తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.
కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.
ట్విటర్‌లో క్షమాపణలు..
అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment