఆ సినిమాలోని కొన్ని సీన్లు చూసి ‘గుణ 369’ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నాం. అనుఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు అర్జున్. కార్తికేయ, అనఘ జోడీ బాగుంది. ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆమె స్టార్ మెటీరియల్ అని నా నమ్మకం. అనఘ స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో డ్యాన్సుల విషయంలోనూ బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. -
జై సేన విజయం సాధించాలి
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్ రోల్. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్ రెడ్డి. -
పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు
‘‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా పర్వాలేదు.. కానీ, పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అంటూ నటుడు సాయికుమార్ డైలాగ్‌తో ‘గుణ 369’ చిత్రం టీజర్ ప్రారంభమవుతుంది. ‘మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు.. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో’ అంటూ కార్తికేయ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. కార్తికేయ, అనగ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్ విడుదలైన కొన్ని క్షణాల నుంచే చాలా బావుందంటూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. డైలాగులు, లొకేషన్లు, నటన, కెమెరా, కాస్ట్యూమ్స్... ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజర్ ఎంత బావుందో, సినిమా అంతకు వెయ్యి రెట్లు బావుంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్ ఉందని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందనే ప్రశంసలు అందుతున్నాయి. మూడు రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చూశాం. ప్రేక్షకులను ఆకట్టుకునే హిట్ సినిమా తీశామనే నమ్మకం వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. కార్తికేయ, మా కెరీర్లో ‘గుణ 369’ చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య కిశోర్, శివ మల్లాల. -
ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ లాంటి బోల్డ్ కంటెంట్‌తో సూపర్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ.. తాజాగా హిప్పీ చిత్రంతో పలకరించాడు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా ఈ హీరో జోరు బాగానే కొనసాగిస్తూ.. తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో రాబోతోన్న గుణ 369 చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్, పోస్టర్‌తో పాజిటివ్ టాక్ రాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏమైనా పర్లేదు కానీ.. పక్కవారి జీవితానికి ఏం కాకుడదు’., ‘మేం మీలాంటి వారికి భయపడేది మాకు ఏమైనా జరుగుతుందనీ కాదు.. మా అనుకున్నవారికి ఏమైనా అవుతుందని’ అనే డైలాగ్‌లతో సినిమా థీమ్ ఏంటో మేకర్స్ హింట్ ఇచ్చేశారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.