రాహుల్‌ గాంధీ.. మీ నాయకులను అదుపులో పెట్టుకోండి: అమల | Amala Akkineni Furious On Konda Surekha Controversial Comments On Her Family, Tweet Inside | Sakshi
Sakshi News home page

Amala Akkineni: సిగ్గు లేకుండా నా భర్త గురించి విషప్రచారం చేస్తారా?

Published Wed, Oct 2 2024 10:34 PM | Last Updated on Thu, Oct 3 2024 10:37 AM

Amala Akkineni Furious on Konda Surekha Controversial Comments

నాగచైతన్య- సమంత విడాకులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల విడాకులకు రాజకీయాలను అంటగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు.

ఇది సిగ్గుచేటు
తాజాగా నాగార్జున సతీమణి అమల అక్కినేని సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ వైఖరిని ప్రశ్నించింది. ఒక మహిళా మంత్రి రాక్షసిగా మారి అమాయక పౌరులను రాజకీయ యుద్ధం కోసం వాడటం చూసి షాకయ్యాను. మేడమ్‌.. సిగ్గు లేకుండా నా భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా.. అది జనాలు నమ్ముతారని భావిస్తున్నారా? మీ ప్రవర్తన నిజంగా సిగ్గుచేటు.

అదుపులో పెట్టుకోండి
నాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే మన దేశం ఏమైపోతుంది? మిస్టర్‌ రాహుల్‌ గాంధీజీ, మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. నా కుటుంబంపై విషపూరిత కామెంట్లు చేసిన మీ మంత్రితో క్షమాపణలు చెప్పించండి. ఇటువంటివారి నుంచి దేశపౌరులను రక్షించండి అని అమల ట్వీట్‌ చేసింది.

 

చదవండి: మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement