sixpack
-
సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ అక్కినేని.. ఫోటో వైరల్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్న అఖిల్ ఇందుకోసం తెగ వర్కవుట్లు చేస్తున్నాడు. తాజగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'
సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్'. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలె రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి మరోసారి ఫిట్‌నెస్‌పై తనకున్న డెడికిషన్ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా ఈ విషయంలో సుధీర్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్‌బాబు.. తన సిక్స్ ప్యాక్ గురించి, దాని వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి కొందరు హీరోలు కాల్ చేసి కనుక్కోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి డైట్‌తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రంలోనూ సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్‌బాబుకు జంటగా నటించనుంది. చదవండి : ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే! -
డిఫరెంట్ లుక్‌లో షాకిచ్చిన కార్తికేయ
ఆర్ఎక్స్ 100 అనే బోల్డ్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తికేయ. ఆ ఒక్క మూవీతో కార్తి లక్షణాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఆ మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ, గుణ369, 90ఎంఎల్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా.. నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు . అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. మార్చి 19వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే కార్తికేయ ఇప్పుడు సిక్స్ ప్యాక్ లుక్‌లో దర్శనమించ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ట్విటర్ వేదికగా కార్తికేయ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో కార్తికేయ కండలు తిరిగిన దేహంతో చాలా కాంఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే తన ట్రైనర్ కుల్దీప్ సేతి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే నెక్స్ట్ సినిమాలో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. మరి ఈ సిక్స్ ప్యాక్ ఏ సినిమా కోసమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E — Kartikeya (@ActorKartikeya) February 16, 2021 -
సిక్స్ ప్యాక్ శౌర్య
లాక్డౌన్ టైమ్‌ను ఫుల్‌గా ఉపయోగించుకుని బాడీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చారు నాగశౌర్య. సిక్స్‌ప్యాక్ ఫిజిక్‌కి మారిపోయారు. కౌబాయ్ లుక్‌తో ఓ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు నాగశౌర్య. అలాగే అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. -
సిక్స్ ప్యాక్ తేజ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. రీసెంట్గా రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల బెండు తీశారు. ఇంకా ఆరు పలకల దేహంతో కనిపించిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సాయితేజ్ పేరు కూడా చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని రెండు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి తేజ్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తారు. ఆ రెండు ఫైట్స్‌లో హోమం నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ ఒకటి. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. -
సిక్స్‌ప్యాక్ ట్రై చేస్తున్నారా?
తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహించి వేస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం శ్రమించే వారి ముఖం, బుగ్గలలోని కొవ్వు పూర్తిగా దహనమైపోయి వారి బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు అవుతుంది. సిక్స్ ప్యాక్స్ అంటూ కడుపుపైన ఉండే ఆరు కండరాలు స్పష్టంగా కనిపించేలా వ్యాయామాలు చేయడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం కడుపు కండరాలకు చాలా ఎక్కువ శ్రమ కలిగేట్లుగా ‘యాబ్స్ ఎక్సర్సైజ్’లు చేస్తుంటారు. మనిషుల్లో ప్రతి ఒక్కరికీ కడుపుపైనా యాబ్స్ కండరాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటంగా పైకితేలేందుకు చేసే వ్యాయామాల్లో ఒక జాగ్రత్త పాటించడం మంచిది. అదేమిటో తెలుసుకునే ముందర అసలు మన దేశవాసు ల్లో పొట్ట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. పొట్ట ఎందుకొస్తుంది అప్పట్లో మన దేశంలో తరచూ కరువులు వస్తుండేవి. ఆహారం దొరకని సమయాల్లో.... తనకు తిండి దొరికినప్పుడే ఆ అదనపు ఆహారాన్నికొవ్వు రూపంలో నిల్వ ఉంచుకునేలా శరీరం తనను తాను సంసిద్ధం చేసుకుంటుంది. జీవులు తమ మనుగడ కోసం అనుసరించే ‘అడాప్టేషన్’ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుండేది. 