డిఫరెంట్‌ లుక్‌లో షాకిచ్చిన కార్తికేయ | karthikeya Six Pack Photo Goes Viral | Sakshi
Sakshi News home page

డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చిన కార్తికేయ

Feb 16 2021 10:10 PM | Updated on Feb 17 2021 12:54 AM

karthikeya Six Pack Photo Goes Viral - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 అనే బోల్డ్‌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ హీరో కార్తికేయ. ఆ ఒక్క మూవీతో కార్తి లక్షణాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఆ మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత  హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా.. నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు . అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలిసిందే.

ప్రస్తుతం కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. మార్చి 19వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే కార్తికేయ ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో దర్శనమించ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. 

ట్విటర్‌ వేదికగా కార్తికేయ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో కార్తికేయ కండలు తిరిగిన దేహంతో చాలా కాంఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే తన ట్రైనర్ కుల్దీప్ సేతి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే నెక్స్ట్ సినిమాలో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. మరి ఈ సిక్స్‌ ప్యాక్‌ ఏ సినిమా కోసమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement