
హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. రాజకీయ దురుద్దేశాల కోసం సినీ సెలబ్రిటీలను వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వార్నింగ్ ఇచ్చింది. టాలీవుడ్ మొత్తం తనకు అండగా నిలబడ్డందుకు నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు.
సింహంలా పోరాడతా..
'నేను బలమైన వ్యక్తినని ఎప్పుడూ అనుకుంటాను. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహంలా నిలబడతాను. అదృష్టవశాత్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో మాకు అండగా నిలబడింది. ఇది మా నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను' అంటూ ఓ నోట్ రిలీజ్ చేశాడు.
అసలేమైందంటే?
ఇకపోతే నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకున్నారు. ఇందులో నాగార్జున హస్తం కూడా ఉందంటూ ఆరోపించారు. ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించిన తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చదవండి: ఫస్ట్ మీటింగ్‌లోనే చేదు అనుభవం.. నా వల్ల కాదని ఊరెళ్లిపోయా!
Comments
Please login to add a commentAdd a comment