సిక్స్‌ప్యాక్‌ బాడీతో​ కనిపించిన అఖిల్‌ అక్కినేని.. ఫోటో వైరల్‌ | Akhil Akkineni Shares His Six Pack Body Look Goes Viral | Sakshi
Sakshi News home page

Akhil Akkineni : సిక్స్‌ప్యాక్‌ బాడీతో​ కనిపించిన అఖిల్‌ అక్కినేని.. ఫోటో వైరల్‌

Published Sat, Oct 29 2022 3:02 PM | Last Updated on Sat, Oct 29 2022 3:13 PM

Akhil Akkineni Shares His Six Pack Body Look Goes Viral - Sakshi

అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా  మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై మాంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో  ఏజెంట్‌గా కనిపించనున్న అఖిల్‌ ఇందుకోసం తెగ వర్కవుట్లు చేస్తున్నాడు. తాజగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించిన అఖిల్‌ దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement