
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సీనీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశాడు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయింంచారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కేసు కూడా నమోదు చేశాడు.
(చదవండి: కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు)
కాగా, నాగార్జున ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. టాలీవుడ్ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా నిలిచారు. బాధ్యత గల పదవిలో ఉండి ఒక మహిళ గురించి తప్పుగా ప్రస్తావించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
(చదవండి: మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..?)
— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2024