17, 18వ శతాబ్దాల్లో తరచూ కరవులు వచ్చే సమయంలో వాటిని అధిగమించి మనుగడ సాధించేందుకు వీలుగా మన దేశవాసుల్లో... (మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశ వాసుల్లో) ఇలా ఒక జన్యుపరివర్తన జరిగింది. ఆ జన్యువు ప్రాబల్యంతో ఒక వయసు తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం మొదలైంది. ఆహారం దొరకని సమయాల్లో ఆ కొవ్వును వినియోగించుకోడానికి వీలుగా ఈ జన్యుపరివర్తన సంభవించిందని దక్షిణ భారత దేశ జన్యుపటలంపై అధ్యయనం చేసిన కొందరి సిద్ధాంతమిది. అయితే ఇప్పుడు హరిత విప్లవం తర్వాత ఆహార ధాన్యాల లభ్యత బాగా పెరిగింది. పైగా స్వాతంత్య్రానంతరం దేశంలోని ఒక చోటి నుంచి మరొక చోటికి రవాణా సౌకర్యాలు విస్తరించాయి. ఆ కారణంగా ఆ ధాన్యాలను ఎక్కడికైనా తరలించడం సులభం కావడంతో మొదట్లోలా కరువుకాటకాలు తగ్గిపోయాయి. కానీ మన దేహంలో పొట్ట వచ్చేందుకు దోహదపడే జన్యువు కారణంగా పొట్ట రావడం మాత్రం ఒక వయసు తర్వాత అలాగే కొనసాగుతూ ఉంది. సిక్స్ ప్యాక్ ఎలా ప్రమాదం? మనం పొట్టపైన కండరాలను పైకి తేలించేందుక తీవ్రమైన యాబ్స్ ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు... అవి కేవలం పొట్టపైన ఉన్న కొవ్వును మాత్రమే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కొవ్వునూ దహనం చేస్తాయి. మన శరీరంలోని కొవ్వు చాలా ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. ఉదాహరణకు ముఖంలోని చెంపల భాగంలో, భుజాల్లో కొవ్వు పేరుకుంటుంది. అందుకే కొందరిలో మరీ ఎక్కువగా కొవ్వు చేరి ఉండటం వల్ల బుగ్గలు బూరెల్లా, భుజాలూ గుండ్రంగా కనిపిస్తుంటాయి. తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా లేదా కీలక అవయవాల రక్షణ కోసం ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహిస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం చాలా తీవ్రంగా శ్రమించే వారి ముఖం, బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు కనిపిస్తాయి. సిక్స్‌ప్యాక్ కోసం వ్యాయామం చేసేవారు ఒక జాగ్రత్త పాటించాలి. తమ ముఖం పూర్తిగా పీక్కుపోయినట్లుగా అయిపోయి... ముఖం ఆకృతి మారిపోయేలా ఉన్న దశలో ఆ వ్యాయామాల్ని ఆపేయాలి. ముఖం అందం తగ్గేంత వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఒకసారి సిక్స్‌ప్యాక్ సాధించాక అది ఎప్పటికీ అలాగే ఉండిపోదు. అదలా ఉండిపోవడం కోసం ఎప్పుడూ యాబ్స్ వ్యాయామాల్ని కొనసాగిస్తూనే ఉండాలి. లేదంటే మన జన్యువుల వల్ల మళ్లీ పొట్ట చుట్టూ కొవ్వు చేరుతూ ఉంటుంది. మీకు మీ ముఖ ఆకర్షణ కూడా ముఖ్యమేనా లేక యాబ్స్ పట్లనే అబ్సెస్ అయి ఉన్నారా అన్నది మీరే తేల్చుకుని, మీ వ్యాయామ తీవ్రతను ఎంచుకోవాలి. -
ఫిట్టే హిట్టు
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఫిజిక్ గురించి టాపిక్ వస్తే సుధీర్‌బాబు పేరు కూడా ప్రస్తావించాల్సిందే. కండలు తిరిగిన శరీరంతో సుధీర్ తన సిక్స్ ప్యాక్ బాడీని కొన్ని సినిమాల్లో చూపించారు. లేటెస్ట్గా తన ఫిజిక్ మీద వర్కౌట్ చేస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం ‘వీ, పుల్లెల గోపీచంద్ బయోపిక్’లో నటిస్తున్నారు. పాత్రకు తగ్గ వేరియేషన్ చూపించడం కోసం ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జిమ్‌లో శ్రమిస్తున్నారు. రోజుకు 8 గంటలు వర్క్ చేయడం ఆయనకున్న డెడికేషన్‌కు ఓ ఎగ్జాంపుల్. -
మళ్లీ సిక్స్ ప్యాక్‌తో ఎన్టీఆర్
ఎన్టీఆర్ మొదటిసారి ఆన్ స్క్రీన్ చొక్కా విప్పింది ఎప్పుడు? ‘టెంపర్’లో. ఆరు పలకల దేహంతో ఆ సినిమాలో కనిపించి, ఆకట్టుకున్నారు. మళ్లీ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. దీనికోసం కసరత్తులు చేస్తున్నారు. మరి.. ఈసారీ చొక్కా విప్పుతారా? అంటే సమాధానం తెలియడానికి చాన్నాళ్లు పడుతుంది. ఇంతకీ ఏ సినిమా కోసం సిక్స్ ప్యాక్ అంటే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న మూవీకే. ఇందులో ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. దాని కోసం ట్రైనర్ ‘స్టీవెన్ లాయిడ్స్’ పర్యవేక్షణలో ట్రైనింగ్ ప్రాసెస్‌లో ఉన్నారు. సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 18 కిలోలు బరువు తగ్గనున్నారు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా ఫినిష్ చే సి, ప్రస్తుతం ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట దర్శకుడు త్రివిక్రమ్. పూర్తి స్థాయి లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. -
కండ బలం కష్టం కాదు...
ఫిట్నెస్కి సింబల్‌గా కనిపించే ప్యాక్ అంటే క్రేజ్ పెరుగుతూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ మరోసారి తన ఫిజిక్‌తో ఫ్యాన్స్‌ని ప్యాక్ చేసేశాడు. దీంతో ‘సిటీయూత్లో ‘సిక్స్’ ఫీవర్ ఒక్కసారిగా రెండింతలైంది. అయితే ఆరుపలకల అపు‘రూపం’సినిమా, సెలబ్రిటీలకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా సిక్సర్ కొడుతున్నారు. అది చాలా సులభమని కొందరు అనుకుంటుంటే.. ఇప్పటికీ అత్యంత కఠినమైన ప్రయాసని మరికొందరు భావిస్తున్నారు. నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ ఏమంటున్నారంటే... ఆరు పలకలు అందరికీ... సిక్స్‌ప్యాక్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురావు. ప్రతి మనిషి శరీరంలో సహజంగానే ఉండే మజిల్స్. అయితే వంశపారంపర్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాలు, బోన్స్ వగైరాల లాగానే ఫ్యాట్‌తో అవి కూడా కవర్ అయిపోతాయి. అలా అట్టడుగున్న ఉన్న వాటిని హార్డ్ వర్క్‌వుట్స్, ఎక్సర్సైజ్ల ద్వారా వెలుగులోకి తీసుకురావడ ం జరుగుతుంది. ఇవి కొందరికే సాధ్యం మరికొందరికి అసాధ్యం అనేది అపోహ మాత్రమే. వ్యక్తి శరీరపు తీరుతెన్నులపై ఆధారపడి 4 నుంచి 8(ఎయిట్ప్యాక్) దాకా పలకలను బిల్డప్ చేయవచ్చు. వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా సమయం తీసుకుంటాయి. ఆత్రపడి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం. డైట్ ఇంపార్టెంట్.. ఈ సిక్స్‌ప్యాక్‌కి గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైనది స్ట్రిక్ట్ డైట్. ఫ్యాట్ స్టమక్‌ని సాధించే క్రమంలో ట్రైనర్ సూచించిన డైట్‌ని తప్పనిసరిగా టైమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు మాయమైపోతాయి. ఎగ్‌వైట్స్, ఫ్రూట్స్, గ్రిల్డ్ చికెన్... ఇలా ప్రొటీన్‌ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా సరిపోకపోతే అవసరాన్ని బట్టి ప్రొటీన్షేక్స్, ఎనర్జీడ్రింక్స్ వినియోగించవచ్చు. సిస్టమాటిక్... వర్కవుట్... క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. లక్ష్యం సిక్స్‌ప్యాక్ అయినప్పటికీ ఫిజిక్‌ని ఓవరాల్‌గా బిల్డప్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీనిలో భాగంగా రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్... వంటివి తప్పనిసరిగా భాగం కావాలి. ఒకేసారి కాకుండా వ్యాయామ సమయాన్ని విడతలవారీగా పెంచుకుంటూ రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చేయాల్సి ఉంటుంది. పొట్టకండరాలైన యాబ్స్‌కి ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి... అబ్డామినల్ ఎక్సర్సైజ్లు శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది కారణం కావచ్చు. - ఎస్.సత్యబాబు