
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్‌థ్రిల్లర్‌గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్
రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్‌పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్‌సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్‌తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్‌గా ఉంటుంది అంటూ అమల తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్
Comments
Please login to add a commentAdd a comment