Akkineni Nagarjuna and Amala Akkineni visits Tirumala Temple - Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు

Published Wed, Apr 26 2023 12:08 PM | Last Updated on Wed, Apr 26 2023 12:44 PM

Akkineni Nagarjuna And Amala Visits Tirumala Srivari Temple - Sakshi

తిరుమల శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

(చదవండి: అజిత్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’)

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..త్వరలో మా ఇద్దరు అబ్బాయిల సినిమా విడుదల అవుతున్నాయని, ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారని, కేవలం కష్టం ఒకటే కాదని, శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామి వారి దర్శనార్థం వచ్చాంమని అక్కినేని ‌నాగార్జున‌ అన్నారు. అనంతరం అమల మీడియాతో మాట్లాడుతూ..  అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు అమల తెలిపారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement