'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్! | Nagarjuna Crazy Comments About Amala with Pregnency Time | Sakshi
Sakshi News home page

Nagarjuna: అదే నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published Sat, Aug 5 2023 9:10 PM | Last Updated on Sat, Aug 5 2023 9:54 PM

Nagarjuna Crazy Comments About Amala with Pregnency Time - Sakshi

టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో సందడి చేశారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో తన భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్ వెల్లడించారు. కాగా.. అమల, నాగార్జున జంటకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!)

నాగార్జున మాట్లాడుతూ..' 'మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. అప్పడు హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భం ధరించింది. దీంతో ఆ సినిమా షూటింగ్ ‍పూర్తి చేసుకుని.. ఆరు నెలలపాటు అమలతో ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్‌లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నా. ఆ టైమ్ నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. '  అని అన్నారు. 

హీరో సోహైల్ మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జునే కారణం. ఆయన బిగ్ బాస్‌లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్  చేశారు.  ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్‌కు రావాలని కోరా. గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి.' అని అన్నారు.

యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాగార్జున చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండండతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

(ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement