Amala Akkineni
-
కొత్త కోడలు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అమల అక్కినేని'
తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్‌ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం.. సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్‌కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్‌గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు? అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్‌గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి.. అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి. సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి.. అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ? అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి. -
రాహుల్ గాంధీ.. మీ నాయకులను అదుపులో పెట్టుకోండి: అమల
నాగచైతన్య- సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల విడాకులకు రాజకీయాలను అంటగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు.ఇది సిగ్గుచేటుతాజాగా నాగార్జున సతీమణి అమల అక్కినేని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించింది. ఒక మహిళా మంత్రి రాక్షసిగా మారి అమాయక పౌరులను రాజకీయ యుద్ధం కోసం వాడటం చూసి షాకయ్యాను. మేడమ్.. సిగ్గు లేకుండా నా భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా.. అది జనాలు నమ్ముతారని భావిస్తున్నారా? మీ ప్రవర్తన నిజంగా సిగ్గుచేటు.అదుపులో పెట్టుకోండినాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే మన దేశం ఏమైపోతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ, మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. నా కుటుంబంపై విషపూరిత కామెంట్లు చేసిన మీ మంత్రితో క్షమాపణలు చెప్పించండి. ఇటువంటివారి నుంచి దేశపౌరులను రక్షించండి అని అమల ట్వీట్ చేసింది. Shocked to hear a woman minister turn into a demon, conjuring evil fictions allegations, preying on decent citizens as fuel for a political war.Madam Minister, do you rely and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without an iota…— Amala Akkineni (@amalaakkineni1) October 2, 2024చదవండి: మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్ -
ఫన్నీగా, రొమాంటిక్‌గా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’టీజర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆట్టుకుంటుందని దర్శకుడు బాల రాజశేఖరుని అన్నారు. -
కమల్, అమల హిట్ సినిమా.. రీమేక్ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో
ఇండస్ట్రీ ఏదైనా సరే మంచి విజయాన్ని సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామే అవుతుంది. ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ''బిల్లా ' చిత్రాన్ని ఆ తరువాత అజిత్ హీరోగా రీమేక్ చేశారు. లక్కీగా ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదే విధంగా రీమేక్ చేసిన కొన్ని చిత్రాలతో నిర్మాతల చేతులు కాలాయి. ఇకపోతే నటుడు కమలహాసన్ 1988లో కథానాయకుడిగా నటించిన చిత్రం 'సత్య'. ఇందులో అక్కినేని అమల హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సురేశ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తే.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కోలీవుడ్‌లో ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'సత్య' చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అందులోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇకపోతే సత్య చిత్రం అర్జున్ అనే హిందీ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. కాగా కమలహాసన్ నటించిన సత్య చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో కమలహాసన్ పాత్రను నటుడు అశోక్‌సెల్వన్ పోషించనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో అశోక్‌సెల్వన్ వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్నాడు. సత్య రీమేక్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫొటో షూట్‌ను కూడా నిర్వహించినట్లు సమాచారం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈయన ఇటీవల పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్నారు. పోర్ తొళిల్ చిత్రం ఓటీటీ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా మెప్పించింది. కాగా సత్య చిత్ర రీమేక్ ను పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అధికారికంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ జాబితాలో నాగార్జున- అమల జోడీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన శివతో పాటు చాలా చిత్రాల్లో జంటగా నటించారు. అయితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా కేవలం కొన్ని సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే సెప్టెంబర్ 12న ఆమె బర్త్ డే సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (ఇది చదవండి: మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!) అమల కుటుంబం అమల అక్కినేని తెలుగు సినిమాల్లో నటించడమే కాదు.. జంతు సంక్షేమ కార్యకర్త కూడా పనిచేస్తున్నారు. ఆమె అసలు పేరు అమల ముఖర్జీ కాగా.. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు కాగా.. తండ్రి బెంగాళీకి చెందినవారు. అమల పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశారు. అమల హైదరాబాద్‌లోని బ్లూ క్రాస్, జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. అమల సినీ కెరీర్ అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రంలో నటించింది . ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో 1987 లో విడుదలైన పుష్పక విమానంలో కమల్ హాసన్ సరసన అమల కీలక పాత్ర పోషించింది . అంతే కాకుండా 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. చినబాబుతో టాలీవుడ్ ఎంట్రీ తెలుగులో అమల నటించిన తొలి చిత్రం చినబాబు. డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి జూన్ 11, 1992న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 1994లో అక్కినేని అఖిల్ జన్మించారు. అయితే నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల నటనకు స్వస్తి పలికింది. చాలా ఏళ్ల తర్వాత 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుగు సినిమాలో కనిపించింది. (ఇది చదవండి: పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!) కోల్‌కతాలోని ఝాలాలో జన్మించిన అమల ఇవాళ 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అమల 1986 నుంచి 1992 వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో చినబాబు, పుష్పక విమానం, శివ, ప్రేమ యుద్ధం, ఘర్షణ, నిర్ణయం, రాజా విక్రమార్క(చిరంజీవి), మనం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హై ప్రీస్టెస్ 2019 (వెబ్ సిరీస్), ఒకే ఒక జీవితంలో నటించారు. View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
నాగార్జున హిట్ సాంగ్‌కు అమల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడి జాబితాలో నాగార్జున-అమలది ముందుంటుంది. ఇద్దరు కలిసి శివతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని రిలయ్ లైఫ్‌లోనూ జోడీగా మారారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించిది. ఇలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ.. ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంది. ఇదిలా ఉంటే..తాజాగా అమల నాగార్జున పాటకు స్టెప్పులేసి అలరించింది. తాజాగా అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ వేడుకకి ముఖ్య అతిథిగా అమల వెళ్లారు. అక్కడ స్టేజ్‌పై అందరూ ఒక్కో పాటకు డ్యాన్స్ చేశారు. ఇత అమల కూడా నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’లోని ‘ప్రియ రాగాలే’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై మీరూ ఒక లుక్కేయండి. నిన్న అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ లో జరిగిన NEO FIESTA 2K23 లో చాలా ఏళ్ళ తరువాత అమల గారు డాన్స్ 👌#AmalaAkkineni#Amala pic.twitter.com/NSMuAGVhzL — Lakshmi Bhavani (@iambhavani1) September 3, 2023 -
'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో సందడి చేశారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో తన భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్ వెల్లడించారు. కాగా.. అమల, నాగార్జున జంటకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) నాగార్జున మాట్లాడుతూ..' 'మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. అప్పడు హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భం ధరించింది. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ఆరు నెలలపాటు అమలతో ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్‌లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నా. ఆ టైమ్ నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ' అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జునే కారణం. ఆయన బిగ్ బాస్‌లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్‌కు రావాలని కోరా. గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి.' అని అన్నారు. యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాగార్జున చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండండతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. 1987లో ముంబైలో ఓ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఇందులో సంజయ్ బ్లూ కలర్ షర్ట్‌లో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. అతడి పక్కనే అమల అక్కినేని ఉండగా ఆమె కూడా బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఉంది. 'ఇది నా ఫస్ట్ ఫోటోషూట్.. అందమైన, తెలివైన అమలతో కలిసి ఈ షూట్లో పాల్గొన్నాను. అన్నీ వర్కవుట్ అయ్యుంటే తనే నాతో కలిసి నటించిన తొలి హీరోయిన్ అయ్యుండేది, కానీ అలా జరగలేదు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ స్పందిస్తూ.. 1987.. అప్పుడు నాకు కేవలం 14 ఏళ్లే అని కామెంట్ చేసింది. కాగా అమల అక్కినేని తమిళ చిత్రం 'మైథిలి ఎన్నై కాదలై'తో తన కెరీర్ మొదలుపెట్టింది. ఈ చిత్రం 1986లో రిలీజైంది. ఆ మరుసటి ఏడాదే సంజయ్ కపూర్‌తో ఫోటోషూట్‌లో పాల్గొంది. ఇకపోతే టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను పెళ్లాడింది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఇకపోతే సంజయ్ కపూర్ 1995లో వచ్చిన 'ప్రేమ్' సినిమాతో తన సినీప్రయాణం ప్రారంభించాడు. చివరగా అతడు 'బ్లడీ డాడీ' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సంజయ్.. 'మెర్రీ క్రిస్మస్' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కానుంది. దీనితో పాటు 'మర్డర్ ముబారక్', 'మేడ్ ఇన్ హెవెన్ 2' కూడా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) చదవండి: అలా జరగాలని కోరుకుంటే లేనిపోని ఒత్తిడి: నిహారిక -
కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్‌పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్‌తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్‌గా ఉంటుంది అంటూ అమల తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్ View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. (చదవండి: అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’) అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..త్వరలో మా ఇద్దరు అబ్బాయిల సినిమా విడుదల అవుతున్నాయని, ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారని, కేవలం కష్టం ఒకటే కాదని, శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామి వారి దర్శనార్థం వచ్చాంమని అక్కినేని నాగార్జున అన్నారు. అనంతరం అమల మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు అమల తెలిపారు.. -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్‌ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైమ్‌లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్‌లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్‌ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్‌ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన నటి అమల? ఏమందంటే!
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇటీవల అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనిపై సమాజం రకరకాలుగా స్పందిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ దీనిపై ట్విట్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తుంటే.. డాగ్ లవర్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాటికి సపరేట్గా వసతి కల్పించాలని, అవి మనలాగే ప్రాణులంటూ ఇటీవల జంతు ప్రేమికురాలు, యాంకర్ రష్మీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బ్లూక్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ ఘటనపై మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ జంతుప్రేమికురాలిగా అమల కుక్కలను శత్రువులుగా చూడోద్దని సూచించారట. ‘ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా? ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షించడ సరికాదు కదా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి’ అని అమల వ్యాఖ్యానించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తను సురేఖ వాణి కూతురు సుప్రిత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో అమల కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆమె నిజంగానే ఈ కామెంట్స్ చేసిందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అమల స్పందించేవరకు వేచి చూడాలి. -
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: అమల అక్కినేని
-
అలీ కూతురి వివాహ వేడుకలో అక్కినేని దంపతులు.. ఫోటోలు వైరల్
ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం నవంబర్ 27న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రోజు జరిగిన అలీ కూతురు వివాహానికి నాగార్జున అక్కినేని తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నాగార్జున దంపతులు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్) వివాహ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు అలీ ఆహ్వానాలు అందించారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి అలీ తన భార్య జుబేదా సుల్తానా బేగంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శుభలేఖలు అందించారు. కాగా.. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. టాలీవుడ్లో నటుడు అలీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. 1979లో నిండు నూరేళ్లు చిత్రంతో అరంగేట్రం చేశారాయన. -
షోరూం ప్రారంభోత్సవంలో మెగా డాటర్స్, అమల సందడి.. ఫొటోలు వైరల్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో కళామందిర్ రాయల్ చీరల షోరూం సోమవారం ప్రారంభమైంది. సినీ నటి అమల అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో లగడపాటి పద్మ, ఫిక్కీ చైర్మన్ సుబ్రా మహేశ్వరి, కళామందిర్ సుమజ, ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ దివ్యారెడ్డి, ఎండి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 49వ స్టోర్ అని తమ వద్ద ప్రత్యేకమైన పైతాని, సిల్క్, కోట, పటోల, హ్యాండ్లూమ్, ఖాదీ చీరలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చీర కట్టులోనే మహిళల ఔన్నత్యం దాగి ఉంటుందన్నారు. చీర కట్టడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఎన్నో డిజైనరీ బ్రాండ్లు కనువిందు చేస్తున్నాయన్నారు. -
ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సుమారు 15 కోట్లకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను
‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉండటంతో నటిగా బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్ మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను. -
ఆ ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను: శ్రీకార్తీక్
‘‘మనం ఏదైనా పనిని నిజాయితీగా చేస్తుంటే ఈ విశ్వమే తోడై మనల్ని ముందుకు నడిపిస్తుంటుందని నా నమ్మకం. ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చింది. అలాగే అన్ని వేళలా సహనంతో ఉండాలని ఈ సినిమాతో నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీ కార్తీక్. శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది (చదవండి: ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది) ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫల్మ్స్ చేశాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద సక్సెస్. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు. -
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసి నాగార్జున, అఖిల్ ఎమోషనల్‌కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నాగ్ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్‌ని, అద్భుతంగా నటించిన శర్వానంద్‌ని అక్కినేని హీరోలు అభినందించారు. ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌ని కార్తీక్ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) -
Kanam Movie: సైన్స్ ఫిక్షన్‌గా అక్కినేని అమల 'కణం'.. రిలీజ్ అప్పుడే!
Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్. ఈ సంస్థ అధినేతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్ తిలక్, ఎమ్మెస్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్ సరాంగ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు. చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
అన్నపూర్ణ స్టూడియోలో అమల, చైతన్య బాధ్యత ఏంటంటే..?
-
బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. -
అర్బన్ పార్కులతో ఆహ్లాదం, ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్‌ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. బిగ్‌బాస్ ఫైనల్లో ఇచ్చిన మాట ప్రకారం.. గత బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ) -
శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు
టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన.. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నాని అన్నారు. ఈ ఏడాది కరోనా అంతమై ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను నటించిన బంగార్రాజు చిత్రాన్ని కరోనా సమయంలోనూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. -
'ఓకే ఒక జీవితం' టీజర్ లాంచ్ ఫోటోలు
-
సరికొత్తగా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్‌లుక్
నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’ తెరకెక్కతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ఫ్రభులు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను మేకర్స్ చేశారు. శర్వానంద్ గిటార్‌తో దర్శనం ఇచ్చాడు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఇక సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌లో పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరోవైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సహానటులుగా కాగా అక్కినేని అమల ఒక కీలక పాత్ర పోషించనుండటం విశేషం. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
నాగార్జునకు 10 ముద్దులు పంపిన అమల
నాగార్జున పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం వైల్డ్ డాగ్. ఇందులో కింగ్ నాగ్ డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌పై అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తనపై అభినందనలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే నాగ్ భార్య అమల కూడా ఈ ట్రైలర్ చూసి నాగ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయిందట. దీంతో తన భర్తకు పది కిస్సులు, 10 హార్ట్ ఎమోజీలు, మరో 10 స్టార్లను వాట్సాప్‌లో పంపించిందట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించాడు. కాగా నాగ్ ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. డేవిడ్ ఇస్మలోన్, శ్యామ్ కౌశిక్ పర్యవేక్షణలో ఫైటింగ్ సీన్లు ప్రాక్టీస్ చేశాడు. యదార్థ సన్నివేశాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న వైల్డ్ డాగ్ సినిమాకు అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. చదవండి: స్క్రీన్ షాట్లు షేర్ చేసినందుకు చాలా సంతోషం: నాగ్ -
మాల్దీవ్స్‌లో అక్కినేని నాగార్జున,అమల
-
రీల్లోనే కాదు రియల్‌గాను హిట్ పెయిరే
(వెబ్‌స్పెషల్): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్లోనే కాదు రియల్‌గా కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి.. కృష్ణ-విజయ నిర్మల 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. అలా మెల్లిగా శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?) జీవిత-రాజశేఖర్ జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగార్జున- అమల టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై) మహేష్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చై-సామ్ ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్, దీపికా- రణ్వీర్ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు. -
‘ఫిల్మ్ హెరిటేజ్ పౌండేషన్ ’
-
‘షీ ఇన్స్పైర్స్’ విజేతలకు సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఎమ్లో జరిగిన కార్యక్రమంలో ‘షీ ఇన్స్పైర్స్’ ప్రోగ్రాం విజేతలను శ్రీమతి అమల అక్కినేని సత్కరించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా తమ సంస్థలో ఫిలిం అండ్ మీడియాలో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అర్హురాలైన యువతికి లక్ష రూపాయల ‘అన్నపూర్ణ స్కాలర్షిప్’ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతిభావంతులైన యువతులు మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పురుషులతో సమానంగా తమ ప్రతిభ ప్రదర్శించేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు మహిళా దినోత్సవం నాడు ఈ స్కాలర్షిప్ ని ప్రకటించారు. శ్రీమతి అమల అక్కినేని ఈ స్కాలర్‌షిప్‌ని ప్రకటిస్తూ, ‘ఇది ప్రతిభ కలిగిన యువతను ఫిలిం అండ్ మీడియా రంగంలో నిష్ణాతులుగా చేయాలన్న మా ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తుంది’ అన్నారు. ఈ స్కాలర్షిప్ అత్యంత ప్రతిభాపాటవాలు చూపిన, అర్హులైన యువతికి అందజేస్తారు. తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని స్వయంశక్తితో విజేతలుగా నిలబడ్డ మహిళలను గౌరవించడానికి రూపొందిచబడ్డ కాంటెస్ట్ ‘షీ ఇన్స్పైర్స్’. గత సంవత్సరం ప్రారంభించబడ్డ ఈ కాంటెస్ట్ 2వ సీజన్ లో భాగంగా ఈ సంవత్సరం వచ్చిన 62 నామినేషన్లలో ఉత్తమ 5 గురిని ఎంపిక చేయడానికి జ్యూరీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రముఖ నటి, సమాజ సేవకురాలు, విద్యావేత్త శ్రీమతి అమల అక్కినేని మాట్లాడుతూ, ‘స్త్రీ శక్తికి మించిన శక్తి లేదు. తానే ఒక సూపర్ పవర్. ఈ డిజిటల్ యుగంలో అందరికీ ఎన్నో అవకాశాలున్నాయి, ముఖ్యంగా మహిళలకి తమ ప్రతిభ ప్రదర్శించే అవకాశం చాలా ఉంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉండేందుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. లెక్కలేనన్ని అవకాశాలున్న మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో టాలెంటెడ్, క్రియేటివ్, హార్డ్ వర్క్ చేసే వారికి చాలా డిమాండ్ ఉంది. వినూత్న ఆలోచనలు కలిగి ఉన్న యువతులని ఈ క్రియేటివ్ ఫీల్డ్ లోకి ఆహ్వానిస్తున్నాను. తద్వారా ఈ రంగంలో తమదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. అమల అక్కినేని చేతుల మీదుగా ‘షీ ఇన్స్పైర్స్’ విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైబ్రాంట్ లివింగ్ ఫుడ్స్ ఎమ్.డి శ్రీదేవి జాస్తి, అన్నపూర్ణ స్టూడియోస్ సి.ఎఫ్.ఓ సుష్మ, ఫీవర్ ఎఫ్.ఎమ్ ఆర్.జె మానస పాల్గొన్నారు. -
అందుకే ఈ కఠిన నిర్ణయం: అమల అక్కినేని
నటిపై లైంగిక వేధింపులు.. అసోషియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ-AMMA) నిర్ణయంపై రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. అసోషియేషన్ నష్టనివారణ చర్యలపై హీరోయిన్లు మాత్రం శాంతించటం లేదు. ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ తరపున 15 మంది సీనియర్ నటీమణులు తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అమ్మలో చేరబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘అమ్మపై నమ్మకం పోయింది. ఎట్టిపరిస్థితుల్లో అందులో చేరబోం. న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఇంక అసోషియేషన్ను నమ్మే ప్రసక్తే లేదు’ అంటూ.. వారంతా ప్రకటనలో పేర్కొన్నారు. నటి అక్కినేని అమలతోపాటు రంజనీ, సజిత మదంబిల్, కానీ కుస్రూతీ, శాంతి బాలచంద్రన్ తదితరులు అందులో ఉన్నారు. ‘ఇండస్ట్రీల్లో మహిళలను ఆటబొమ్మలుగా చూస్తున్నారని, అమ్మ వైఖరి అప్రజాస్వామ్యికంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలే అమలవుతున్నాయని, తమ తోటి నటి లైంగిక దాడికి గురైతే.. నిందితుడికి బాసటగా నిలిచే నిర్ణయం తీసుకుందని, సమాన వేతన చట్టం అమలు కావటంలేదని.. ఇలా 8 కారణాలతో కూడిన ఓ లేఖను డబ్ల్యూసీసీ అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేశారు. మహిళల పట్ల వివక్షత పోయి.. సినిమా అంటే ప్రజలు ఓ మాధ్యమంగానే చూసే రోజులు రావాలని తాము కోరుకుంటున్నట్లు వారు లేఖలో తెలియజేశారు. సంబంధిత కథనాలు... అమ్మ నిర్ణయం.. హీరో వెనకడుగు నిర్ణయం నా ఒక్కడిదే కాదు: మోహన్‌లాల్ -
మహిళలకు నిత్యం వేధింపులే!
ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నానికి వెళ్లగా అక్కడ తన వ్యక్తిగత స్వేచ్ఛ(ప్రెవేట్ స్పేస్)కు భంగం కలిగే విధంగా కొందరు ప్రవర్తించారని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి జరిగిందని, తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను కలిగించిందన్నారు. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇచ్చే విజ్ఞత దేశంలో కరువైందన్నారు. ఒకరి ప్రెవేట్ స్పేస్‌లోకి వెళ్లి బాధ కలిగించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలైన తాము ఎక్కడికి వెళ్లినా జన సందోహం ఉంటుందని, జనం అత్యంత సమీపంగా వచ్చి భౌతిక వేధింపులకు గురి చేస్తారని తెలిపారు. నిత్యం చాలా మంది సెలబ్రిటీలు ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగా, భావోద్వేగ పరంగా సైతం వేధింపులుంటా యని, 24 గంటల పాటు నలువైపులా నుంచి వీటిని ఎదుర్కోక తప్పదన్నారు. దీంతో జీవితంలో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళాభ్యున్నతికి సాక్షి చేపట్టిన ‘నేను శక్తి’ ఉద్యమం ముగింపు సందర్భంగా బుధవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న పిల్లలు, మహిళలతో ప్రతి ఒక్కరి ప్రెవేట్ స్పేస్‌ను గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల కోసం నేను శక్తి అక్షర ఉద్యమాన్ని చేపట్టినందుకు సాక్షి గ్రూపుకు, సంస్థ చైర్మెన్ వైఎస్ భారతీరెడ్డికి అభినందనలు తెలిపారు. నేను శక్తి శీర్షిక పేరు ఎంతో అందంగా ఉందని అభినందించారు. విద్యా, ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలు వేధింపులు, గహ హింస, లింగ వివక్ష నుంచి బయటపడగలరని, సాధికారత సాధించగలరని ఐక్యరాజ్య సమితి పేర్కొందని గుర్తు చేశారు. విద్యతోనే ఉద్యోగ, ఉపాధి అకవాశాలు లభిస్తాయని, అప్పుడే ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలమన్నారు. వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించిన మహిళలు ఇతర మహిళల అభివృద్ధికి విస్తృత కషి చేయాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్ల కిందే నటన వృత్తికి స్వస్తి చెప్పిన తాను ప్రస్తుతం బ్లూ క్రాస్ సంస్థ ద్వారా జంతువుల హక్కులు, ప్రధానంగా వీధి కుక్కల సంతానోత్పత్తిని నిరోధించేందుకు పని చేస్తున్నానన్నారు. తన మామ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నానని తెలిపారు. సినిమాలు, సీరియళ్ల నిర్మాణానికి ఎలాంటి అర్హతలు అవసరం లేవని, అందుకే వాటిలో మహిళలను చిత్రీకరించే విధానం సరిగ్గా ఉండదన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసే ఈ కీలక రంగంలో ప్రవేశించేందుకు ఎలాంటి అర్హతలు అక్కర్లేని పరిస్థితి ఉందని గుర్తించిన తన మామ అక్కినేని నాగేశ్వరరావు దూరదృష్టితో ఈ శిక్షణ సంస్థను నెలకొల్పారన్నారు. శిక్షణ ద్వారా రైటర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లకు దిశానిర్దేశం చేస్తే సినిమాలు మెరుగవుతాయని అక్కినేని నాగేశ్వరరావు భావించా రన్నారు. మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించవద్దని ఈ శిక్షణ సంస్థ ద్వారా భవిష్యత్తు నటులు, సాంకేతిక నిపుణులకు మనస్తత్వ, సామాజిక బాధ్యత అంశాలపై శిక్షణ అందిస్తున్నామన్నారు. -
స్నేహంతో స్పృశిస్తాం.. ప్రేమలతో తరిస్తాం..
ఎక్కడి నుంచి తెచ్చావ్.. ఈ కుక్కపిల్లను..! అనడిగితే చాలా మందికి కోపమొస్తుంది. ‘ఇది కుక్కపిల్ల కాదు.. మా రీనా. మా ఫ్రెండ్’ అంటూ ఘాటుగా సమాధానమిస్తారు. కుక్కపిల్లనో.. పిల్లి అనో పిలిస్తే వారు ఒప్పుకోరు. ఇది కాస్త చాదస్తంగా.. అనిపించినా నగర జీవనంలో ఇప్పుడు చాలామంది తమ పెంపుడు జంతువుల విషయంలో ఇలానే ఉంటున్నారు. ఈ పద్ధతి కుక్కపిల్లకే పరిమితం కాలేదు.. అన్ని జంతువుల విషయంలోనూ ఇలానే ఉంది. వాటికి రూ.లక్షలు ఖర్చుపెట్టి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. చనిపోతే రిచ్‌గా సమాధులు కట్టించేవారూ ఉన్నారు. పెంపుడు జంతువులపై నగరవాసి పెంచుకున్న ప్రేమకు ఇది నిదర్శనం. నేడు జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నగరంలో జంతుప్రేమకుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే పెద్దవారికి తోడుగా ఉంటాయనే ఆలోచన నుంచి యువత తమ తోటి స్నేహితులుగా పలు రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు ఇందుకు ఉదాహరణగా నిలిస్తున్నాయి. జంతు సంరక్షణలో సంస్థలు.. ఏ జంతువైనా సరే మనతో కలిసి జీవించే హక్కు ఉందంటున్నారు జంతు ప్రేమికులు. అందుకే వాటి సంరక్షణ కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి హక్కుల కోసం పోరాడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూక్రాస్ సంస్థ దాదాపు 24 ఏళ్లుగా జంతు సంరక్షణ సేవలందిస్తోంది. ఇక్కడి సభ్యులు ఇప్పటి వరకు దాదాపు 4 లక్షలకు పైగా జంతువులను కాపాడారు. వాటికి అవసరమైన వైద్యం అందించి ప్రాణం పోశారు. మరో 1,22,480 పక్షులను కాపాడడంతో పాటు 12,805 జంతువులను దత్తత తీసుకొన్నారు. ఈ ఉద్యమాన్ని బ్లూక్రాస్ హైదరాబాద్ నిర్వాహకురాలు అక్కినేని అమల 1992 నుంచి చేస్తున్నారు. ఈ సంస్థనే కాకుండా స్నేక్ సొసైటీలు, జంతు సంరక్షణ సంస్థలు నగరంలో చాలానే ఉన్నాయి. ఎవరన్నా జంతువులు, పక్షులను బాధపెట్టేలా ప్రవర్తించినా, గాయం చేసినా వారికి శిక్ష వేయించేలా కృషి చేస్తున్నారు. మరో ప్రపంచంలో ఉన్నట్టే.. నా వద్ద పది కుక్కలున్నాయి. ఇంట్లో ఉన్నంత సేపూ వాటితోనే గడుపుతుంటా. వాటితో ఉన్నంత సేపూ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఆనందంగా ఉంటుంది. ఆ ప్రాణులుకు ఏమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేను. తగ్గేవరకు మనసు మనసులో ఉండదు. – పూరీ జగన్నాథ్ ఒత్తిడిలో పెద్ద రిలీఫ్ అవే.. ఒక్క జంతు సంరక్షణ దినోత్సవం నాడేకాదు.. జంతువులను ప్రతిరోజు ప్రేమగా చూడాలి. ఆ మూగ జీవాలను అర్థం చేసుకోవాలేగాని హాని చేయకూడదు. నా వద్ద రెండు పిల్లులు ఉన్నాయి. వాటిని చూస్తే చాలు నాకు పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. – సదా గుండెల నిండా ప్రేమ.. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే చాలా ప్రేమ. ఈ మధ్య అతను ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల ఒక్కటి మృత్యువాతపడింది. దీంతో దాదాపు వారం రోజులపాటు కోలుకోలేకపోయాడు. బేగంపేటలో మరో కుటుంబం ముద్దుగా పెరిగిన శునకం కన్నుమూస్తే ఇంటిల్లిపాది కన్నీరుమున్నీరయ్యారు. ప్రత్యేకంగా దహన సంస్కారాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఓ పెంపుడు కుక్కపిల్ల అదృశ్యమవడంతో దాని యజమాని నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. చివరికి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కుక్కపిల్లను దొంగిలించిన నిందితుడిని పట్టుకున్నారు. దానిని తిరిగి అప్పగించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా సంఘటనల్లో ఇప్పుడు తమ పెంపుడు జంతువులకు ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా వాటిని పేరుతోకాకుండా మరొలా పిలిస్తే గొడవకు దిగుతున్నారు. జంతువులపై తమ అనంతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. తారల ఇంట అనుబంధం.. కొన్ని నెలల క్రితం తెలుగు ఇండస్ట్రీకి చెందిన రవిబాబు పందిపిల్లతో ఓ ఏటీఎం క్యూలైన్లో నిలబడి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సినిమా కోసం ఇది చేసినా.. దానిని తాను పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఇక రాంచరణ్ వద్ద పదుల సంఖ్యలో గుర్రాలు, కుక్కలు, ఒంటె వంటి జంతువులు, కోడి పుంజుతో సహా పక్షులే ఉన్నాయి. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే పిచ్చిప్రేమ. దర్శకుడు పూరీ జగన్నాథ్ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన వద్ద దేశవిదేశీ పక్షులు, జంతువులు చాలానే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, నాగార్జున, ప్రభాస్, త్రిష, అనుష్క, సోనమ్ కపూర్.. ఒకరేమిటి.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షూటింగ్‌లు మినహాయిస్తే ఎక్కువ సమయాన్ని తమకు ఇష్టమైన జంతువులు, పక్షులతోనే గడుపుతున్నారు. -
ఐ లవ్యూ స్వీట్ హార్ట్.. : నాగార్జున
నటి అక్కినేని అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఐ లవ్యూ స్వీట్ హార్ట్.. నీతో కలిసి మరెన్నో సంవత్సరాలు ఇలాగే జీవించాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్ డే' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా అమల మంగళవారం 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటిగానే కాకుండా సమాజ సేవలో అమల తనవంతు కృషి చేస్తున్నారు. నాగార్జున, అమల1992 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత 2012 లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2014 లో వచ్చిన 'మనం' సినిమాలో ఆమె ఓ సన్నివేశంలోనూ నటించారు. ఈ ఏడాది మొదట్లో మలయాళ సినిమా కేరాఫ్ సైరాభానుతో మరోసారి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ సమయం కుటుంబంతో పాటు సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తున్న అమల, మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు రెడీ అంటున్నారు. I love you sweetheart I wish for myself many happy returns of today with you happy birthday!! pic.twitter.com/1eEFQc2zeW — Nagarjuna Akkineni (@iamnagarjuna) 12 September 2017 -
ఫ్రెండ్ కోసం లాయర్‌గా మారిన అమల
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల మరోసారి వెండితెర మీద కనిపించేందుకు రెడీ అవుతోంది. నాగార్జునతో పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అమల చాలా కాలం తరువాత లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో తెర మీద కనిపించింది. ఇప్పుడు మరోసారి వెండితెర మీద కనిపించేందుకు ఓకె చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమల నటిగా పరిచయం అయ్యింది మలయాళ ఇండస్ట్రీలోనే.. అందుకే మాలీవుడ్ లో రీ ఎంట్రీకి సై అంది. ఇటీవల హౌ ఓల్డ్ ఆర్ యు..? సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ హీరోయిన్ మంజు వారియర్ కోసం అమల రీ ఎంట్రీకి అంగీకరించింది. మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్న కేరాఫ్ సైరాభాను సినిమాలో అమల లాయర్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
మలయాళంలో అమల
దాదాపు 20 ఏళ్ల తరువాత మలయాళ తెరపై మెరవనున్నారు అక్కినేని అమల. చాలాకాలంగా తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మలయాళ సినిమాలో అమల నటించనున్నారు. నూతన దర్శకుడు ఆంటోనీ సోనీ సెబాస్టియన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాబాను' చిత్రంలో అమలా కీలకమైన పాత్రలో కనిపిస్తారట. లాయర్‌గా నటించనున్నారని వినికిడి. సైరాబాను పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తుంది. ఓ సాధారణ ముస్లిం గృహిణికి, ఆమె కుమారుడికి మధ్య ఉన్న అనుబంధమే చిత్ర కథనంగా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది. -
లైబ్రరీ ఆన్ వీల్స్
గచ్చిబౌలి: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల అన్నారు. కొండాపూర్‌లోని చిరెక్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొబైల్ లైబ్రరీ (లైబ్రరీ ఆన్ వీల్స్), ఆడిటోరియాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కూల్ మేనేజ్మెంట్ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నారెడ్డి మాట్లాడుతూ మొబైల్ లైబ్రరీ వారంలో ఒక రోజు మసీద్‌బండ (శేరిలింగంపల్లి) స్కూల్‌కు వెళ్తుందన్నారు. చిరెక్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి ప్రభుత్వ విద్యార్థులతో చదివిస్తారని చెప్పారు. ఈ బస్‌లో తెలుగు, హిందీ పుస్తకాలు, చార్టులు ఉన్నాయి. విద్యార్థుల విరాళాలతో పుస్తకాలు సమకూర్చామన్నారు. ప్రిన్సిపల్ ఇఫ్రత్ ఇబ్రహీం, జోషి తదితరులు పాల్గొన్నారు. -
బాగా బిజీ.. అతిథి పాత్రలే చేస్తా
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక తనకు లేదని అలనాటి అందాల హీరోయిన్ అమల అక్కినేని అన్నారు. తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత్రిగా, హైదరాబాద్ బ్లూ క్రాస్ సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ బాధ్యతలతో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. అప్పుడప్పుడు కొన్నిచిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను.. ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని వెల్లడించారు. షూటింగ్ పేరుతో కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే అతిథి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. కథ, పాత్ర నచ్చితే అతిథి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు. అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్‌లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే ఉద్దేశం లేదన్నారు. ప్రముఖ దర్శకులు నటించమని తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పది రోజుల షూటింగ్ నిమిత్తం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అమల.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో మెరిసింది. తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లో ఓ సీన్లో కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హమారీ అధూరీ కహానీ' చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల అతిథి పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. -
కేవలం అతిధి పాత్రలే..చాలా బిజీ
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక లేదని అలనాటి అందాల హీరోయిన్, అమల అక్కినేని అన్నారు. తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతగా హైదరాబాద్ బ్లూ క్రాస్ సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ బాధ్యతలతో తాను ఇపుడు చాలా సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని వెల్లడించారు. అలాగే షూటింగ్ పేరుతో, కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి ఇతర నగరాలు తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే పూర్తికాలంకాకుండా కేవలం అతిధి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. కథ, పాత్ర నచ్చితే అతిధి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు.అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్‌లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే ఉద్దేశం లేదన్నారు. ప్రముఖ దర్శకులు నటించమని తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. సం.రానికి కనీసం ఇద్దరు దర్శకులు తనకు ఫోన్ చేసి నటించే ఉద్దేశం ఉందా అని అడుగుతారని పేర్కొన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పదిరోజుల షూటింగ్ నిమిత్తం ఈ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. కాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను పెళ్లాడిన తర్వాత అమల అక్కినేని దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంది. ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్' సినిమాలో మెరపులు మెరిపించింది. అనంతరం అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లోనూ ఓ సీన్లో నూ కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. -
పాలపిట్టను బంధించడం నేరం
హైదరాబాద్: దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభమని సంప్రదాయాన్ని పాటించడం మంచిదే అయినా మొక్కుకోసం వాటిని బంధించరాదని బ్లూ క్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎనిమల్ వెల్ఫేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దసరా రోజున పాలపిట్టను బంధించి పంజరాల్లో పెట్టుకొని వ్యాపారాలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఎక్కడైనా వీటిని బంధించినట్లు తెలిస్తే హెల్ప్‌లైన్ నంబర్లు 7674922044, 9849027601, 3298985, 9966629858 సమాచారం అందించాలన్నారు. -
‘మా ఇంట్లో లెదర్ ఉత్పత్తులు వాడం’
సెంట్రల్ యూనివర్సిటీ : జంతువుల నుంచి తయారు చేసే లెదర్ ఉత్పత్తులు తమ ఇంట్లో వాడటం లేదని బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని కొండాపూర్ రోడ్లో నూతన ’హోం ఎక్స్పర్ట్స్’ ఫర్నిచర్, ఇంటీరియర్ షాప్‌ను అక్కినేని అమల ప్రారంభించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ మా ఇంట్లో ఎవరి గదిని వారే అలంకరించుకుంటారని పేర్కొన్నారు. నాగార్జునతో సహా అందరం ఎవరి అభిరుచులకు అనుగుణంగా గదులను తీర్చిదిద్దుకుంటామన్నారు. హోం ఎక్స్పర్ట్స్ ఎండీ జయభరత్ రెడ్డి మాట్లాడుతూ భారత్‌తో పాటు జర్మనీ, టర్కీ, చైనా, మలేసియా ఉత్పత్తులు నూతన షాపులో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఏఎస్ అధికారి రవిగుప్తా, ఐపీఎస్ అధికారులు జాయ్దీప్ నాయక్, రమేష్ రెడ్డి, ఐఆర్ఎస్ అధికారులు ఎంఆర్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, మురళీ మోహన్‌లు పాల్గొన్నారు. -
హిందీ సినిమా చూసిన నాగార్జున, అమల
హైదరాబాద్: తాను ప్రత్యేక పాత్రలో నటించిన 'హమారీ ఆధూరీ కహానీ' హిందీ సినిమాను తన భర్త అక్కినేని నాగార్జునతో కలిసి అక్కినేని అమల గురువారం వీక్షించారు. గురువారం వీరి పెళ్లిరోజు కూడా కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశారు. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్, రాజకుమార్ రావ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. ఆమె కోసం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. అమల నటనను నాగార్జున ఎంతో మెచ్చుకున్నారని తెలిపాయి. ఈ సినిమాలో ఇమ్రాన్ షహ్మీ తల్లిగా అమల నటించారు. తన సినిమాను నాగార్జున, అమల దంపతులు మెచ్చుకున్నారని దర్శకుడు మొహిత్ సూరి తెలిపారు. వారి ప్రశంస తనకు పెద్ద కాంప్లిమెంట్ అని పేర్కొన్నారు. 'హమారీ ఆధూరీ కహానీ' శుక్రవారం విడుదలైంది. -
'హరిత నగరాన్ని నిర్మిద్దాం'
హైదరాబాద్ : పరిశుభ్రమైన నగరాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు, నటి అమల అక్కినేని పిలుపునిచ్చారు. ఎర్త్‌డేను పురస్కరించుకొని బుధవారం బేగంపేట హరిత హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారానికి రెండు గంటల పాటు పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న శుభ్రక్లకు ఈ సందర్భంగా అమల యూనిఫామ్ అందజేశారు. కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు తెరవడానికి కృషి చేస్తున్నట్లు ఎక్స్‌నోరా నిర్వాహకుడు మేజర్ శివకిరణ్ వెల్లడించారు. పర్యావరణం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జూన్ 5న క్లీన్ ఇండియా గ్రీన్లీఫ్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యావరణ, అడవుల శాఖ స్పెషల్ సెక్రటరీ ఎంసీ పరేగాన్, ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘టామి’అందరికీ నచ్చుతుంది
డా. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో బాబూ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మించిన చిత్రం ‘టామి’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమలకు ఈ చిత్రం ప్రివ్యూ చూపించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ - ‘‘పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల కనబర్చే విశ్వాసం ఎలాంటిదో చూపించే చిత్రం ఇది. పిల్లలు, పెద్దలూ అందరూ చూడాల్సిన చిత్రం. మూగజీవాల పట్ల మనుషులు చూపించాల్సిన ఆదరణ గురించి చెప్పిన ఈ చిత్రానికి ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలను కుంటున్నాను’’ అని చెప్పారు. ఈ చిత్రంలో భూగీ అనే శిక్షణ పొందిన శునకం నటించిందనీ, త్వరలోనే ప్రచార చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
హీరో అఖిల్... నిర్మాత నితిన్!
కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలు కానుంది. నితిన్ మాట్లాడుతూ -‘‘అఖిల్ సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. ‘దిల్’తో నా కెరీర్‌ని మలుపు తిప్పిన వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే అద్భుతమైన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’ అని చెప్పారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ముహూర్తం షాట్ తీసినట్లు అఖిల్, నితిన్‌లు ట్విట్టర్లో పెట్టగానే ఒక గంటలో రెండు లక్షల క్లిక్స్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు. -
మళ్లీ హిందీలో...
కొద్దిగా విరామం తరువాత అమల అక్కినేని ఇప్పుడు హిందీ తెరపై మెరిసిపోనున్నారు. అదీ ఏకంగా ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్‌భట్ చిత్రంలో! ‘‘టైమ్‌లెస్ బ్యూటీ అమల అక్కినేని మా ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించారు. చాలా ఆనందంగా ఉంది’’ అని మహేష్ భట్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, అక్కినేని ఇంటి కోడలైన తర్వాత అమల సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఆమె తెరపై కనిపించిన తెలుగు చిత్రం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలోని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఆ తర్వాత అమల దక్షిణాదిన వేరే సినిమా ఒప్పుకోలేదు కానీ, గత ఏడాది ఒక హిందీ చిత్రంలో తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ‘ఉయిర్‌మై’ అనే తమిళ టీవీ ధారావాహికలో నటిస్తున్న అమల... ‘హమారీ అధూరీ కహానీ’లో పాత్ర నచ్చడంతో, నటించడానికి పచ్చజెండా ఊపారు. గతంలో ‘దయావాన్, కబ్ తక్ ఛుపే రహూంగీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించారు. దక్షిణాదిన ఘనవిజయం సాధించిన ‘శివ’ హిందీ రీమేక్‌లో కూడా ఆమే కథానాయిక. ఆ విధంగా హిందీ ప్రేక్షకులకు అమల సుపరిచితురాలే. ఇక తాజా చిత్రం ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రం విషయానికొస్తే.. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో మహేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తల్లిదండ్రులు షిరీన్ మొహమ్మద్ అలీ, నానాభాయ్ భట్, సవతి తల్లి జీవితాల ఆధారంగా మహేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బాలీవుడ్ తెర మీదకు అమల!
చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉండి.. ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్న అక్కినేని అమల త్వరలోనే బాలీవుడ్ తెరమీద మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత మహేశ్ భట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. తాము తీస్తున్న ప్రేమకథా చిత్రం 'హమారీ అధూరీ కహానీ'లో అమల అక్కినేని నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న అమల.. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత చాలాకాలం పాటు ముఖానికి రంగేసుకోలేదు. అంతకుముందు శివ, సత్య, పుష్పకవిమానం, నిర్ణయం లాంటి అనేక సినిమాల్లో ఆమె నటించారు. తర్వాత ఇటీవల విడుదలైన 'మనం' చిత్రంలో డాన్స్ టీచర్‌గా కొద్ది సెకన్ల పాటు కనిపించారు. తమిళ టీవీ సీరియల్ ఒకదాంట్లో కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు విద్యాబాలన్, ఇమ్రాన్ హష్మి, రాజ్‌కుమార్ రావు ప్రధానపాత్రల్లో వస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో నటిస్తున్నారు. -
అమల అక్కినేనికి అంతపేరెలా వచ్చింది?
డాక్టర్ కవితా సందీప్ అంటే మనకు తెలియదు.కానీ, తమిళనాడులో మాత్రం చాలా పాపులర్ డాక్టర్. అవును ఆ డాక్టర్ ఎవరో కాదు. మన అమల అక్కినేని. తమిళనాడులోని ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నారు అమల. చెన్నై కళాక్షేత్ర విద్యార్థిని అయిన అమల 'మైథిలి ఎన్నై కాదళి' అంటే తెలుగులో 'మైథిలి నా ప్రేయసి' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి ప్రత్యక్షమయ్యారు. ఆరేళ్లలో అమల దాదాపు 50 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషలలో ఆమె నటించారు. ఈ మధ్య కాలంలో అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఉయిర్ మెయ్' అనే బుల్లితెర తమిళ సీరియల్ కోసమే ఆమె మేకప్ వేసుకున్నారు. ఉయిర్ మెయ్ అంటే ప్రాణదాత. డాక్టర్స్ చుట్టు ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ సీరియల్లో డాక్టర్ కవితా సందీప్ పాత్రలో అమల నటిస్తున్నారు. సందీప్ పాత్ర భరత్ కళ్యాణ్‌ది. పన్నెండు మంది డాక్టర్లు, వారి జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టు కథ నడుస్తుంది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన భూషణ్ కళ్యాణ్ ఈ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.తమిళ హీరో గీబ్రాన్ ఉస్మాన్ ఇందులో చిన్నపిల్లల డాక్టర్ పాత్ర. ఈ సీరియిల్ స్క్రిప్టు చాలా బాగుందని, అందువల్లనే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు అమల చెప్పారు. అమల ఊహించినట్లే ఈ సీరియల్ తమిళనాడులో బాగా పాపులర్ అయింది. అందులోని డాక్టర్ పాత్ర అమలకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. ''నేను సీరియల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం''అని అమల అన్నారు. ఉయిర్మెయ్ ధారావాహికలో నటించడానికి గల కారణాలను అమల వివరిస్తూ ఈ కథ, కథనం చాలా బాగున్నాయని తెలిపారు. పైగా ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉందని చెప్పారు. ఇందులో తన పాత్ర పేరు డాక్టర్ కవిత అని, ఎమర్జెన్సీ కేర్‌కి హెడ్‌ని అని తెలిపారు. కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని ఈ పాత్ర చెబుతుంది. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళంలో అనేక చిత్రాలలో నటించిన అమలకు తమిళనాడులో అభిమానులు బాగానే ఉన్నారు. మళ్లీ తెరపై అమల కనిపించడం వారికి ఆనందంగా ఉంది. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు అమల ఫుల్స్టాప్ పెట్టేశారు. ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు. ఇరవయ్యేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా మెరిశారు. ఇప్పుడు బుల్లి తెరపై మంచి పాత్ర పోషిస్తున్నారు. - శిసూర్య -
డాక్టర్ కవితగా..!
‘‘నేను సీరియల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం’’ అని అక్కినేని అమల అన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నయ్‌లో ఉన్నారు. తమిళ ధారావాహిక ‘ఉయిర్మెయ్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు ఫుల్స్టాప్ పెట్టేసి, ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు అమల. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా, ఇరవయ్యేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరిశారామె. అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లవుతోంది కానీ, వేరే సినిమాలేవీ అమల అంగీకరించలేదు. కానీ, ‘ఉయిర్మెయ్’ ధారావాహికను మాత్రమే అంగీకరించి, ఆ సీరియ్ల్లో నటించడానికి గల కారణాన్ని అమల చెబుతూ -‘‘ఈ కథ, కథనం చాలా బాగున్నాయి. పైగా ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉంది. అందుకే చేస్తున్నా. ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ కవిత. ఎమర్జెన్సీ కేర్‌కి హెడ్‌ని అన్నమాట. కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని నా పాత్ర చెబుతుంది’’ అన్నారు. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళ చిత్రం ‘మైథిలీ ఎన్నయ్ కాదలి’ ద్వారానే అమల కథానాయికగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత, ‘మెల్ల తిరందదు కదవు’, ‘వేలైక్కారన్’, ‘వేదం పుదిదు’, ‘సత్య’... ఇలా పలు చిత్రాల్లో నటించారామె. ఆ విధంగా తమిళనాడులో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు అమల. వాళ్లందరికీ అమల మళ్లీ తెరపై కనిపించడం ఆనందంగా ఉంది. -
మోడీ నాయకత్వం బాగుందన్న నాగ్
నటుడు నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పవన్ కల్యాణ్ నరేంద్ర మోడీని కలుసుకున్న కొద్ది రోజులకే నాగార్జున మోడీని అహ్మదాబాద్ లో కలుసుకోవడంతో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఒక వైపు నరేంద్ర మోడీని పొగుడుతూనే, తాను రాజకీయాలకు దూరమని నాగార్జున స్పష్టం చేశారు. 'నేను లేదా నా భార్య అమల పోటీ చేయడం లేదు. నాకు క్రియాశీలక రాజకీయాలు వద్దు. మేము సీటు గురించి మాట్లాడలేదు,' అని ఆయన అన్నారు. 'నరేంద్ర మోడీ చాలా ప్రేరణనిచ్చే నాయకుడు. ఆయన నాయకత్వం చాలా బాగుంది. ఆయన ఆలోచనా విధానం నాకు నచ్చింది. నేను ఒక గ్రామానికి వెళ్లి స్వయంగా అక్కడి అభివృద్ధిని చూశాను. ఆ గ్రామంలో వై ఫై వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.' అని నాగార్జున చెప్పారు. అయితే 'మార్పు మంచిదే' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు తెలుగుదేశంలో పొత్తు ఇప్పటి వరకూ ఖరారు కాకపోయినా, బిజెపికి రాష్ట్రంలో పెద్దగా పట్టు లేకపోయినా ఒక వారం వ్యవధిలో నరేంద్ర మోడీని ఇద్దరు పాపులర్ తెలుగు నటులు కలవడం విశేషం.